Orange Cap
-
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్‌రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్‌దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్) -
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హీరోలు వీరే.. 2024 సీజన్లో ఎవరు..?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్‌పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మార్ష్ 11 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 2009 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఆ సీజన్లో హేడెన్ 12 మ్యాచ్‌ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు. 2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్‌రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్‌రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. -
శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్ శుబ్‌మన్ గిల్‌కు ఎప్పటికి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ కొడుతుందో లేదో తెలియదు కానీ గిల్‌కు మాత్రం కెరీర్లో బెస్ట్ టోర్నీగా మిగిలిపోతుంది. సోమవారం సీఎస్కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికి ధోని సూపర్ ఫాస్ట్ స్టంపింగ్‌కు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్ అందుకోనున్ను శుబ్‌మన్ గిల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సీజన్లో గిల్ 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లి 973 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ కోహ్లి చేసిన పరుగులే అత్యుత్తమం. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. తొలి టీమిండియా బ్యాటర్‌గానూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లి, గిల్ తర్వాత జాస్ బట్లర్ 863 పరుగులు(రాజస్తాన్ రాయల్స్, 2022), డేవిడ్ వార్నర్ 848 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2018) వరుసగా ఉన్నారు. ఇక ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు బాదిన జాబితాలోనూ గిల్ చోట సంపాదించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున 118 బౌండరీలు బాదాడు. ఓవరాల్ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ 128 బౌండరీలతో(రాజస్తాన్ రాయల్స్, 2022లో) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 122 బౌండరీలు(ఆర్సీబీ, 2016లో), డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు(ఎస్ఆర్హెచ్, 2016లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Brief but looking dangerous - Shubman Gill was in the mood tonight.#TATAIPL #CSKvGT #IPLonJioCinema #IPLFinal pic.twitter.com/B1IeAqAHCL— JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు -
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
శుభ్‌మన్ గిల్‌కు ఆరెంజ్ క్యాప్.. అయితే గుజరాత్ టైటిల్ గెలవడం కష్టం..!
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబైని ఓడించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుభ్‌మన్ గిల్ సుడిగాలి శతకం (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సాధించి, గుజరాత్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ క్రమంలో గిల్ ఆరెంజ్ క్యాప్‌ను (సీజన్లో అత్యధిక పరుగులు) కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 60.79 సగటున, 156.43 స్ట్రయిక్ రేట్‌తో 3 శతకాలు, 4 అర్ధశతకాల సాయంతో 851 పరుగులు చేశాడు. గిల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని, గుజరాత్ ఫైనల్‌కు చేరిన తర్వాత ఓ ఆసక్తికర విషయం నెట్టింట ట్రోల్ అవుతుంది. అదేంటంటే.. ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాళ్ల జట్టు ఐపీఎల్ టైటిల్‌ను కేవలం రెండు పర్యాయాలు మాత్రమే గెలవడం. 2014లో కేకేఆర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉప్పప్పుడు కేకేఆర్, 2021లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలిచినప్పుడు సీఎస్కే టైటిల్ విన్నర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే క్రికెట్ అభిమానులు.. శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉంటాడు కాబట్టి, ఈసారి గుజరాత్ టైటిల్ గెలవదని దాదాపుగా ఫిక్స్ అయిపోయారు. మరికొందరేమో.. గుజరాత్ సెంటిమెంట్లను తిరగరాసి, చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేక సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గుజరాత్ చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి. కాగా, నిన్న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్.. 62 పరుగుల తేడాతో ముంబైని మట్టికరిపించింది. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఆరెంజ్‌క్యాప్ విన్నర్ విజేత షాన్ మార్ష్ (పంజాబ్, 616 పరుగులు, 2008)-రాజస్థాన్ రాయల్స్ మాథ్యూ హేడెన్ (సీఎస్కే, 572, 2009)-డెక్కన్ ఛార్జర్స్ సచిన్ టెండూల్కర్ (ముంబై, 618, 2010)-సీఎస్కే క్రిస్ గేల్ (ఆర్సీబీ, 608, 2011)-సీఎస్కే క్రిస్ గేల్ (ఆర్సీబీ, 733, 2012)-కేకేఆర్ మైఖేల్ హస్సీ (సీఎస్కే, 733, 2013)-ముంబై రాబిన్ ఉతప్ప (కేకేఆర్, 660, 2014)-కేకేఆర్ డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్, 562, 2015)-ముంబై విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 973, 2016)-సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్, 641, 2017)-ముంబై కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్, 735, 2018)-సీఎస్కే డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్, 692, 2019)-ముంబై కేఎల్ రాహుల్ (పంజాబ్, 670, 2020)-ముంబై రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్కే, 635, 2021)-సీఎస్కే జోస్ బట్లర్ (రాజస్థాన్, 863, 2022)-గుజరాత్ చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్