Ms Dhoni Birthday: Virat Kohli Pens Down Emotional Note Says Elder Brother - Sakshi
Sakshi News home page

Ms Dhoni Birthday- Virat Kohli: నా అన్నయ్య.. నీలాంటి నాయకుడు ఎవరూ లేరు: కోహ్లి భావోద్వేగ నోట్‌

Published Thu, Jul 7 2022 1:03 PM | Last Updated on Thu, Jul 7 2022 2:42 PM

Ms Dhoni Birthday: Virat Kohli Pens Emotional Note Says Elder Brother - Sakshi

ధోనితో కోహ్లి(PC: Virat Kohli Twitter)

Virat Kohli Emotional Wishes For MS Dhoni: ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు అన్నయ్యగా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌’’ అంటూ టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి శుభాకాంక్షలు తెలియజేశాడు.

కాగా మిస్టర్‌ కూల్‌ ధోని గురువారం తన 41వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానులు ఆయనకు విషెస్‌ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సైతం ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పూరిత ట్వీట్‌ చేశాడు. నా కెప్టెన్‌ ధోని అంటూ అతడితో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. కోహ్లి ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇక స్టార్‌ బ్యాటర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఎదగడం వెనుక ధోని ప్రోత్సాహం ఉందన్న సంగతి తెలిసిందే. కష్టకాలంలో కోహ్లికి అండగా నిలబడి అతడు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ధోని ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలో తన ‘అన్న’ పట్ల కోహ్లి ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.

మరోవైపు హర్భజన్‌ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సురేశ్‌ రైనా తదితర క్రికెటర్లు.. రాజకీయ, సినీ ప్రముఖులు ధోని భాయ్‌కు విషెస్‌ తెలియజేస్తున్నారు. దీంతో #HappyBirthdayDhoni హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. కాగా ధోని తన కెరీర్‌లో 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 చాంపియ‌న్స్ ట్రోఫీలు సాధించి భారత్‌కు మూడు ఐసీసీ మేజర్‌ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్‌ అయితే ప్రపంచకప్‌ జట్టు నుంచి కోహ్లి అవుట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement