
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన మహనటి సావిత్రి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో కూడా ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బయోపిక్‌పై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో హిందీలో భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్య్వూలో సురేశ్ రైనాకు తన బయోపిక్‌పై ఓ ప్రశ్న ఎదురైంది.
సౌత్‌లో మీ బయోపిక్ తీస్తే అందులో ఏ నటుడు నటించాలని అనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించగా వెంటనే రైనా స్పందిస్తూ.. హీరో సూర్య నటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు. అంతేగాక సూర్య నటన బాగుంటుందని, పాత్రలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుంటూ తనదైన నటనను కనబరుస్తాడని, అందుకే ఈ బయోపిక్‌లో సూర్య అయితే తన పాత్రకు కరెక్ట్‌గా సరిపోతాడంటూ రైనా చెప్పుకొచ్చాడు. కాగా టిమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు.
టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి భారత ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. ఇక సూర్య విషయానికి వస్తే ఇటీవల అతడు నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు తెలుగు నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సూర్య సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై తెలుగు అగ్ర దర్శకులతో సూర్య చర్చలు జరుగుతున్నట్లు వినికిడి.
" If my biopic is made, someone from south may be my favorite @Suriya_offl can do the role" - @ImRaina 💙#Suriya40 | #VaadiVaasal | #Suriya pic.twitter.com/bWUqTHBoN2
— Trends Suriya™ (@Trendz_Suriya) June 24, 2021
చదవండి:
టాలీవుడ్ ఎంట్రీకి సూర్య రెడీ.. ఆ దర్శకుడుతో సెట్ అయ్యేనా!
Comments
Please login to add a commentAdd a comment