ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం పంపిన ప్రతిపాదనకు నియామకాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కుమార్ ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్లలో అత్యంత సీనియర్‌గా ఉన్నారు. బీఎస్సీ చేసిన ఆయన 1988లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఎస్‌బీఐలో తన కెరియర్ ప్రారంభించారు. మరోవైపు, ప్రస్తుతం డీఎండీగా ఉన్న రాణా అశుతోష్ కుమార్ సింగ్‌ను ఎస్‌బీఐ ఎండీగా కేంద్రం నియమించింది. ఎస్‌బీఐలో ఒక ఛైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు.
ఇదీ చదవండి: పండగ సీజన్‌లో శనగపప్పు ధరలకు రెక్కలు
Comments
Please login to add a commentAdd a comment