రియల్టీ రంగంలో ఆన్‌లైన్ సేవలందిస్తున్న టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ తన వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వినియోగదారులు మరింత సమర్థంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రాపర్టీ సందర్శనను ప్రారంభించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే చాలామందికి అనుమానాలుంటాయి. కాబట్టి నేరుగా ప్రాపర్టీ సందర్శించి నిర్ణయం తీసుకునేందుకు మ్యాజిక్స్‌బ్రిక్స్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.
మ్యాజిక్ బ్రిక్స్ 100కుపైగా బిల్డర్లతో కలిసి హైదరాబాద్‌లో సైట్ విజట్ ప్రోడక్ట్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఈ సర్వీసును విస్తరించినట్లు ప్రకటించింది. ఔరా రియల్టీ, విజన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్, ఎలిగెంట్ ఇన్‌ఫ్రా, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలతో సహా 100కు పైగా డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరునెలల్లో 120కి పైగా ప్రాజెక్టుల్లో 8,200 కంటే ఎక్కువ సైట్ సందర్శనలను అందించినట్లు తెలిపింది. వినియోగదారులు సగటున రూ.1.25 కోట్లతో 450 కంటే ఎక్కువ విలువైన ఇళ్లు బుక్ చేసుకున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్‌ఐసీ ఉపాధి అవకాశం
ఈ కార్యక్రమానికి సంబంధించి మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ..‘సాధారణంగా పండగ సీజన్ తరువాత డిసెంబరులో నివాస కొనుగోళ్లు తగ్గుతాయి. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇంటి యజమానుల ఆకాంక్ష మేరకు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఇళ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు పండగలు, ప్రత్యేక రోజులకు అతీతంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాపర్టీ విజిట్ ఫెస్ట్‌కు మంచి స్పందన ఉంది. కొంతమంది కొనుగోలుదారులతో ఒకే రోజులో 4-5 ప్రాపర్టీలను సందర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయాన్ని దాదాపు 50% తగ్గించేందుకు వీలవుతుంది. రియల్టీ రంగంలో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు అందిస్తూ మెరుగైన సేవలు అందుబాటులో ఉంచుతున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment