Builders
-
ఇళ్లు కట్టి.. ఈవీ చార్జింగ్ ఎక్కడ?
ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.. మంచిదే..! శబ్ద, వాయు కాలుష్యంతో మానవాళికి ఉపద్రవంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగించాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగంపై ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవీ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే వాహనాల కొనుగోళ్లకు రాయితీలు ఇస్తేనే సరిపోదు.. ఆయా వాహనాల చార్జింగ్ పాయింట్లు, స్టేషన్ల ఏర్పాటుపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లకు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్న తరుణంలో.. బిల్డర్లు కూడా తమవంతు బాధ్యతగా భవన సముదాయాల్లోనే ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడే స్పష్టత లోపించింది. భవన సముదాయాల్లో ఎక్కడ ఈవీ స్టేషన్లు, పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. బేస్మెంట్, సెల్లార్లోనా లేదా బయట ఓపెన్ స్పేస్‌లో ఈవీ స్టేషన్ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈవీ పాలసీ అమలులో ఉన్నా.. స్పష్టత లేకపోవడంతో స్టేషన్ల ఏర్పాటుకు బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారు.బిల్డర్‌ను బాధ్యుడిని చేస్తే ఎలా? ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నివాస సముదాయాల్లో వసతులను కోరుకుంటున్నారు. పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు వారు ఉండే చోటే ఈవీ చార్జింగ్ స్టేషన్ ఉండాలని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బిల్డర్లు పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ సెల్లార్లో ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి బిల్డర్‌ను బాధ్యులు చేస్తే ఎలా? అని సంశయంలో పడిపోతున్నారు.ఈవీపై స్పష్టత అవసరమే.. సాధారణంగా బిల్డర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత నివాస సముదాయాన్ని అసోసియేషన్‌కు అప్పచెబుతాడు. వారు ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను సరిగా నిర్వహణ చేయపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా? అని పలువురు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉదాహరణకు గతంలో ప్రాజెక్ట్‌కు అగ్ని ప్రమాద శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) వచ్చిందంటే ఇక ఆ ప్రాజెక్ట్ వంక అధికారులు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలని కొత్త నిబంధనలను జోడించారు. ఇదే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అసోసియేషన్‌కు అప్పజెప్పిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ఉపకరణలు పనిచేయవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు క్రమంతప్పకుండా మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. -
ప్రాపర్టీ సందర్శన సేవలు ప్రారంభం
రియల్టీ రంగంలో ఆన్లైన్ సేవలందిస్తున్న టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ తన వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వినియోగదారులు మరింత సమర్థంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రాపర్టీ సందర్శనను ప్రారంభించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే చాలామందికి అనుమానాలుంటాయి. కాబట్టి నేరుగా ప్రాపర్టీ సందర్శించి నిర్ణయం తీసుకునేందుకు మ్యాజిక్స్బ్రిక్స్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.మ్యాజిక్ బ్రిక్స్ 100కుపైగా బిల్డర్లతో కలిసి హైదరాబాద్‌లో సైట్ విజట్ ప్రోడక్ట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఈ సర్వీసును విస్తరించినట్లు ప్రకటించింది. ఔరా రియల్టీ, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఎలిగెంట్ ఇన్ఫ్రా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలతో సహా 100కు పైగా డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరునెలల్లో 120కి పైగా ప్రాజెక్టుల్లో 8,200 కంటే ఎక్కువ సైట్ సందర్శనలను అందించినట్లు తెలిపింది. వినియోగదారులు సగటున రూ.1.25 కోట్లతో 450 కంటే ఎక్కువ విలువైన ఇళ్లు బుక్ చేసుకున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంఈ కార్యక్రమానికి సంబంధించి మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ..‘సాధారణంగా పండగ సీజన్ తరువాత డిసెంబరులో నివాస కొనుగోళ్లు తగ్గుతాయి. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇంటి యజమానుల ఆకాంక్ష మేరకు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఇళ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు పండగలు, ప్రత్యేక రోజులకు అతీతంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాపర్టీ విజిట్ ఫెస్ట్‌కు మంచి స్పందన ఉంది. కొంతమంది కొనుగోలుదారులతో ఒకే రోజులో 4-5 ప్రాపర్టీలను సందర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయాన్ని దాదాపు 50% తగ్గించేందుకు వీలవుతుంది. రియల్టీ రంగంలో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు అందిస్తూ మెరుగైన సేవలు అందుబాటులో ఉంచుతున్నాం’ అన్నారు. -
నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ ఇస్తారని తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కల సాకారంలో కస్టమర్‌తో బిల్డర్ చేసుకునే సేల్ అగ్రిమెంట్ అత్యంత కీలకం. ఒప్పందపత్రంలోని నిబంధనలు, షరతులను బట్టి మన కల తీరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే మనిషికి హృదయ స్పందనలాగే డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సేల్ అగ్రిమెంట్ అంతకంటే ముఖ్యమని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) సభ్యులు కె.శ్రీనివాస రావు అంటున్నారు. ఆయనతో ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ విశేషాలివీ..బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలన్నీ తమకు అనుకూలమైన నిబంధనలను, షరతులను పొందుపరిచి కస్టమైజ్డ్ అగ్రిమెంట్లను రూపొందించి కస్టమర్లతో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులకు భద్రత, రక్షణ ఉండాలంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్స్ వలలో చిక్కితే రోడ్డున పడతారు. నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే.. నిర్మాణ దశలను బట్టి డెవలపర్లకు బ్యాంక్ నిధులను విడుదల చేస్తుంది. రెరా నిబంధనల ప్రకారం ఆయా నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిర్మాణ పనుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే డెవలపర్లు నిధులను ఇతర ప్రాజెక్ట్‌లు, అవసరాలకు మళ్లిస్తుండటంతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకునే సరికి నిధులు సరిపడాలేక అది ఆగిపోతుంది. మరోవైపు నిధులు పూర్తిగా విడుదల కాగానే కస్టమర్‌కు బ్యాంక్ నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం ప్రారంభమవుతుంది. కానీ, కస్టమర్‌కు ఆ టైంకు ఫ్లాట్ చేతికి రాదు. గృహప్రవేశం చేయలేరు. దీంతో బయట అద్దె, ఫ్లాట్‌కు ఈఎంఐ చెల్లించడం కస్టమర్‌కు అదనపు భారంగా మారుతుంది. గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయని డెవలపర్లు ఆలస్యం అయిన కాలానికి 10.25 శాతం వడ్డీని కస్టమర్‌కు చెల్లించాల్సిందే. ఒకవేళ సమయానికి కస్టమర్లు బిల్డర్‌కు సొమ్ము చెల్లించకపోతే వారు కూడా 10.25 శాతం వడ్డీని డెవలపర్‌కు అందజేయాల్సిందే. కార్పస్ ఫండ్ అందజేయాలి.. సెమీ ఫర్నిష్ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2 లక్షలు, 3 లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయనే బిల్డర్ల ఉచిత సలహాకు చాలామంది కస్టమర్లు చిక్కుతున్నారు. అయితే సెమీ ఫర్నీష్ ఫ్లాట్‌ను పూర్తి ఫర్నీష్గా ఎప్పుడు చేస్తారనే విషయంపై బిల్డర్‌తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటూ టైల్స్, పెయింటింగ్ వంటి తుది మెరుగులు దిద్దకుండా అసంపూర్తి ఫ్లాట్‌నే కస్టమర్‌కు అప్పగించి బిల్డర్లు చేతులు దులుపుకుంటారు. కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్ తీసుకోరాదు. అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతాను తెరిచి, వడ్డీతోసహా కార్పస్ ఫండ్‌ను అందులో జమ చేయాలి. కస్టమర్ల అనుమతి తప్పనిసరి.. కస్టమర్‌తో ఒప్పందం చేసుకున్నాక ప్రాజెక్ట్ లేదా ఫ్లాట్ డిజైనింగ్, ఎలివేషన్ వంటి వాటిల్లో బిల్డర్ ఏమైనా మార్పులు చేయాలంటే 2/3 వంతు కస్టమర్ల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బిల్డర్ బ్యాంక్ రుణంతోనే కడుతున్నప్పుడు కస్టమర్లు బిల్డర్‌కు పోస్ట్ డేటెడ్ చెక్స్ అందజేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డెవలపర్లు కస్టమర్ల నుంచి 10 శాతానికి మించి టోకెన్ అమౌంట్‌ను వసూలు చేయకూడదు. భూ యజమానికి చిక్కులు.. నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్ పొజిషన్‌కు కస్టమర్‌కు రెరా చట్టం ప్రకారం 2 నెలల సమయం ఉంటుంది. కానీ, 15 రోజుల్లోనే పొజిషన్ తీసుకోవాలని బిల్డర్లు కస్టమర్లను ఒత్తిడి చేస్తుంటారు. ఇంటీరియర్ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు కస్టమర్లు పొజిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. మరికొందరు పొజిషన్ తీసుకుంటే అపార్ట్మెంట్ నిర్వహణ వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థల యజమానితో బిల్డర్ ఒప్పందం చేసుకుంటే రెరా చట్టం ప్రకారం డెవలపర్ కూడా ప్రమోటరే అవుతారు. కాబట్టి ఇరువురి మధ్య జరిగే అగ్రిమెంట్లు పారదర్శకంగా ఉండాలి. లేకపోతే భూ యజమానికి కూడా చిక్కులు తప్పవు. -
పన్ను ఎవరు కట్టాలి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
తగ్గుతున్న బిల్డర్ల ఆసక్తి - పరిమితమైన అందుబాటు ధరల ఇళ్లు
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్ల (రూ.40లక్షల్లోపు) ప్రాజెక్టుల పట్ల బిల్డర్లలో ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో, అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 18 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 40 శాతంగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. కరోనా ముందు 2018 జూలై - సెప్టెంబర్ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల వాటా మొత్తం సరఫరాలో 42 శాతంగా ఉండడం గమనించొచ్చు. దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై రీజియన్, కోల్‌కతా, పుణె పట్టణాల్లో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,16,220 యూనిట్ల ఇళ్ల సరఫరా నమోదైంది. ఇందులో రూ.40లక్షల్లోపున్న అందుబాటు ధరల ఇళ్లు 20,920 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, 2018 సెప్టెంబర్ క్వార్టర్లో అందుబాటు ధరల ఇళ్ల సరఫరా 21,900 యూనిట్లుగా ఉంది. విలాస ప్రాజెక్టులకే మొగ్గు రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక రాబడుల కోసం ఎక్కువగా విలాసవంతమైన ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. లాభాల మార్జిన్లు తక్కువగా ఉండడం, భూముల ధరలు అధికంగా ఉండడంతో అందుబాటు ధరల ఇళ్లు వారికి లాభసాటిగా ఉండడం లేదని పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో లగ్జరీ ఇళ్ల వాటా (రూ.1.5 కోట్లపైన ధర ఉండేవి) రెండింతలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ కాలంలో 1,16,200 యూనిట్లను ప్రారంభించగా, ఇందులో 27 శాతం (31,180 యూనిట్లు) లగ్జరీ విభాగంలో ఉన్నట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో ఒక త్రైమాసికంలో అత్యధికంగా లగ్జరీ యూనిట్ల ప్రారంభం గత త్రైమాసికంలోనే నమోదైనట్టు అనరాక్ తెలిపింది. 2018లో మొత్తం నూతన ఇళ్ల సరఫరా 52,120 యూనిట్లలో లగ్జరీ ఇళ్ల వాటా 9 శాతంగానే (4,590) ఉన్నట్టు పేర్కొంది. ‘‘డెవలపర్లు లగ్జరీ ఇళ్ల విభాగం పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. కరోనా తర్వాత ఈ విభాగంలో అద్భుతమైన పనితీరు చూపిస్తోంది. ఏడు పట్టణాల్లో వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి’’అని అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. -
బిల్డర్లకు రేటింగ్! రియల్టీలో విభజన రేఖ స్పష్టంగా ఉండాలి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లలో మంచి, చెడు మధ్య విభజన రేఖ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కస్టమర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి పొందడానికి వీలుంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో ముఖ్యంగా ఇళ్ల ప్రాజెక్టులు ఎక్కువ శాతం కస్టమర్ల నిధులపైనే ఆధారపడి ఉంటున్నాయంటూ, ఈ విధానం మారాల్సి ఉందన్నారు. బిల్డర్ల గత పనితీరును మదించి రేటింగ్ ఇచ్చే విధంగా విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి నగదు పరమైన సమస్యలు ఒక ప్రధాన కారణమన్నారు. చిన్న వర్తకులకు చెల్లింపులు చేసేందుకు కాంట్రాక్టులు కొన్ని నెలల సమయం తీసుకుంటున్నారనని పేర్కొంటూ.. చిన్న వర్తకులకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కేవలం కొన్ని చెత్త ప్రాజెక్టులు, కొందరు చెడు రుణ గ్రహీతల ఉండడం వల్ల పరిశ్రమ మొత్తం రుణాల పరంగా ప్రతికూలతలను చూస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
వంశీరామ్ బిల్డర్స్ పై కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు!
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసొస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే! స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కండీషన్స్ అప్లై ఎలాగైతే ఉంటుందో అలాగే స్థిరాస్తి రంగానికీ ఉంటుంది. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థ్ధిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్ నిర్ణయించుకుంటాడు. ఇలాంటి పరిస్థితులలో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా.. గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తుంది. ఇందులో ధర చ.అ.కు రూ.5,500లకు విక్రయిస్తుంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చ.అ.కు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు. రేపటి అవసరాన్ని బట్టే కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమం అని చాలా మంది సలహా ఇస్తుంటారు కానీ ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థ్ధిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. పైగా విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని బట్టి గృహాలను కొనుగోలు చేయాలి. చాలా మంది ప్రస్తుతం ఆర్జించే ఆదాయానికి పరిమితమై కొనుగోలు నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు, పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈరోజు 2 బీహెచ్‌కే కొనే చోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. ఉత్తమ గృహ కొనుగోలుదారులు చేసేదిదే. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వీటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలలో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఇప్పటికే ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలకు, ప్రాంతాలతో దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ఏరియాలకు కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ మెరుగైంది కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, నేడు పరిస్థితి మారింది. మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ చదవండి: NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్లకు భారీ ఊరట.. -
ఆశతో ఆడుకుంటున్న బిల్డర్ల.. బలవుతున్న సామాన్యులు, ఇన్వెస్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓ పక్క గృహ నిర్మాణాలలో ప్రీలాంచ్ విక్రయాలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న బిల్డర్లు.. పెట్టుబడిదారులనూ వదలడం లేదు. స్థలం కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు రాకముందే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్ డిజైన్లు, అందమైన బ్రోచర్లతో ఆకర్షిస్తున్నారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువే లాభం, వంద శాతం సొమ్ము ముందే చెల్లిస్తే సగం ధరకే వాణిజ్య స్థలం, ప్రాజెక్ట్ పూర్తయ్యాక రెట్టింపు అద్దె అంటూ అన్ని రకాల మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చివరకు నట్టేట ముంచేస్తున్నారు. బాధితులు వేల సంఖ్యలో.. సాహితీ, ఫీనిక్స్, సీఎన్ఎన్ వెంచర్స్, సెన్సేషన్, గరోండా బిల్డర్స్, సంధ్యా కన్వెన్షన్ వంటి నిర్మాణ సంస్థలెన్నో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నామని జనాలను నమ్మించి సొమ్ము వసూలు చేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి హైస్ట్రీట్ ఏరియాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. బిల్డర్ల చేతిలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్డ్ పోలీసులు, ప్రవాసులూ చిక్కి విలవిల్లాడుతున్నారు. కట్టిన సొమ్ము వాపసు ఇవ్వాలని డెవలపర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ బిల్డర్లు బౌన్సర్లను నియమించుకుని కొనుగోలుదారులను కనీసం ఆఫీసు లోపలికి కూడా రానివ్వటం లేదని సత్యా టెక్నో పార్క్ బాధితుడు వాపోయారు. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా అద్దె! సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ నానక్‌రాంగూడలో జీ+47 అంతస్తులలో హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. రూ.60 లక్షలకు 397 చ.అ., రూ.82 లక్షలకు 546 చ.అ. స్పేస్‌ను ప్రీలాంచ్లో భాగంగా విక్రయిస్తోంది. రూ.60 లక్షల పెట్టుబడిదారులకు రూ.14,500, రూ.82 లక్షల వాళ్లకు రూ.62 వేలు అద్దె ప్రతి నెలా కంపెనీయే చెల్లిస్తుందని మాయమాటలు చెబుతోంది. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, 10 ఏళ్ల పాటు ఈ అద్దె అగ్రిమెంట్ ఉంటుందని నమ్మబలుకుతోంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవచ్చని లేదా కస్టమర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వల వేస్తోంది. ఇంతా చేస్తే ప్రాజెక్ట్‌ను నిర్మించే స్థలం సెన్సేషన్ కంపెనీ పేరు మీదే లేకపోవటం గమనార్హం. అంతా గోల్మాల్.. బోయిన్‌పల్లిలో 4 ఎకరాలలో ధనా మాల్ నిర్మిస్తామని సీఎన్ఎన్ వెంచర్స్ ప్రచారం చేసింది. 120 చ.అ. స్థలం రూ.10 లక్షల చొప్పున వందలాది మందికి విక్రయించింది. కానీ సంస్థకు నేటికీ నిర్మాణ అనుమతులు రాలేదు. ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలని కొనుగోలుదారులు రోజూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సంస్థ మాత్రం కిక్కురుమనడం లేదు. తాజాగా ఇదే సంస్థ బెంగళూరులోని చిక్కజల ప్రాంతంలో 7 ఎకరాలలో ధనా మాల్ పేరిట ప్రీలాంచ్ కింద కమర్షియల్ రిటైల్ షాపింగ్ స్పేస్‌ను విక్రయిస్తుండటం గమనార్హం. కమర్షియల్స్‌ను ప్రీలాంచ్లో విక్రయించకూడదు కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేయకుండా విక్రయాలు చేయకూదు. నిబంధనలు అతిక్రమించిన డెవలపర్లకు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – కె.విద్యాధర్, టీఎస్ రెరా సెక్రటరీ -
దేశంలో ఈడీ హీట్.. రూ.415 కోట్లు విలువైన బిల్డర్స్ ఆస్తులు సీజ్!
ముంబై: దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హీట్ కొనసాగుతోంది. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్రలోని ఓ బిల్డర్‌కు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను సీజ్ చేసిన మరుసటి రోజునే మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. ఆ బిల్డర్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన మొత్తం రూ.415 కోట్లు విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఎస్ బ్యాంక్- డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి.. ఇప్పటికే రేడియస్ డెవెలపర్స్ అధినేత సంజయ్ ఛాబ్రియా, ఏబీఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చీఫ్ అవినాశ్ భోంస్లేలను అరెస్ట్ చేసింది ఈడీ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు రూ.34వేల కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతవారం అవినాశ్ భోంస్లేకు చెందిన హెలికాప్టర్‌ను పుణెలో స్వాధీనం చేసుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా బుధవారం సీజ్ చేసిన ఆస్తుల్లో.. ముంబైలోని రూ.116.5 కోట్లు విలువైన ఆస్తి, ఛాబ్రియా సంస్థలో 25 శాతం ఈక్విటీ షేర్లు, రూ.3 కోట్లు విలువైన ఫ్లాట్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్లో లాభం రూ.13.67 కోట్లు, రూ.3.10 కోట్లు విలువైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. మరోవైపు.. అవినాశ్ భోంస్లే ఆస్తుల్లో ముంబైలోని రూ.102.8 కోట్లు విలువైన డూప్లెక్స్ ఫ్లాట్, పుణెలోని రూ.14.65 కోట్లు, రూ.29.24 కోట్లు విలువైన భూములు, నాగ్‌పూర్‌లోని రూ.15.62 కోట్లు విలువైన మరో ల్యాండ్ వంటివి సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. పీఎంఎల్ఏ చట్టం 2002 ప్రకారం ఇరువురికి అటాచ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది ఈడీ. తాజాగా సీజ్ చేసిన ఆస్తులతో మొత్తం ఇద్దరికి సంబంధించి రూ.1,827 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 1988లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఎస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్స్ కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లను విచారిస్తోంది ఈడీ. డీహెచ్ఎఫ్ఎల్కు ఎస్ బ్యాంక్ నుంచి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్లోని స్వల్ప కాలిక నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్‌లో రూ.3,700 కోట్లు ఎస్ బ్యాంక్ పెట్టుబడి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. అలాగే.. మసాలా బాండ్స్‌లో రూ.283 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. దానికి బధులుగా డీహెచ్ఎఫ్ఎల్ ద్వారా కపిల్ వాద్వాన్.. రాణా కపూర్ సంస్థలకు రూ.600 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టగా సంజయ్ ఛాబ్రియాన్ చెందిన రేడియస్ గ్రూప్‌నకు రూ.2,317 కోట్లు రుణాలు వచ్చాయని... వాటిని అవినాశ్ భోంస్లేతో కలిసి ఇతర మార్గాల్లోకి మళ్లించాడని పేర్కొంది. ఇదీ చదవండి: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు -
తండ్రి డబ్బు, లోన్‌తో నిర్మాణరంగ ప్రయాణం మొదలెట్టి.. 26 ఏళ్లకే!
Pranav Sharma Inspirational Journey: ఇల్లు కట్టి చూడు... అంటారు ఇంటినిర్మాణం కష్టాలు చెప్పేలా. ఒక్క ఇల్లు ఏం ఖర్మ...పాతికేళ్ల వయసులోనే వెయ్యి ఇండ్లను నిర్మించి, దిగువ మధ్యతరగతి వారి సొంత ఇంటి కలను నిజం చేశాడు ప్రణవ్ శర్మ, ఫెలిసిటీ అడోబ్, ఫౌండర్. కడుపులో చల్ల కదలకుండా చల్లగా ఉద్యోగం చేసుకోవడం అంటే కొందరికి ఇష్టం. కొందరికి మాత్రం ఆ చల్లదనం వేడిపుట్టిస్తుంది. ఫైర్‌ను ప్రజ్వరిల్లేలా చేస్తుంది. ప్రణవ్‌శర్మ రెండో కోవకు చెందిన యువకుడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు ఇరవైకిలోమీటర్ల దూరంలో ఉన్న టైర్2 సిటీ సంగనేర్‌కు చెందిన శర్మ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తికాగానే బెంగళూరులోని డెలాయిట్‌లో మెనేజ్మెంట్ ఇంటర్న్‌గా చేరాడు. ఆరోజుల్లో ఒకరోజు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యెజన’ గురించి విన్న తరువాత తనలో ఒక ఐడియా మెరిసింది. ఆరునెలలు ఉద్యోగం చేసిన తరువాత, ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ‘ఫెలిసిటీ అడోబ్’ అనే నిర్మాణసంస్థను మొదలుపెట్టాడు. తండ్రి అశోక్‌శర్మ రిటైర్డ్ ఆయుర్వేద వైద్యుడు. ఆయన దగ్గర తీసుకున్న డబ్బు, లోన్‌తో తన నిర్మాణరంగ ప్రయాణం మొదలైంది. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ రిస్క్ ఎందుకు!’ ‘నిర్మాణరంగం అంటేనే రిస్క్. కాకలు తీరినవారు కూడా ఖంగు తింటుంటారు’....ఇలాంటి మాటలు అతడికి వినిపించాయి. వాటిని ప్రణవ్ పెద్దగా పట్టించుకోలేదు. టైర్ సిటీలలో సొంత ఇల్లు అనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. టైర్సిటీకి చెందిన తనకు కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శానిటైజేషన్, స్వచ్ఛమైన తాగునీరు, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్....మొదలైన విషయాల గురించి అవగాహన ఉంది. ‘స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలను కాలేజీలో కంటే బయటే ఎక్కువ నేర్చుకున్నాను’ అంటాడు శర్మ. ‘ఇంటి అద్దె ఖర్చులతోనే సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి’ అనే ప్రకటనతో రంగంలోకి దిగాడు. నెల తిరగకుండానే 300 అప్లికేషన్లు వచ్చాయి. బుకింగ్ అడ్వాన్స్‌లు వచ్చాయి. ఈ సంతోషం ఆవిరి అయ్యేలా అప్లికేషన్లను బ్యాంకులో సమర్పిస్తున్నప్పుడు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ...మొదలైన బ్యాంకుల నుంచి అప్రూవల్ ప్రాసెస్ గురించి సలహాలు, సూచనలు తీసుకున్నాడు. లోన్ ప్రాసెస్ గురించి క్లయింట్స్‌కు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. అలా తొలిదశలో స్వర్ణగృహ–1 పదహారు నెలల్లో పూర్తయింది. ‘తక్కువ ధర, తక్కువ కాలం’ అయినంత మాత్రాన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు శర్మ. తుమకూర్, వసంతనరసపుర(కర్నాటక)లో రెండో దశ నిర్మాణం పూర్తయింది. కోలార్‌లో మూడో దశ మొదలైంది. బెల్గామ్‌లోని బెల్గవిలో నాలుగో దశ నిర్మాణం మొదలుకానుంది. 2028 నాటికి 50,000 హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని 26 ఏళ్ల ఈ యంగ్బిల్డర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా కరువుపీడిత ప్రాంతాలలో సోలార్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రంగంలోకి దిగాడు. ‘నా విజయం యువతరానికి స్ఫూర్తి ఇచ్చి, సొంతకాళ్ల మీద నిలబడే ధైర్యాన్ని ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంది!’ అంటున్నాడు ప్రణవ్ శర్మ. ‘కొందరికి తమ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వారు చేసిన పనే మాట్లాడుతుంది. ప్రణవ్‌శర్మ ఈ కోవకు చెందిన వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు నేషనల్ బ్యాంక్, హోమ్లోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ప్రకాష్. చదవండి👉🏾 చిరుద్యోగి నుంచి సీయీవో దాకా! -
ఉత్తమ బిల్డర్ కావాలంటే?
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత, గడువులోగా నిర్మాణం పూర్తి చేయడం, కొనుగోలుదారులు సత్సంబంధాలు, ఉపాధి, ఆర్థిక సహకారం అందించే ఏ డెవలపర్ అయినా విజయం సాధిస్తాడని నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. దుబాయ్‌లో జరిగిన రియల్టీ 2.0 సదస్సులో పాల్గొన్న ఆయన ‘ఎగ్జిక్యూటింగ్ యువర్ లీడర్షిప్ విజన్ యాస్ ఏ రియల్టర్’ అనే అంశంపై మాట్లాడారు. సానుకూల ఆలోచనలు, నిబద్ధత, విమర్శ, శిక్షణ, నైపుణ్యత, సమయపాలన, శాశ్వత అభ్యాసన, అసాధారణ వైఖరిలను అలవరచుకోవాలని సూచించారు. ప్రతి రోజు కొత్త గోల్‌ను పెట్టుకోవాలని, దాన్ని అధిగమిస్తూ ఉండాలని చెప్పారు. కంపెనీ ఉద్యోగుల మీద నమ్మకం, ప్రతి రోజు శిక్షణ, ట్రాకింగ్ ఉండాలని పేర్కొన్నారు. లక్ష్యం ఎందుకు? లక్ష్యం పెట్టుకోవటం గొప్ప కాదు.. ఎందుకోసం లకి‡్ష్యంచామో స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. పనిచేయడానికి ఉత్తమ స్థలం, ఉత్తమ ఉత్పత్తి, అవార్డ్లు, రివార్డ్‌లు, కమ్యూనిటీ సర్వీస్, అత్యధిక లాభం వీటిల్లో వేటికోసం టార్గెట్‌ను ఎంపిక చేసుకున్నామో విశ్లేషించుకోవాలని సూచించారు. నా వరకైతే ప్రస్తుతం రూ.100 కోట్ల లోపు టర్నోవర్ ఆర్క్ గ్రూప్‌ను 2030 నాటికి రూ.5 వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఆర్క్ ఫౌండేషన్‌లో ఇప్పటికే వైద్యులు, ఇంజనీర్లు, క్రీడాకారులుగా ఎదిగిన విద్యార్థులున్నారు. వంద మంది సివిల్ సర్వెంట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని తెలిపారు. సమయపాలన, లక్ష్యం, బం ధం, సవాళ్లు.. ఈ నాలుగు అంశాలను సరిగ్గా అమలు పరిస్తేనే ఎంపిక చేసుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. సవాళ్లను అధిగమించే పరిష్కార మార్గాలను కనుగొనగలిగితేనే లక్ష్యాన్ని చేరుకోగలమని అభిప్రాయపడ్డారు. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు) -
High Rise Apartments Hyderabad: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. కానీ?!
‘హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ పదేళ్ల క్రితం ఏఎస్రావు నగర్లో మూడున్నర ఎకరాల్లో 25 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మించింది. అప్పట్లో నగరంలోని ఆకాశహర్మ్యాలలో టాప్– 5లో ఇదొకటి. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుంది. కార్పస్ ఫండ్ కింద ఫ్లాట్ రూ.లక్ష చొప్పున వసూలు చేసి రెండేళ్ల పాటు నిర్వహణ కంపెనీయే చేపట్టింది. ఇక్కడిదాకా బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నివాసితుల సంఘం ప్రాజెక్ట్‌లోని వసతులను వార్షిక నిర్వహణ చేపట్టలేకపోయింది. అపార్ట్మెంట్లు రంగులు, అంతర్గత రోడ్లు పాడైపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.4 వేల ధర పలుకుతుంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3 వేలకు మించి రీసేల్ కావటం లేదు’ సాక్షి, హైదరాబాద్: ఇదీ ఓ హైరైజ్ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి. కొనేటప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తు హైరైజ్ రిస్క్‌లను అంచనా వేయటంలో నిర్మాణ సంస్థ, కొనుగోలుదారూ విఫలం చెందిన ఘటనకు ఇదో మచ్చుతునక. అంటే.. ఆకాశహర్మ్యాలు నిర్మించొద్దని కాదు.. నిర్వహణ సరిగా చేయలేకపోయినా, దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలకు ముందస్తు పరిష్కారం చూపించలేకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. నిర్మాణ సంస్థదేముంది కట్టేసి, అమ్మేసి చేతులు దులుపుకొంటుంది అంతే. ఆ తర్వాత కష్టాలు షరామామూలే. 41 శాతం ఎక్కువ.. భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాల సంస్కృతి భారీగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన హైరైజ్ భవనాలు క్రమంగా ఇక్కడా పెరిగిపోతున్నాయి. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి రాగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. 2020తో పోలిస్తే 41 శాతం ఎక్కువ. తొందరపడితే నష్టాలే.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఒకర్ని చూసి మరొకరు హైరైజ్ నిర్మాణాలను చేపడుతున్నారు. గచ్చిబౌలి, గండిపేట, కొండాపూర్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఖాజాగూడ, పుప్పాలగూడ, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం నార్సింగి, శంకర్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో 25 నుంచి 30 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగైదు ఏళ్లలో అదనంగా 70 వేల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయంటున్నారు నిపుణులు. ఇంత భారీ స్థాయిలో సరఫరాను అందుకునే డిమాండ్ ఉందా? డిమాండ్‌కు మించి సరఫరా జరిగితే ఇన్వెంటరీ పెరిగి రియల్టీ మార్కెట్ దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలా చేయాలి.. భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్‌లోని నివాసితులు, వాహనాల సంఖ్య, జనసాంద్రతకు తగ్గట్టుగా రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించాలి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతం లోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ప్రతి అంతస్తునూ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి అంశాలను తనిఖీ చేయాలి. ఆ స్థోమత బిల్డర్‌కు ఉందా? హైరైజ్ ప్రాజెక్ట్‌లను నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా? లేదా? అనేది చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్ మధ్యలో బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత, ఇతరత్రా అంశాల గురించి ఆరా తీయాలి. - నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ ఇంపాక్ట్ ఫీజు పెంచాలి.. హైరైజ్ నిర్మాణాలను నియంత్రించాలంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు క్యాప్ పెట్టడం సరైన నిర్ణయం కాదు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తింటుంది. అపరిమిత ఎఫ్ఎస్ఐ కారణంగానే ఇతర నగరాల నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపడుతున్నాయి. హైరైజ్ భవనాలను నియంత్రించాలంటే చేయాల్సింది ఇంపాక్ట్ ఫీజును పెంచాల్సిందే. – సి.శేఖర్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్ -
నరకం చూస్తున్న సామాన్యుడు.. సచ్చినా.. మారరా..?
గోల్కొండ: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కల సాకారం కావాలంటే మాత్రం నరకం చూడాల్సిందే.. ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు.. నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులకు లంచాలు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అడుగడుగునా ఇబ్బందులు తప్పవు.. అడిగినంతా ఇచ్చుకుంటే ఇక ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది అన్ని శాఖల అధికారుల తీరు. దీంతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఏ అధికారికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన బిల్డర్లు లంచాలు వారికి అందించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. ♦ అక్రమ నిర్మాణానికి డ్రైనేజీ లైన్ వేయాలన్నా.. తాగునీటి పైప్‌లైన్ అయినా.. ట్రాన్స్ఫార్మర్, మీటర్లు ఇలా ఏది కావాలన్నా బిల్డర్లు అధికారుల జేబుల్లో డబ్బులు కుక్కి.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ లైన్ నుంచి ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు ఇస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ♦ నిర్మాణాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉండే వాటిని ప్రైవేటు వ్యక్తులు పక్కకు తరలించే అవకాశం కల్పిస్తున్నారు. డబ్బులిచ్చుకో.. పనులు చేసుకో.. అంటూ బిల్డర్లకు, భవన యజమానులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ♦ 10 రోజుల క్రితం తేజ కాలనీలో ఓ బిల్డర్లు తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రదేశానికి తరలిస్తుండగా విద్యుదాఘాతానికి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నిర్లక్ష్యంలో విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ♦ పెద్దపెద్ద ప్రమాదకరమైన పనులను దినసరి కూలీలతో చేయిస్తున్నా.. అధికారులు మొద్దు నిద్ర వదలకపోవడంపై స్థానిక కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ముడితే చాలు ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? అని ప్రశి్నస్తున్నారు. ♦ నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచాలు ఇవ్వకపోతే ఒక్క అధికారి కూడా పని చేయడం లేదు. డబ్బులు ఇచ్చే వరకు ఫైల్ పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఇంకా కొందరు అధికారులు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారు. ♦ అయ్యా.. సారూ.. అంటూ వారి చుట్టూ తిరుగుతున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. మీటింగులు, విజిట్ అంటూ సొంత పనుల కోసం తిరుగుతున్నారు. కొంత మంది బిల్డర్లు, గుత్తేదారులు ఫోన్లోనే మాట్లాడుకొని ముడుపులు వారి వద్దకే పంపడంతో పనులు చకచకా సాగిపోతున్నాయి. ♦ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయి చాలామంది బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ♦ అన్ని శాఖల్లో ఇదే విధానం కొనసాగుతోంది. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ లైన్ కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సిందే.. విద్యుత్ మీటర్ కోసం క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇస్తే ఎలాంటి అక్రమాలైనా.. సక్రమాలవుతున్నాయి. ♦ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు మార్చడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాలనీల్లో బిల్డర్లు వీటిని పాటించడం లేదు. దీని వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ♦ పలుమార్లు విద్యుత్ స్తంభాలు వేయడానికి, మార్చడానికి బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా దినసరి కూలీలను పెట్టుకుని పనులు కానిస్తున్నారు. తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మార్చడానికి ఓ వ్యక్తి పది రోజుల క్రితం ఓ కూలీలను నియమించుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు కొనసాగించాడు. దీంతో ఆ కూలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
బిల్డర్ దారుణ హత్య
పాయకాపురం(విజయవాడ రూరల్): విజయవాడ నగరంలో ఓ బిల్డర్ దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నున్న రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నానికి చెందిన పీతల అప్పలరాజు(45) విజయవాడలో అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయిస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఆఫీస్ నిర్వహిస్తూ పాయకాపురంలో (దేవినేని గాంధీపురంలో) అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. భార్యా పిల్లలు మాత్రం విశాఖలోనే ఉంటున్నారు. నెలలో పది రోజులు విజయవాడలో ఉంటూ మిగిలిన 20 రోజులు విశాఖలో ఉంటాడు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి తన ఇంటి మొదటి అంతస్తులో నిద్రించిన అప్పలరాజు.. సోమవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో కింది పోర్షన్లో ఉంటున్న వారు పైకి వెళ్లి చూశారు. మంచంపై అప్పలరాజు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్త్ ఏసీపీ షేక్ షాను, సీఐ హానీష్‌బాబులు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తలపై తీవ్ర గాయాలున్నాయి. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ జాగిలాలు హత్య జరిగిన ప్రాంతం నుంచి దూరంగా ఉన్న బ్రాందీ షాపు, గృహ సముదాయాల మధ్య సంచరించాయి. సమీపంలోని సీసీ కెమేరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కొన్ని ఆధారాలు లభించాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ చెప్పారు. ఆర్థిక లావాదేవీలు లేదా వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అప్పట్లో రూ. 40 వేలు.. ఇప్పుడు 60 వేలు.. మేమేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా ఏడాదిన్నరగా ముందుకు సాగని ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించినా ధరలు పెరిగిపోవడంతో ఆగిపోవడమో లేక నత్తనడకన సాగడమో జరుగుతోంది. సిమెంట్, ఇసుక, స్టీల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ రేట్లతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం బిల్డర్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. పాత రేట్లకు పనులు పూర్తి చేయలేమంటూ కాంట్రాక్టర్లు, ఒప్పందం మేరకు కట్టాల్సిందేనంటూ యజమానులు ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ఇంటి నిర్మాణానికి పునాదుల నుంచి పైకప్పు వరకు ఏ వస్తువు కొన్నా 20% నుంచి 30% వరకు ధరలు పెరిగాయి. గతంలో స్టీల్ టన్నుకు రూ.4,0000 నుంచి 5,0000 మధ్యలో ఉండేది. ఇప్పుడు అదే రూ. 55000 నుంచి రూ. 60వేలకు వెళ్లిపోయింది. గతంలో ఒక్క ఇటుక రూ.6 నుంచి రూ.7 ఉండేది. అదే ఇప్పుడు రూ.8 నుంచి 10కి పెరిగిపోయింది. గతంలో ఇసుక టన్ను రూ.1,200 నుంచి 1,600 వరకు ఉండేది. అదే ఇప్పుడు టన్ను ధర రూ. 2000 నుంచి 2,500 వరకు అమ్ముతున్నారు. వర్షాకాలం మొదలు కాకముందే ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకా వర్షాలు కురిస్తే మాత్రం రూ.3 వేల నుంచి రూ.3,500 దాటే అవకాశం లేకపోలేదు. వీటితోపాటు కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. దీంతో ఇంటి నిర్మాణం కోసం లాక్‌డౌన్‌కు ముందు చేసుకున్న అగ్రిమెంట్లతో ఇప్పుడు ఇంటి యజమాని –బిల్డర్స్ తలపట్టుకుంటున్నారు.లాక్‌డౌన్‌తో భవన నిర్మాణ వస్తువుల ఉత్పత్తి ఆగిపోవడం, సామగ్రి తయారీ లేకపోవడంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రవి (మేస్త్రీ, బిల్డర్) ముందు కుదుర్చుకున్న ఒప్పందాలతో ఇప్పుడు పనులు చేయాలంటే మాపైన అదనపు ఆర్థిక భారం పడుతోంది. అయినా ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి నిర్మాణం పూర్తిచేస్తేనే పరపతి పెరిగి కొత్తవి కట్టే అవకాశాలు వస్తాయి. శ్రీనివాస్ (రాజేంద్ర బిల్డర్స్, ముసారాంబాగ్) ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడమే. కొద్దిరోజుల పాటు ఆగుదామంటే ఇంటి యజమానులు ఆగడం లేదు. రాజు (ఇంటి యజమాని) ఆర్నెల్ల క్రితం ఇంటి నిర్మాణం కాంట్రాక్టును ఓ బిల్డర్‌కు ఇచ్చాను. రూ. 30లక్షలతో ఇళ్లు కట్టాలని ఒప్పందం చేసుకున్నాం. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో గతంలోని ఒప్పందం ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని, తనకు మరో రూ.5 లక్షలు అదనంగా ఇవ్వాలని బిల్డర్ చెప్పడంతో పనులు ఆగిపోయాయి. కూలీల రేట్లు (రూ.లలో) గతంలో ఇప్పుడు మేస్త్రీ 700 – 800 1,100 – 1,200 పార మేస్త్రీ 600 – 700 800 – 900 ఆడవారు 500 – 600 700 – 800 లేబర్ 400 – 500 600 – 700 -
బిల్డర్ల మోసాల నుంచి రక్షణ కల్పించాలి
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు బిల్డర్లు, ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్రం నమూనా ఒప్పందాలను సిద్ధం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ ‘మోడల్ బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్’, ‘మోడల్ ఏజెంట్, బయ్యర్ అగ్రిమెంట్’లను అమలయ్యేలా చూడాలని కూడా బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తన పిల్లో కోరారు. ప్రమోటర్లు, బిల్డర్లు, ఏజెంట్లూ ఏకపక్షమైన ఒప్పందాలను ఉపయోగిస్తూంటారని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసి భవనాలను కొనుగోలుదార్లకు అందించడంలో విపరీతమైన జాప్యం చేయడం, వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఇప్పటికే చాలాసార్లు జరిగాయనీ, ఏకపక్ష ఒప్పందాల్లోని నిబంధనలను సాకుగా చూపుతున్నారని అశ్విని కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘బిల్డర్లు డెలివరీ షెడ్యూల్‌ను పదే పదే జారీ చేస్తూంటారు. అనైతికమైన, ఏకపక్షమైన వ్యాపార కార్యకలాపాలు చేస్తూంటారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఫ్రాడ్, మోసం, విశ్వాస ఘాతుకం, నిజాయితీ లేకపోవడం, కార్పొరేట్ చట్టాల ఉల్లంఘన, భవనాల విషయంలో అవకతవకలు జరుగుతూంటాయి’’అని వివరించారు. ఈ చర్యలన్నింటి వల్ల వినియోగదారులు మానసిక, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని, అంతేకాకుండా తాము జీవించే, జీవనోపాధి హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే సాఫ్ట్ లాంచ్ చేయడం చట్టాన్ని నేరుగా అతిక్రమించడమేనని ఆరోపించారు. విక్రయానికి ముందుగా నియంత్రణ సంస్థల వద్ద ఆ ప్రాజెక్టును నమోదు చేయడం అవసరమని, బిల్డర్ వద్ద అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కూడా ఈ పిటిషన్లో కోరారు. -
కంటెయినర్ ఇళ్లొచ్చాయ్!
మొయినాబాద్(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్లు, ఔరా అనిపించే ఇంటీరియర్. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. సులభంగా తరలింపు... రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే. వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. చదరపు అడుగుకు రూ.1,200... 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్‌కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్‌ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆసక్తిని బట్టి తయారీ వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్ రూమ్‌లు, లేబర్ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్రూమ్లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్ఈఎఫ్ టెక్నాలజీస్, జీడిమెట్ల -
‘రెరా’... బిల్డర్లు పట్టించుకోరా..?
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారుకు భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) కార్యరూపం దాల్చడంలేదు. పునాది పడే ప్రతి ప్రాజెక్టు, లేఅవుట్ విధిగా ‘రెరా’లో నమోదు కావాల్సిందేనని చట్టం చెబుతున్నా బిల్డర్లు/డెవలప ర్లు పట్టించుకోవడంలేదు. 2017లో ‘రెరా’చట్టం మనుగడలోకి వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 2,500 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు) ఆమోదముద్ర వేస్తే.. అందులో 2,500 ప్రాజెక్టులే పేర్లను నమోదు చేసుకోవడం చూస్తే ‘రెరా’ అమలులో పురపాలక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాతో వెసులుబాటు! స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలో పేర్లను నమో దు చేసుకోని సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన సర్కారు.. జరిమానాలతో సరిపెడుతోంది. రూ.3 లక్షల పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో పేరు నమోదు చేసుకోకున్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం రియల్టీ కంపెనీల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి అనుమతి పొందిన స్థిరాస్తి సంస్థలు గత నవంబర్ 30 వరకు ఆన్లైన్లో ‘రెరా’లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ తర్వాత రూ. 50 వేల జరిమానాతో గడువు ఇస్తే 50 సంస్థలు ముందుకు రాగా.. రెండోసారి రూ.3 లక్షల పెనాల్టీతో పేర్ల నమోదుకు అవకాశం కల్పించినా ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ చైర్మన్ రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. అవగాహనాలోపం..! వినియోగదారులకు విశ్వాసం, నమ్మకం కలిగించేందుకు వీలుగా ‘రెరా’ను పకడ్బందీగా అమలు చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలం, 8 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తప్పనిసరిగా ‘రెరా’లో నమోదుచేసుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధన ఉండటంతో రియల్టర్లు ‘రెరా’లో నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు భరో సా ఇచ్చేలా.. డెవలపర్లు విధిగా పాటించేలా కొన్ని నిబంధనలు పకడ్బందీగా ఉండటం కూడా వారి వెనుకడుగుకు కారణంగా కనిపిస్తోంది. ‘రెరా’లో నమోదు అనంతరమే.. స్థలాలు, ఫ్లాట్లు విక్రయాలకు చెందిన ప్రచారం నిర్వహించుకోవాలనే షరతు విధించింది. ఈ మేరకు పత్రికా, ప్రసారమాధ్యమా ల్లో ‘రెరా’రిజిస్టర్ నంబర్‌ను ప్రచురించాలని స్పష్టం చేసింది. బడా సంస్థలు మినహా మధ్యతరగతి రియల్టీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించడంలేదు. భూమి పూజ చేసిందే మొదలు ప్లాట్ల బేరాలను సాగిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేస్తున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, తదితర సంస్థల సమన్వయం కొరవడడం కూడా ‘రెరా’లో పేర్లు నమోదు కాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ‘రెరా’కు తగినంత సిబ్బంది లేకపోవడం.. ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోంది. రెరా ఆవశ్యకత, చట్టబద్ధత, ప్లాట్ల క్రయవిక్రయాల్లో ఈ చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే అం శంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంగానీ, ప్రచారం చేయడంలో పురపాలక శాఖ విఫలమైంది. దీంతో ఈ చట్టంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. భారీగా జరిమానాలు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో బిల్డర్లపై రెరా సంస్థ భారీగానే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు 400 ప్రాజెక్టులపై రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు జరిమానాలు విధించి రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇవి కేవలం బడాసంస్థలకు సంబంధించినవి మాత్రమే కాగా, హెచ్ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్మెంట్ల విషయంలో తాత్సారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ‘రెరా’అధికారులు మాత్రం మధ్యతరగతి రియల్ మోసాలు తమ వరకు రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ‘రెరా’లో నమోదు చేసుకోకుండానే వెంచర్లు చేసి అమ్ముకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే, 2017 జనవరి తర్వాత వెలిసిన లేఅవుట్ల విషయంలో ఇప్పటి నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తామని ‘రెరా’కార్యదర్శి విద్యాధర్ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమ లేఅవుట్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాగానే సమాచారం తమకు వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖతో సమన్వయం కుదుర్చుకునే పనిలో ఉన్నామని, సదరు డెవలపర్‌కు చెందిన సమస్త సమాచారాన్ని ఆ శాఖ నుంచి తీసుకుంటామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
బిల్డర్లూ.. పారాహుషార్
సాక్షి, హైదరాబాద్ : భూమి వినియోగంలో హేతుబద్ధత, భవన నిర్మాణాలకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా లే అవుట్ల విషయంలో బిల్డర్లు, అధికారులను బాధ్యులను చేసేలా ముసాయిదా మున్సిపల్ చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. లే అవుట్లు చేశాక ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్ముకొని సొమ్ము చేసుకొనే బిల్డర్లు ఆయా లే అవుట్లను గాలికి వదిలేస్తే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా నిబంధనలు తయారవుతున్నాయి. లే అవుట్ ఆమోదం పొందిన రెండేళ్లలో కనీస సౌకర్యాలను కల్పించి సంబంధిత ఆధారాలను ఆన్లైన్లో పొందుపరచకుంటే ఆ బిల్డర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి లే అవుట్లు వేయకుండా అనర్హులుగా ప్రకటించేలా కఠిన నిబంధనలతో చట్టాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణాల విషయంలోనూ నిర్మాణదారులు, అధికారులను జవాబుదారీలను చేయడంతోపాటు నిర్మాణదారులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలు రూపొందుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వారం రోజుల్లోగా అనుమతి ఇచ్చేదీ లేనిది తేల్చేయాలనే నిబంధనను పొందుపరచనున్నారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించాలనుకుంటే ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణాలను వివరిస్తూ అధికారులు లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని లేదంటే అనుమతి ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొననున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న నిబంధనలకు కొంత మార్పు చేసి 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవనం నిర్మించాలనుకుంటే గతంలోలాగా అనుమతులు అవసరం లేదని, సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని, దరఖాస్తుదారుల స్వయం పూచీకత్తుతో భవనాలు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుందని కొత్త చట్టంలో పేర్కొంటున్నారు. భూమి వినియోగంలో హేతుబద్ధత, భవన నిర్మాణాల విషయంలో ముసాయిదా చట్టంలో పేర్కొంటున్న ముఖ్యాంశాలివే... 1. లే అవుట్లకు సంబంధించి... చట్టంలో పేర్కొన్న విధంగా లే అవుట్ల అనుమతి కోసం సదరు లే అవుట్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలను వివరిస్తూ ఆన్లైన్లో లేదా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లేఅవుట్‌ను అనుమతిస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తూ లే అవుట్ వివరాలను ఆన్లైన్లో అధికారులు ఉంచాలి. లే అవుట్ అనుమతులను నిర్దేశిత సమయంలో ఇవ్వలేకపోయిన పక్షంలో బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనుమతి పొందిన లే అవుట్లలో రెండేళ్లలో డెవలపర్ లేదా బిల్డర్ కనీస సౌకర్యాలు కల్పించి ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. లేదంటే సదరు డెవలపర్ లేదా బిల్డర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి లే అవుట్లు చేపట్టకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. లే అవుట్లో పార్కులు, గ్రీన్‌బెల్ట్, ఆట స్థలాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను ఉచితంగా మున్సిపాలిటీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారులు స్పష్టమైన రికార్డు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేటాయించిన ఖాళీ స్థలాల్లో మళ్లీ క్రయవిక్రయ లావాదేవీలు నిర్వహిస్తే జరిమానా విధించడంతోపాటు మూడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 2. వన నిర్మాణాలకు సంబంధించి... కమిషనర్ లేదా వైస్ చైర్పర్సన్ అనుమతి లేకుండా భవన నిర్మాణాల కోసం ఎలాంటి భూమిని వినియోగించకూడదు. అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించకూడదు. 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవన నిర్మాణానికిగాను ఆన్లైన్లో సదరు యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు అన్ని డాక్యుమెంట్లు ఆన్లైన్లో సమర్పించిన వెంటనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో వారం రోజుల్లోగా సదరు యజమానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అలా చేయకుండా సదరు దరఖాస్తుపై వారం రోజుల్లోగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే అనుమతి ఇచ్చినట్లే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు. 200 చదరపు మీటర్లలోపు స్థలాల్లో భవన నిర్మాణానికి ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్‌కు సదరు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం ఉండదు. భవన నిర్మాణానికి అనుమతి వచ్చిన 18 నెలల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకవేళ నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి చేయకపోతే ఆ భవనానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మించే భవనాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం నిర్ణయించిన సంఖ్యలో చెట్లు నాటాలి. అన్ని భవనాల్లో పార్కింగ్ స్థలాలను ఉంచాలి. అక్కడ ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ సదుపాయం కల్పించాలి. భవన నిర్మాణ సమయంలో ఎవరైనా మరణిస్తే నిర్మాణాన్ని నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. -
అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో రియల్టర్లు ప్రజలను మోసం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కైన బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కి ఆకాశహర్మాలు నిర్మిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని అభిప్రాయపడింది. వినియోగదారుల్ని ఆమ్రపాలి గ్రూప్ మోసం చేసిందన్న సుప్రీంకోర్టు, అవినీతికి పాల్పడినవారికి మరణశిక్ష విధించలేమని స్పష్టం చేసింది. -
నిఘా.. నిద్ర నటిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము వస్తుందా? రాకుంటే ఎందుకు రావడం లేదు, దాని వెనకున్న కారణాలేంటి? ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అధికార యంత్రాంగం లేదా కాంట్రాక్టర్ల వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తోందా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాల్సిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గాడితప్పినట్టు కనిపిస్తోంది. గతంలో విజిలెన్స్ విభాగం నుంచి నివేదిక వచ్చిందంటే సంబంధిత అధికారులుగానీ, కాంట్రాక్టర్లుగానీ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిగా నత్తనడకన సాగుతోందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చేయి తడిపితే చాలు.. హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించే బిల్డర్లు, నిర్మాణాలు చేస్తున్న యజమానుల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏ ప్రణాళికైనా వారి జేబులు నింపుకోవడానికే పరిమితమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి డివిజన్‌పరిధిలో భవనాలు నిర్మిస్తున్న ఓ బిల్డర్ నిబంధనలు అతిక్రమించి కట్టడాలు సాగిస్తున్నాడని జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసులు స్వీకరించిన సంబంధిత బిల్డర్లు అధికారులకు ఎంతో కొంత సమర్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదే బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కంగారుపడ్డ సంబంధిత బిల్డర్ జీహెచ్ఎంసీ అధికారిని ఫోన్లో ఆరా తీయగా, తమకు ఇచ్చినట్టుగానే విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తే నిర్మాణం సక్రమంగా సాగుతుందని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారికి రూ. 3 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇలా హైదరాబాద్‌లోని వందలాదిమంది బిల్డర్లు, సంబంధిత యజమానులకు ఇదే రీతిలో నోటీసులు జారీచేయడం, వాటి పేరున దండుకోవడం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రీతిలో రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లకు అమ్ముతున్నారని రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి రెండు లారీలను శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు తెలిసింది. ఈ రెండు ఘటనలే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే గుట్టుగా సాగిపోవడానికి విజిలెన్స్ అధికారుల ఆమ్యామ్యాల వ్యవహారమే కారణమని చర్చ జరుగుతోంది. గతంలో నల్లగొండ విజిలెన్స్ అధికారి భాస్కర్‌రావు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా, ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఉన్నతాధికారులనే కలవరానికి గురిచేస్తుంది. రిపోర్టులేవి..? ప్రభుత్వాలకు పథకాల అమలు, అమలులో ఉన్న సమస్యలు, అవినీతి వ్యవహారాలు, పక్కదారి పట్టిస్తున్న అధికారుల వివరాలతో కూడిన నివేదికలను ప్రతినెలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న అధికార వ్యవస్థ ఎక్కడా కూడా ఏ పథకాలపైగానీ, ఏ ప్రాజెక్టుపైగానీ, లోపభూయిష్టమైన ఏ వ్యవస్థపైనా ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా పంపిన దాఖలాల్లేవని సచివాలయ వర్గాలు చెబుతున్నా యి. పైగా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవతలి వ్యక్తికి సమాచారమిచ్చి వసూళ్లు చేసుకుం టున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలెదుర్కుంటున్న సంస్థలు, ఆయా వ్యక్తులకు మేలు చేకూర్చేలా నివేదికలివ్వడాన్ని ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పాలన గాడి తప్పినట్టేనా? ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ హోదా అధికారి ఉండి అజమాయిషీ చేసేవారు. కానీ ఇప్పుడు డీజీ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు రావడం, సమీక్షించే సమయం కూడా లేకపోవడంతో విజిలెన్స్ విభాగం గాడితప్పినట్టు ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో విజిలెన్స్ నివేదికలపై ఏ ఒక్క సంస్థపైగానీ, అధికారిపైగానీ చర్యలు తీసుకోలేదంటే పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ త్రివేది వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్ త్రివేది హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఈ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పనిఒత్తిడితో సచివాలయానికే పరిమితం కావడం వల్ల విజిలెన్స్ విభాగం గాడితప్పుతున్నట్టు స్వంత విభాగంలోనే చర్చించుకుంటున్నారు. -
అపార్ట్‌మెంట్‌కు అడ్డొచ్చిందని...
బొబ్బిలి: ఓ బిల్డర్ వ్యాపారానికి అడ్డొచ్చిందని దశాబ్దాల తరబడి వినియోగిస్తున్న శ్మశానాన్ని మార్చేశారు. ఇప్పటికే ఓ కాలనీ వాసులకు శ్మశానానికి స్థలమిచ్చిన గ్రామానికి తరలించడంతో ఆ గ్రామానికి చెందిన గిరిజనులు తమ శ్మశానం వాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మున్సిపాలిటీలోని గెస్ట్‌హౌస్ కాలనీ సమీపంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు ఉమ్మడిగా ఉన్న శ్మశానం సుమారు ఎకరా విస్తీర్ణంలో వాడుకలో ఉండేది. ఇటీవల ఆ పక్కనే జిరాయితీ భూమిని కొన్న ఓ బిల్డర్ పక్కన శ్మశానం ఉందన్న విషయం తెలియక కొనేసి బిల్డింగ్ నిర్మించారు. అయితే ఆ శ్మశానాన్ని మరో చోటకు తరలించేందుకు కాలనీకి చెందిన కొందరు పెద్దలు బిల్డర్‌కు సహకరించడంతో రెండు గ్రామాల మధ్య శ్మశాన వివాదం తలెత్తింది. గెస్ట్‌హౌస్ కాలనీ శ్మశానానికి ఉన్న రహదారిని తవ్వేసి పక్కనే ఉన్న పోలవానివలస శ్మశానంలో దహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా పోలవానివలస గ్రామ గిరిజనులను హెచ్చరించడం, బెదిరించడంతో వారు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. కేవలం ఓ బిల్డర్ వ్యాపారం కోసం ఇక్కడి శ్మశానాన్ని తరలించడం ఏమిటని స్థానికులు వాదిస్తున్నా అధికారులు ఆదేశించారని చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కొత్తగా శ్మశానానికి రోడ్డు వేసేందుకు అక్కడి సమాధి చేసిన మృతదేహాలను కూడా వెలికి తీశారని గిరిజన గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే ఎవరి శ్మశానాన్ని వారికి కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బావి తవ్వుకుంటే పాడు చేశారు శ్మశానానికి అవసరమైన బావిని తవ్వించాం. బిల్డర్ ఇక్కడ శ్మశానం ఏమిటని బావికి ఉన్న కప్పులను తవ్వించేశారు. అసలు మా శ్మశానం వద్ద బిల్డింగ్ కట్టడమేమిటి? శ్మశానాన్ని తరలించడం ఏమిటి? మేం ఒప్పుకోం. ఎక్కడి శ్మశానం అక్కడే ఉండాలి. –అరసాడ మురళి, స్థానికుడు, గెస్ట్‌హౌస్ కాలనీ రోడ్డు తవ్వేసి మరో రోడ్డు వేశారు మా కాలనీ వాసులు వినియోగిస్తున్న శానానికి ఉన్న రహదారిని తవ్వేశారు. మరో శ్మశానానికి వెళ్లాలని మరో రోడ్డు వేశారు. మా కాలనీకి చెందిన కొందరు ప్రబుద్ధులకు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇదెక్కడి న్యాయం? కె.పార్వతి, మున్సిపల్ కౌన్సిలర్, 21వ వార్డు 1960 నుంచి ఉంటున్నాం.. మేం ఐటీఐ నిర్మించినపుడు అక్కడుండటం శ్రేయస్కరం కాదని అప్పటి చైర్మన్ ఆరి గంగయ్య మాకు ఇక్కడ స్థలమిచ్చారు. గెస్ట్‌హౌస్ కాలనీకి శ్మశానం లేదంటే మేమే స్థలమిచ్చాం. ఎవరో ఖాళీ చేయమంటే మా శ్మశానానికి వస్తామంటున్నారు. ఇదెలా కుదురుతుంది? మేం ఇచ్చేది లేదు. వాళ్ల గొడవలు వారే తీర్చుకోవాలి. మధ్యలో మా మీదకు వస్తారా? –ముంగి సింహాద్రి, గిరిజన పెద్ద, పోలవానివలస -
‘డబుల్’కు రియల్టర్లు
సిటీబ్యూరో: ఎట్టకేలకు గ్రేటర్లో ‘డబుల్’ ఇళ్ల నిర్మాణానికి రియల్ రంగంలోని బిల్డర్లు ముందుకొస్తున్నారు. నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధిత రంగంలోని బడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో, జీహెచ్ఎంసీలో పేరు నమోదు చేసుకున్న రియల్ రంగంలోని వారికి సైతం టెండర్లలో పాల్గొనేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మునిసిపల్ మంత్రి కేటీఆర్ సైతం రియల్ రంగంలోని బిల్డర్లతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. గ్రేటర్లో ఈ సంవత్సరం లక్ష డబుల్ బెడ్రూమ్ఇళ్లు లక్ష్యం కాగా, ఇటీవల జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచిన 12,242 ఇళ్లకు గాను 11,962 ఇళ్లకు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 14 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈ టెండర్లు ఆహ్వానించగా, ఒక చోట ఎవరూ టెండరు దాఖలు చేయలేదు. మరోచోట సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో పడింది. మిగతా 12 ప్రాంతాల్లో 11,962 ఇళ్లకు టెండర్లు ప్రాథమికంగా అర్హత పొందాయి. పూర్తిస్థాయి పరిశీలనానంతరం అర్హులైన వారికి టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ 12 ప్రాంతాల్లోనూ పది ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రియల్ రంగంలోని వారే టెండర్లు దాఖలు చేశారు. మిగతా రెండు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. రియల్ రంగంలోని బిల్డర్ల నుంచి టెండర్లు దాఖలు కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరు టెండర్లు దాఖలు చేసిన ప్రాంతాల్లో నగర కోర్ ఏరియాతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాలున్నాయి. ఇదిలా ఉండగా న్యూ ఇందిరానగర్‌లో మాత్రం ఎవరూ టెండరు దాఖలు చేయలేదు. నార్సింగి సర్వే నెం. 105కు సంబంధించి సాంకేతిక ఇబ్బందులతో పెండింగ్‌లో ఉంచారు. మురహరిపల్లి, శ్రీరామ్నగర్లలో ఇళ్ల నిర్మాణాలకు పెద్ద కాంట్రాక్టర్లు ముందుకు రాగా, మిగతా అన్ని ప్రాంతాల్లో రియల్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
గుంటూరు : రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కంపెనీలు బస్తాకు 100 రూపాయలు మేర పెంచేశాయి. కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మండిపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని పేర్కొంటోంది. కంపెనీలు గనుక ధరల పెంపులో దిగిరాకపోతే, నిర్మాణాలు ఆపివేస్తామని క్రెడాయ్ హెచ్చరించింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎలాగైనా ధరలు తగ్గించేలా చూడాలని కోరుతోంది. ధరలను కంపెనీలు తగ్గించని పక్షంలో ఇతర దేశాల నుంచి సిమెంట్ ను దిగుమతి చేసుకుంటామని క్రెడాయ్ తెలిపింది. ధరల పెంపుతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింటుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. సిమెంట్ కంపెనీలు ఈ మేర ధరలు ఒక్కసారిగా పెంచడం ఇదేమీ మొదటిసారి కాదని, అంతకమునుపు కూడా ఇలానే చేశాయని బిల్డర్స్, కాంట్రాక్టర్లు వాపోయారు. ఈ వ్యవహారంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ సిమెంట్ కంపెనీలకు భారీ జరిమానాలు కూడా విధించినట్టు గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గనుక పరిగణలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుమతామని బిల్డర్స్, కాంట్రాక్టర్లు చెప్పారు. -
నిర్మాణ అనుమతుల్లో జాప్యమేల?
♦ అన్నీ సక్రమంగా ఉన్నా మంజూరు కావటం లేదంటున్న బిల్డర్లు ♦ అధికారులు, ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తున్నట్లు వెల్లడి ♦ ఓసీ జారీలోనూ అధికారులది అలసత్వమే సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న దిక్కుమాలిన నిబంధనల్ని తొలగిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రంగం ఎదుర్కొనే సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కూడా పదే పదే చెబుతున్నారు. కానీ, సంబంధిత మంత్రిత్వ శాఖలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయనేది నిర్మాణ సంస్థల ఆరోపణ. ఫీజుల రూపంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించడం మానేసి రకరకాల కారణాలతో వేధిస్తున్నారని నగరంలో పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’ ప్రతినిధితో వాపోయారు. గతంలో చేతివాటం ప్రదర్శించైనా సరే అనుమతులను జారీ చేసేవారని... ఇప్పుడైతే జేబు ఖాళీ అవుతోంది తప్ప పని మాత్రం జరగటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆన్లైన్ ద్వారా అనుమతులివ్వటమనేది పెద్ద ప్రహసనంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అనుమతులు మాత్రం రావటంలేదు. అధికారులు లేకపోవటం, సిబ్బంది కొరత వంటి రకరకాల కారణాలను సాకుగా చూపుతున్నారు. వేగంగా అనుమతులు వస్తేనే కదా మేం మరిన్ని ప్రాజెక్టులు చేపట్టగలిగేది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఓసీ జారీలోనూ అంతే.. నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే కొనుగోలుదారులు ఇంట్లోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఇందుకు కారణం స్థానిక సంస్థలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయటంలో జాప్యం చేస్తుండటమే. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లోనే ఓసీని జారీ చేయాలి. కానీ, అధికారులు ఇందుకు అనుగుణంగా నడుచుకోవటంలేదు. ♦ డెవలపర్లు నిర్మాణ సమయంలో తనఖా కింద 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు సమర్పించాలి. దీన్ని విడుదల చేయడానికి, అనుసరించాల్సిన విధివిధానాల్ని జీవో నంబర్ 168లో పేర్కొన్నారు. దీని ప్రకారం డెవలపర్ అనుమతి ప్రకారం నిర్మాణం చేపట్టారా? నాలుగువైపులా ఖాళీలను సరిగ్గా వదిలారా? నిబంధనల ప్రకారమే భవన వినియోగం ఉందా? పార్కింగ్ కోసం స్థలాన్ని సక్రమంగా వదిలి పెట్టారా? తదితర అంశాల్ని పరిశీలించి స్థానిక సంస్థలు తనఖాను విడుదల చేయాలి. ♦ కానీ, జరుగుతున్నదేంటంటే.. నిర్మాణం పూర్తయి.. చివరి పనులు జరుగుతున్నప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను జారీ చేయటంలేదు. పైగా అగ్నిమాపక నిరోధక శాఖ నుంచి నిరంభ్యంతర ధృవీకరణ పత్రం తెచ్చారా? మంచినీటి లభ్యతను పరిశీలించారా? వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్ని పరిశీలించాలని జీవోలో ఎక్కడా పేర్కొనలేదు. అయినప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓసీ జారీలో ఆలస్యం ప్రభావం డెవలపర్ల మీద కాకుండా కొనుగోలుదారుల మీద పడుతోంది. సమయానికి గృహ ప్రవేశం చేయలేక అటు బ్యాంకు నెలసరి వాయిదాలు కట్టలేక, ఇటు అద్దెలూ చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అందుబాటు ఇళ్ల వైపు దృష్టి సారించేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ‘సామాన్యుల సొంతింటి కలను తీర్చేలా అందుబాటు ఇళ్లను కడితేనే గిరాకీ’.. మైకు దొరికితే చాలు ప్రతి బిల్డర్ పలికే పలుకులివి. స్టేజీ మీద అవకాశం దొరికితే చాలు నిర్మాణ సంఘాల ప్రతినిధులు చెప్పే మాటలూ ఇవే. కానీ, వాస్తవానికి హైదరాబాద్‌లో జరుగుతోన్న నిర్మాణాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. సామాన్యుల కోసం అందుబాటు ధరలో ఇళ్లను కట్టే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఏవో కొన్ని సంస్థలను మినహారుుస్తే.. నగరానికి చెందిన అధిక శాతం మంది బిల్డర్లు అందుబాటు ఇళ్లవైపు దృష్టి సారించట్లేదన్నది చేదు వాస్తవం. వేతన జీవుల కోసం ఇళ్లను కట్టాలన్న ఆలోచనా అధిక శాతం మందిలో కనబడట్లేదనేది నిజంగా నిజం. ⇔ ఎక్కువ శాతం నిర్మాణ సంస్థలు.. లగ్జరీ గృహాల నిర్మాణాల్ని చేపడుతూ వీటిని విస్మరిస్తున్నారుు. ప్రధాన నగరం నుంచి పది, పన్నెండు కిలోమీటర్ల దూరంలో.. కేవలం నివసించడానికి అవసరమయ్యే విధంగా అంటే ఎలాంటి ఆధునిక సదుపాయాల జోలికెళ్లకుండా.. 800 నుంచి వెరుు్య చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు కట్టేవారే కరువయ్యారు. ధర ఓ ఇరవై లక్షలకు అటుఇటుగా ఉంటే.. శరవేగంగా అమ్ముడవుతారుు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. కొనేవారి సంఖ్య పెరుగుతుందని వీరు అంటున్నారు. ⇔ ‘మార్కెట్లో ఇళ్లను కొనేవారి సంఖ్య తగ్గింది..’ ‘గత కొంతకాలం నుంచి గిరాకీ లేదు..’ ఇలా రకరకాలుగా పలువురు బిల్డర్లు అంటున్నారు. అధిక శాతం కొనుగోలుదారులకు కావాల్సిందేమిటో కనుక్కోకుండా.. కేవలం కొద్ది మందిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణుల అభిప్రాయం. బిల్డర్లు, డెవలపర్లు ఇప్పుడైనా.. తమలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇళ్లు కట్టాలని నగరానికి చెందిన మధ్యతరగతి ప్రజానీకం, వేతనజీవులు కోరుతున్నారు. -
బిల్డర్స్‌కు ఐటీ షాక్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం జువెల్లరీ వ్యాపారులను, బులియన్ ట్రేడర్స్‌ను, హవాలా ఆపరేటర్లను టార్గెట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం బిల్డర్స్‌కు షాకిస్తోంది. దిగ్గజ బిల్డర్స్, వారి కమిషన్ ఏజెంట్లు రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను అంగీకరిస్తున్నారని ఇంటిలిజెన్స్ రిపోర్టులో తేలడంతో వారిపై కొరడా ఝళిపించడానికి సిద్దమైంది. తాజా ప్రాపర్టీ డీల్స్‌లో బిల్డర్స్ ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. దీంతో దేశవ్యాప్తంగా బిల్డర్స్పై ఐటీ సర్వే చేపడుతోంది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, మీరట్, అలహాబాద్, లక్నో, కోల్కత్తా, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని సిటీలోని పెద్ద బ్రోకింగ్ హైసింగ్స్పై రైడ్స్ నిర్వహిస్తోంది. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం వారి చేతుల్లో కలిగి ఉన్న నగదు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలను రాబడుతోంది. పెద్దనోట్ల రద్దుకు ముందు చాలామంది బిల్డర్స్ ఫండ్స్‌ను సేకరించడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. కనీసం గడువు సమయానికి ఫ్లాట్ కట్టేసి, కొనుగోలు దారుడి చేతులోకి ఇవ్వడానికి ఆపసోపాలు పడేవారు. బిల్డర్స్పై ఇప్పటికే పలు కేసులు కోర్టులో ఫైల్ అయి, విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. కొంతమందికి కోర్టు జరిమానాలు కూడా పడ్డాయి. కానీ రద్దు అనంతరం పరిణామాలతో బంగారు వర్తకుల వల్లే, వీరి వద్ద కూడా రద్దు అయిన కరెన్సీ పెరుగుతోందని ఇంటలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది. వెనువెంటనే వారి కంట్రక్షన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రాజెక్టు ధర రూ.100 కోట్లు అయితే, బిల్డర్ చాలా తేలికగా రూ.10-15 కోట్ల నగదును చేతుల మీదనే నడిపిస్తున్నాడనని తెలిసింది. అదేవిధంగా నోట్ల రద్దుకు ముందు ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన నగదును సర్దుబాటు చేసుకుంటున్నారని తేలింది. గత మూడు రోజులుగా నోయిడా ఆధారిత దిగ్గజ బిల్డర్‌పై, మరో ఇద్దరి బిల్డర్స్పై ఐటీ అధికారులు జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో బెంగళూరు ఆధారిత బిల్డర్ నుంచి రూ.12 కోట్ల లెక్కలో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు చెప్పారు. వాటిలో రూ.3.5 కోట్లు నగదు, రూ.45 లక్షల విలువైన బులియన్ బిల్డర్ దగ్గర లభ్యమైనట్టు చెప్పారు. నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అనంతరం బ్లాక్‌మనీ కలిగిఉన్న వారికి జువెల్లరీ వ్యాపారులు, హవాలా ఆపరేటర్లు, బిల్డర్స్ సహకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఐటీ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా వారిపై సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు, ఐటీ డిపార్ట్మెంట్కు సహకరిస్తున్నాయి. -
స్థిరపడుతున్న సానుకూలత!
సాక్షి, హైదరాబాద్ : నగర స్థిరాస్తి మార్కెట్లో అమ్మకాల ప్రవాహం మొదలైంది. పాత నిర్మాణాల్లో ఫ్లాట్లు లేకపోవడంతో కొత్త ప్రాజెక్ట్‌ల ధరలు కొద్దిగా పెంచేశారు బిల్డర్లు. మరోవైపు బడా ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం సరైన స్థలాల కోసం సంస్థల మధ్య పోటీ మొదలైంది. తక్షణమే ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి డెవలపర్లు అడుగులేస్తున్నారు. ⇔నిన్నటిదాకా వేచిచూసే ధోరణికి అలవాటు పడ్డవారిలో కొందరు మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో స్థానిక పరిస్థితులను పక్కన పెట్టేసి సొంతిళ్లను కొనడానికి ముందుకొస్తున్నారు. స్థిరాస్తి రంగం చాలా భిన్నమైంది. మార్కెట్ ప్రతికూలంగా ఉందనుకోండి.. ధర తక్కువైనా ఇళ్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకు రారు. అదే కొంచెం తేరుకోగానే చాలు.. చ.అ.కు రూ.100 ఎక్కువ పెట్టయినా ఇళ్లను కొనేస్తారు. ⇔రెండు నెలల నుంచి వాణిజ్య స్థిరాస్తి రంగం కూడా మెరుగైంది. నిర్మాణ రంగం అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు ప్రతికూల పరిస్థితుల్లో ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ⇔మార్కెట్లో పెరిగిన సానుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని డెవలపర్లు సరైన స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల నుంచి మెట్రో నగరాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో స్థలాల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. మార్కె ట్లో నెలకొన్న గిరాకీని అర్థం చేసుకున్న పలువురు స్థల యజమానులు ఇష్టమొచ్చిన రేట్లు చెబుతున్నారు. తమ కోర్కెల చిట్టాను డెవలపర్ల ముందు పెడుతున్నారు. అయితే భూయజమానులు చెబుతున్న నిబంధనలకు కొందరు డెవలపర్లు అంగీకరిస్తున్నప్పటికీ పొరపాటున ప్రతికూల పరిస్థితులు ఎదురైతే గనక ప్రాజెక్ట్ పూర్తి కావడ మే ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. మార్కెట్ మెరుగవ్వగానే నిర్మాణాన్ని ఆరంభించి ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం బదులు వాస్తవాల్ని అర్థం చేసుకుని నిర్మాణాల్ని మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే స్థల య జమానులు వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకుని డెవలపర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. లేకపోతే ఇరువురికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు. మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో.. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లైన మెట్రో రైలుతో నగరంలో, ఔటర్ రింగ్ రోడ్డుతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి మార్కెట్ జోరందుకుంటుంది. ఓఆర్ఆర్తో ప్రయాణం సులువవుతుంది కాబట్టి ఔటర్ చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలూ ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో రూ.70-80 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనేబదులు.. శివార్లలో లగ్జరీ విల్లాలను కొనేయచ్చని కస్టమర్ల అభిప్రాయం. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
స్థిరాస్తి బిల్లు.. మనకేం తెచ్చింది?
► కొనుగోలుదారుల చేతిలో పాశుపతాస్త్రం ► 500 చ. మీ. లేదా 8 ఫ్లాట్లున్న ప్రతి ప్రాజెక్టూ బిల్లు పరిధిలోకే.. ► మోసం చేసే బిల్డర్లుకు జైలుశిక్ష ► స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2015కు ఆమోదం అడ్డదిడ్డంగా.. కొన్ని చోట్ల మాఫియా తరహాలో విస్తరించిన స్థిరాస్తి రంగానికి సంస్కరణ దిశగా అడుగులు పడ్డాయ్! బ్రోచర్లో మయసభను తలపిస్తూ.. క్షేత్రస్థాయిలో నాసిరకం నిర్మాణాలతో మోసం చేసే బిల్డర్లకు ముచ్చెమటలు పట్టనున్నాయ్!! .. ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2015’కు గురువారం రాజ్యసభ ఆమోదం తెలపడమే ఇందుకు కారణం. స్థిరాస్తి కొనుగోలుదారుల చేతిలో పాశుపతాస్త్రంలా మారే ఈ బిల్లులోని ముఖ్యాంశాల సమాహారమే ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: దేశంలో స్థిరాస్తి వ్యవస్థను నియంత్రించి, మోసపూరిత డెవలపర్ల నుంచి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేదే స్థిరాస్తి నియంత్రణ బిల్లు-2015. ప్రకటనలతో ఆకర్షించి, నిర్మాణ పనుల్ని సాగదీస్తూ, సమయానికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న బిల్డర్లు, డెవలపర్లకు గుణపాఠం చెప్పాలంటే స్థిరాస్తి నియంత్రణ బిల్లు అత్యంత ఆవశ్యకమనేది కొనుగోలుదారుల అభిప్రాయం. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.. స్థిరాస్తి నియంత్రణ బిల్లుతో బిల్డర్లకు, బిల్డర్లతో కొనుగోలుదారులకూ ఎలాంటి సమస్యలెదురైనా పరిష్కరించేందుకు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేస్తారు. లేదా రెండు రాష్ట్రాలకు కలిపి ఒక సంస్థను లేదా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక నియంత్రణ సంస్థను 60 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. సమస్యల వేగవంత పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌లో ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయ నిర్ణయాధికారులుంటారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి దీనికి నేతృత్వం వహిస్తారు. కీలక అంశాలపై ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకునేందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి నేతృత్వంలో ఓ జాతీయ సలహా మండలి కూడా ఏర్పాటవుతుంది. ప్రీలాంచ్ అమ్మకాలు చేయొద్దు.. దేశంలోని బిల్డర్లు, ఏజెంట్లు, ప్రమోటర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్ట్, స్ట్రక ్చరల్ ఇంజనీర్లు తమ పేర్లను, చిరునామాలను నియంత్రణ సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్ లే-అవుట్, అభివృద్ధి గడువు, భూమి స్థితి, చట్టపరమైన అమోదాల పరిస్థితి ఇలా స్థిరాస్తికి సంబంధించిన ప్రతి ఒక్కటీ నియంత్రణ సంస్థకు సమర్పించాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే అమ్మకాలు ప్రారంభించాలి. అంటే ప్రీలాంచ్ పేర్లతో ముందస్తు అమ్మకాలు చేయరాదన్నమాట. పొందిన అనుమతులన్నింటినీ నియంత్రణ సంస్థకు సమర్పించడంతో పాటు నిర్మాణానికి ముందే బిల్డర్లు తమ వెబ్సైట్లలో వాటిని ప్రదర్శించాలి. ప్రాజెక్ట్‌ను ఎంత కాలంలో పూర్తి చేస్తామనే విషయాన్ని ముందుగానే స్పష్టం చేయాలి. ప్రతి ప్రాజెక్ట్‌కు ఓ ఖాతా.. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో)ను తెరవాలి. కొనుగోలుదారుల నుంచి స్వీకరించిన సొమ్ములో 70 శాతాన్ని 15 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ఆ నిధులను ఆ ప్రాజెక్ట్ కోసమే ఖర్చు చేయాలి. ఇతర అవసరాలు, ప్రాజెక్ట్‌లకు మళ్లించేందుకు వీలు లేదు. సంబంధిత ప్రాజెక్ట్‌లోని కొనుగోలుదారుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్, స్ట్రక్చరల్ డిజైన్లను మార్చడానికి వీల్లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే ఆరు నెలల ముందుగానే చార్టర్ట్ అకౌంటెంట్ (సీఏ) పర్యవేక్షణలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అడి ట్ చేయించాలి. తప్పు చేస్తే జైలు.. తప్పుడు ప్రకటనలు చేసే బిల్డర్లకు తొలి తప్పిదానికైతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా.. పదే పదే తప్పుడు ప్రకటనలు చేసేవారికి గరిష్టంగా మూడేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తారు. అప్పటికీ నిబంధనలను పాటించకపోతే మరో 10 శాతం జరిమానాతో పాటు జైలు ఊచలూ లెక్కపెట్టాల్సిందే. అంతేకాకుండా కొనుగోలుదారులు చెల్లించిన పూర్తి సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 8 ఫ్లాట్లుంటే బిల్లు పరిధిలోకే.. కొత్తగా నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలే కాదు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లూ బిల్లు పరిధిలోకే వస్తాయి. స్వీయ అవసరాల కోసం కట్టే ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణం పూర్తయి ఇంకా ధ్రువీకరణ పత్రాలు రాని ప్రాజెక్ట్‌లూ ఇందులోకే వస్తాయి. ఇంకా చెప్పాలంటే 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లుండే ప్రతి నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లు బిల్లు పరిధిలోకే వస్తాయన్నమాట. ఫ్లాట్లను సూపర్ బిల్టప్ ఏరియా ప్రాతిపదికన కాకుండా కార్పెట్ ఏరియా ప్రాతిపదికన విక్రయించాలి. ప్రతి బిల్డర్ తాను అమ్మబోయే ఫ్లాట్ కార్పెట్ ఏరియాను, సొసైటీ కామన్ ఏరియాను విడి విడిగా స్పష్టం చేయాలి. ప్రస్తుతం బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. సూపర్ ఏరియా అంటూ నాలుగు గోడల మధ్య ఉండే కార్పెట్ ఏరియాకు 25-30 శాతం అదనంగా కలిపి ఫ్లాట్ విస్తీర్ణాన్ని లెక్కేస్తున్నారు. దీంతో వినియోగించుకోని స్థలానికీ కొనుగోలుదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. ‘‘స్థిరాస్తి కొనుగోలుదారులకు 100 శాతం న్యాయం చేసే స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లును స్వాగతిస్తున్నాం. అయితే ఈ బిల్లును ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లోని స్థిరాస్తి రంగాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్టుందని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ జి. రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఆయనింకా ఏమంటారంటే.. ► ఈ బిల్లుతో చిన్న, మధ్యతరహా బిల్డర్లు నిలదొక్కుకోలేరు. కొనుగోలుదారులు చెల్లించే 70 శాతం సొమ్మును బ్యాంకులో జమ చేయలేరు. దీంతో నగదు నిల్వల్లేక ఆయా బిల్డర్లు వ్యాపారాన్ని విస్తరించలేరు కూడా. మార్కెట్లో బడా బిల్డర్లు మాత్రమే ఉండటంతో స్థిరాస్తి సుమారు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. ► అధిక శాతం నిర్మాణాలు ఆలస్యం జరిగేది ప్రభుత్వ విభాగాలు అనుమతులు జాప్యం వల్లే. అలాంటప్పుడు నిర్మాణాలు ఆలస్యమైతే కేవలం బిల్డర్లను శిక్షించడం సరైందికాదు. ► స్థిరాస్తి నియంత్రణ సంస్థకు పూర్తి స్థాయి అధికారాల్ని ఇవ్వడంతో మళ్లీ లెసైన్సుల రాజ్యం మొదలవుతుంది. నియంత్రణ సంస్థ నుంచి కూడా ప్రలోభాలు, బెదిరింపులూ తప్పవు. దీంతో అవినీతే కాదు ద్రవ్యోల్యణం పెరిగే అవకాశమూ లేకపోలేదు. ► ఏదేమైనా ఈ బిల్లుతో నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుం ది. ఎఫ్‌డీఐ, రీట్స్ పెట్టుబడులు సులువుగా వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిమీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
జూన్ నెల... ఫలిస్తుందా కల
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఖాళీగా 1200 అపార్టుమెంట్లు రాజధాని నిర్మాణ ప్రక్రియలో జాప్యంతో ఆందోళనలో బిల్డర్లు ఉద్యోగుల తరలిరాక కోసం ఎదురుచూపులు సాక్షి ప్రతినిధి, గుంటూరు : జూన్‌పైనే అమరావతిలోని బిల్డర్లు ఆశలు పెట్టుకున్నారు. జూన్ నాటికి ప్రభుత్వ ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరావాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో బిల్డర్లు భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అపార్టుమెంట్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. సాధారణంగా ఒక అపార్టుమెంట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి బిల్డర్లు కనీసం 18 నెలల సమయం తీసుకుంటారు. పూర్తి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండే సంస్థలైతే 15 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. కొందరు బిల్డర్లు 12 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని.. అధిక వేతనాలిచ్చి పనులు చేయిస్తున్నారు. 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివస్తారని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ కనీసం అందులో సగమైనా వస్తే నిర్మిస్తున్న అపార్టుమెంట్లను మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశగా ఉన్నారు. చదరపు అడుగు ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు నిర్ణయించి ప్లాట్లు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆందోళనలో బిల్డర్లు.. రాజధాని ప్రకటన నాటి నుంచి నిర్మాణాలు ప్రారంభించిన కొందరు బిల్డర్ల అపార్టుమెంట్లు పూర్తి కావచ్చాయి. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లు, పూర్తికావచ్చిన అపార్టుమెంట్లను హైదరాబాద్ నుంచి తరలిరానున్న ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేస్తారనే ఆశతో బిల్డర్లు ఉన్నారు. అయితే తాత్కాలిక రాజధాని నిర్మాణం ఇంకా టెండర్ల దశ దాటకపోవడం, రాజధానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. జూన్ నాటికి సీఎం పేర్కొన్న విధంగా ఉద్యోగులు తరలిరాకపోతే తమ పరిస్థితి తల్లకిందులవుతుందనే భయంతో ఉన్నారు. సీఎం మాటలు నమ్మి నివేశన స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు ధరలు పెరగక తీవ్రంగా నష్టపోయారు. తమ పరిస్థితి అలా అవుతుందనే భయం కూడా కొందరికి లేకపోలేదు. ఖాళీగా అపార్టుమెంట్లు.. ఇప్పటికే దాదాపు 1200 అపార్టుమెంట్లు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయి కొనుగోలుదారులు, అద్దెదారులు ముందుకు రాకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. ఈ పరిణామానికి బిల్డర్లు, వాటి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు బిల్డర్లు భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థంకాక సామాన్య లాభాలతో బయటపడేందుకు తక్కువ రేటుకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. నగరాలకు కొద్ది దూరంలోని అపార్టుమెంట్లకు చదరపు అడుగు ధర రూ.3 వేలు చెబుతున్నప్పటికీ, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు ఎవరైనా ముందుకు వస్తే రెండు మూడు వందలు తగ్గించి, గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు పూర్తి చేస్తున్నారు. అయితే ఎవరికి వారు వ్యాపారం మంచిగానే ఉందని చెబుతున్నప్పటికీ, వాస్తవాలు ఆ స్థాయిలో లేవని బిల్డర్లే అంగీకరిస్తున్నారు. -
బిల్డర్ల ముందుచూపు!
ఫ్లాట్ విలువలో సగం చెల్లించాకే నిర్మాణం ‘రియల్’ బూమ్ లేకపోవడంతో ముందు జాగ్రత్త ముందుగానే అంత ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్న కొనుగోలుదారులు ఆ మొత్తాన్ని వదిలేసుకుంటే తమ పరిస్థితేంటంటున్న బిల్డర్లు విజయవాడ, గుంటూరు, పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఫ్లాట్ నిర్మాణంలో సగం మొత్తాన్ని నిర్మాణానికి ముందుగానే డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నేపథ ్యంలో నివేశన స్థలాలు, వ్యవసాయ భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు నమ్మి రియల్టర్లు, ధనికులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. సీఎం పేర్కొన్న విధంగా నివేశన స్థలాలు, వ్యవసాయ భూముల ధరలు పెరగకపోవడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. రియల్టర్లలా కాకుండా బిల్డర్లు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు.. గుంటూరు : వచ్చే జూన్ నాటికి హైదరాబాద్‌లో ఉన్న రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులంతా రాజధానికి చేరుకుంటారని ప్రచారం సాగుతోంది. కనీసం 50 వేల మంది కొత్త వ్యక్తులు రాజధానికి వస్తారనేది అంచనా. దీనికి అనుగుణంగా బిల్డర్లు అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నివేశన స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసి నష్టపోయిన రియల్టర్ల వలే కాకుండా అపార్టుమెంట్ల ధరలో 50 శాతం అడ్వాన్సుగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాల ప్రారంభ దశలోనే సగం ఎలా చెల్లిస్తామని కొనుగోలుదారులు ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్న స్థాయిలో రాకపోతే అపార్టుమెంట్ల నిర్మాణాలకు చెల్లించిన స్వల్ప మొత్తాలు మీరు వదిలేస్తే మా పరిస్థితేంటని బిల్డర్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. సీఎం చెబుతున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధానికి తరలిరాకపోతే లక్షలు వ్యయంతో కొనుగోలు చేసిన అపార్టుమెంట్లను అద్దెకు తీసుకునే వారుండరనే ఆందోళనను కొనుగోలుదారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహాలు అటు కొనుగోలుదారులు, అమ్మకందారుల నుంచి వ్యక్తమవుతుండటంతో అనుకున్న స్థాయిలో అపార్టుమెంట్ల అమ్మకాలు ఊపందుకోలేదు. పెరిగిన అపార్టుమెంట్ల నిర్మాణాలు.. అమరావతి రాజధాని నేపథ్యంలో ఏడాది నుంచి విజయవాడ, గుంటూరులో అపార్టుమెంట్ల నిర్మాణాల్లో వేగం పెరిగింది. వచ్చే జూన్ నుంచి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధానికి తరలిరానున్నారని, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జూన్ నాటికి పూర్తవుతుందనే ప్రచారం ఎక్కువుగా సాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు విజయవాడ, గుంటూరుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ భవ నాలు అద్దెకు తీసుకుంటున్నారు. మంత్రులు నాగార్జున యూనివర్సిటీకి సమీపంలోని అపార్టుమెంట్లు, విల్లాలు అద్దెకు తీసుకుంటున్నారు. అపార్టుమెంట్లకు పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల నుంచి నూతన బిల్డర్లు రంగ ప్రవేశం చేశారు. స్థానిక బిల్డర్లతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద నిర్మాణ సంస్థలు విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా చేసుకుని కార్యాలయాలు ప్రారంభించాయి. ఉన్నతాధికారులు, వ్యాపారులు, రాజకీయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పెద్ద సంస్థలు అధునాతన సౌకర్యాలతో కూడిన అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ అపార్టుమెంట్లలో చదరపు అడుగు రూ. 4 వేల నుంచి 6 వేల వరకూ ధర నిర్ణయించి విక్రయాలు జరుపుతున్నాయి. మరి కొన్ని సంస్థలు చదరపు అడుగు రూ.మూడు వేల నుంచి ఐదు వేలలోపే ధర నిర్ణయించి అమ్మకాలు ప్రారంభించాయి. ఖాళీగా అపార్టుమెంట్లు రాజధాని ప్రకటన నాటి నుంచి కొందరు బిల్డర్లు నిర్మాణాలు ప్రారంభించారు. వారి నిర్మాణాలు దాదాపు పూర్తికావడంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశాలు చేశారు. వాటిని అద్దెకు తీసుకునే వారు లేకపోవడంతో దాదాపు వెయ్యికిపైగా అపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో అపార్టుమెంట్ల అద్దెలు అధికంగానే ఉన్నప్పటికీ, వాటి పరిసర ప్రాంతాల్లో అద్దెలు అనుకున్న స్థాయిలో లేవు. డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ రూ.6 వేల నుంచి రూ.8 వేలలోపు లభిస్తున్నాయి. ఇదే నగరాల్లో అయితే రూ.10 నుంచి రూ.15 వేల వర కూ అద్దెలున్నాయి. వీటికి అనుగుణంగానే నగరాల్లోని సామాన్య ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ.45 నుంచి రూ.60 లక్షల్లోపు ఉంటే, ఖరీదైన ప్రాంతాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకూ ధర పలుకుతోంది. -
స్థిరపడుతున్న సానుకూలత!
హైదరాబాద్: మూడు నెలల నుంచి అమ్మకాల ప్రవాహం మొదలైంది. దీంతో నగర నిర్మాణ రంగం నెమ్మదిగా ఊపిరిపీల్చుకుంటోంది. పాత నిర్మాణాల్లో ఫ్లాట్లు లేకపోవడంతో.. పలు సంస్థలు ఏకంగా అమ్మకాలనే నిలిపివేశాయి. సరైన స్థలాల కోసం బడా నిర్మాణ సంస్థల మధ్య పోటీ మొదలైంది. తక్షణమే ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు వేగంగా అడుగులేస్తున్నారు. మొత్తానికి 2015 చివరి నాటికి నగర స్థిరాస్తి రంగంలో మళ్లీ సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాల జోరు రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి దాకా రేటు పెంచాలంటే భయం. చదరపు అడుక్కీ వంద రూపాయలెక్కువ చెబితే.. కొనుగోలుదారులు కొనరేమోనన్న దిగులు. చివర్లో వెనుకడుగు వేస్తారేమోనని మార్కెటింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఫ్లాట్లను విక్రయించేవారు. దాదాపు ఇదే పరిస్థితులు మూడేళ్ల నుంచి నగర నిర్మాణ రంగంలో నెలకొన్నాయి. కానీ, గత మూడు నెలలుగా పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వేచి చూసే ధోరణికి అలవాటు పడ్డవారిలో కొందరు.. మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో రాజకీయ పరిస్థితులను పక్కన పెట్టేసి సొంతిళ్లను కొనడానికి ముందుకొస్తున్నారు. భిన్నమైన మార్కెట్.. స్థిరాస్తి రంగం చాలా భిన్నమైంది. మార్కెట్ ప్రతి కూలంగా ఉందనుకోండి.. ధర తక్కువైనా ఇళ్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకురారు. అదే కొం చెంతేరుకోగానే చాలు.. చదరపు అడుక్కీ వంద రూపాయలు ఎక్కువ పెట్టయినా ఇళ్లను కొనేస్తారు. రెండు నెలల నుంచి వాణిజ్య స్థిరాస్తి రంగం కూడా మెరుగైంది. మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుండటం.. స్టాక్ మార్కెట్ సానుకూలంగా ఉండటం వల్ల స్థిరాస్తి రంగంలో పె ట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. స్థలాల కోసం.. మార్కెట్ పెరిగిన సానుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పలువురు బిల్డర్లు. డెవలపర్లు సరైన స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల నుంచి మెట్రో నగరాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో స్థలాల కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి. మార్కెట్లో నెలకొన్న గిరాకీని అర్థం చేసుకున్న పలువురు స్థల యజమానులు ఇష్టమొచ్చిన రేట్లు చెబుతున్నారు. తమ కోర్కెల చిట్టాను డెవలపర్ల ముందు పెడుతున్నారు. అయితే భూయజమానులు చెబుతోన్న నిబంధనలకు కొందరు డెవలపర్లు అంగీకరిస్తున్నప్పటికీ.. పొరపాటున ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కనుక ప్రాజెక్ట్ పూర్తి కావటం ప్రశ్నార్థకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ మెరుగవ్వగానే నిర్మాణాన్ని ఆరంభించి.. ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం బదులు వాస్తవాల్ని అర్థం చేసుకుని నిర్మాణాలను మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే స్థల యజమానులూ వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుని డెవలపర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. లేకపోతే ఇరువురికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఓఆర్ఆర్ పూర్తయితే.. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఫ్లాట్ల రేట్లు నేటికీ అందుబాటులో ఉన్నాయన్నది డెవలపర్ల మాట. ఓఆర్ఆర్, మెట్రో రైలు వల్ల ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతోందన్నారు. 2015 నాటికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగించటం మరింత సులువవుతుంది. దీని చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఫలితంగా పలు సంస్థలు విదేశీ తరహాలో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలను చేపడతాయి. ప్రయాణం చేయడం భారం కాదు కాబట్టి ఓఆర్ఆర్ చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. నగరంలో రూ.60-70 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనేవారు.. ఓఆర్ఆర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలను కొనుగోలు చేస్తారు. నగరం నలువైపులా ఓఆర్ఆర్ అనుసంధానమైంది. రేడియల్ రోడ్లు కూడా పూర్తి కావాల్సి ఉంది. పైగా మెట్రో రైలు అతి త్వరలో మొదలవుతుంది. ఇలా రోడ్డు వ్యవస్థ నగరంలో మెరుగుకానుంది. పైగా ఆకాశవంతెనల్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇవన్నీ పూర్తయ్యాక శివారు ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సులువుగా సాగించే వీలుంటుంది. ఇప్పుడే కాకపోయిన కనీసం రెండేళ్లలో అయినా పూర్తయ్యే అవకాశముంది. ఇలాంటి అంశాలన్నీ క్షుణ్నంగా పరిశీలించిన కొనుగోలుదారులు నగరం కంటే కాస్త దూరమైనా శివారు ప్రాంతాల్లోనే స్థిరాస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
మహానగరాభివృద్ధిని ‘పాత’రేశారు!
పాత తేదీలతో లే అవుట్లు, భవనాలకు అనుమతులు * బిల్డర్లతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ల కుమ్మక్కు * రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని 5 గ్రామాల్లో అక్రమాలు * హెచ్ఎండీఏ ప్రత్యేక విచారణలో వెల్లడి.. క్రిమినల్ కేసులకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని గ్రామాల్లో లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. బిల్డర్లు, రియల్టర్లతో గ్రామ పంచాయతీల కార్యనిర్వహణాధికారులు(ఈఓలు), కార్యదర్శులు, సర్పం చ్‌లు కుమ్మక్కై ఏకంగా దశాబ్ద కాలం కింది నాటి పాత తేదీలతో దొడ్డిదారిలో అనుమతులు జారీ చేసేస్తున్నారు. అక్రమ మార్గంలో లభించిన అనుమతులతో బిల్డర్లు వందల సంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలను ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈఓలు, సర్పంచ్‌లకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందుతున్నాయి. నేరుగా హెచ్ఎండీఏ కమిషనర్లు ఇవ్వాల్సిన అనుమతులను ఈవోలే ఇచ్చేస్తుండటంతో సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, గండి మైసమ్మ, ప్రగతినగర్, బౌరంపేట, దూలపల్లి గ్రామాల పరిధిలో అక్రమ అనుమతుల ఆరోపణలపై హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా చేపట్టిన విచారణలో ఈ బాగోతం వెలుగు చూసింది. అధికార పరిధి దాటిన ఈఓలు... గ్రామ పంచాయతీ ఈఓల అధికారాలను కేవలం రెండంతస్తుల భవన నిర్మాణాల అనుమతుల వరకే పరిమితం చేస్తూ 2008 ఏప్రిల్ 17న హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా పాత తేదీలతో దొడ్డిదారిలో ఈఓలు మూడంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 భవన సముదాయాలతోపాటు ఆరు గేటెడ్ కమ్యూనిటీలను హెచ్ఎండీఏ బృందం పరిశీలించగా, అందులో 30 భవనాలకు స్థానిక గ్రామ పంచాయతీల ఈఓలు పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్లు బయటపడింది. అధికారులను ఈఓలు దుర్వినియోగం చేయడంతోపాటు బిల్డర్లతో కుమ్మక్కై భారీగా లంచాలు స్వీకరించినట్లు ఈ విచారణలో తేలింది. ఇక ఎల్ఆర్ఎస్ పథకం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ గ్రామాల్లో పాత తేదీలతో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు హెచ్ఎండీఏ గుర్తించింది. ఈఓలు, సర్పంచ్‌లతో కుమ్మక్కైన బిల్డర్లు బౌరంపేట, మల్లంపల్లి గ్రామాల్లో సుమారు 45 ఎకరాల్లో పెద్ద మొత్తంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నట్లు బయటపడింది. ప్రభుత్వానికి హెచ్ఎండీఏ లేఖ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టనుందని, అప్పుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చని ఈఓలు సలహా ఇవ్వడంతోనే బిల్డర్లు అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని హెచ్ఎండీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఐదు గ్రామాల్లో అక్రమ మార్గంలో అనుమతులు జారీ చేసిన ఈఓలు, సర్పంచ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్రమ లే అవుట్లు, కట్టడాల ఫొటోలు, ఇతర వివరాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. -
రియల్టర్లు, బిల్డర్లకు చుక్కెదురు
⇒ భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించాల్సిందే ⇒ తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం ⇒ సింగిల్ జడ్జి తీర్పులో తప్పేం లేదు ⇒ 270 అప్పీళ్లు కొట్టివేత హైదరాబాద్: భూవినియోగ మార్పిడి ఫీజు చెల్లింపు వ్యవహారంలో ఇరు రాష్ట్రాల్లోని రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లకు హైకోర్టు ధర్మాసనం ముందు చుక్కెదురైంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న సందర్భంలో తుది లే అవుట్ పొందాలంటే 2006లో వచ్చిన చట్టం కింద భూవినియోగ మార్పిడి ఫీజు కచ్చితంగా చెల్లించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇప్పటికే సింగిల్ జడ్జి 2010లో వెలువరించిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ బిల్డర్లు, డెవలపర్లు, రియల్టర్లు పెద్ద సంఖ్యలో దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేసు పూర్వపరాలివీ.. 2006 చట్టప్రకారం తుది లే అవుట్ పొందాలంటే కలెక్టర్, ఆర్డీవోల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్లు తీసుకురావాలంటూ ఆయా పట్టణాభివృద్ధి సంస్థలు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వీటిని విచారించిన సింగిల్ జడ్జి, ఆయా పట్టణాభివృద్ధి సంస్థలు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ 2010లో తీర్పునిచ్చారు. అయితే, 2006 చట్టానికి ముందు వ్యవసాయ భూములను వ్యవసాయేతర కార్యకలాపాల కోసం ఉపయోగించి ఉంటే ఆ భూముల విషయంలో నిరభ్యంతర పత్రం తీసుకురావాల్సిన అవసరం లేదని తేల్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ఇరు రాష్ట్రాల్లోని బిల్డర్లు, రియల్టర్లు కలిపి మొత్తం 270 అప్పీళ్లను ధర్మాసనం ముందు దాఖలు చేశారు. వీటన్నింటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల(అభివృద్ధి) చట్టం 1975 కింద లే అవుట్ అనుమతి కోసం తగిన ఫీజు చెల్లించే అనుమతి పొందుతామని, తిరిగి 2006 చట్టం కింద ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బిల్డర్లు, రియల్టర్లు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. 1975 చట్టం పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ఓ పద్ధతి ప్రకారం చేసేందుకు ఉద్దేశించిందని, 2006 చట్టం వ్యవసాయ భూములను ఇతర వినియోగాలకు ఇష్టారాజ్యంగా ఉపయోగించకుండా ఉండేందుకు తీసుకొచ్చారని, ఈ రెండింటికీ ఏ మాత్రం పొంతన లేదంటూ ఆయా పట్టణాభివృద్ది సంస్థలు చేసిన వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఎటువంటి తప్పులేదంటూ రిట్ అప్పీళ్లను కొట్టేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. -
సొంతిల్లెక్కడ కొనాలి?
సాక్షి, హైదరాబాద్ : సొంతిల్లు అనేది సామాన్యుల వరకైతే కలే. ఆ కలను నిజం చేసుకోవాలంటే ముందు సవాలక్ష సందేహాలు. గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటి లో తీసుకోవాలా అనే విషయాల్లో తర్జనభర్జన. ఇల్లు కొనాలనే విషయంలో నిపుణుల సూచనలివిగో.. సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం. మరోసారి నిర్మాణ సామాగ్రి కష్టాలు. ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు.. ఇలా రకరకాల సమస్యలతో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. ఫలితంగా దాని ప్రభావం నిర్మాణ పనులపై పడుతోంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మూడేళ్ల నుంచి ఇలాంటి ధోరణి కొందరు బిల్డర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోశారంటే సొంతింట్లోకి అడుగు పెట్టేదెన్నడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే సొమ్మును చెల్లించాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంబించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్ని చేయలేకుండా మిగిలిపోతున్నారు. గత రెండేళ్లుగా పం డగ వేళల్లో ఇల్లు కొన్నవారు నేటికీ గృహప్రవేశం చేయకపోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. స్థిర నివాసమా: స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. పెట్టుబడి కోణమా: పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే నిర్ణయానికి రావాలి. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. -
నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు!
‘పైన పటారం..లోన లోటారం’ అనే నానుడి భాగ్యనగరంలోని చాలా ప్రాజెక్ట్‌లకు వర్తిస్తుంది. బ్రోచర్‌ను అందంగా డిజైన్ చేసి.. ఆ తర్వాత చుక్కలు చూపించే బిల్డర్లు చాలా మందే ఉన్నారు. నచ్చిన ఫ్లాటు కనబడితే చాలు.. డెవలపర్ పూర్వాపరాలను చూడకుండానే నిర్ధారిత సొమ్మును కట్టి బోలెడుమంది ఫ్లాట్లను కొంటుంటారు. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా లేవనో.. అమ్మకాలు కావటం లేదనో.. నిర్మాణ పనులు నిలిచిపోతే నష్టపోయేది కొనుగోలుదారుడే. అందుకే నమూనా చూసి ఫ్లాట్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడితే బోల్తా పడినట్టే కొనుగోలుకు ముందే జాగ్రత్తలు అవసరం సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు కానీ అమ్మకాల సమయంలోకానీ కొనుగోలుదారులతో బిల్డర్లు, మార్కెటింగ్ సిబ్బంది ఆత్మీయంగా మాట్లాడతారు. నిర్ధారిత సొమ్మును చెల్లిస్తే రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిస్తామని నమ్మబలుకుతారు. గడువులోగా ఫ్లాట్ తాళాలు అందించకపోతే బ్యాంక్ వడ్డీ కొనుగోలుదారుల మీదే పడుతుంది. ఒకపక్క బ్యాంక్ వడ్డీ, మరో పక్క ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతాం. సరిగ్గా ఈ సమయంలో ఫ్లాట్లను అమ్మిన వ్యక్తితో మాట్లాడదామంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకడు. సంస్థలో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నించినా ఫలితముండదు. ప్రాజెక్టు ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని కొందరు బిల్డర్లు ఒప్పందాల్లో పేర్కొంటారు. కాకపోతే ఈ పరిహారం కొనుగోలుదారులకు ఏమాత్రం చాలదు. ఉదాహరణకు ఫ్లాట్ ఆలస్యమైతే చ.అ.కు రూ.5 చొప్పున పరిహారం ఇస్తామంటారు. అయితే కొనుగోలుదారులు కట్టే నెలసరి వాయిదాలతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు. సమయానికి అందించినా.. గడువు లోగా ఫ్లాట్లను పూర్తి చేయలేకపోతున్నారు బిల్డర్లు. ఈ జాబితాలో చిన్న బిల్డర్లే కాదు పెద్ద సంస్థలూ ఉన్నాయి. ఏలియెన్స్, హిల్‌కౌంటీ, ప్రజయ్ వంటివే ఇందుకు ఉదాహరణలు. ఏదైనా సంస్థ నిర్ణీత గడువులోపే ఇళ్లను అందించినా.. నిర్మాణ లోపాలు స్వాగతం పలుకుతుంటాయి. శ్లాబులు, బాత్రూముల నుంచి నీరు కారడాలు, తలుపులు సరిగ్గా పట్టకపోవడం, ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా వేయడం, బయటి ప్రాంతాలు, గోడలకు రంగులు సరిగ్గా వేయకపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. నిర్మాణ లోపాలు లేకుండా బిల్డర్లు ఫ్లాట్లు అందించగానే అంతా సవ ్యంగా ఉందని భావించరాదు. నిజానికి గృహప్రవేశం చేశాకే అసలైన సమస్యలు పుట్టుకొస్తాయి. అధిక శాతం మంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు. 2006లో జీవో నెం. 86 అమల్లోకి వచ్చాక నిర్మాణం కట్టే ప్రతి బిల్డరూ ఈ పత్రం తప్పక తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్మాణం అక్రమ కట్టడంగా పరిగణిస్తారు. పత్రాలు పక్కాగా.. లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొన్నాక హక్కుల్లో చిక్కులు వస్తే ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్మాణ పరమైన అనుమతులు, స్థిరాస్తి యాజమాన్య హక్కు పత్రాలు పక్కాగా ఉన్నాయా? న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా? అన్న విషయాలను చూసుకోవాలి. ఇటీవలికాలంలో కొంత మంది బిల్డర్లు ఓపెన్ స్పేస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఓపెన్ స్పేస్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. వాటికి అనుమతులు కూడా ఉండవు. కానీ కొంత మంది బిల్డర్లు అక్కడ కూడా నిర్మాణాలు చేసి తక్కువ ధరకే అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందువల్ల కొనుగోలుదారులు ప్రధానంగా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వీలైతే అనుభవమున్న న్యాయవాదిని సంప్రదించాలి. వసతులూ ప్లాన్‌లో.. కొనుగోలుదారులకు బిల్డర్లు అనేక రకాల వరాలు ఇస్తుంటారు. కలలో ఉన్న సౌధాన్ని మాటలతో కళ్ల ముందు చూపిస్తుంటారు. అపార్టుమెంట్లో పిల్లల పార్కు, ఈత కొలను, వ్యాయామశాల వంటి మరెన్నో సౌకర్యాలను చెబుతుంటారు. ఇవన్నీ అపార్టుమెంట్ ప్లాన్‌లో పొందుపరచబడి ఉంటాయి. అందువల్ల ప్లాన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంటీరియర్స్‌కు సంబంధించిన పనులు సాధారణంగా బిల్డర్ చేసివ్వరు. సర్వాంగ సుందరంగా ఉండే నమూనా ఫ్లాట్ అన్నది నిర్మాణపరంగా మీ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కానీ ఆ ఇల్లును ఆ విధంగా చేసిస్తారని పొరపాటుపడొద్దు. ఈతీరుగా మీ ఫ్లాట్ కావాలంటే అదనపు సొమ్ము చెల్లించక తప్పదు. నాణ్యత లేకుంటే చిక్కులే.. నిర్మాణ పనులు చివరి దశలోకి రాగానే ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా అనే తహతహ చాలా మందికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఫ్లాట్ నాణ్యతను పరిశీలించాలి. కొందరు బిల్డర్లు నమూనా ఫ్లాట్‌పై చూపెట్టిన శ్రద్ధ వాస్తవ ఫ్లాట్‌లో పాటించరు. ఇటువంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి. ఫ్లాట్ల నిర్మాణంలో నాణ్యత లేకపోతే రాజీపడకూడదు. ఒప్పందాన్ని మీరి నాణ్యత లోపాలు ఉంటే సవరించాకే ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ఏళ్ల నాటి కష్టం ఇంటిని చూస్తే మాయమవుతుంది. ♦ ఇంటికి వేసే రంగులు యజమానుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. సున్నితమైన మనస్సు ఉన్న వారు లేత రంగులు, ప్రేమ పిపాసులు గులాబీ రంగు, సంపద కోరుకునే వారు బంగారు వర్ణం, ఆహ్లాదం కోరుకునే వారు లావెండర్ వంటి రంగులు ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. గొప్పదనాన్ని చెప్పాలనుకునే వారు ముదురు రంగులు ఎంచుకుంటారని నిపుణుల మాట. ♦ ఏ ఇంట్లోకి ప్రవేశించినా ప్రతి ఒక్కరి చూపు పడేది టీవీ క్యాబినెట్ మీదే. అందుకే టీవీ యూనిట్‌ను ఆధునికంగా తీర్చిదిద్దడమూ ఓ కళే. టీవీ యూనిట్‌కు వైరింగ్ జాగ్రత్తగా చేయించాలి. లేకపోతే ఎంత ఖరీదైన టీవీకొన్నా క్యాబినెట్ చేయించినా బయటికి వైర్లు వేలాడుతుంటే అందవికారంగా కనిపిస్తుంది. డీటీహెచ్, డీవీడీ ప్లేయర్, ఏసీ, టీవీలకు సంబంధించి వైరు, రిమోట్లు ఎక్కువే ఉంటాయి. ఇవి బయటికి కన్పించకుండా చూసుకోవాలి. టీవీ వెనకా ఒకటిన్నర అంగుళాల మందం గత పైపు ఏర్పాటు చేసి అందులో నుంచి డీవీడీ, డీటీహెచ్‌లకు కనెక్షన్ ఇవ్వాలి. టీవీకి స్పీకర్లు బిగించేవారు ఆ వైర్లు కూడా కనిపించకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి realty@sakshi.com -
ఫ్లాట్లను అద్దెకు ఇస్తాం
- గృహ నిర్మాణ శాఖను సంప్రదించిన బిల్డర్లు - లెసెన్స్ అగ్రిమెంట్ విధానాల్లో మార్పు చేయాలని విజ్ఞప్తి - అపార్ట్మెంట్లకు డిమాండ్ లేక సతమతమం - కోట్లల్లో ధరలు.. పక్క ప్రాంతాల బాట పడుతున్న ప్రజలు ముంబై: లగ్జరీ అపార్ట్మెంట్లకు డిమాండ్ లేక సతమతమవుతున్న బిల్డర్లు లెసైన్స్ అగ్రిమెంట్ విధానాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు సరైన ఊతం లేకపోవడంతో ఇప్పటి వరకు అమ్ముడవని ప్లాట్లను అద్దెకు ఇచ్చి కొంత సొమ్మును సంపాదిద్దామని అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు బిల్డర్ల నుంచి ఏవిధమైన అధికారిక ప్రతిపాదన అందలేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. బిల్డర్లు సరైన ప్రతిపాదనతో వస్తే గృహనిర్మాణ శాఖ స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. మధ్య తరగతి వర్గం వారికి ముంబైలో ఇళ్లు కొనడం చాలా కష్టమని, ఇప్పటి వరకు నగరంలో అమ్ముడవని ప్లాట్లు 5 లక్షల వరకు ఉన్నాయని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ప్లాట్లు గనక అమ్ముడవకపోతే బిల్డర్లు బ్యాంకులకు అప్పు చెల్లించలేరని, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అమ్ముడవని ప్లాట్లను అద్దెకు ఇవ్వాలని వారు తమను సంప్రదించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్లాట్లు, సర్వీసు అపార్ట్మెంట్లకు గల లెసైన్స్ విధానాన్ని మార్చాలని కోరుతున్నారన్నారు. ముంబైలో అమ్ముడవని ప్లాట్లు, అపార్ట్మెంట్ల ఖరీదు కోట్లల్లో ఉందని, వాటిని కొనలేక ప్రజలు ముంబై చుట్టుపక్కల ప్రాంతాలైన థాణే, నవీ ముంబై, వాసాయ్-విరార్ ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. దీంతో అప్పులు తీర్చడానికి ఈ కొత్త విధానంతో ముందుకు వచ్చారని, రూ. రెండు కోట్లు విలువ ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ. 30,000 అద్దెకు ఇవ్వాలని వారు యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటికి అవసరమైన సామాను, పారిశుధ్యం, నీరు, పార్కింగ్ సౌకర్యం, మెయింటెనెన్స్ సౌకర్యాలను బిల్డర్లు సమకూరుస్తారని అధికారి చెప్పారు. అద్దెకు తీసుకునే వారి ఆర్థిక స్థితిని బట్టి తగ్గించడం జరుగుతుందని, తక్కువ సమయం కోసం అపార్ట్మెంట్ కావాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. 5-స్టార్ హోటల్లలో చెల్లించేంత బిల్లు వీటికి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. -
ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే!
- ఇంటి దగ్గరే విద్య, వైద్య, వాణిజ్య సంస్థలు, పార్కులూ ఉండాలంటున్న కొనుగోలుదారులు - దీంతో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌ల వైపే మొగ్గు చూపుతున్న బిల్డర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంటి పక్కనే ఆఫీసు. కాలుష్యం, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా రోజూ నడుచుకుంటూ వెళ్లొచ్చు. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేసేందుకు షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్లుండాలి. అవి కూడా ఇంటిదగ్గర్లోనే. విద్య, వైద్య సదుపాయాలూ ఉండాల్సిందే. అవి కూడా చేరువలోనే’’ ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటాయా? అది కూడా కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో. కానీ, ఇలాంటి ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లే కావాలంటున్నారు కొనుగోలుదారులు. ఇంకేం మరి బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి కొన్ని నగరాలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు భాగ్యనగరానికీ వచ్చేశాయి. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి. నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతున్న శ్రీశైలం హైవేలో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామన్నారు. ఈ రోడ్లో 3 వేల ఎకరాల్లో హార్డ్‌వేర్ పార్క్, వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ పార్కులు, 5 కి.మీ. దూరంలో ఉన్న ఆదిభట్లలోని ఏరోస్పేస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయి. మహేశ్వరంలో ఫ్యాబ్‌సిటీ, ముచ్చర్లలో ఫార్మాసిటీలు కూడా రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తక్కువలో తక్కువగా 40-50 వేల ఉద్యోగులు రానున్నారు. వీరందరికీ నివాస సముదాయాలే కాదు వాణిజ్య, నిత్యావసరాలూ కావాలి. అందుకే ఈ ప్రాంతంలో 3,600 ఎకరాల్లో బటర్ ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. నగరం చుట్టూ.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకూ ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా. 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ! ఫ్లాట్లు అమ్మేశామా.. చేతులు దులుపుకున్నామా అన్న రీతిలో కాకుండా కొనుగోలుదారులకు ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కందుకూరు మండలంలోని కర్తాల్ గ్రామంలో 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని సంస్థ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. ప్రాజెక్ట్ మొత్తాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసి సరికొత్త నగరంగా రూపుదిద్దుతాం. ⇒ 3 వేల ఎకరాల్లో రెసిడెన్షియల్, 600 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్లొస్తాయి. ప్రస్తుతం నివాస సముదాయాలను విక్రయిస్తున్నాం. 50 ఎకరాలు డాక్టర్స్ కాలనీ, 150 ఎకరాలు టెమ్స్-1,2, 50 ఎకరాలు క్లౌడ్ పార్క్, 500 ఎకరాలు ఎన్నారై టౌన్షిప్, 1,000 ఎకరాలు ఎవరెస్ట్, 200 ఎకరాలు వీకెండ్ హోమ్స్‌లకు కేటాయించాం. ⇒ ఎన్నారై టౌన్షిప్లో 500 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.3,500. ఎవరెస్ట్‌లో 200, 267, 300, 400 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.2,200. వీకెండ్ హోమ్స్‌లో 800 విల్లాలుంటాయి. 1,200 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉండే ఒక్కో విల్లా ధర రూ.40 లక్షలు. ⇒ వచ్చే జూలైలో కమర్షియల్ ప్రాజెక్ట్‌నూ మార్కెట్లోకి తీసుకొస్తాం. ఇందులో విద్యా, వైద్య సంస్థలు, షాపింగ్ మాల్స్, క్రీడా మైదానాలు, అమ్యూజ్మెంట్ పార్క్.. ఇలా ప్రతీ విభాగానికి కొంత స్థలాన్ని కేటాయిస్తాం. అయితే ఆయా విభాగాన్ని ఏదో అమ్మేశాం అన్న రీతిలో కాకుండా అంతర్జాతీయ సంస్థలతో కలసి జాయింట్ వెంచర్‌గా చేపడతాం. విద్యుత్ సమస్యేమీ లేకుండా సొంతంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ కేంద్రాన్ని కూడా నెలకొల్పుతున్నాం. -
చూపెట్టేదొకటి..కట్టేదింకొకటి
రాజమండ్రిలో, దానిలో విలీనం అవుతాయంటున్న పంచాయతీల్లో ప్లాన్‌కు విరుద్ధంగా, అనుమతి లేకుండా భవన నిర్మాణం యథేచ్ఛగా సాగిపోతోంది. భద్రతను బేఖాతరు చేస్తూ ఆకాశ హర్మ్యాలు కట్టేస్తున్నారు. రెండు, మూడ ంతస్తులకే అనుమతి పొంది అయిదంతస్తులు నిర్మించేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో కళ్లు మూసుకుంటున్నారు. అడ్డగోలుగా భవనాలు కడుతున్న బిల్డర్లకు ఇప్పుడు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అండగా నిలవడంతో మరింత ఇష్టారాజ్యంగా మారింది. సాక్షి, రాజమండ్రి :నగరంలో, నగర పరిసరాల్లోని పంచాయతీల్లో నిర్మాణంలో ఉన్న భవనాల్లో అనేకం. నిబంధనలను పునాదుల్లో పాతి పెట్టి కడుతున్నవేనంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యవహారంలో బిల్డర్లకు కొమ్ము కాస్తున్నది అవినీతిపరులైన అధికారులు, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే. రాజమండ్రి శివార్లలోని దివాన్‌చెరువు, బొమ్మూరు పంచాయతీల్లో అనుమతులకు విరుద్ధంగా అపార్ట్మెంట్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో 15కు పైగా భవనాలను మూడంతస్తులకే అనుమతులు పొంది, ఐదంతస్తులతో నిర్మించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న ఇలాంటి భవనాలకు టీడీపీ నేతలు అండగా ఉన్నారు. బిల్డర్లు మూడంతస్తుల అపార్టుమెంట్లు కడుతున్నట్టు ధృవపత్రాలపై స్థల యజమాని సంతకం తీసుకుంటున్నారు. కానీ నాలుగు, ఐదు అంతస్తుల కట్టడాలు ప్రారంభిస్తున్నారు. ఇటీవల రెండు భవనాల విషయంలో స్థల యజమానులు బిల్డర్లతో గొడవ పడగా.. భవనాల ఎత్తు ఇతర అంశాలు అనుమతులకు లోబడే ఉంటాయని నచ్చ చెప్పినట్టు తెస్తోంది. బహుళ అంతస్తుల భవనాల విషయంలో డీటీసీపీ అనుమతులు తప్పనిసరి. తాము నిర్మాణానికి అనుగుణంగా అనుమతులకు దరఖాస్తు చేశామని, అవి రానున్నాయని పంచాయతీ కార్యదర్శులకు చెబుతూ బిల్డర్లు వారికి భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారు. ఈ అక్రమ కట్టడాలపై డీటీసీపీ అధికారులకు కూడా లక్షల్లో ముడుపులు ముట్టచెబుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. కొనుగోలుదారులకు తప్పని ఇక్కట్లు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో ముందుగా రెండు బెడ్ రూం ప్లాట్లతో అపార్టుమెంట్లు కట్టేందుకు అనుమతులు పొందుతున్న బిల్డర్లు మూడు బెడ్ రూంలతో నిర్మిస్తున్నారు. దీంతో వీటిని కొనాలనుకునే వారు రుణాలు పొందడంలో ఇబ్బందులకు గురవుతున్నారు. బొమ్మూరులో తహశీల్దారు కార్యాలయం సమీపంలోనే ఒక భవనం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం అవడంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించినట్టు తెలుస్తోంది. సాక్షాత్తూ ఒక జాతీయ బ్యాంకు ఉద్యోగే ముందు ప్లాట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని, తర్వాత రుణం కోసం తమ బ్యాంకును సంప్రదించగా భవన నిర్మానం ప్లాన్‌కు విరుద్ధంగా ఉండడంతో అధికారులు నిరాకరించినట్టు సమాచారం. దాంతో ఆ ఉద్యోగి మరో బ్యాంకును ఆశ్రయించి రుణం పొందినట్టు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో మరో అపార్టుమెంట్‌ను కూడా ప్లాన్‌తో పొంతన లేకుండా నిర్మించడంతో గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకాడుతున్నారు. అయితే నిర్మాణాలు పూర్తయ్యాక తనిఖీలు జరిగితే భారీగా పెనాల్టీలు పడతాయని కొనుగోలుదారులు సంశయిస్తుండగా ఆ సొమ్ములు తామే కడతామని బిల్డర్లు నమ్మబలుకుతున్నారు. రాజమండ్రిలో టీడీపీ కార్పొరేటర్ల అండ రాజమండ్రి నగరంలో కూడా అనుమతులకు భిన్నంగా భవన నిర్మాణాలు అధికార పార్టీ కార్పొరేటర్ల అండతో సాగిపోతున్నాయి. గోకవరం బస్టాండ్ సమీపంలో చిన్న స్థలంలో ఓ భారీ భవంతి నిర్మాణం చకచకా చరుగుతోంది. ఈ భవనానికి అసలు అనుమతులు రాకుండానే నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో నగరంలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ఘటనను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. సన్నగా పొడవుగా నిర్మిస్తున్న ఈ భవనం అలాంటి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందంటున్నారు. నగరపాలక మండలిలో నంబర్-2గా ఉన్న ఒక కార్పొరేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభావితం చేసి, ఈ భవన నిర్మాణానికి అండగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల అనుమతులు లేవని ఒక భవనాన్ని కూల్చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులకు తమ కార్యాలయానికి దగ్గరలో జరుగుతున్న ఈ నిర్మాణం కనిపించలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
క్యాంపాకోలా వాసులకు లతా మంగేష్కర్ మద్దతు
ముంబై: కాంప్యాకోలా వాసులకు ప్రముఖ గాయకురాలు లతామంగేష్కర్ మద్దతు పలికారు. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్యులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో తమ ఫ్లాట్లను ఖాళీ చేస్తున్నవారికి అండగా నిలవాలని, వారిని శిక్షించవ ద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విషయం అడగాలనుకుంటున్నా.. సుప్రీంకోర్టు నిర్ణయంతో వందలాదిమంది పిల్లలు, పెద్దలు నిరాశ్రయులయ్యారు. తీవ్ర ఒత్తిడికి లోనైన ముగ్గురు ఇప్పటికే మృతిచెందారు కూడా. ఇది అన్యాయం. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్య జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల’ని ట్విటర్లో పేర్కొన్నారు. దక్షిణ ముంబైలోని క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 1981 నుంచి 1989 మధ్య కాలంలో ఏడు భవనాలను నిర్మించారు. ఇక్కడ కేవలం ఆరు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించే అనుమతి ఉన్నా బిల్డర్లు నిబంధనలను అతిక్రమించారు. మిడ్‌టౌన్ బిల్డింగ్‌లో 20 అంతస్తులు, ఆర్చిడ్ బిల్డింగ్‌లో 17 అంతస్తులు నిర్మించారు. ఇలా మొత్తం ఏడు భవనాల్లో అక్రమంగా 102 ఫ్లాట్లు ఉన్నాయి. వీరంతా ఖాళీ చేయాలని, అదనంగా ఉన్న అంతస్తులను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. -
బహుళ అంతస్తుల్లో ఉల్లంఘనలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : బహుళ అంతస్తుల నిర్మాణంలో బిల్డర్లు కనీస ప్రమాణాలూ పాటించడం లేదు. దీంతో ఆ ఆపార్ట్మెంట్ ఉన్న కాలనీవాసులకు ఇబ్బందులు తప్ప డం లేదు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుండడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు నగరంలోని 17 అపార్ట్మెంట్ల బిల్డర్లకు నోటీసులు జారీ చేశారు. పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడంతో అపార్టుమెంట్ కల్చర్ పెరుగుతోంది. దీంతో అపార్టుమెంట్ల నిర్మాణాలూ పెరుగుతున్నాయి. జిల్లాలో 200లకుపైగా బహుళ అంతస్తుల భవనాలున్నా యి. ఒక్క నిజామాబాద్ నగరంలోనే 110కుపైగా ఉన్నాయి. ఇందులో 20 అపార్ట్మెంట్లు నిర్మాణ దశ లో ఉన్నాయి. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ పట్టణ ప్రాంతాలతో పాటు నిజామాబాద్ నగర సమీపంలోని ముబారక్‌నగర్, గూపన్పల్లి, బోర్గాం తదితర గ్రామాల పరిధిలోనూ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. అయితే బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన నియమ నిబంధనల బిల్డర్లు తుంగలో తొక్కుతున్నారు. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వీరి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. దీంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. అపార్టుమెంట్ల సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిబంధనలు ఇవి నిజామాబాద్ నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి నిబంధనలు విధించారు. నగరంలో 300 చదరపు గజాల స్థలంలో జీ+2 అంతస్తులకు అనుమతి ఇచ్చేందుకు మాత్రమే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారం ఉంది. ఆపైన బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి మున్సిపల్ ఆర్డీ, మున్సిపల్ డెరైక్టర్ల అనుమతి పొందాల్సి ఉంటుంది. వెయ్యి చదరపు గజాల స్థలంలో ఐదు అంతస్తులను నిర్మించేందుకు మున్సిపల్ ఆర్డీ అనుమతి, ఆపైన అంతస్తుల నిర్మాణం చేపట్టాలనుకుంటే మున్సిపల్ డెరైక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అపార్టుమెంట్‌కు పార్కింగ్ స్థలం ఉండాలి. అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. బహుళ అంతస్తు చుట్టూ నిబంధనలకు అనుగుణంగా ఖాళీ స్థలం, ప్రహరీ వంటి నిర్మాణాలు చేపట్టాలి. తాగునీటి సరఫరాతోపాటు డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ముం దస్తు అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాతే అపార్టుమెంట్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే బహుళ అంతస్తుల నిర్మాతలు ఈ నిబంధన లను తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా, ఇష్టారాజ్యంగా అపార్టుమెంట్లు నిర్మించి, విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వీటిని కొనుక్కున్నవారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించేవారూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వినాయక్‌నగర్‌లో.. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ ప్రాంతం లో 22 అపార్ట్మెంట్లున్నాయి. ఇందులో 18 నిర్మాణా లు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. వీటిలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో ఆయా అపార్టుమెంట్ల సమీపంలో నివసిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్లలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురికి నీరు నిల్వ ఉంటోందని, దీంతో దోమలు పెరుగుతున్నాయని, తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు స్పందించి నిర్మాణాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 17 అపార్టుమెంట్లకు సంబంధించి వాటి యజమానులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో డ్రైనేజీని సరి చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. అంతటా ఇదే పరిస్థితి జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో 90 వరకు అపార్టుమెంట్లున్నాయి. మరికొన్ని బహుళ అంతస్తులు నిర్మాణ దశలో ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు.. బహుళ అంతస్తుల నిర్మాణానికి మాత్రం కళ్లు మూసుకొని అనుమతులు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నియమ నిబంధనల ప్రకారంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు అమ్యామ్యాలకు ఆశపడుతుండడంతో బిల్డర్ల ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. నోటీసులిచ్చాం వినాయక్‌నగర్ ప్రాంతంలోని బస్వాగార్డెన్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని 17 అపార్టుమెంట్లను గుర్తించాం. వాటి యజమానులకు నోటీసులు ఇచ్చాం. వారంలోగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. -మల్లికార్జున్, ఏసీపీవో, నగర పాలక సంస్థ, నిజామాబాద్ -
అరకొరగా ఇసుక సరఫరా, నిర్మాణ రంగం ఢమాల్
సాక్షి/మెహదీపట్నం, న్యూస్‌లైన్ : నగరంలో నిర్మాణ రంగం పడకేసింది. ఇసుక కొరత వల్ల భారీ వెంచర్లే కాదు.. చోటామోటా ఇళ్ల నిర్మాణాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. మరోవైపు నిర్మాణ పనులు లేకపోవడంతో దినసరి కూలీలు రోడ్డున పడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతాల నుంచి నగరానికి రావాల్సిన ఇసుక లారీలు సమ్మెలు, ఆందోళనల కారణంగా ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకైనా వస్తుందా అంటే వర్షాల కారణంగా రావాల్సిన స్థాయిలో రావటం లేదు. దీంతో ఇసుక కొరత తీవ్రంగా మారింది. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలించి ధరలను విపరీతంగా పెంచేశారు. ఇప్పటికే పెరిగిన స్టీలు, సిమెంట్, రెడీమిక్స్ ధరలతో సతమతమౌతున్న ప్రజలు, బిల్డర్లకు ఇసుక ధర కూడా పెరగడం భారంగా మారింది. అమాంతం పెరిగిన ఇసుక రేట్లతో నగరంలోని పలువురు బిల్డర్లు ప్రస్తుతానికి నిర్మాణ పనులను పక్కన పెట్టేశారు. నిలిచిపోయిన ఇసుక రవాణా.. నిర్మాణరంగ అవసరాల కోసం హైదరాబాద్‌కు ప్రతిరోజు సుమారు 60 వేల టన్నుల ఇసుక అవసరం. సీమాంధ్ర ప్రాంతాలైన రాజమండ్రి, తెనాలి, రావులపాలెం, కర్నూ లు, అమరావతి, విజయవాడ, దాములూరు, తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్, అచ్చంపేట, నల్గొండ, డిండి, తిరుమలగిరి, వరంగల్, ఏటూరు నాగారం, నిజామాబాద్, కరీంనగర్ల నుంచి నగరానికి నిత్యం ఇసుక రవాణా జరుగుతుంది. ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 3 వేల నుంచి 5 వేల లారీల ఇసుక తరలివస్తుంది. కానీ, ప్రస్తుతం సీమాంధ్రుల ఉద్యమం నేపథ్యంలో నగరానికి ఇసుక లారీలు రావడం లేదు. మరోవైపు భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం ఉధృతంగా ఉం డటంతో తెలంగాణ ప్రాంతాల నుంచి రావాల్సిన లారీలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు ఇసుక ను అక్రమంగా తరలించి ధరలను అమాంతం పెంచేశారు. జోరుగా అక్రమ దందా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇసుకకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కర్మన్‌ఘాట్, చంపాపేట, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్రావు నగర్, సైనిక్‌పురి, తిరుమలగిరి, సుచిత్ర, మేడ్చల్, పాతముంబై రహదారి తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. రవాణా శాఖ నిబంధనలను అతిక్రమించి లారీల్లో ఇసుకను ఓవర్‌లోడ్ చేసి మరీ తరలిస్తున్నారు. నిబ ంధనల ప్రకారం లారీలో ఎంత లోడుందో తెలిపే ధ్రువీకరణ ప్రతం తప్పనిసరి. ధర్మ కాంటాలు (వే బ్రిడ్జి) నుంచి ఈ పత్రాలు తీసుకోవాలి. అయితే ఈ ధర్మ కాంటాలు అధర్మకాంటాలుగా మారాయి. డబ్బులు తీసుకొని తప్పుడు తూకాలతో మాయాజాలం చేస్తున్నాయి. అధికలోడు ఉన్నా సరే డబ్బులు తీసుకొని కంప్యూటర్లో తారుమారు చేసి తక్కువ బరువు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో ఇసుక అక్రమంగా తరలిస్తుండటంతో కోట్లాది రూపాలయ వ్యయంతో నిర్మించిన రహదారులు ధ్వంసమవుతున్నాయి. అధిక లోడును నియంత్రించలేక లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాతి ఇసుకకు పెరుగుతున్న డిమాండ్ నది ఇసుక సరఫరా తగ్గిపోవటం, ధరలు చుక్కలనంటుతుండటంతో హైదరాబాద్ నిర్మాణ అవసరాల కోసం ప్రజలు, బిల్డర్లు ప్రత్నామ్యాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో రోబో సాండ్ (రాతి ఇసుక)కు డిమాండ్ పెరిగిపోయింది. నది ఇసుకతో పోల్చుకుంటే రాతి ఇసుక ధరలు అందుబాటులో ఉండటంతో ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం వాటి ధరలూ పెరిగిపోయాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 రోబోసాండ్ తయారీ యూనిట్లు వెలిశాయంటే రాతి ఇసుకకు పెరుగుతున్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు. ఆగిన నిర్మాణాలు పెరిగిన ఇసుక రేట్లను భరించి నిర్మాణాలను పూర్తి చేయడం భారంగా మారిందని పలువురు బిల్డర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు నిర్మాణాలు అసంపూర్తిగా ఆగిపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడి నగరంలో నిత్యం వేలాది మంది జీవిస్తున్నారు. రోజూ కూలి చేస్తేనే వారి పొట్ట నిండుతుంది. ప్రస్తుతం సమైక్య ఉద్యమంతో నిర్మాణ రంగం నెమ్మదించడంతో అడ్డాకూలీలకు పనిదొరకని పరిస్థితి నెలకొంది. రెక్కాడితే గాని డొక్కాడని వీరి కుటుంబాలు పని దొరక్క పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇసుక ధరలు తగ్గించాలి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పనులు చేయలేక సగంలోనే నిర్మాణాలు నిలివేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే స్టీలు, సిమెంట్ వంటి సామగ్రి ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పుడు ఇసుక కూడా ఆ జాబితాలో చేరింది. సమ్మెల ప్రభావం ఇసుక లారీలపై పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇసుక ధరలు త గ్గేలా చర్యలు తీసుకోవాలి. - వెంకట్, ఎస్వీ ప్లానర్ అధినేత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి వర్షాల కారణంగా ఇసుక తవ్వకాలు జరగకపోవడంతో రేట్లు పెరిగిన మాట వాస్తవమే. అయితే సమ్మెల కారణంగా ఆ రేట్లు మరింత పెరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని సమ్మెలతో లారీలు నిలిచిపోకుండా చూసుకోవాలి. లేకపోతే ముందుముందు చాలా ఇబ్బందులెదురవుతాయి. - కొమ్మిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, హైదరాబాద్ లారీ యజమానుల సంఘం నాయకుడు రేట్లు పెంచేస్తున్నారు ఏ ప్రాంతంలో ఉద్యమాలు జరిగినప్పటికీ వాటి ప్రభావం రవాణా వ్యవస్థపై పడ కుండా చూసుకోవాలి. లేకుంటే కేవలం నిర్మాణ సామాగ్రికే కాకుండా కూరగాయలు, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇదే అదునుగా భావించి అక్రమంగా వస్తువులను తరలించి రేట్లను పెంచేస్తున్నారు. - రామారావు, గ్రేటర్ హైదరాబాద్ భవన, నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పస్తులుంటున్నాం సాధారణంగా అడ్డా మీదకు వెళ్లగానే పని లభించేది. ప్రస్తుతం ఇసుక దొరకడం లేదన్న కారణంతో నిర్మాణాలు వాయిదా పడుతున్నాయి. దీంతో పనులు దొరకడం లేదు. నిత్యం రూ.200 కూలీ దొరికేది. గత 15 రోజుల్లో నాలుగు రోజులు మాత్రమే కూలి దొరికింది. మిగతా రోజులు ఇంటిల్లిపాది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. - రాంచందర్, గుడిమల్కాపూర్, కూలి