sumadhura Group
-
TTD: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటి రూపాయలు విరాళం
తిరుపతి, సాక్షి: బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ శ్రీ మధుసూధన్ టిటిడి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టిటిడి అదనపు ఈవో కార్యాలయంలోదాత టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
1,000 కోట్లతో ఒలింపస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమధుర, వాసవి గ్రూప్‌లు సంయుక్తంగా కలిసి నానక్‌రాంగూడలో ఒలింపస్ పేరిట లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లోనే ఎత్తయిన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ జీ మధుసూదన్ తెలిపారు. 5.06 ఎకరాలు, 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+ 44 అంతస్తులలో ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 854 ఫ్లాట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. 50 వేల చ.అ. క్లబ్‌హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, గెస్ట్ సూట్స్, స్పోర్ట్స్ బార్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్పా వంటి అన్ని రకాల వసతులుంటాయి. -
రూ.300 కోట్లతో సుమధుర అక్రోపొలిస్
31 అంతస్తుల్లో.. 564 లగ్జరీ ఫ్లాట్లు సాక్షి, హైదరాబాద్ : బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సుమధుర గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. రూ.300 కోట్ల పెట్టుబడితో గచ్చిబౌలిలో 4 ఎకరాల 5 గుంటల స్థలంలో అక్రోపొలిస్ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వాసవీ హోమ్స్ సంస్థతో కలిసి 28:72 నిష్పత్తితో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నామని సంస్థ చైర్మన్ మధుసూదన్ శుక్రవారమిక్కడ విలేకరులతో చెప్పారు. జూలై 2019 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని.. ఆ తర్వాత సుమారు 10 లక్షల చ.అ. స్థలం అమ్మకానికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 31 అంతస్తుల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 564 ఫ్లాట్లుంటాయి. 1,245-2,615 చ.అ. మధ్య 2, 3 పడక గదులుంటాయి. ప్రారంభ ధర రూ.58 లక్షలు. ఇందులో క్లబ్ హౌజ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల వసతులుంటాయి. ఇప్పటికే బెంగళూరులో 18కి పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశామని.. వచ్చే రెండేళ్లలో పుణే, చెన్నైల్లోనూ నిర్మాణాలను ప్రారంభిస్తామని మధుసూదన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ (కన్స్ట్రక్షన్స్) భరత్ పాల్గొన్నారు.