homebuyers
-
లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న భారతీయులు!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. బ్యాంక్ అకౌంట్లో లక్షల కోట్లున్నా.. సొంతిల్లు లేకపోతే సంతృప్తిగా ఉండలేరు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కోవిడ్-19 కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. శాలరీ కటింగ్‌లు, నిరుద్యోగం పట్టి పీడించింది. దీంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలు అడి అశలయ్యాయి. అయితే లగ్జరీ ఇళ్ల విషయంలో అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయులు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ గ్రూప్ లగ్జరీ ఇళ్ల విక్రయాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..హెచ్1 (ఫస్ట్ ఆఫ్ కేలండర్ ఇయర్) జనవరి - మార్చి 2022లో మొత్తం ఏడు నగరాల్లో 1.84లక్షల యూనిట్లను అమ్మగా..అందులో 14శాతం లగ్జరీ ఇళ్లే ఉన్నాయని హైలెట్ చేసింది. దీనికి విరుద్ధంగా, 2019 మొత్తంలో విక్రయించిన 2.61 లక్షల యూనిట్లలో కేవలం 7 శాతం మాత్రమే లగ్జరీ కేటగిరీలో ఉన్నాయి”అని అనరాక్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ ధరలో (రూ.40 లక్షల లోపు ధర కలిగిన యూనిట్లు)ఉన్న ఇళ్ల అమ్మకాల వాటా 2019లో 38 శాతం నుండి ఈఏడాది జనవరి-మార్చి సమయానికి 31 శాతానికి పడిపోయాయి. కోవిడ్-19 పరిస్థితులు అదుపులోకి రావడంతో ఇళ్లను కొనుగోలు చేయాలని భావించినా.. అందుకు ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదని తెలుస్తోంది. “ఇక లగ్జరీ ఇళ్లను సొంతం చేసుకోవాలని కొనుగోలు దారులపై మహమ్మారి ప్రభావం చూపింది. అయినప్పటికి వారికి వచ్చే అధిక ఆదాయం లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు దోహద పడినట్లు అనరాక్ నివేదిక తెలిపింది. డెవలపర్ల తగ్గింపులతో కొనుగోలుదారులకు లగ్జరీ ఇళ్లపై మక్కువ పెరిగింది. దేశంలో అనుకూల పరిస్థితుల కారణంగా ఎన్ఆర్ఐలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు”అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అన్నారు. చదవండి👉 రీసేల్ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే! -
కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. పెరగనున్న ఇళ్ల ధరలు!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. వచ్చే 6 నెలల్లో గృహల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ నివేదిక తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చుల వల్ల వచ్చే ఆరు నెలల్లో హౌసింగ్ ధరలు పెరుగుతాయని ప్రముఖ హౌసింగ్ పోర్టల్ Housingcom, రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO కలిసి నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగంలో వినియోగదారుల మనోభావాలను అంచనా వేయడానికి 3,000 మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయలను సేకరించినట్లు ఈ సర్వే పేర్కొంది. 'రెసిడెన్షియల్ రియల్టీ కన్స్యూమర్ సెంటిమెంట్ అవుట్‌లుక్(జనవరి-జూలై 2022)' నివేదిక పేర్కొన్న వివరాల ప్రకారం.. 100 మందిలో 47% మంది వినియోగదారులు రియల్ ఎస్టేట్'లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని ఈ సర్వే హైలైట్ చేసింది. స్టాక్, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వంటి వాటిలో పెట్టె పెట్టుబడితో పోలిస్తే ఇది అత్యధికం. 2020 ద్వితీయార్ధంలో నిర్వహించిన సర్వేలో కేవలం 35 శాతం మంది మాత్రమే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరిచారు. "కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ప్రజలు గృహాల కొనుగోలుకు సిద్దం అవుతున్నారు. గత ఏడాది 2021లో డిమాండ్ పెరగడంతో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగాయని మా డేటా చూపించింది. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్ కంటే ముందు స్థాయి అమ్మకాలను దాటుతాయని మేము బలంగా నమ్ముతున్నాము" అని Housingcom గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ అన్నారు. ఈ సర్వే ప్రకారం.. కొత్త ఇళ్లు కొనాలని చూస్తున్న వారిలో సగానికి పైగా (51 శాతం) రాబోయే ఆరు నెలల్లో గృహ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం నిర్మాణ వ్యయం పెరగడం. అదే సమయంలో 73 శాతం మంది ప్రజలు ఇంటి కొనుగోలుకి ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా తగ్గింపు ధరలు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మినహాయింపును పెంచాలి, నిర్మాణ సామగ్రిపై వస్తు సేవల పన్ను(జిఎస్టి) ను తగ్గించాలని, చిన్న డెవలపర్లకు రుణ లభ్యతను విస్తరించాలని, గృహ కొనుగోళ్ల డిమాండ్ పెంచడానికి స్టాంప్ డ్యూటీని అన్నీ రాష్ట్రాలు తగ్గించాలని ఈ నివేదిక సూచించింది. (చదవండి: లాంగ్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇవే!) -
కొత్త ఇంటిని కొనుగోలు చేసే వారికి శుభవార్త..! ఇదే సరైన సమయం..!
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2022 సామాన్యులకు నిరాశే మిగిల్చింది. ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు లేక పోవడంతో బడ్జెట్ చాలా మందిని నిరాశ పర్చింది. కాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా నిర్ణయం కొత్తగా ఇంటిని కొనుగోలుచేసే వారికి శుభవార్తను అందించింది. రెపో రేట్లు యథాతథం..! ఆర్బీఐ నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని నివాస గృహాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల సుదీర్ఘ ద్వైమాసిక ఎంపీసీ సమావేశం తర్వాత, కమిటీ రెపో , రివర్స్ రెపో రేట్లను వరుసగా 4 శాతం, 3.35 శాతం గా ఉంచింది. రెపో రేట్ యథాతథంగా ఉండడంతో బ్యాంకులు రుణదాతలకు ఇచ్చే వడ్డీ రేట్లు అలాగే ఉంచే అవకాశం ఉంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు అలాగే..! రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఆర్బీఐ నిర్ణయం గృహనిర్మాణ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. దీంతో కొంత ఇంటిని కొనుగోలుదారులు చేసే వారికి తక్కువ వడ్డీకే రుణాలను పొందుతారు. ప్రస్తుతం చాలా ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అందించే వడ్డీ రేట్లు 6.4-6.9 శాతం మధ్య ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌కు జోష్..! రియల్ ఎస్టేట్ రంగం రికవరీ వైపు రావడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏబీఏ కార్పోరేషన్ డైరెక్టర్, క్రెడాయ్ వెస్ట్రన్ యూపీ ప్రెసిడెంట్ అమిత్ మోడీ అభిప్రాయపడ్డారు. ఆర్బిఐ తీసుకున్న అనుకూల వైఖరి ఆర్థిక వాతావరణాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉన్నందున ఇప్పటికీ కొత్త గృహాలను కొనుగోలు చేయగల గృహ కొనుగోలుదారులకు ఇది సానుకూలంగా ఉంటుందని భారతీయ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ సీఈఓ-రెసిడెన్షియల్, అశ్విందర్ ఆర్. సింగ్ తెలిపారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అభిప్రాయపడ్డారు. చదవండి: లగ్జరీ కార్లను పక్కన పెట్టి కామన్ మ్యాన్ కారుకే ఓటు -
ఎస్బీఐ వినూత్న గృహ రుణ పథకం
ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్బీఐ తెలిపింది. ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి కుమార్ మరింత వివరిస్తూ.. ‘‘ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్ బుక్ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందేంత వరకు అమల్లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
జేపీ ఇన్ఫ్రాటెక్ బిడ్డింగ్‌లో పాల్గొనద్దు
న్యూఢిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి జేపీ గ్రూప్‌కు అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌పై (జేఐఎల్) తాజాగా దివాలా ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ) అలహాబాద్ బెంచ్‌ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవద్దని జేఐఎల్‌తోపాటు మాతృసంస్థ జేపీ గ్రూప్‌కు, ప్రమోటర్లకు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దివాలా చట్టం (ఐబీసీ) కింద జేఐఎల్ హోల్డింగ్ కంపెనీ జేపీ అసోసియేట్స్ లిమిటెడ్‌పై (జేఏఎల్) సైతం కార్పొరేట్ దివాలా పరిష్కార పక్రియ ప్రారంభించేలా బ్యాంకర్లకు తగిన ఆదేశాలివ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) సుప్రీం సూచించింది. ‘‘21,532 మంది గృహ కొనుగోలుదారుల విషయంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయటానికి అటు జేఏఎల్ ఇటు జీఐఎల్‌కు తగిన ఆర్థిక వనరులు లేవన్న విషయం స్పష్టమైపోయింది’’ అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. రూ.526 కోట్ల చెల్లింపుల్లో జేఐఎల్ విఫలమయ్యిందని పేర్కొంటూ, ఎన్సీఎల్టీ ముందు ఐడీబీఐ బ్యాంక్ కార్పొరేట్ దివాలా ప్రక్రియ పిటిషన్ దాఖలు చేసింది. తొలి రౌండ్ బిడ్డింగ్ ప్రక్రియలో జేఐఎల్ లిక్విడేషన్ విలువకన్నా తక్కువగా ఉన్న దాదాపు రూ.7,350 కోట్ల బిడ్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. సుప్రీం తాజా రూలింగ్ ప్రకారం– ఇప్పటి నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమై 180 రోజుల్లో ముగియాల్సి ఉంటుంది. రుణ దాతల కమిటీలో గృహ కొనుగోలుదారులు కూడా ఉంటారు. కొత్త బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. జేఏఎల్, జేఐఎల్ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసిన రూ. 750 కోట్లు ఎన్సీఎల్టీకి బదలాయించడం జరుగుతుంది. -
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్
మీరు గృహ కొనుగోలుదారులా? మీ గృహం కోసం బిల్డర్ కు లేదా ఫ్లాట్ ఓనర్ కు ఒప్పందం మేరకు డబ్బు చెల్లించినప్పటికీ మీకు ఫ్లాట్ స్వాధీనం చేయడం లేదా? ఒప్పందం ప్రకారం అలా ఫ్లాట్ స్వాధీన పరచని పక్షంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా? ఒకవేళ బిల్డర్ లేదా నిర్మాణ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటిస్తే, లేదా నిధులు లేవన్న కారణంగా నిర్మాణాలను వాయిదా వేస్తూ వెళుతున్నప్పుడు ఏం చేయాలి? అలాంటి వారికి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కేవలం బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు మాత్రమే అస్త్రాలుగా వాడుతున్న ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) ఇకనుంచి వినియోగదారులు కూడా ఉపయోగించేలా చట్టంలో సంబంధిత నిబంధనల్లో మార్పులు చేశారు. అంటే ఒప్పందం మేరకు ఫ్లాట్ స్వాధీనపరచనప్పుడు ఈ చట్టం ప్రకారం వినియోగదారులు బిల్డర్ నుంచి క్లెయిమ్ పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిబంధనల మేరకు బిల్డర్ లేదా కంపెనీ ఏదేనీ కారణం చూపిస్తూ ఫ్లాట్ ను స్వాధీనం చేయనప్పుడు తాజా చట్టం మేరకు క్లెయిమ్ కోరవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఫండ్స్ లేవని సాకుచూపుతూ చాలామంది డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు డెలివరీలు ఇవ్వకుండా నాన్చుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు గడువు మించి మరింత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటు రీఫండ్ కోసం కూడా కొనుగోలుదారులు వేచిచూడాల్సి వస్తోంది. చట్టంలో చేర్చిన కొత్త నిబంధనల మేరకు క్లెయిమ్ కోసం ప్రత్యేకంగా ఒక దరఖాస్తును సమర్పించాలి. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజుల్యూషన్ ప్రాసెస్ కింద ఈ దరఖాస్తును అందించాలి. అలా సమర్పించిన దరఖాస్తును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), దివాలా చట్టం కింద కేసును అంగీకరిస్తే, మిగతా ప్రక్రియ ముందుకు సాగడానికి తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్‌ను నియమిస్తారు. ఇలా దివాలా చట్టం కింద దివాలా కార్పొరేట్ సంస్థ నుంచి గృహ వినియోగదారులు తమ రీఫండ్‌ను పొందవచ్చు. -
'మునుగుతారో చస్తారో.. డబ్బు చెల్లించాల్సిందే'
న్యూఢిల్లీ: భవన నిర్మాణ కంపెనీ సూపర్ టెక్కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. కొనుగోలుదార్లకు వారి డబ్బులు వారికి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో మాటకు వీలు లేదని తెలిపింది. మునుగుతారో.. చస్తారో.. గృహాల కొనుగోలు దార్లు పెట్టిన పెట్టుబడులు వారికి నాలుగు వారల్లోగా చెల్లించాలని ఆదేశించింది. నోయిడాలో ఎమరాల్డ్ టవర్స్ ప్రాజెక్టు పేరిట సూపర్ టెక్ రీయల్ ఎస్టేట్ సంస్థ ఓ కొత్త నిర్మాణం చేపడుతోంది. ఇందులో ఫ్లాట్‌లో బుక్ చేస్తూ ఎంతోమంది తాము కష్టపడి సంపాధించిన ధనాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చారు. అయితే, నిర్మాణదారు ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా లేని కారణంగా ప్రస్తుతం అందులో పెట్టుబడి పెట్టినవారు తమ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, అందుకు ఆ సంస్థ సిద్ధంగా లేకపోవడంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం 'మీరు మునుగుతారా.. చచ్చిపోతారా అన్నది మాకు అనవసరం. గృహాల కొనుగోలు దార్లకు వారు డిమాండ్ చేసినట్లు తిరిగి డబ్బు చెల్లించాలి. మీ ఆర్థిక పరిస్థితుల విషయానికి మేం సరైన ప్రాధాన్యత ఇవ్వబోము' అని సుప్రంకోర్టు వ్యాఖ్యానిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి మొత్తం చెల్లించాలని ఆదేశించింది.