Construction companies
-
భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. -
అవసరమైతే అందరికీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, నిర్మాణ సంస్థ లు, అధికారులకు అవసరమైతే త్వరలోనే నోటీసు లు జారీ చేస్తామని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. అవసరమైతే ప్రజాప్రతినిధులను పిలి పించి బ్యారేజీల నిర్మాణంపై తీసుకున్న నిర్ణయాల్లో వారి పాత్రను తెలుసుకుంటామన్నారు. కాళేశ్వరం బ్యారే జీల నిర్మాణంపై న్యాయ విచారణను ప్రారంభించిన సందర్భంగా గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును విచారిస్తారా? అని ప్రశ్నించగా.. కేసీఆర్ పేరును ప్ర స్తావించకుండా జస్టిస్ ఘోష్ పైవిధంగా బదులిచ్చా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం త్వరలోనే పత్రిక ల్లో బహిరంగ ప్రకటన జారీ చేస్తామని చెప్పారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నాకే విచారణ ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యా మ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ నివేదికలు, విజిలెన్స్ దర్యాప్తు నివే దికలు, కాగ్ ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లతో పాటు ఎన్డీఎస్ఏ నిపుణులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. న్యాయపరమైన అంశాలకు లోబడే.. వ్యక్తుల ముఖాలు చూసి కా కుండా న్యాయపరమైన అంశాలకు లోబడే విచారణ ఉంటుందని జíస్టిస్ ఘోష్ పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విచారణ కొనసాగుతుందని, ఏవైనా పొరపాట్లు జరిగితే కోర్టులు స్టే విధించే అవకాశం ఉంటుందని తెలిపా రు. బ్యారేజీల నిర్మాణంతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని చెప్పారు. రెండో పర్యాయం రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు బ్యారేజీలను సందర్శిస్తానని వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన జారీ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో లోపాల పై న్యాయ విచారణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం గురువారం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేసింది. బ్యారేజీల నిర్మాణంలో చో టుచేసుకున్న లోపాలు, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసి బాధ్యులను గుర్తించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసినట్టు తెలిపింది. సాక్ష్యాధారాలు తప్పనిసరి: ప్రజలు తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో పాటు నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో సీల్డ్ కవర్లో మే 31లోగా బీఆర్కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెల్లో వేయాలని ప్రకటన సూచించింది. పోస్టు ద్వారా కూడా ఫిర్యాదులను పంపవచ్చని తెలిపింది. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా అఫిడవిట్ పొందుపర్చని ఫిర్యాదులను తిరస్కరిస్తామని పేర్కొంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. -
2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా..
సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..? క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు. -
ముడుపులివ్వకపోతే మూడినట్లే!..
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో రాజధాని భవనాల నిర్మాణ పనుల సమయంలో షాపూర్జీ పల్లోంజీ సంస్థ తరఫున నేను చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యేవాడిని. ఇలా కలుస్తున్న సమయంలో ఒకసారి ఆయన తన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను పరిచయం చేశారు. ఇక నుంచి శ్రీనివాస్ చెప్పినట్లుగా నడుచుకోవాలని నన్ను ఆదేశించారు’’ అని ఆదాయపు పన్ను శాఖకు ఇచ్చిన స్టేట్మెంట్లో మనోజ్ వాసుదేవ్ పార్థసాని వెల్లడించాడు. తదనంతరం పీఏ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడికి ముడుపులు ఏ రూపంలో ఎలా ఇవ్వాలో చెప్పేవారని, లేకపోతే తమ బిల్లులు పాస్ చెయ్యకుండా పెండింగ్‌లో పెట్టేవారని, చేసేదేమీ లేక చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చామని మనోజ్ పార్థసాని ఐటీ శాఖకు స్పష్టంగా చెప్పటంతో... రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామనే ముసుగులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి వాటి నుంచి వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు ఎలా తన జేబులో వేసుకున్నారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ.... అదే ఏడాది నవంబరు 1, 5 తేదీల్లో ఆయన్ను విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. తదనంతరం ఆయన చెప్పిన వివరాల ఆధారంగా 2020లో చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు దొరకటంతో... అలా ముడుపుల రూపంలో అందిన మొత్తాన్ని బయటకు వెల్లడించకుండా దాచిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చింది. నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు ఎదురు తిరగటంతో... ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ చంద్రబాబుకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా జత చేయటంతో చంద్రబాబు సాగించిన ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు బయటపడింది. దీంతోపాటు అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబు సొంత ఖాతాల్లోకి ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నాయి కనక దీన్ని చంద్రబాబు సంపాదించిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మనోజ్ పార్థసాని ఏం చెప్పారంటే... మనోజ్ పార్థసాని కార్యాలయంలో సోదాల అనంతరం ఆయన్ను ఐటీ శాఖ కొన్ని ప్రశ్నలడిగింది. దానికి ఆయనిచ్చిన సమాధానాలను రికార్డు చేసింది. ఆ ప్రశ్న జవాబులు ఎలా సాగాయంటే... ఐటీ శాఖ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు తరచూ కలిసేవారా? ఎక్కడ? ఏం మాట్లాడుకునేవారు? ఎంవీపీ రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణ పనులు షాపుర్జీ పల్లోంజీ సంస్థకు దక్కాయి. ఆ సమయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని పలు సమావేశాలు, ప్రజంటేషన్ల సమయంలో కలిశాను. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం (2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్లను నిర్మించే కాంట్రాక్టును దక్కించుకుంటే 2019 మార్చి నాటికి కేవలం 23వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది) ఈడబ్ల్యూఎస్ హౌసింగ్, హైకోర్టు నిర్మాణం, అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర విభాగాధిపతులు కార్యాలయాల నిర్మాణాల సమయంలో చంద్రబాబును పలు సందర్భాల్లో కలిశా. ఇవి పూర్తిగా ప్రభుత్వం నిర్వహించిన సమావేశాలు. ఏపీటిడ్కో, ఏపీ సీఆర్డీఏ వాళ్లు నిర్వహించే ఈ సమావేశాలకు షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో కలిసి నేను హాజరయ్యాను.చంద్రబాబు నాయుడిని తొలిసారిగా వ్యక్తిగతంగా కలిసినప్పుడు... ఆయన 2019, ఫిబ్రవరిలో విజయవాడలోని తన ఇంటికి వచ్చి కలవాలని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇంటికి వెళ్లా. అక్కడకు వెళ్లి కలిసినపుడు రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల స్థితి గతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను నాకు పరిచయం చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆదేశించారు. రూ.118 కోట్లకు లెక్కల్లేవని చంద్రబాబుకు ఐటీ జారీ చేసిన నోటీసుల్లో ఒక భాగం ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు తరఫున శ్రీనివాస్ మీకు ఎలాంటి సూచనలిచ్చారు? ఎంవీపీ శ్రీనివాస్ నాకు కొన్ని కంపెనీల జాబితాను పంపిస్తానని చెప్పాడు. ఆ కంపెనీల ద్వారా ముడుపులు తరలించాలని చెప్పారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సబ్ కాంట్రాక్టు పనులు పొందిన విక్కీజైన్ అనే వ్యక్తి టచ్‌లోకి వచ్చారు. విక్కీ జైన్ నయోలిన్, ఎవరెట్ అనే కంపెనీల పేర్లను ఇచ్చారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు మార్చి, 2019లో నన్ను విజయ్ నంగాలియా అనే వ్యక్తి కలిశారు. ముంబై కొలాబాలో ఉన్న షాపూర్జీ పల్లోంజీ ఆఫీసు బయట ఆయన నన్ను కలిశారు. నంగాలియా, హయగ్రీవ, అన్నై, షలాక కంపెనీలకు సబ్ కాంట్రాక్టు రూపంలో వర్క్ ఆర్డర్ల పేరిట ముడుపుల నగదు తరలించాల్సిందిగా సూచించారు. ఇలా తరలించిన నగదును విక్కి, వినయ్ నంగాలియాలు చంద్రబాబు నాయుడు ఎక్కడకు చేరవేయమంటే అక్కడకు చేరవేసేవారు. ఈ కంపెనీల్లోకి ఇంకా బోలెడంత నగదు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎక్కడకు తరలించారన్న సంగతులు నాకు తెలియవు. ఎందుకంటే కేవలం షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి జరిగిన చెల్లింపుల వరకే నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు కనక దాన్ని శ్రీనివాస్‌కు చెప్పి... ఆ మొత్తం చంద్రబాబుకు చేరిందా లేదా అన్న విషయాన్ని కనుక్కునేవాడిని. ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు, శ్రీనివాస్ చెప్పినంత మాత్రాన బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నగదు తరలించడం తప్పు కదా? దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎంవీపీ శ్రీనివాస్ ఈ కంపెనీల ద్వారా బోగస్ బిల్లులతో నగదు తరలించాలని చేసిన ప్రతిపాదనను మొదట్లో నేను వ్యతిరేకించాను. షాపూర్జీ పల్లోంజి అనేది అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అని, అవసరమైతే వాళ్లు అడిగిన మొత్తాన్ని నేరుగా పార్టీ ఫండ్ రూపంలోనే చెల్లిస్తుందని చెప్పాను. అప్పుడు వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు... ‘‘ఇది పార్టీ ఫండ్ కాదు. ఈ కంపెనీల ద్వారా మేం చెప్పిన వ్యక్తులకు నేరుగా నగదును తరలించాల్సిందే. ఒకవేళ మీరు గనక మా ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని. నిజానికి అప్పటికే మేం రాజధానిలో చాలా ప్రాజెక్టుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. నడుస్తున్న అనేక ప్రాజెక్టులతో భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు చెప్పినట్లుగా వినటం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు. -
2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్!
భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ రంగాలలో ఒకటి 'రియల్ ఎస్టేట్' అని అందరికి తెలుసు. ప్రస్తుతం ఈ రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 7.1 కోట్ల ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నైట్‌ఫ్రాంక్ ఇండియా, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ సర్వేయర్స్ ప్రకారం.. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోందని.. ఈ తరుణంలో ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగులకు డిమాండ్.. ఇప్పటి వరకు నిర్మాణ రంగంలో ఉన్న చాలా మంది ప్రజలకు సరైన నైపుణ్యాలు లేవని.. అలాంటి నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు. కావున రానున్న రోజుల్లో ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి డిమాండ్ భారీగా ఉండనుంది. అంతే కాకుండా ఈ రంగానికి తగిన విధంగా మార్చుకోవడానికి కంపెనీలు కూడా తమ వంతు పాటుపడాలని కొంత మంది సూచిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న 7.1 కోట్ల మందిలో 44 లక్షలు ఇంజినీర్లు, టెక్నీషియన్స్ ఉన్నారు. మిగిలిన వారికి ఈ రంగంలో ఎక్కువ నైపుణ్యాలు లేకపోవడం గమనార్హం. కావున రానున్న రోజుల్లో సరైన మెళుకువలున్నవారు ఈ రంగంలో అడుగుపెడితే తప్పకుండా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన వంటి లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. -
1,000 కోట్లతో ఒలింపస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమధుర, వాసవి గ్రూప్‌లు సంయుక్తంగా కలిసి నానక్‌రాంగూడలో ఒలింపస్ పేరిట లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లోనే ఎత్తయిన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ జీ మధుసూదన్ తెలిపారు. 5.06 ఎకరాలు, 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+ 44 అంతస్తులలో ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 854 ఫ్లాట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. 50 వేల చ.అ. క్లబ్‌హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, గెస్ట్ సూట్స్, స్పోర్ట్స్ బార్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్పా వంటి అన్ని రకాల వసతులుంటాయి. -
బాబోయ్.. 28 గంటల్లో 10 అంతస్తులు కట్టేశారు
బీజింగ్: మానవ మేధస్సు ఎప్పటికప్పుడు ప్రకృతితో పోటీపడడం సరే.. తనతోతాను కూడా పోటీపడుతోంది. ఈరోజు ఓ అద్భుతాన్ని సృష్టిస్తే మరుసటిరోజుకే దాన్ని అప్డేట్ చేస్తోంది. ఇలా మనిషి మెదడులో మెరిసిన గమ్మత్తుకి ఈసారి చైనాలోని చాంగ్షా అనే ప్రాంతం సాక్ష్యంగా నిలింది. పేకలు పేర్చినట్టుగా మేడలోని అంతస్తులు, అందులోని గదులను పేర్చి. ఇల్లు కట్టాలంటే నెలలు.. భారీ భవనాలైతే సంవత్సరాలు పట్టడం సర్వసాధారణం. పునాదులు, పిల్లర్లు, స్లాబ్, గోడలు, ప్లాస్టరింగ్, తలుపులు, కిటికీలు, రంగులు.. హమ్మయ్య ఇంత పని ఇల్లంటే! అలాంటిది చైనాలోని చాంగ్షాలో 28 గంటల్లో 10 అంతస్తుల భవనాన్ని కట్టి చరిత్ర సృష్టింంది బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ. ఇది ఎలా సాధ్యమైందంటే.. ఆ భవన నిర్మాణానికి కావాల్సిన లిఫ్ట్ దగ్గర నుంచి పిల్లర్లు, గదులు, గుమ్మాలు, బాత్రమ్లు, అల్మారాలు, ఇంటీరియర్లు.. ఇలా ఆ బిల్డింగ్‌కు కావల్సిన సమస్తాన్నీ ముందుగానే ఫ్యాక్టరీలో తయారు చేశారు ఫోల్డ్ అయ్యే విధంగా. ట్రక్కుల్లో వాటిని నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత పెద్దపెద్ద క్రేన్ల సాయంతో ఒకదానిపై ఒకటి పేర్చుతూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. -
బ్రాండెడ్ గృహాలదే బాజా
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోళ్లలో బ్రాండ్ మోగిపోతుంది. నాణ్యత, గడువులోగా నిర్మాణాల పూర్తి, ఆధునిక వసతుల కల్పన, రుణాల మంజూరులో ప్రాధాన్యత.. కారణాలేవైనా బ్రాండెడ్ నిర్మాణ సంస్థల గృహాలకు డిమాండ్ పెరిగింది. రెరా, జీఎస్టీ వంటి నిర్మాణాత్మక విధానాల అమలు తర్వాత వీటి ఆధిపత్యం పెరిగింది. లగ్జరీతో పాటు అఫర్డబుల్, మధ్య ఆదాయ విభాగాల గృహాలను నిర్మిస్తుండటంతో లిస్టెడ్, ప్రముఖ డెవలపర్ల విక్రయాలు ప్రతికూల సమయంలోనూ జోరుగా సాగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2021 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో (ఏప్రిల్–డిసెంబర్) 93,140 గృహాలు విక్రయమయ్యాయి. ఇందులో ఎనిమిది లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల వాటా 22 శాతంగా ఉండగా.. ప్రధానమైన అన్–లిస్టెడ్ కంపెనీల విక్రయాలు 18 శాతం, ఇతర కంపెనీల విక్రయాలు 60 శాతంగా ఉన్నాయి. 2017 ఎఫ్‌వైలో మొత్తం 2.03 లక్షల గృహాలు విక్రయం కాగా ఇందులో టాప్ 8 లిస్టెడ్ కంపెనీల విక్రయాల వాటా 6 శాతంగా ఉంది. నాన్–లిస్టెడ్ సంస్థల విక్రయాలు 11 శాతం, ఇతరు ల వాటా 83 శాతంగా ఉంది. 2021 ఎఫ్వైలోని లిస్టెడ్ కంపెనీల సేల్స్‌లో అత్యధికంగా 66.4 లక్షల చ.అ. విక్రయాలతో గోద్రెజ్ ప్రాపర్టీస్ ముందు వ రుసలో నిలువగా.. 50.4 లక్షల చ.అ. విక్రయాలలో బెంగళూరు కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ నిలిచింది. క్యూ3లో సేల్స్ అధరహో.. 2021 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 8 లిస్టెడ్ కంపెనీలు 2.123 కోట్ల చ.అ.లో విక్రయాలను పూర్తి చేశాయి. కోవిడ్–19 ఫస్ట్ వేవ్ 2020 ఎఫ్వైతో పోల్చితే విక్రయాలలో 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 2.088 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. ఎఫ్వై 21లో తొలి మూడు త్రైమాసికాల విక్రయాలను గమనిస్తే.. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో సేల్స్ బాగా జరిగాయి. జూలై–సెప్టెంబర్ (క్యూ2)తో పోలిస్తే క్యూ3 విక్రయాలలో 77 శాతం వృద్ధి నమోదయింది. 8 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్ (క్యూ1)లో 51.6 లక్షల చ.అ. విక్రయాలను పూర్తి చేయగా.. క్యూ2లో 58 లక్షల చ.అ., క్యూ3లో 1.027 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. జనవరి–మార్చి (క్యూ4)లో ఇప్పటివరకు బ్రిగేడ్, ఒబెరాయ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్ మూడు కంపెనీలు మాత్రమే ఫలితాలను ప్రకటించాయి. ఇవి 32.1 లక్షల చ.అ.లుగా ఉన్నాయి. లిస్టెడ్, ప్రధాన కంపెనీలివే... ► 8 లిస్టెడ్ కంపెనీలివే: బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కోల్టే–పాటిల్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఒబెరాయ్ రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పూర్వాంకర, శోభా. ► ప్రధాన కంపెనీలివే: మైహోమ్ కన్స్ట్రక్షన్స్, అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, అసెట్జ్ ప్రాపర్టీ, ఏటీఎస్ గ్రీన్, కాసాగ్రాండ్ బిల్డర్స్, కల్పతరు, లోధా గ్రూప్, పిరామల్ రియల్టీ, రన్వాల్ గ్రూప్, సలార్పూరియా సత్త్వా, శ్రీరామ్ ప్రాపర్టీస్, సిగ్నేచర్ గ్లోబల్, సన్‌టెక్ రియల్టీ, టాటా హౌసింగ్ డెవలపర్మెంట్ కో, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, వాధ్వా గ్రూప్, వీటీపీ రియల్టీ. -
‘ప్రభుత్వమే నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలి’
సాక్షి, విజయవాడ: కరోనాతో అన్నిరంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో)రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్నాధ్ తెలిపారు. విజయవాడలో గురువారం నెరెడ్కో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెరెడ్కో ఉపాధ్యక్షుడు అమర్నాధ్ మాట్లాడుతూ... నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ప్రస్తుత పరిస్థితి లో ప్రభుత్వమే ఆదుకోవాలి . సిమెంట్, ఐరన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్ లేకపోయినా... సిండికేట్‌గా మారి ధరలు పెంచేశారు. ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2008 లో ఐదు శాతం స్టాంపు డ్యూటీ తగ్గించి రియల్ఎస్టేట్ రంగాన్ని ఆదుకున్నారు. నేడు వ్యాపారం ముందుకు సాగే పరిస్థితి లేనందున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆదుకోవాలి.నిర్మాణ రంగాన్ని కూడా పరిశ్రమ గా గుర్తించి, ప్రోత్సాహించాలి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల నిర్మాణ రంగానికి ప్రయోజనం లేదు. రియల్ ఎస్టేట్ యాభై శాతం పడిపోయిందని అంటున్నారు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పడిపోలేదు. ప్రభుత్వం ధరలు నియంత్రణ చేసేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం సహకారం అందిస్తే... ఆదాయం రావడంతో పాటు, లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది అని తెలిపారు. అదేవిధంగా 7.5 స్టాంపు డ్యూటీ ని 2.5 కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి అందించే ధరలకే సిమెంట్, ఐరన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ) ఇక నగర జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్ మాట్లాడుతూ... లాక్ డౌన్ ప్రభావం నిర్మాణ రంగం పై బాగా పడింది. కార్మికులు అందరూ పనులు లేక స్వగ్రామాలకు వెళ్లిపోయారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ భవిష్యత్తు లో బాగుంటుంది.. ఇప్పుడు ఎటువంటి ఉపశమనం ఉండదు. ప్రస్తుత పరిస్థితి లో యేడాది పాటు ప్రభుత్వమే సహకారం ఇవ్వాలి. ఈ మూడు నెలల్లో సిమెంట్, ఐరన్ రేట్లు బాగా పెరిగాయి . ప్రభుత్వం ఇచ్చే సహకారం పైనే నిర్మాణ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అన్నారు. -
షాకింగ్ : కూలనున్న ఐదు లక్షల కొలువులు..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్మాణ రంగం కుదేలైన క్రమంలో రానున్న రెండేళ్లలో రియల్ఎస్టేట్ ఇతర అనుబంధ రంగాల్లో భారీగా కొలువుల కోత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాణ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఆయా కంపెనీలు లేవని, తీవ్ర నగదు కొరత బ్యాంకింగ్, నిర్మాణ రంగాలకు సమస్యగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు నిర్మాణ రంగానికి తాజా రుణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొనడం రియల్ఎస్టేట్ రంగంలో సమస్యలు పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన గృహాలు, వెంచర్లలో పలు యూనిట్లు విక్రయానికి నోచుకోకుండా ఉన్నాయని, భారీగా డిస్కౌంట్లను ఆఫర్ చేసినా ఇన్వెంటరీలు పేరుకుపోయాయని నిర్మాణ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా రూ 1.8 లక్షల కోట్ల విలువైన నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. నిర్మాణ రంగంలో స్ధబ్ధత కారణంగా దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంచనా వేసింది. ఇక సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ పరిశ్రమలోనూ పెద్దసంఖ్యలో పరోక్ష ఉద్యోగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. గృహాలు, అపార్ట్మెంట్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండటంతో తక్కువ అద్దెలు, పెట్టుబడి పెరుగుదల ప్రతికూలంగా ఉంటుందనే అంచనాతో ఇన్వెస్టర్లు సైతం ఆస్తుల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డెవలపర్లు వడ్డీ, ఈఎంఐల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నారని పారాడిగ్మ్ రియల్టీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ మెహతా చెప్పారు. -
రాయితీలు లాభమేనా?
సాక్షి, హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలోని నిర్మాణ సంస్థలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరి, ఈ ఆఫర్లు నిజంగా స్థిరాస్తి కొనుగోలుదారులకు లాభసాటేనా? అసలు ప్రాజెక్ట్ కొనగానే సాఫ్ట్ లాంచ్లోనో.. ప్రీ లాంచ్లోనో కొంటే లాభముంటుందా? వంటి సందేహాలు సహజం. ♦ ప్రాజెక్ట్ ప్రారంభించగానే కొనుగోలు చేస్తే కొంత వరకు లాభముంటుందని నిపుణులంటున్నారు. ఎలాగంటే ఓ కంపెనీ ధర చ.అ.కు రూ. 3,000 చొప్పున అమ్మకాలు మొదలెట్టింది.. అదే సంస్థ సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ పేరిట అమ్మకాలు చేపట్టినప్పుడు చ.అ.కు రూ. 2,800కే ఇవ్వొచ్చు. ఇంకా తక్కువకు విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి ఫ్లాట్ రేటు పెరగడానికి ఆస్కారముంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ♦ ప్రాజెక్ట్ లేదా వెంచర్ ఏదైనా సరే మీరు మొదటి కస్టమరైతే కొత్త అల్లుడికి ఇచ్చినంత మర్యాద ఇస్తారు. ఫ్లాట్‌లోని ప్రత్యేకతలు, వసతులూ నచ్చకపోతే మార్పులు చేయమంటే కూడా చేసిస్తారు. అంటే మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి. ♦ అయితే ధర తక్కువగా ఉందని తొందరపడి మాత్రం స్థిరాస్తిని కొనుగోలు చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోవాలి. అలాగే కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్‌కు అనుమతి ఉందా? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందా? మళ్లీ అమ్మకానికి పెడితే రీసేల్ అవుతుందా? వంటి అంశాల్ని గమనించాలి. సంస్థలకూ లాభమే.. ముందస్తు కొనుగోళ్లు కస్టమర్లకే కాదు నిర్మాణ సంస్థలకూ లాభమే. అనుమతులు రాక ముందే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముందస్తు అమ్మకాలు కలిసొస్తాయి. అయితే ఇది కేవలం నిర్మాణ సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపైనే ఆధారపడుతుంది సుమి. -
అందుబాటు ఇళ్ల వైపు దృష్టి సారించేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ‘సామాన్యుల సొంతింటి కలను తీర్చేలా అందుబాటు ఇళ్లను కడితేనే గిరాకీ’.. మైకు దొరికితే చాలు ప్రతి బిల్డర్ పలికే పలుకులివి. స్టేజీ మీద అవకాశం దొరికితే చాలు నిర్మాణ సంఘాల ప్రతినిధులు చెప్పే మాటలూ ఇవే. కానీ, వాస్తవానికి హైదరాబాద్‌లో జరుగుతోన్న నిర్మాణాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. సామాన్యుల కోసం అందుబాటు ధరలో ఇళ్లను కట్టే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఏవో కొన్ని సంస్థలను మినహారుుస్తే.. నగరానికి చెందిన అధిక శాతం మంది బిల్డర్లు అందుబాటు ఇళ్లవైపు దృష్టి సారించట్లేదన్నది చేదు వాస్తవం. వేతన జీవుల కోసం ఇళ్లను కట్టాలన్న ఆలోచనా అధిక శాతం మందిలో కనబడట్లేదనేది నిజంగా నిజం. ⇔ ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు.. లగ్జరీ గృహాల నిర్మాణాల్ని చేపడుతూ వీటిని విస్మరిస్తున్నారుు. ప్రధాన నగరం నుంచి పది, పన్నెండు కిలోమీటర్ల దూరంలో.. కేవలం నివసించడానికి అవసరమయ్యే విధంగా అంటే ఎలాంటి ఆధునిక సదుపాయాల జోలికెళ్లకుండా.. 800 నుంచి వెరుు్య చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు కట్టేవారే కరువయ్యారు. ధర ఓ ఇరవై లక్షలకు అటుఇటుగా ఉంటే.. శరవేగంగా అమ్ముడవుతారుు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. కొనేవారి సంఖ్య పెరుగుతుందని వీరు అంటున్నారు. ⇔ ‘మార్కెట్లో ఇళ్లను కొనేవారి సంఖ్య తగ్గింది..’ ‘గత కొంతకాలం నుంచి గిరాకీ లేదు..’ ఇలా రకరకాలుగా పలువురు బిల్డర్లు అంటున్నారు. అధిక శాతం కొనుగోలుదారులకు కావాల్సిందేమిటో కనుక్కోకుండా.. కేవలం కొద్ది మందిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణుల అభిప్రాయం. బిల్డర్లు, డెవలపర్లు ఇప్పుడైనా.. తమలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇళ్లు కట్టాలని నగరానికి చెందిన మధ్యతరగతి ప్రజానీకం, వేతనజీవులు కోరుతున్నారు. -
జోరు పెరగాలంటే!
హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలున్నాయి. అందరికీ నచ్చే వాతావరణముంది. స్థానికులకు హిందీ భాష వస్తుంది. నైపుణ్యం గల యువతకు కొరతే లేదు. అన్నింటికీ మించి ఇళ్ల ధరలూ తక్కువగా ఉంటాయి. రానున్న రోజుల్లో మార్కెట్ తప్పకుండా వృద్ధి చెందుతుంది’’.. భాగ్యనగరం గురించి ఏ బిల్డర్‌ని అడిగినా ఇంచుమించు ఇలాగే చెబుతారు. గత కొంతకాలంగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు కూడా. ఇందతా నిజమే అయినప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మార్కెట్ మెరుగు కావటం లేదెందుకు? మునుపటి జోరెందుకు కన్పించటం లేదు? ఈ అంశంపై నగర నిర్మాణ సంస్థలు ఆలోచించాల్సిన అవసరముంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. దాన్ని సరిదిద్దుకోవాలనే విషయాన్ని ఆలోచించాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకేయాలి. అప్పుడే హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో మళ్లీ మునుపటి జోరును చూడొచ్చు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు నాలుగేళ్ల నుంచి హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో అనుకున్నంత ఊపు లేదు. ఆశించిన స్థాయిలో అమ్మకాలూ లేవు. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వల్ల పెట్టుబడిదారులు పూర్తిగా నిష్ర్కమించారు. ఫలితంగా స్థిర నివాసానికి మొగ్గు చూపేవారే మిగిలిపోయారు. వీరిలోనూ అధికశాతం మంది వివిధ ప్రాంతాల్లో గల ప్రాజెక్టులన్నీ తిరిగి చూడటం, రేటు తక్కువున్న చోట కొనడం చేసేవారు. ఇంటికి సంబంధించి అంతిమ నిర్ణయం తీసుకోవడానికి రెండు లేదా మూడు నెలల సమయాన్ని తీసుకునేవారు. ఇంకొందరేమో సొంతిల్లు కొనాలన్న ఆశ ఉన్నప్పటికీ.. వారి బడ్జెట్‌కు తగ్గట్లు మార్కెట్లో ఇళ్లు దొరకని పరిస్థితి. కొన్ని చోట్ల ధరలు తక్కువున్నా.. అవి నగరానికి దూరంగానో.. మౌలిక సదుపాయాలూ అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనో ఉన్నాయి. మరికొందరేమో హైదరాబాద్‌ను పూర్తిగా విస్మరించి బెంగళూరు, పుణె, చెన్నైల్లో కొనుగోలు చేశారు. ఇలా రకరకాల కారణాల వల్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ధర ఎక్కువ ఫ్లాట్ల ధరలు అందుబాటులోఉంటే.. మార్కెట్‌తో సంబంధం లేకుండా అమ్మకాలు మెరుగ్గా జరిగేవి. కాకపోతే పశ్చిమ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు పడక గదుల ఫ్లాట్లు రూ.40-50 లక్షలు, మూడు పడక గదుల ఫ్లాట్లయితే రూ.60 లక్షలు పెట్టాల్సిందే. అంతంత రేటు పెట్టాలంటే ఐటీ రంగంలో కనీసం పదేళ్లకు పైగా అనుభవమున్న వారి వల్ల సాధ్యమవుతుంది. వారి శాతం ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాల్లో 2,3 బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం కనీసం రూ.30-40 లక్షలు పెట్టాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు వెనుకడుగు వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువ పెడితే.. కొనుగోళ్లు మెరుగ్గా జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం, కొత్తగా ఆరంభమయ్యే ప్రాజెక్టుల్లోనైనా తక్కువ విస్తీర్ణం గల ఫ్లాట్లకు పెద్ద ్దపీట వేయాలి. మార్కెట్ పోకడను అర్థం చేసుకోకుండా ఒంటెద్దు పోకడకు పోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహిం చాలి. నమ్మకం పోయిందా.. బూమ్ సమయంలో ఆరంభమైన పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు కొన్నవారు.. అందులో గృహ ప్రవేశం చేయడానికి నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా ఫ్లాట్లను అందజేయడం వల్ల రెండిందాల నష్టం జరిగింది. హైదరాబాద్ బిల్డర్లంటే ఆలస్యం చేస్తారన్న అపవాదు నెలకొంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఇతర నగరాలకు చెందిన వారు ఇలాంటి ప్రతికూల సమాచారాన్ని అంతర్జాలంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా చాలా మంది నగరంలో ఇళ్లు కొనడం మానేశారు. దీని బదులుగా బెంగళూరు, చైన్నైలను ఎంచుకోవటం మేలని భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం.. విభజన జరగక ముందు వరకూ హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందినవారు ఇళ్లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. వీరితో బాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులు ముందంజలో ఉండేవారు. కానీ, రాష్ట్ర విభజన జరిగాక.. ఇక్కడ కొందరు కొనుగోళ్లు చేయడాన్ని నిలిపివేశారు. పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని వేచి చూస్తున్నారు. పలువురు పెట్టుబడిదారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అందులో కొందరు అక్కడే ఇల్లో, ప్లాటో కొనాలని నిర్ణయానికి వచ్చారు. కాకపోతే అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆయా ప్రాంతాల్ని హైదరాబాద్‌తో బేరీజు వేసుకున్నాక ప్రస్తుతం చాలామంది పునరాలోచనలో పడ్డారు. వీరంతా తీసుకునే తదుపరి నిర్ణయం మీద ఆధారపడి ఇక్కడి అమ్మకాలు ఆధారపడతాయనేది మార్కెట్ నిపుణులు విశ్లేషణ.