భారత క్రికెట్‌లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ వెల్లడించాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచిన అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్‌కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.
అశ్విన్‌కు ఎంతంటే?
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కనీసం 25 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది. 2022 వరకు ఆటగాళ్లకు తక్కువ మొత్తంలో పెన్షన్ లభించేది. కానీ జూన్ 1, 2022 ఆటగాళ్ల పెన్షన్ స్కీమ్‌లో బీసీసీఐ భారీగా మార్పులు చేసింది.
ప్రస్తుత విధానం ప్రకారం.. 25 నుండి 49 మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్లందరికి ప్రతీ నెలా రూ.30 వేల పెన్షన్ లభిస్తుంది. గతంలో వారికి నెలకు 15,000 రూపంలో పెన్షన్ అందేది. అదే విధంగా 50 నుంచి 74 మ్యాచులు ఆడిన వారికి రూ.45 వేల పెన్షన్ బీసీసీఐ నుంచి అందనుంది.
75కి పైగా మ్యాచులు ఆడిన క్రికెటర్లకు ప్రతి నెలా రూ.52,500 పెన్షన్ ఇస్తారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 25 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన టెస్టు క్రికెటర్లందరికీ నెలకు రూ.70,000 పెన్షన్ లభించింది. గతంలో వీరి పింఛన్ రూ. 50,000గా ఉండేది. ఈ లెక్కన 106 టెస్టులు ఆడిన అశ్విన్‌కు రూ. 70,000 పెన్షన్ అందనుంది.
చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment