ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.
కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.
అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు.
ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్
రన్నరప్- సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)
మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)
ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)
ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)
గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)
పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్‌దీప్ సింగ్ (కేకేఆర్)
ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్ హైదరాబాద్
విన్నర్ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)
రన్నరప్ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్)
Comments
Please login to add a commentAdd a comment