Suresh Raina Takes Brilliant Catch in Road Safety World Series - Sakshi
Sakshi News home page

Road Safety League: సురేష్‌ రైనా స్టన్నింగ్‌ క్యాచ్‌.. చూసి తీరాల్సిందే!

Published Thu, Sep 29 2022 1:57 PM | Last Updated on Thu, Sep 29 2022 3:14 PM

Suresh Raina takes brilliant catch in Road Safety World Series - Sakshi

PC: Social Media

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా ప్రపంచ ఉత్తమ ఫీల్డర్‌లలో ఒకడు. అతడు క్రికెట్‌ నుంచి తప్పుకున్నప్పటికీ.. తన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. తాజాగా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రైనా ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్‌ సెమీఫైనల్‌-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో రైనా ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన అభిమాన్యు మిథున్‌ బౌలింగ్‌లో.. బెన్‌ డంక్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రైనా.. డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. రైనా స్టన్నింగ్‌ క్యాచ్‌తో బ్యాటర్‌తో పాటు భారత ఫీల్డర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా సురేష్‌ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అదే విధంగా ఇటీవల అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ సచిన్‌.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 17 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితే వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను గురువారానికి వాయిదా వేశారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.

చదవండి: Abu Dhabi T10 League: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్‌ ఐపీఎల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement