IPL 2022: ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు.. ఇకపై..! | IPL 2022: Samsung Closes Deal With Mumbai Indians, Slice Cards Replaces | Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు.. ఇకపై..!

Published Thu, Jan 20 2022 1:19 PM | Last Updated on Thu, Jan 20 2022 1:22 PM

IPL 2022: Samsung Closes Deal With Mumbai Indians, Slice Cards Replaces - Sakshi

Mumbai Indians New Title Sponsor: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ సామ్సంగ్.. ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌తో తెగదెంపులు చేసుకుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న సామ్సంగ్‌.. ఈ ఏడాదితో కాంట్రాక్ట్‌ ముగియడంతో ముంబై ఇండియన్స్‌తో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుంది. సామ్సంగ్‌ తప్పుకోవడంతో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఓ స్టార్టప్‌తో ముంబై ఇండియన్స్‌ డీల్‌ కుదుర్చుకుంది. 

మార్కెట్‌లో స్లైస్‌ కార్డ్స్‌(Slice Cards) పేరిట సంచలనాలను సృష్టిస్తున్న ఈ సంస్థ వచ్చే మూడేళ్ల కాలానికి ముంబైతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గాను ఆ సంస్థ ముంబై ఇండియన్స్‌కు రూ. 90 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో ఇకపై ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జెర్సీలపై సామ్సంగ్ స్థానంలో స్లైస్ కనిపించనుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న లక్నో ఫ్రాంచైజీ ‘మై11  సర్కిల్’ను టైటిల్ స్పాన్సర్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. 
చదవండి: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement