Ind vs NZ: Washington Sundar breaks Suresh Raina's 12-year long record - Sakshi
Sakshi News home page

IND vs NZ: వాషింగ్టన్‌ సుందర్‌ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు

Published Sat, Nov 26 2022 9:21 AM | Last Updated on Sat, Nov 26 2022 10:35 AM

Washington Sundar shatters Suresh Rainas 12 year old record - Sakshi

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత ఇన్నింగ్స్‌ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్‌ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు సాధించాడు. తద్వారా సుందర్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌ గడ్డపై అత్యంత వేగంగా 30కు పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సుందర్‌ నిలిచాడు

అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మూజీ ఆటగాడు సురేష్‌ రైనా పేరిట ఉండేది. 2009లో బ్లాక్‌ క్యాప్స్‌పై 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సుందర్‌ రైనా రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య రెండో వన్డే హామిల్టన్‌ వేదికగా నవంబర్‌ 27న జరగనుంది.
చదవండి: SL vs AFG: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గాన్‌.. 60 పరుగుల తేడాతో ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement