
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టు బెంగళూరులోని సమీపంలోని ఆలూర్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తోంది.
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉన్న బరోడా స్పిన్నర్ మహేష్ పిథియాతో కమ్మిన్స్ సేన ప్రాక్టీస్ చేస్తుంది. అయితే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్‌లు ఆడకపోవడంపై భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆశ్చర్యం వక్తం చేశాడు.
"టెస్టు సిరీస్‌కు ముందు నేను ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేవాడిని. వార్మాప్ మ్యాచ్‌లు ఆడడం చాలా ముఖ్యం. ఎందుకంటే భారత వంటి ఉపఖండ పిచ్‌లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేస్తేనే.. ఇక్కడి పరిస్థితులను అర్దం చేసుకోగలరు. టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఎందుకు వార్మాప్ మ్యాచ్‌లు ఆడలేదో నాకు అర్ధం కావడం లేదు.
ఇక మా స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా రోహిత్, కోహ్లి కూడా అదరగొడుతున్నారు. కాబట్టి ఆస్ట్రేలియా- భారత్ సిరీస్ అభిమానులకు మంచి మజా ఇవ్వడం" ఖాయం అని అని మిషన్ ఒలింపిక్స్ వార్షిక దినోత్సవంలో పాల్గొన్న రైనా ఈ వాఖ్యలు చేశాడు
ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
నాలుగు టెస్టుల సిరీస్
► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్
► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
► మార్చి 1-5: ధర్మశాల
► మార్చి 9- 13: అహ్మదాబాద్
మూడు వన్డేల సిరీస్
► మార్చి 17- ముంబై
► మార్చి 19- వైజాగ్
► మార్చి 22- చెన్నై
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
చదవండి: Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్ వణికిపోతోంది! నిదర్శనమిదే..
Comments
Please login to add a commentAdd a comment