
టీమిండియా టైటిల్ స్పాన్సర్ మారింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తప్పుకోవడంతో ఆ స్థానాన్ని గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. పేటీఎం అభ్యర్థన మేరకే టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ట్రాన్స్‌ఫర్ కాంట్రాక్ట్ కూడా పూర్తయ్యాయని, ఆగస్ట్ మొదటి వారంలో పేటీఎంతో ఒప్పందాలు ఉంటాయని తెలిపింది.
2015లో పేటీఎం బీసీసీఐతో నాలుగేళ్లకు గాను 203 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో ఆడే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. సెప్టెంబర్‌లో స్వదేశంలో భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ మాస్టర్ కార్డ్‌కు తొలి టైటిల్ స్పాన్సర్‌షిప్ సిరీస్ కానుంది. బీసీసీఐ-మాస్టర్ కార్డ్‌ల మధ్య ఈ ఒప్పందం 2023 మార్చి వరకు కొనసాగనుంది.
చదవండి: Ind Vs WI 3rd ODI: మా గుండె పగిలింది.. కానీ ఇప్పుడు! తుది జట్లు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment