ఎస్‌బీఐ వినూత్న గృహ రుణ పథకం | State Bank launches Residential Builder Finance with Buyer Guarantee | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ వినూత్న గృహ రుణ పథకం

Published Thu, Jan 9 2020 5:12 AM | Last Updated on Thu, Jan 9 2020 5:12 AM

State Bank launches Residential Builder Finance with Buyer Guarantee - Sakshi

ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్‌బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్‌బీఐ తెలిపింది.

ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి కుమార్‌ మరింత వివరిస్తూ.. ‘‘ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్‌ బుక్‌ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ పొందేంత వరకు అమల్లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement