
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమధుర, వాసవి గ్రూప్‌లు సంయుక్తంగా కలిసి నానక్‌రాంగూడలో ఒలింపస్ పేరిట లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లోనే ఎత్తయిన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ జీ మధుసూదన్ తెలిపారు.
5.06 ఎకరాలు, 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నాలుగు బేస్‌మెంట్లు, స్టిల్ట్+ 44 అంతస్తులలో ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 854 ఫ్లాట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. 50 వేల చ.అ. క్లబ్‌హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, గెస్ట్ సూట్స్, స్పోర్ట్స్ బార్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్పా వంటి అన్ని రకాల వసతులుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment