'మునుగుతారో చస్తారో.. డబ్బు చెల్లించాల్సిందే' | Sink or die, you must refund homebuyers: Supreme Court | Sakshi
Sakshi News home page

'మునుగుతారో చస్తారో.. డబ్బు చెల్లించాల్సిందే'

Published Wed, Sep 7 2016 3:01 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

'మునుగుతారో చస్తారో.. డబ్బు చెల్లించాల్సిందే' - Sakshi

'మునుగుతారో చస్తారో.. డబ్బు చెల్లించాల్సిందే'

న్యూఢిల్లీ: భవన నిర్మాణ కంపెనీ సూపర్ టెక్కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. కొనుగోలుదార్లకు వారి డబ్బులు వారికి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో మాటకు వీలు లేదని తెలిపింది. మునుగుతారో.. చస్తారో.. గృహాల కొనుగోలు దార్లు పెట్టిన పెట్టుబడులు వారికి నాలుగు వారల్లోగా చెల్లించాలని ఆదేశించింది. నోయిడాలో ఎమరాల్డ్ టవర్స్ ప్రాజెక్టు పేరిట సూపర్ టెక్ రీయల్ ఎస్టేట్ సంస్థ ఓ కొత్త నిర్మాణం చేపడుతోంది. ఇందులో ఫ్లాట్లో బుక్ చేస్తూ ఎంతోమంది తాము కష్టపడి సంపాధించిన ధనాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చారు.

అయితే, నిర్మాణదారు ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా లేని కారణంగా ప్రస్తుతం అందులో పెట్టుబడి పెట్టినవారు తమ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, అందుకు ఆ సంస్థ సిద్ధంగా లేకపోవడంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం 'మీరు మునుగుతారా.. చచ్చిపోతారా అన్నది మాకు అనవసరం. గృహాల కొనుగోలు దార్లకు వారు డిమాండ్ చేసినట్లు తిరిగి డబ్బు చెల్లించాలి. మీ ఆర్థిక పరిస్థితుల విషయానికి మేం సరైన ప్రాధాన్యత ఇవ్వబోము' అని సుప్రంకోర్టు వ్యాఖ్యానిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి మొత్తం చెల్లించాలని ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement