మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అద్బుతమైన విజయం సాధించింది. ఆఖరి రోజు వరకు జరిగిన ఈ బాక్సింగ్ డే పోరులో 184 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో ఆసీస్ నిలిచింది.
ఈ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 90 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన పాట్ కమిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన కమ్మిన్స్..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎక్కవ సార్లు ఔట్ చేసిన సారథిగా కమిన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మను ఇప్పటివరకు కమ్మిన్స్ ఆరు సార్లు ఔట్ చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిచీ బెనాడ్ పేరిట ఉండేది. రిచీ బెనాడ్ ఇంగ్లండ్ లెజెండరీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్‌ను 5 సార్లు ఔట్ చేశాడు. తాజా మ్యాచ్‌తో రిచీ బెనాడ్ ఆల్‌టైమ్ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు.
చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment