రూ.300 కోట్లతో సుమధుర అక్రోపొలిస్ | Luxury flats start sumadhura Group in gachibowli akropolis named | Sakshi
Sakshi News home page

రూ.300 కోట్లతో సుమధుర అక్రోపొలిస్

Published Fri, Oct 14 2016 10:27 PM | Last Updated on Tue, Jun 4 2019 6:45 PM

రూ.300 కోట్లతో సుమధుర అక్రోపొలిస్ - Sakshi

రూ.300 కోట్లతో సుమధుర అక్రోపొలిస్

31 అంతస్తుల్లో.. 564 లగ్జరీ ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్ : బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సుమధుర గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. రూ.300 కోట్ల పెట్టుబడితో గచ్చిబౌలిలో 4 ఎకరాల 5 గుంటల స్థలంలో అక్రోపొలిస్ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వాసవీ హోమ్స్ సంస్థతో కలిసి 28:72 నిష్పత్తితో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నామని సంస్థ చైర్మన్ మధుసూదన్ శుక్రవారమిక్కడ విలేకరులతో చెప్పారు. జూలై 2019 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని.. ఆ తర్వాత సుమారు 10 లక్షల చ.అ. స్థలం అమ్మకానికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 31 అంతస్తుల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 564 ఫ్లాట్లుంటాయి.

1,245-2,615 చ.అ. మధ్య 2, 3 పడక గదులుంటాయి. ప్రారంభ ధర రూ.58 లక్షలు. ఇందులో క్లబ్ హౌజ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల వసతులుంటాయి. ఇప్పటికే బెంగళూరులో 18కి పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశామని.. వచ్చే రెండేళ్లలో పుణే, చెన్నైల్లోనూ నిర్మాణాలను ప్రారంభిస్తామని మధుసూదన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ (కన్‌స్ట్రక్షన్స్) భరత్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement