Title sponsor
-
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న మాస్టర్ కార్డ్
Mastercard Acquires Title Sponsorship Rights For All BCCI Home Matches: బీసీసీఐ ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. NEWS - Mastercard acquires title sponsorship rights for all BCCI international and domestic home matches. More details here 👇👇https://t.co/VGvWxVU9cq — BCCI (@BCCI) September 5, 2022 ఇప్పటివరకు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తప్పుకోవడంతో మాస్టర్ కార్డ్ ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. పేటీఎం అభ్యర్థన మేరకే బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించింది. ఈ డీల్‌కు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ మొత్తం పూర్తైందని బీసీసీఐ వివరించింది. కాగా, బీసీసీఐ.. 2015లో పేటీఎంతో నాలుగేళ్లకు గాను 203 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. నాటి నుంచి భారత్‌లో ఆడే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈనెల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి మాస్టర్ కార్డ్ బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. బీసీసీఐ-మాస్టర్ కార్డ్‌ల మధ్య ఒప్పందం 2023 మార్చి వరకు కొనసాగనుంది. చదవండి: టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. -
టీమిండియా టైటిల్ స్పాన్సర్ మార్పు.. కొత్త స్పాన్సర్ ఎవరంటే..?
టీమిండియా టైటిల్ స్పాన్సర్ మారింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తప్పుకోవడంతో ఆ స్థానాన్ని గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. పేటీఎం అభ్యర్థన మేరకే టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డ్‌కు మళ్లించినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్ కాంట్రాక్ట్ కూడా పూర్తయ్యాయని, ఆగస్ట్ మొదటి వారంలో పేటీఎంతో ఒప్పందాలు ఉంటాయని తెలిపింది. 2015లో పేటీఎం బీసీసీఐతో నాలుగేళ్లకు గాను 203 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో ఆడే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. సెప్టెంబర్‌లో స్వదేశంలో భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ మాస్టర్ కార్డ్‌కు తొలి టైటిల్ స్పాన్సర్షిప్ సిరీస్ కానుంది. బీసీసీఐ-మాస్టర్ కార్డ్‌ల మధ్య ఈ ఒప్పందం 2023 మార్చి వరకు కొనసాగనుంది. చదవండి: Ind Vs WI 3rd ODI: మా గుండె పగిలింది.. కానీ ఇప్పుడు! తుది జట్లు ఇవే! -
IPL 2022: ఎస్ఆర్హెచ్లో ధోని పెట్టుబడులు.. ఈ ఏడాది నుంచే షురూ..!
ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న ఎంఎస్ ధోని.. ప్రత్యర్ధి జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాడన్న వార్త ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిషేధం సమయంలో పూణేకు ఆడటం మినహా లీగ్ ఆరంభం నుంచి సీఎస్కేకు మాత్రమే ఆడుతూ వస్తున్న ధోని.. మరో జట్టులో పెట్టుబడులు పెట్టడమేంటని అతని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ధోని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎస్ఆర్హెచ్లో భాగమయ్యాడని తెలిసి అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 2015 నుంచి ‘కార్స్ 24’ అనే సంస్థలో ధోనికి పెట్టుబడులున్నాయి. ఈ సంస్థకు ధోనియే బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థే ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. దీంతో ధోని ఎస్ఆర్హెచ్లో పెట్టుబడులు పెడుతున్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా, గతేడాది ఐపీఎల్ వరకు ‘జెకె లక్ష్మీ’ సంస్థ ఎస్ఆర్హెచ్ ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎస్ఆర్హెచ్ సహా పలు జట్లు ఇదివరకు ఉన్న జెర్సీ స్పాన్పర్లను మార్చి కొత్త సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకున్నాయి. ముంబై ఇండియన్స్ సామ్‌సంగ్‌ను వదులకుని స్లైస్ వైపు మొగ్గు చూపగా, చెన్నై సూపర్‌కింగ్స్ టీవీఎస్ యూరోగ్రిప్‌తో జత కట్టింది. చదవండి: ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. విషయం తెలియక..! -
IPL 2022: ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు.. ఇకపై..!
Mumbai Indians New Title Sponsor: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ సామ్సంగ్.. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు చేసుకుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న సామ్సంగ్.. ఈ ఏడాదితో కాంట్రాక్ట్ ముగియడంతో ముంబై ఇండియన్స్‌తో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుంది. సామ్సంగ్ తప్పుకోవడంతో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఓ స్టార్టప్‌తో ముంబై ఇండియన్స్ డీల్ కుదుర్చుకుంది. మార్కెట్లో స్లైస్ కార్డ్స్(Slice Cards) పేరిట సంచలనాలను సృష్టిస్తున్న ఈ సంస్థ వచ్చే మూడేళ్ల కాలానికి ముంబైతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గాను ఆ సంస్థ ముంబై ఇండియన్స్‌కు రూ. 90 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో ఇకపై ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జెర్సీలపై సామ్సంగ్ స్థానంలో స్లైస్ కనిపించనుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న లక్నో ఫ్రాంచైజీ ‘మై11 సర్కిల్’ను టైటిల్ స్పాన్సర్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! -
వివో బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్..
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో.. తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడుతుందని ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సంస్థ వెల్లడించింది. టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ పేర్కొంది. కోహ్లి తన కాంట్రాక్ట్‌లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వివరించింది. మరో రెండు రోజుల్లో 14వ ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో.. కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వివో ప్రస్తుతం ఐపీఎల్ అఫిషియల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, చెన్నై వేదికగా ఈ నెల 9న జరుగనున్న లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లి సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. చదవండి: రోహిత్ 'ఆరే'యడం ఖాయం.. -
‘పేటీఎం’కే టైటిల్ స్పాన్సర్షిప్
ముంబై: భారత్‌లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ ‘పేటీఎం’ తిరిగి దక్కించుకుంది. స్వదేశంలో భారత జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో (టెస్టులు, వన్డేలు, టి20లు) పాటు మహిళల క్రికెట్ సహా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీలు అన్నింటికీ ‘పేటీఎం’ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుంది. స్పాన్సర్‌షిప్‌పై ‘పేటీఎం’ యాజమాన్యం వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 2019–2023 మధ్య నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందు కోసం ‘పేటీఎం’ రూ.326.80 కోట్లు చెల్లించ నుంది. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా ఒక్కో మ్యాచ్‌కు పేటీఎం రూ. 3.80 కోట్లు చెల్లిస్తుంది. గత ఏడాది రూ. 2.4 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టి20తో భారత్ స్వదేశీ సీజన్ మొదలవుతుంది. -
ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి పెప్సీ తప్పుకుంది. పెప్సీ స్థానంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ 'వివో' ముందుకొచ్చింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా పెప్సీ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 396 కోట్ల భారీ మొత్తానికి కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాలు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఇటీవల ఐపీఎల్లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో పెప్సీ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పెప్సీ కన్నా ముందుగా ఐపీఎల్‌కు డీఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 200 కోట్లకు కుదిరిన డీఎల్ఎఫ్ ఒప్పందం 2008 నుంచి 2012 వరకు కొనసాగింది. ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పెప్పీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడం చాలా చిన్న విషయం అన్నారు. ఈ ఘటన ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. పెప్సీతో తమ అనుబంధం చక్కగా కొనసాగిందని, సామరస్య పూర్వకమైన చర్చలతో ఈ వ్యవహారం ముగుస్తుందని ప్రకటించారు. రెండు సంవత్సరాలకు టైటిల్ స్పాన్సర్‌గా ఇప్పటికే చైనా కంపెనీ వివోతో ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సీ ఒప్పందానికి వర్తించిన నియమనిబంధనలే ఈ డీల్ కు కూడా వర్తిస్తాయని ప్రకటించింది. 2013లో వెలుగుచూసిన అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఐపీఎల్ ప్రతిష్ఠ మసకబారింది. తాజాగా స్పాట్ ఫిక్సింగ్పై జస్టిస్ లోథా కమిటి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధించడంతో పెప్సీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
బీసీసీఐకి స్పాన్సర్లు కావలెను
ముంబై: భారత్‌లో జరిగే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్టెల్ తన కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. ఫలితంగా ఇప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం ఈ ఏడాది మార్చి 31నే ముగిసింది. అయితే పునరాలోచించుకునేందుకు బోర్డు మరో మూడు నెలల అదనపు సమయం ఇచ్చినా ఎయిర్టెల్ ఆసక్తి కనబర్చలేదు. 31 నెలల కాలానికిగాను ఈ టెలికాం సంస్థ ప్రతీ మ్యాచ్‌కు రూ. 3.33 కోట్ల చొప్పున చెల్లించింది. కొత్త స్పాన్సర్షిప్ కోసం టెండర్ డాక్యుమెంట్ ఖరారు చేసేందుకు ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని బోర్డు మార్కెటింగ్ కమిటీ గురువారం సమావేశం కానుంది. అయితే సహారా తప్పుకున్నందున టీమ్ స్పాన్సర్‌షిప్‌పై ఎయిర్ టెల్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆధునిక పరిజ్ఞానంతో కొత్త జెర్సీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా భారత్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దీనిని చాలా ఆదునిక పరిజ్ఞానంతో రూపొందించారు. 100 శాతం రీసైకిల్డ్ పాలిస్టర్‌తో తొలిసారి ఈ తరహా జెర్సీ తయారు కావడం విశేషం. భుజాలపై చక్కటి డిజైన్‌తో పాటు తేలిగ్గా, చెమట పట్టకుండా, చల్లగా ఉంటూ క్రికెటర్లకు మరింత సౌకర్యవంతంగా జెర్సీ ఉంటుందని జట్టు కిట్ స్పాన్సర్ నైకీ తెలిపింది. దీనిని రూపొందించడంలో ఆటగాళ్ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దక్షిణాఫ్రికా పర్యటనపై చర్చించలేదు: పటేల్ దక్షిణాఫ్రికా పర్యటనపై భారత క్రికెట్ బోర్డు దోబూచులాట ఇంకా కొనసాగుతోంది. దుబాయ్‌లో దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓ లొర్గాట్, బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మధ్య భేటీతో పరిస్థితి చక్కబడిందనుకున్న తరుణంలో పటేల్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అసలు తమ మధ్య దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించి ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.