PC: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబైని ఓడించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుభ్‌మన్ గిల్ సుడిగాలి శతకం (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సాధించి, గుజరాత్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ క్రమంలో గిల్ ఆరెంజ్ క్యాప్‌ను (సీజన్‌లో అత్యధిక పరుగులు) కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 60.79 సగటున, 156.43 స్ట్రయిక్ రేట్‌తో 3 శతకాలు, 4 అర్ధశతకాల సాయంతో 851 పరుగులు చేశాడు.
గిల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని, గుజరాత్ ఫైనల్‌కు చేరిన తర్వాత ఓ ఆసక్తికర విషయం నెట్టింట ట్రోల్ అవుతుంది. అదేంటంటే.. ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాళ్ల జట్టు ఐపీఎల్ టైటిల్‌ను కేవలం రెండు పర్యాయాలు మాత్రమే గెలవడం. 2014లో కేకేఆర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉప్పప్పుడు కేకేఆర్, 2021లో సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలిచినప్పుడు సీఎస్‌కే టైటిల్ విన్నర్లుగా నిలిచాయి.
ఈ క్రమంలో సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే క్రికెట్ అభిమానులు.. శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉంటాడు కాబట్టి, ఈసారి గుజరాత్ టైటిల్ గెలవదని దాదాపుగా ఫిక్స్ అయిపోయారు. మరికొందరేమో.. గుజరాత్ సెంటిమెంట్లను తిరగరాసి, చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేక సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గుజరాత్ చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి.
కాగా, నిన్న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్.. 62 పరుగుల తేడాతో ముంబైని మట్టికరిపించింది. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.
ఆరెంజ్‌క్యాప్ విన్నర్ విజేత
- షాన్ మార్ష్ (పంజాబ్, 616 పరుగులు, 2008)-రాజస్థాన్ రాయల్స్
- మాథ్యూ హేడెన్ (సీఎస్‌కే, 572, 2009)-డెక్కన్ ఛార్జర్స్
- సచిన్ టెండూల్కర్ (ముంబై, 618, 2010)-సీఎస్‌కే
- క్రిస్ గేల్ (ఆర్సీబీ, 608, 2011)-సీఎస్‌కే
- క్రిస్ గేల్ (ఆర్సీబీ, 733, 2012)-కేకేఆర్
- మైఖేల్ హస్సీ (సీఎస్‌కే, 733, 2013)-ముంబై
- రాబిన్ ఉతప్ప (కేకేఆర్, 660, 2014)-కేకేఆర్
- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్, 562, 2015)-ముంబై
- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 973, 2016)-సన్‌రైజర్స్
- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్, 641, 2017)-ముంబై
- కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్, 735, 2018)-సీఎస్‌కే
- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్, 692, 2019)-ముంబై
- కేఎల్ రాహుల్ (పంజాబ్, 670, 2020)-ముంబై
- రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్‌కే, 635, 2021)-సీఎస్‌కే
- జోస్ బట్లర్ (రాజస్థాన్, 863, 2022)-గుజరాత్
చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్
Comments
Please login to add a commentAdd a comment