ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టడం ద్వారా ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ క్యాచ్‌తో విరాట్ ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రికార్డును బద్దలుకొట్టాడు.
ఐపీఎల్‌లో రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు పట్టగా.. విరాట్ 242 మ్యాచ్‌ల్లో 110 క్యాచ్‌లు పట్టి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా అవతరించాడు. కోహ్లి, రైనా తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత కీరన్ పోలార్డ్‌కు దక్కింది. పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (99), శిఖర్ ధవన్ (98) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి (గేల్ 22, బాబర్ ఆజమ్ 11 తర్వాత) ఎగబాకాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు (8) చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు.
ఐపీఎల్‌లో విరాట్ చేసిన సెంచరీలు..
- 2016లో గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 100 నాటౌట్
- 2016లో పూణేపై 58 బంతుల్లో 108 నాటౌట్
- 2016లో గుజరాత్ లయన్స్‌పై 55 బంతుల్లో 109
- 2016లో కింగ్స్ పంజాబ్‌పై 50 బంతుల్లో 113
- 2019లో కేకేఆర్‌పై 58 బంతుల్లో 100
- 2023లో సన్‌రైజర్స్‌పై 63 బంతుల్లో 100
- 2023లో గుజరాత్ టైటాన్స్‌పై 61 బంతుల్లో 101 నాటౌట్
- 2024లో రాజస్థాన్ రాయల్స్‌పై 72 బంతుల్లో 113 నాటౌట్
ఇదిలా ఉంటే, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. జోస్ బట్లర్ మెరుపు శతకం చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. రాయల్స్ స్పిన్నర్లు అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment