MasterCard Chairman Rajnish Kumar: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాస్టర్‌కార్డ్ ఇండియన్ యూనిట్‌కు కుమార్‌ను చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంపాదన ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతిపెద్ద బ్యాంకు అధికారిగా ఉన్నప్పడు సంపాదించిన దానికంటే మూడు రెట్టు ఎక్కువ సంపాదిస్తున్నారట. వివిధ లిస్టెడ్ సంస్థలలో డైరెక్టర్‌గా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది.
సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం రజనీష్ కుమార్ FY 2023లో హీరో మోటోకార్ప్ ద్వారా రూ.38 లక్షలు, LTIMindtree ద్వారా రూ. 33.2 లక్షలు, అంబుజా సిమెంట్స్ నుంచి 17.8 లక్షలు, మొత్తంగా రూ. 89 లక్షల వేతనం పొందారు. దీనికి తోడు ఇటీవల ఎల్ అండ్ టీ, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ బోర్డులకు నియమితులయ్యారు. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ FY 2023 వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి స్వతంత్ర డైరెక్టర్‌కు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి సిట్టింగ్ ఫీజులు, కమీషన్‌తో కలిపి సంవత్సరానికి సుమారు రూ.51 లక్షల దాకా చెల్లిస్తుంది. 2023 మార్చి 30న బోర్డులో నియమితులైన రజనీష్ కుమార్ తప్ప మిగిలిన వారికి మేనేజర్ బోర్డు సమావేశానికి హాజరైనందుకు లక్ష సిట్టింగ్ ఫీజు చెల్లింస్తోంది.
ఎల్ అండ్ టీ బోర్టులో మే 10, 2023 నుండి మే 9, 2028 వరకు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు బోర్డ్ ప్రతి సమావేశానికి కంపెనీ అతనికి సిట్టింగ్ ఫీజుగా రూ.1 లక్ష చెల్లించింది.ఎస్‌బీఐ 2021 ఆర్థిక సంవత్సరంలో కుమార్ మొత్తం రూ. 30.34 లక్షల పరిహారాన్ని అందుకున్నారు. అలాగే 2020లో అతని జీతం రూ.31.26 లక్షలు. అయితే SBIలో ఉన్నంత కాలం విలాసవంతమైన వసతి, ఉచిత రవాణా ప్రయాణ ప్రోత్సాహకాలు తదితర అదనపు ప్రోత్సాహకాలను పొందారు. 2020 అక్టోబరు వరకు 40 సంవత్సరాలుగా ఎస్‌బీఐ వివిధ హోదాల్లో సేవలందించిన రజనీష్ కుమార్ స్టార్టప్ భారత్‌పైకి ఛైర్మన్‌గా ఉన్నారు.
కాగా కంపెనీల చట్టం 2013 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే సమయంలో ఇరవై కంటే ఎక్కువ కంపెనీలలో ఏదైనా ప్రత్యామ్నాయ డైరెక్టర్‌షిప్‌తో సహా డైరెక్టర్‌గా పదవిని కలిగి ఉండకూడదు. అయితే 10 పబ్లిక్ కంపెనీలకు మించకుండా డైరెక్టర్‌గా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment