
ఎస్ఎస్‌కే స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 విజేతగా ది బ్యాట్ కేవ్ జట్టు నిలిచింది. నానక్ రామ్ గూడ లో శుక్రవారం నిర్వహించిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో క్లాసిక్ కల్ట్ స్టార్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 163/5 స్కోరు చేయగా, ది బ్యాట్ కేవ్ జట్టు 16.5 ఓవర్లలో 165/5 స్కోరు చేసి విజేతగా నిలిచింది.
టోర్నమెంట్‌కు ది బ్యాట్ కేవ్, వావ్ కాజ్. కామ్, హైరింగ్ ఐ, టాలెంట్ కన్సల్టింగ్ స్పాన్సర్స్ గా, ఇగ్నిటియో చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాయి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ప్రణీత్ కళ్లేపు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మోహన్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రణీత్ కళ్లేపు, బెస్ట్ బౌలర్ గా రాధా నిలిచారు.
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ విజేతల ట్రోఫీని అందజేశారు. చిన్నతనంలో సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, అభివృద్ధి ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇగ్నిషియో అత్యుత్తమ సేవలను అందిస్తున్నదని తెలిపారు. అందరూ ఆటను ఆస్వాదిస్తూ కొనసాగించాలని ప్రోత్సహించారు.