
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, మునపటి కంటే అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను గత రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఈ ఏడాది పండుగ సీజన్‌ను ధూంధాంగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. తాజాగా బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను కూడా రివీల్ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాబోతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐదు రోజుల పాటు ఈ నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో మొబైల్స్, గాడ్జెట్లు, టీవీలు, అతిపెద్ద ఉపకరణాలు వంటి అన్ని ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందించనున్నట్టు చెప్పింది. ఈ ఏడాది తన కస్టమర్లకు బహుళ పేమెంట్ ఆప్షన్లపై ఆఫర్లను అందించడానికి మాస్టర్‌కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ కూడా తన ఫెస్టివ్ సీజన్ సేల్‌ను టీజ్ చేసింది. కానీ ఎప్పటి నుంచి నిర్వహించనుందో ప్రకటించలేదు. ముందస్తు సేల్స్ మాదిరిగానే ఈ సారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను దశల వారీగా నిర్వహించబోతుంది.
తొలి రోజు సేల్‌లో ఫ్యాషన్, టీవీ, అప్లియెన్స్, ఫర్నీచర్, స్మార్ట్ డివైజ్‌లపై ఆఫర్లను అందించనుంది. రెండో రోజు సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ డీల్స్‌ను ఆఫర్ చేస్తుంది. చివరి మూడు రోజులు అన్ని కేటగిరీల వస్తువులపై ఆఫర్లను ప్రకటించనుంది. సాధారణంగా సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లతో పాటు, ప్రతి గంట గంటకు ఫ్లాష్ సేల్స్, ఎనిమిది గంటలకు ఒక్కసారి కొత్త కొత్త డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ ఎక్కువ మొత్తంలో పేమెంట్ ఆప్షన్లను అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు పేమెంట్ ఆఫర్లు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులతో పాటు ఎంపిక చేసిన కార్డులకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, రూ.60వేల వరకు కార్డులెస్ పేమెంట్ వంటివి ఆఫర్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లలాగా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ముందస్తు యాక్సస్, సేల్ ప్రారంభం కావడానికి కంటే మూడు గంటల ముందే డీల్స్ యాక్సస్ లభిస్తాయి. ఫోన్‌పే యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్ల యాక్సస్ పొందుతారు. ట్రావెల్, మొబైల్ రీఛార్జ్‌లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. ఈ సేల్ కోసం సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, విరాట్ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ మరింత ప్రమోట్ చేయనుంది.
Prepare for the BIG B of sales. The Big Billion Days is back 10th October. 😃 pic.twitter.com/AhLfhorKuB
— Flipkart (@Flipkart) September 25, 2018
Comments
Please login to add a commentAdd a comment