సాక్షి, హైదరాబాద్: ‘సామాన్యుల సొంతింటి కలను తీర్చేలా అందుబాటు ఇళ్లను కడితేనే గిరాకీ’.. మైకు దొరికితే చాలు ప్రతి బిల్డర్ పలికే పలుకులివి. స్టేజీ మీద అవకాశం దొరికితే చాలు నిర్మాణ సంఘాల ప్రతినిధులు చెప్పే మాటలూ ఇవే. కానీ, వాస్తవానికి హైదరాబాద్‌లో జరుగుతోన్న నిర్మాణాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. సామాన్యుల కోసం అందుబాటు ధరలో ఇళ్లను కట్టే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఏవో కొన్ని సంస్థలను మినహారుుస్తే.. నగరానికి చెందిన అధిక శాతం మంది బిల్డర్లు అందుబాటు ఇళ్లవైపు దృష్టి సారించట్లేదన్నది చేదు వాస్తవం. వేతన జీవుల కోసం ఇళ్లను కట్టాలన్న ఆలోచనా అధిక శాతం మందిలో కనబడట్లేదనేది నిజంగా నిజం.
⇔ ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు.. లగ్జరీ గృహాల నిర్మాణాల్ని చేపడుతూ వీటిని విస్మరిస్తున్నారుు. ప్రధాన నగరం నుంచి పది, పన్నెండు కిలోమీటర్ల దూరంలో.. కేవలం నివసించడానికి అవసరమయ్యే విధంగా అంటే ఎలాంటి ఆధునిక సదుపాయాల జోలికెళ్లకుండా.. 800 నుంచి వెరుు్య చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు కట్టేవారే కరువయ్యారు. ధర ఓ ఇరవై లక్షలకు అటుఇటుగా ఉంటే.. శరవేగంగా అమ్ముడవుతారుు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. కొనేవారి సంఖ్య పెరుగుతుందని వీరు అంటున్నారు.
⇔ ‘మార్కెట్లో ఇళ్లను కొనేవారి సంఖ్య తగ్గింది..’ ‘గత కొంతకాలం నుంచి గిరాకీ లేదు..’ ఇలా రకరకాలుగా పలువురు బిల్డర్లు అంటున్నారు. అధిక శాతం కొనుగోలుదారులకు కావాల్సిందేమిటో కనుక్కోకుండా.. కేవలం కొద్ది మందిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణుల అభిప్రాయం. బిల్డర్లు, డెవలపర్లు ఇప్పుడైనా.. తమలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇళ్లు కట్టాలని నగరానికి చెందిన మధ్యతరగతి ప్రజానీకం, వేతనజీవులు కోరుతున్నారు.