Emerald Towers project
-
కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో కూల్చివేత పూర్తిచేయాలని, దానికయ్యే ఖర్చులు మొత్తం బిల్డర్ భరించాలని పేర్కొంది. రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో... అదీ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో అనధికార నిర్మాణాలలో విపరీతమైన పెరుగుదల, సందేహాస్పదమైన లావాదేవీలు గతంలో కోర్టు గుర్తించినట్లు తెలిపింది. బిల్డర్లు, ప్లానింగ్ అథారిటీ మధ్య ఇలాంటి కుమ్మక్కు లావాదేవీలు చిన్నస్థాయిలో జరిగేది కాదని తీర్పులో పేర్కొంది. చదవండి: మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు -
'మునుగుతారో చస్తారో.. డబ్బు చెల్లించాల్సిందే'
న్యూఢిల్లీ: భవన నిర్మాణ కంపెనీ సూపర్ టెక్కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. కొనుగోలుదార్లకు వారి డబ్బులు వారికి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో మాటకు వీలు లేదని తెలిపింది. మునుగుతారో.. చస్తారో.. గృహాల కొనుగోలు దార్లు పెట్టిన పెట్టుబడులు వారికి నాలుగు వారల్లోగా చెల్లించాలని ఆదేశించింది. నోయిడాలో ఎమరాల్డ్ టవర్స్ ప్రాజెక్టు పేరిట సూపర్ టెక్ రీయల్ ఎస్టేట్ సంస్థ ఓ కొత్త నిర్మాణం చేపడుతోంది. ఇందులో ఫ్లాట్‌లో బుక్ చేస్తూ ఎంతోమంది తాము కష్టపడి సంపాధించిన ధనాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చారు. అయితే, నిర్మాణదారు ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా లేని కారణంగా ప్రస్తుతం అందులో పెట్టుబడి పెట్టినవారు తమ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, అందుకు ఆ సంస్థ సిద్ధంగా లేకపోవడంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం 'మీరు మునుగుతారా.. చచ్చిపోతారా అన్నది మాకు అనవసరం. గృహాల కొనుగోలు దార్లకు వారు డిమాండ్ చేసినట్లు తిరిగి డబ్బు చెల్లించాలి. మీ ఆర్థిక పరిస్థితుల విషయానికి మేం సరైన ప్రాధాన్యత ఇవ్వబోము' అని సుప్రంకోర్టు వ్యాఖ్యానిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి మొత్తం చెల్లించాలని ఆదేశించింది.