master cards
-
ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!
MasterCard Chairman Rajnish Kumar: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాస్టర్‌కార్డ్ ఇండియన్ యూనిట్‌కు కుమార్‌ను చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంపాదన ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతిపెద్ద బ్యాంకు అధికారిగా ఉన్నప్పడు సంపాదించిన దానికంటే మూడు రెట్టు ఎక్కువ సంపాదిస్తున్నారట. వివిధ లిస్టెడ్ సంస్థలలో డైరెక్టర్‌గా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం రజనీష్ కుమార్ FY 2023లో హీరో మోటోకార్ప్ ద్వారా రూ.38 లక్షలు, LTIMindtree ద్వారా రూ. 33.2 లక్షలు, అంబుజా సిమెంట్స్ నుంచి 17.8 లక్షలు, మొత్తంగా రూ. 89 లక్షల వేతనం పొందారు. దీనికి తోడు ఇటీవల ఎల్ అండ్ టీ, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ బోర్డులకు నియమితులయ్యారు. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ FY 2023 వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి స్వతంత్ర డైరెక్టర్‌కు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి సిట్టింగ్ ఫీజులు, కమీషన్‌తో కలిపి సంవత్సరానికి సుమారు రూ.51 లక్షల దాకా చెల్లిస్తుంది. 2023 మార్చి 30న బోర్డులో నియమితులైన రజనీష్ కుమార్ తప్ప మిగిలిన వారికి మేనేజర్ బోర్డు సమావేశానికి హాజరైనందుకు లక్ష సిట్టింగ్ ఫీజు చెల్లింస్తోంది. ఎల్ అండ్ టీ బోర్టులో మే 10, 2023 నుండి మే 9, 2028 వరకు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు బోర్డ్ ప్రతి సమావేశానికి కంపెనీ అతనికి సిట్టింగ్ ఫీజుగా రూ.1 లక్ష చెల్లించింది.ఎస్బీఐ 2021 ఆర్థిక సంవత్సరంలో కుమార్ మొత్తం రూ. 30.34 లక్షల పరిహారాన్ని అందుకున్నారు. అలాగే 2020లో అతని జీతం రూ.31.26 లక్షలు. అయితే SBIలో ఉన్నంత కాలం విలాసవంతమైన వసతి, ఉచిత రవాణా ప్రయాణ ప్రోత్సాహకాలు తదితర అదనపు ప్రోత్సాహకాలను పొందారు. 2020 అక్టోబరు వరకు 40 సంవత్సరాలుగా ఎస్బీఐ వివిధ హోదాల్లో సేవలందించిన రజనీష్ కుమార్ స్టార్టప్ భారత్‌పైకి ఛైర్మన్‌గా ఉన్నారు. కాగా కంపెనీల చట్టం 2013 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే సమయంలో ఇరవై కంటే ఎక్కువ కంపెనీలలో ఏదైనా ప్రత్యామ్నాయ డైరెక్టర్‌షిప్‌తో సహా డైరెక్టర్‌గా పదవిని కలిగి ఉండకూడదు. అయితే 10 పబ్లిక్ కంపెనీలకు మించకుండా డైరెక్టర్‌గా ఉండవచ్చు. -
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న మాస్టర్ కార్డ్
Mastercard Acquires Title Sponsorship Rights For All BCCI Home Matches: బీసీసీఐ ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. NEWS - Mastercard acquires title sponsorship rights for all BCCI international and domestic home matches. More details here 👇👇https://t.co/VGvWxVU9cq — BCCI (@BCCI) September 5, 2022 ఇప్పటివరకు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తప్పుకోవడంతో మాస్టర్ కార్డ్ ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. పేటీఎం అభ్యర్థన మేరకే బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించింది. ఈ డీల్‌కు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ మొత్తం పూర్తైందని బీసీసీఐ వివరించింది. కాగా, బీసీసీఐ.. 2015లో పేటీఎంతో నాలుగేళ్లకు గాను 203 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. నాటి నుంచి భారత్‌లో ఆడే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈనెల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి మాస్టర్ కార్డ్ బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. బీసీసీఐ-మాస్టర్ కార్డ్‌ల మధ్య ఒప్పందం 2023 మార్చి వరకు కొనసాగనుంది. చదవండి: టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. -
టీమిండియా టైటిల్ స్పాన్సర్ మార్పు.. కొత్త స్పాన్సర్ ఎవరంటే..?
టీమిండియా టైటిల్ స్పాన్సర్ మారింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తప్పుకోవడంతో ఆ స్థానాన్ని గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. పేటీఎం అభ్యర్థన మేరకే టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్ కాంట్రాక్ట్ కూడా పూర్తయ్యాయని, ఆగస్ట్ మొదటి వారంలో పేటీఎంతో ఒప్పందాలు ఉంటాయని తెలిపింది. 2015లో పేటీఎం బీసీసీఐతో నాలుగేళ్లకు గాను 203 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో ఆడే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. సెప్టెంబర్‌లో స్వదేశంలో భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ మాస్టర్ కార్డ్‌కు తొలి టైటిల్ స్పాన్సర్షిప్ సిరీస్ కానుంది. బీసీసీఐ-మాస్టర్ కార్డ్‌ల మధ్య ఈ ఒప్పందం 2023 మార్చి వరకు కొనసాగనుంది. చదవండి: Ind Vs WI 3rd ODI: మా గుండె పగిలింది.. కానీ ఇప్పుడు! తుది జట్లు ఇవే! -
తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్ కార్డ్స్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజటల్ స్టేట్ పార్టనర్షిప్ విషయంలో ఇరువురి మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రజలకు అత్యంగ వేగంగా డిజిటల్ సేవలు అందివ్వడానికి మాస్టర్ కార్డ్స్ తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం దోహదం చేస్తుంది. అంతే కాకుండా రైతులు, మధ్య, చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి ఉపకరిస్తుంది. సైబర్‌క్రైం, డిజిటల్ లిటరసీ విషయంలోనూ మాస్టర్‌కార్డ్స్ తెలంగాణతో కలిసి పని చేయనుంది. In line with its vision of a Digital Telangana, the Govt. of Telangana entered into an MoU with @Mastercard to formalize a Digital State Partnership. The announcement was made in the presence of Minister @KTRTRS & Mastercard VC & President Michael Froman in Davos #InvestTelangana pic.twitter.com/zHx23l3Wra — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022 చదవండి: తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్ ఫార్మా మరో రూ.500 కోట్లు.. -
నవ్వితే చాలు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయ్!
నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీతో బెన్ఫిట్స్ ఏంటంటే! ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. కేబీవీ రీసెర్చ్ ఏం చెబుతోంది 2026 నాటికి ఈ కాంటాక్ట్ లెస్ బయో మెట్రిక్ టెక్నాలజీ బిజినెస్ 18.6బిలియన్ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కేబీవీ రీసెర్చ్ తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్లు అభివృద్ధి చేశాయని తెలిపింది. చదవండి👉ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
రష్యాకు సర్ప్రైజ్ షాక్.. టెన్షన్లో పుతిన్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. దాడుల నేపథ్యంలో రష్యా బలగాలు అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు పట్టణాలు, నగరాలపై పట్టును సాధించే ప్రయత్నం చేస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రష్యన్ సైనికులు తమ దేశ ప్రజలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆరోపించారు. మరోవైపు దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో సైబర్ వార్‌ను ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. యువకులు డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో రష్యా సైతం తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య డిజిటల్ యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
అశ్లీల వేషాలు కుదరవు! బ్యాంకుల షాక్..
కంటెంట్ క్రియేషన్ కోసం స్వేచ్ఛను ఇస్తే.. కొందరు దానిని మితిమీరి ఉపయోగించుకుంటున్నారు. అశ్లీల కంటెంట్ పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రీమియం మెంబర్షిప్ వెబ్సైట్.. ‘ఓన్లీఫ్యాన్స్’ తమ అడల్ట్ క్రియేటర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై అశ్లీల కంటెంట్‌కు తమ సైట్లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అక్టోబరు 1 నుంచి యూకేకు చెందిన సబ్‌స్రి్కప్షన్ సర్వీస్.. ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్ వైడ్‌గా యూజర్లు(భారత్‌లో సుమారు మూడున్నర లక్షలు) ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం, సైట్లకు.. పేమెంట్ ద్వారా బ్యాకింగ్ పార్ట్నర్స్కు కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో డీసెంట్ సైట్‌గా పేరున్న ఓన్లీఫ్యాన్స్.. ఆ తర్వాతి కాలంలో అడల్ట్ కంటెంట్ , ఆశ్లీలతకు మధ్య సన్నని గీతను చెరిపేసింది. పూర్తి అశ్లీల వెబ్‌సైట్‌గా మారింది. దీంతో ఓన్లీఫ్యాన్స్పై విమర్శలు పెరిగాయి. త్వరలో ఇలాంటి కంటెంట్‌పై నిషేధం విధించనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని, ఈ మేరకు రాబోయే రోజుల్లో పూర్తి అప్డేట్లను యూజర్లకు అందుబాటులో ఉంచుతామని ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. కారణం ఇదే.. విచ్చలవిడిగా అశ్లీల కంటెంట్ సైట్లో కనిపిస్తుండడంపై బ్యాంకింగ్ పార్ట్నర్స్, పేఅవుట్ ప్రొవైడర్స్ ఓన్లీసైట్కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. అశ్లీల కంటెంట్‌తో పాటు యాక్టివిటీస్ కూడా ఉండకూడదని స్పష్టం చేస్తోంది. అయితే గత నెలలో ఈ చర్యల్లో భాగంగా మొదటి అడుగు వేసింది ఓన్లీఫ్యాన్స్. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ఆరోపణలపై 15 అకౌంట్లను డీయాక్టివ్ చేసింది. ఇకపై మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని యూజర్లను హెచ్చరించింది కూడా. ఇక NCOSE నైతిక విలువల పేరిట.. మాస్టర్‌కార్డ్(పేమెంట్ జరగకుండా) ఇలాంటి కంటెంట్‌ను చూడకుండా బ్యాన్ విధించింది. ‘సురకక్షితమైన పేమెంట్ కాద’ని పేర్కొంటూ.. ఓన్లీఫ్యాన్స్తో పాటు మైఫ్రీకామ్స్ ఇతరత్ర సైట్లకు వీలు లేకుండా చేసింది. నో పేమెంట్స్ మాస్టర్‌కార్డ్, వీసా ఇదివరకే పోర్న్‌హబ్‌తో డీల్ రద్దు చేసుసుకున్నాయి. కారణం.. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రొత్సహించడం. అయితే ఈ ఆరోపణలను ఖండించిన పోర్న్ హబ్.. వెరిఫై లేని యూజర్ల కంటెంట్‌ను అప్లోడ్ కానివ్వకుండా చూసుకుంటోంది. తాజాగా మాస్టర్‌కార్డ్.. ఓన్లీఫ్యాన్స్పైనా నిషేధం విధించింది. 2016 నుంచి లండన్ బేస్డ్గా పని చేస్తున్న ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌ను టిమ్ స్టోక్లే 2016లో స్థాపించాడు. మొదలట్లో కుకింగ్, ఫిట్ ద్వారా పేరు సంపాదించుకుంది. ఆపై పోర్నోగ్రఫీ ద్వారా పేరు మోసింది. సెక్స్ వర్కర్స్ వీటి ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్‌కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్ ఉందని యాక్సియోస్ సర్వే వెల్లడించింది. లియోనిడ్పై ఎఫెక్ట్ ఓన్టీఫ్యాన్ వెబ్సైట్ ద్వారా సాలీనా 300 క్రియేటర్లు మిలియన్ డాలర్ల దాకా సంపాదిస్తుంటే.. 16 వేలమంది సంవత్సరానికి కనీసం యాభై వేలు సంపాదిస్తున్నారు. ఓన్లీఫ్యాన్స్‌లో ఎక్కువ వాటా ఉక్రెయిన్-అమెరికాకు చెందిన పోర్న్ ఎంట్రప్రెన్యూర్ లియోనిడ్ రాడ్వింస్కీ పేరిట ఉంది. ఇందులో ఆయన వాటా వన్ బిలియన్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్లీ కంటెంట్ బ్యాన్.. ఈ షేర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి : Facebook Horizon Workroom: ఈ టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
బ్యాంకులకు ‘మాస్టర్’ షాక్..
న్యూఢిల్లీ: స్థానిక డేటా స్టోరేజీ నిబంధనలు పాటించనందుకు గాను పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థ మాస్టర్‌కార్డుపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించడం.. ఇతర బ్యాంకులకు సంకటంగా మారింది. మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం ఉన్న 5 ప్రైవేట్ బ్యాంకులు కొత్తగా కార్డులు జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులు సమస్యలు ఎదుర్కోనున్నాయి. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకుపైనా దీని ప్రభావం పడనుంది. తరచూ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నందున కొత్త కార్డులు (డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్) జారీ చేయకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటోంది. మరోవైపు, బ్యాంకులతో పాటు బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ కార్డు వంటి సంస్థలు కూడా సమస్యలు ఎదుర్కోనున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా నివేదిక ప్రకారం .. మాస్టర్‌కార్డ్‌పై ఎక్కువగా ఆధారపడిన ఏడు సంస్థలు కొత్త కార్డులను జారీ చేయలేకపోవచ్చు. ఇతర పేమెంట్ గేట్వేలతో ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త కార్డులు జారీ చేయడానికి కనీసం 2–3 నెలలు పట్టేస్తుందని అంచనా. టెక్నాలజీని అనుసంధానం చేసుకోవాల్సి రానుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. మూడింటిపై ఎక్కువ ప్రభావం.. ఆర్బీఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్ బజాజ్ ఫిన్సర్వ్ ప్రధానంగా కార్డుల జారీ కోసం మాస్టర్కార్డ్పైనే ఆధారపడటం వల్ల వాటిపై మరింత తీవ్ర ప్రభావం పడనుంది. ‘కో–బ్రాండ్ భాగస్వాములు సహా క్రెడిట్ కార్డుల సంస్థల్లో ఆర్బీఎల్ బ్యాంకు, యస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్పై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే వీటి కార్డ్ స్కీములన్నీ కూడా మాస్టర్కార్డ్తోనే ముడిపడి ఉన్నాయి‘ అని నొమురా నివేదికలో తెలిపింది. దీని ప్రకారం ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు జారీ చేసే కార్డుల్లో 35–40 శాతం మాస్టర్‌కార్డ్‌వి ఉంటున్నాయి. అటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో భాగమైన క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్బీఐ కార్డ్ జారీ చేసేవాటిల్లో 10 శాతం మాస్టర్‌కార్డ్‌వి ఉంటున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు పూర్తిగా వీసాకి అనుసంధానమైనది కావడంతో దానిపై ప్రభావమేమీ ఉండదు. వీసాతో ఆర్బీఎల్ ఒప్పందం.. తాజా పరిణామాల నేపథ్యంలో వీసా ప్లాట్‌ఫాంపై క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు వీసా వరల్డ్‌వైడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు 8–10 వారాలు పట్టొచ్చని, తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో కో–బ్రాండెడ్ కార్డుల స్కీములు కూడా ఉన్నాయి. -
మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏదైనా వస్తువును తాకాలంటే ఎక్కువ శాతం ప్రజలు భయపడుతున్నారు. దింతో నగదు చెల్లింపుల విషయంలో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఎటిఎంలను తాకకుండానే నగదు ఉపసంహరణ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకోని రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ఇంకా అందరికి అందుబాటులోకి రాకున్నప్పటికీ పరీక్ష దశలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ కార్డ్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్‌తో సహాయంతో పూర్తి కాంటాక్ట్‌లెస్ నగదు ఉపసంహరణను విధానాన్ని తీసుకోని రాబోతుంది. మాస్టర్ కార్డు దారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి ఎటిఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ యాప్‌లో పిన్ను నమోదు చేయాలి. తర్వాత మీరు మొబైల్ లో ఎంటర్ చేసిన మొత్తాన్ని ఎటిఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏటీఎంలలో మోసాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తన నెట్‌వర్క్‌లోని అన్ని ఎటిఎంలకు దశలవారీగా ఈ 'కాంటాక్ట్‌లెస్' క్యూఆర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. చదవండి: సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు -
వేలి ఉంగరంతోనూ చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు జేబులో పర్సు, పర్సులో డబ్బులు లేకుండా ఎలాంటి చెల్లింపులు జరిగేయి కాదు. అయితే ఎలాంటి చెల్లింపులైన జరిపేందుకు 2011లో ‘మాస్టర్ కార్డు’ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ లావా దేవీలకు సంబంధించి దాన్ని ఓ పెద్ద విప్లవంగా పేర్కొన్నారు. అప్పట్లో ఆ కార్డు కేవలం వీఐపీలకే అందుబాటులో ఉండేది. 2014లో బార్ల్కేల కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ‘ఆపిల్ పే’ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు పేటీఎం, రూపే, గూగుల్ పే ఎన్నో డబ్బు చెల్లింపు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సరికొత్తగా చొక్కా చివరన గుండీలాగా అమర్చుకునే చిప్, వేలికి ధరించే ఉంగరం, కంకణం వంటి పరికరాల చెల్లింపులు జరిపే సౌకర్యం అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపు మిషన్ వద్దకు ఈ చిప్, ఉంగరం లేదా కంకణంను తీసుకెళ్లి కావాల్సినంత చెల్లింపులు జరపవచ్చు. క్రెడిట్ కార్డుల్లాగా ఇవి పనిచేయవు. ఖాతాలో డబ్బులు ఉన్నప్పుడే పని చేస్తాయి. పైగా ఇవన్నీ యాప్‌లకు అనుసంధానించి పని చేస్తాయి. చేతికి ధరించిన కంకణం ద్వారా చెల్లింపులు జరపాలంటే బార్ల్కేల తీసుకొచ్చిన ‘పింగిట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అలాగే పనిచేసే ‘కే’ ఉంగరం నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. మూడింటిలో ఇదే ఖరీదైనది. దాదాపు 9వేల రూపాయలకు ఈ ఉంగరం, దాని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మిగతావి రెండున్నర వేల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వస్తువులు పోయినప్పుడు లేదా చోరీ అయినప్పుడు చెల్లింపులను యాప్ ద్వారా నిలిపివేయవచ్చు. 2024 సంవత్సరానికి ఇలాంటి చెల్లింపు పద్ధతులు 18 లక్షల వరకు రావచ్చన్నది ఓ అంచనా. అప్పుడు జేబులో పెన్ను, మెడలో గొలుసు, చెవి పోగులు, ముక్కు పుడక ఏ ఆభరణం రూపంలోనైనా చెల్లింపులు జరపొచ్చన్నమాట. -
మాస్టర్‌కార్డ్ కొత్త భద్రత ఫీచర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ’ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్ పార్టీ వెబ్సైట్ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20 శాతం మొబైల్ ఈ–కామర్స్ లావాదేవీలు అవాంతరాల కారణంగా విఫలమవుతున్నాయని మాస్టర్‌కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీచర్‌ను తెచ్చినట్లు వివరించారు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులకూ ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. -
ఫారిన్ కంపెనీలన్నీ ఇక్కడే స్టోర్ చేయాలి!
న్యూఢిల్లీ : స్థానికంగా డేటా స్టోర్ చేయాలంటూ... అంతర్జాతీయ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తుది గడువును ఇంకా పొడిగించే లేదంటూ కూడా ఆర్బీఐ తేల్చేసింది. ఇప్పటికే డేటాను స్థానికంగా స్టోర్ చేసుకునేందుకు కంపెనీలకు ఆరు నెలల సమయం ఇచ్చినట్టు ఆర్బీఐ సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతో నేటి నుంచే ఈ స్థానిక స్టోరేజ్ నిబంధనలను విదేశీ కంపెనీలు పాటించాల్సి వస్తోంది. అంటే గ్లోబల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీలన్నీ దేశీయ కస్టమర్ల లావాదేవీల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలి. తుది గడువును పొడిగించాలని కోరుతూ... వీసా, మాస్టర్‌కార్డు, పేపాల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఈ నెల ప్రారంభంలో కలిశారు. కానీ అప్పటికే ఆరు నెలల సమయమిచ్చిన ఆర్బీఐ, ఇక పొడిగింపు ఇవ్వనని చెప్పింది. వాట్సాప్ తాము ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలను పాటిస్తున్నట్టు పేర్కొంటోంది. భారత్‌లో పేమెంట్ సంబంధిత డేటాను స్టోర్ చేసే సిస్టమ్‌ను రూపొందించినట్టు ఈ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్‌కు భారత్‌లో 200 మిలియన్ మంది యూజర్లున్నారు. మెసేజింగ్ మాధ్యమంగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ, దేశీయ పేమెంట్ రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు పేమెంట్స్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దేశీయ కంపెనీలు ఆర్బీఐ మార్గదర్శకాలను స్వాగతిస్తున్నాయి. అయితే గ్లోబల్ కంపెనీలు మాత్రం ఆర్బీఐ మార్గదర్శకాలపై కాస్త అసంతృప్తిగానే ఉన్నాయి. స్థానిక సర్వర్లను ఇప్పడికప్పుడు ఏర్పాటు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అంటూ గ్లోబల్ కంపెనీలు భయపడుతున్నాయి. ఖర్చుల పెరుగుదలను నివారించేందుకు భారత్‌లో ఒరిజినల్ డేటాకు బదులు, మిర్రర్ డేటాను అందిస్తామని గ్లోబల్ కంపెనీలు ఇటీవల ఆర్బీఐతో జరిపిన సమావేశంలో చెప్పాయి. అయితే ఆ ప్రతిపాదనకు ఆర్బీఐ ఒప్పుకోలేదు. కచ్చితంగా డేటాను ఎండ్-టూ-ఎండ్ లావాదేవీగా అందించాలని ఆదేశించింది. పేమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకే సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయడం జరుపాలని తెలిపింది. -
బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా?
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, మునపటి కంటే అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను గత రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఈ ఏడాది పండుగ సీజన్‌ను ధూంధాంగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. తాజాగా బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను కూడా రివీల్ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాబోతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐదు రోజుల పాటు ఈ నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో మొబైల్స్, గాడ్జెట్లు, టీవీలు, అతిపెద్ద ఉపకరణాలు వంటి అన్ని ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందించనున్నట్టు చెప్పింది. ఈ ఏడాది తన కస్టమర్లకు బహుళ పేమెంట్ ఆప్షన్లపై ఆఫర్లను అందించడానికి మాస్టర్‌కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ కూడా తన ఫెస్టివ్ సీజన్ సేల్‌ను టీజ్ చేసింది. కానీ ఎప్పటి నుంచి నిర్వహించనుందో ప్రకటించలేదు. ముందస్తు సేల్స్ మాదిరిగానే ఈ సారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను దశల వారీగా నిర్వహించబోతుంది. తొలి రోజు సేల్‌లో ఫ్యాషన్, టీవీ, అప్లియెన్స్, ఫర్నీచర్, స్మార్ట్ డివైజ్‌లపై ఆఫర్లను అందించనుంది. రెండో రోజు సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ డీల్స్‌ను ఆఫర్ చేస్తుంది. చివరి మూడు రోజులు అన్ని కేటగిరీల వస్తువులపై ఆఫర్లను ప్రకటించనుంది. సాధారణంగా సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లతో పాటు, ప్రతి గంట గంటకు ఫ్లాష్ సేల్స్, ఎనిమిది గంటలకు ఒక్కసారి కొత్త కొత్త డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఫెస్టివ్ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ ఎక్కువ మొత్తంలో పేమెంట్ ఆప్షన్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు పేమెంట్ ఆఫర్లు, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులతో పాటు ఎంపిక చేసిన కార్డులకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, రూ.60వేల వరకు కార్డులెస్ పేమెంట్ వంటివి ఆఫర్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లలాగా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ముందస్తు యాక్సస్, సేల్ ప్రారంభం కావడానికి కంటే మూడు గంటల ముందే డీల్స్ యాక్సస్ లభిస్తాయి. ఫోన్‌పే యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్ల యాక్సస్ పొందుతారు. ట్రావెల్, మొబైల్ రీఛార్జ్‌లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. ఈ సేల్ కోసం సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, విరాట్ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ మరింత ప్రమోట్ చేయనుంది. Prepare for the BIG B of sales. The Big Billion Days is back 10th October. 😃 pic.twitter.com/AhLfhorKuB — Flipkart (@Flipkart) September 25, 2018 -
కార్డుల భద్రతపైనే దృష్టి
సాక్షి, అమరావతి : పెద్ద నోట్ల రద్దు తర్వాత డెబిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు 10 శాతంపైగా పెరిగినట్లు అంతర్జాతీయ పేమెంట్, టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డు చెపుతోంది. ఇప్పటీకి 95 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతుండటంతో ఇండియాకి మరిన్ని పేమెంట్ సొల్యూషన్స్ సంస్థల అవసరం ఉందని మాస్టర్ కార్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో... తాము తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇండియాలో డిజిటల్ లావాదేవీలు తదితర అంశాలను ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు... పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డు లావాదేవీలు పెరిగినట్లే పెరిగి, మళ్లీ నగదు లావాదేవీలు యథాస్థానానికి వచ్చాయని పలు సర్వేలు చెపుతున్నాయి? ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరగటం నిజం. అప్పటి వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి కొనసాగుతోంది. గతంలో డెబిట్ కార్డులను 95 శాతం ఏటీఎంల నుంచి నగదును తీసుకోవడానికే వాడేవారు. 5 శాతమే పాయింట్ ఆఫ్ సేల్ (పాస్) మెషీన్ల వద్ద స్వైప్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్‌డ్రాయల్స్ 85 శాతం లోపే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో పాస్ మెషీన్లు పెరిగాయి. అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థల ప్రవేశంతో డిజిటల్ లావాదేవీలూ పెరిగాయి. అంతెందుకు! అందరం కలిసి 40 ఏళ్లలో 15 లక్షల పాస్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తే కేవలం ఈ రెండేళ్లలో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికిది 50 లక్షలు దాటొచ్చు. ప్రభుత్వం రూపే కార్డును ప్రోత్సహిస్తుండటం, గూగుల్ పే, పేటీఎం వంటి సంస్థల ప్రవేశంతో మాస్టర్ కార్డుకు పోటీ పెరిగిందా? ప్రభుత్వం రూపే, భీమ్ యాప్, భారత్ క్యూఆర్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇవే కాక మరిన్ని పేమెంట్ సొల్యూషన్ సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. ఇవేమీ మాస్టర్‌కార్డుకు పోటీ కానే కాదు. ఇప్పటికీ దేశంలో 95 శాతం నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ లావాదేవీల విలువ 200 బిలియన్ డాలర్ల లోపే. ఇది వచ్చే ఐదేళ్ల లో ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థకు భూతం లాంటి నగదు లావాదేవీలను తరిమికొట్టడానికి మరింత మంది రావాలి. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగం గా రూపే కార్డుతో సబ్సిడీలివ్వటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది చాలామంచి పరిణామం. మాస్టర్ కార్డు అనేది ఇంటర్నేషనల్ కార్డు. ఈ కార్డు ను ప్రపంచంలో మూడు దేశాలు (ఇరాన్, నార్త్‌కొరియా, సిరియా) తప్ప అన్ని దేశాల్లో వాడొచ్చు. ఏ కార్డునైనా బ్యాంకులు జారీ చేసే అవకాశం ఉంది కనక మాకు ఇబ్బందేమీ లేదు. ఇప్పటికీ దేశీయ డెబిట్ కార్డు విభాగంలో మాది అగ్రస్థానమే. డిజిటల్ లావాదేవీలకు ఫీజులు ఇబ్బందికరమే కదా? దీన్ని గుర్తించే ప్రభుత్వం రూ.2,000 లోపు డెబిట్‌కార్డు లావాదేవీలపై ఫీజులను రద్దు చేసింది. రూ.2,000 లోపు లావాదేవీలపై మర్చెంట్ ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. మొత్తం కార్డు లావాదేవీల్లో 85 శాతం రూ.2,000 లోపు ఉండటంతో చాలామందికి ఉపయోగకరంగా ఉంది. చిన్న లావాదేవీలపై మేం కూడా 99 శాతం చార్జీలను తగ్గించాము. మరి డిజిటల్ మోసాల సంగతో..? కార్డు భద్రత చాలా ప్రధానం. గత నాలుగేళ్లలో మేం ఇందుకోసం రూ.6,800 కోట్లు ఖర్చు చేశాం. గతంలో స్వైపింగ్ కార్డు స్థానంలో చిప్ కార్డులు తేగా... ఇపుడు అంతకంటే సెక్యూరిటీతో కూడిన వైఫై (కాంటాక్ట్ లెస్) కార్డులను ప్రవేశపెట్టాం. చిప్, కాంటాక్ట్ లెస్ కార్డుల్లో టోకెనైజేషన్ టెక్నాలజీ వాడటం వల్ల మీ 16 నెంబర్ల కార్డు నెంబరు అల్గోరిథమ్‌లో 50–60 నెంబర్లుగా మారిపోతుంది. ఈ కార్డుల వివరాలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరు. వైఫై కార్డుల్లో రూ.2,000 లోపు లావాదేవీలను మూడుసార్లు వరకు ఎలాంటి పిన్ లేకుండా వాడవచ్చు. అంతకంటే ఎక్కువైతే రూ.2,000లోపు లావాదేవీ అయినా సరే పిన్ నెంబర్‌ను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డును ఎవరు దొంగిలించినా అధిక లావాదేవీలు నిర్వహించడానికి వీలుండదు. ఇకపై అన్నీ వైఫై కార్డులనే జారీ చేస్తాం. పాస్ మెషీన్లు కూడా కాన్టాక్ట్లెస్ టెక్నాలజీతోనే విడుదల చేస్తున్నాం. వాలెట్, జేబుల్లో ఉన్న కార్డుల డేటాను కూడా హ్యాక్ చేయొచ్చునంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. నిజమా? బస్సులో, షాపింగ్ మాల్స్‌లో వాలెట్ లేదా జేబును టచ్ చేయడం ద్వారా మీ కార్డులోని డేటాను మొత్తం తెలుసుకోవచ్చునంటూ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో వాస్తవం లేదు. కేవలం వాలెట్‌ను టచ్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోలేరు. దీనిపై అవగాహన కల్పించే వీడియోను రూపొ ందిస్తున్నాం. త్వరలోనే విడు దల చేస్తాం. ఇక ఏటీఎం మెషీన్లు స్కిమ్మింగ్ చేసి కొత్త కార్డులను తయారు చేయడమనేది ఆయా ఏటీఎంలు నిర్వహిస్తున్న బ్యాంకులు తీసుకునే పటిష్టమైన చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఇండియా కార్యకలాపాల్లో వృద్ధి ఎలా ఉంది? ఇక్కడ డిజిటల్ బ్యాంకింగ్‌లో అపార అవకాశాలున్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 90 శాతం లావాదేవీలు డిజిటల్లో జరుగుతుంటే ఇక్కడ 5 శాతం కూడా లేవు. అందుకే ఇండియాను ప్రధానమైన మార్కెట్‌గా చూస్తున్నాం. ఇక్కడ 2013లో 29 మందిగా ఉన్న ఉద్యోగులు ఇపుడు 2వేలు దా టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 15 శా తం మంది ఇక్కడే ఉన్నారు. ఆదాయంలో చూస్తే మూడు శాతం ఇక్కడ నుంచి వస్తోంది. కాబట్టి రా నున్న కాలంలో మరింతగా పెట్టుబడులు పెడతాం. -
అత్యుత్తమ సీఈఓల్లో మాస్టర్‌కార్డ్ బంగా
* హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రపంచ టాప్-100 జాబితాలో 64వ ర్యాంక్ * భారత్ సంతతికి చెందిన ఎకైక వ్యక్తి... న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీ సీఈఓల్లో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో బంగా 64వ స్థానంలో నిలిచారు. అంతేకాదు.. భారత్‌లో జన్మించిన సీఈఓల్లో ఆయన ఒక్కరికి మాత్రమే ఈ జాబితాలో ర్యాంకు లభించడం విశేషం. దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలు సాధించడం, వాటాదారులకు మంచి రాబడులు, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంపు వంటి నిర్దిష్ట అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకున్నట్లు హెచ్‌బీఎస్ పేర్కొంది. 2010లో మాస్టర్‌కార్డ్ పగ్గాలను చేపట్టిన బంగా.. షేర్హోల్డర్లకు 169 శాతం లాభాలను అందించారని.. అదేవిధంగా కంపెనీ మార్కెట్ క్యాప్‌ను 66 బిలియన్ డాలర్ల మేర పెంచినట్లు తెలిపింది. కాగా, ర్యాం కింగ్స్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్రీ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో గిలీడ్ సెన్సైస్ సీఈఓ జాన్ మార్టిన్, సిస్కో సిస్టమ్స్ సీఈఓ జాన్ చాంబర్స్ రెండు, మూడు ర్యాంకులను చేజిక్కించుకున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ.. * టాప్-100లో ఇద్దరు మహిళలకే చోటుదక్కింది. వెంటాస్ సీఈఓ డెబ్రా కఫారో(27), టీజేఎక్స్ చీఫ్ కరోల్ మేరోవిట్జ్(51) ఇందులో ఉన్నారు. * ర్యాంకింగ్స్‌లోని కంపెనీల్లో ఇతర దేశాలకు చెందిన సీఈఓలు 13 మంది ఉండగా.. వారిలో బంగా ఒకరు. టాప్-100 సీఈఓల్లో 29 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. 24 మందికి ఇంజినీరింగ్‌లో అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయి. * ఇంజినీరింగ్ విద్య వల్ల ప్రాక్టికల్(ఆచరణాత్మక) దృక్పథం అలవడుతుందని.. ఇది ఎలాంటి కెరీర్‌లోనైనా చోదోడుగా నిలుస్తుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా చెప్పారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన నోహ్రియా కూడా భారతీయుడే కావడం గమనార్హం.