I Think Gujarat Will Have a Slight Edge Over Rajasthan Royals in IPL 2022 Finals Says Suresh Raina - Sakshi
Sakshi News home page

IPL 2022: 'ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఆధిపత్యం చెలాయిస్తుంది'

Published Sun, May 29 2022 4:37 PM | Last Updated on Sun, May 29 2022 5:08 PM

I think Gujarat will have a slight edge over Rajasthan in finals Says Suresh Raina - Sakshi

ఐపీఎల్‌-2022 ఫైనల్‌ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ తొలి టైటిల్‌ సాధించడానికి ఉర్రూతలూగుతోంది. మరోవైపు రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి రెండోసారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 విజేత ఎవరన్నది భారత మాజీ క్రికెటర్‌  సురేష్ రైనా అంచనా వేశాడు. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్‌ టైటాన్స్‌ కొంచెం మెరుగ్గా కన్పిస్తుందని రైనా అభిప్రాయపడ్డాడు. 

"ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం చెలాయిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారికి నాలుగు, ఐదు రోజులు మంచి విశ్రాంతి లభించింది. అదే విధం‍గా గుజరాత్‌ ఆటగాళ్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అలా అని రాజస్తాన్‌ను కూడా తేలికగా తీసుకోలేము. రాజస్తాన్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లో కూడా ఉంది  ఇక ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ చెలరేగితే.. అది రాజస్తాన్‌కు జట్టుకు కలిసిస్తోంది. అదే విధంగా అహ్మదాబాద్‌ వికెట్ అద్భుతంగా ఉంది. కాబట్టి బ్యాటర్లు మరోసారి చెలరేగే అవకాశం ఉంది" అని సురేష్ రైనా పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 ‍మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement