ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత జట్టుకు మరో కఠిన సవాలు ఎదురు కానుంది. పాకిస్తాన్, యూఈఏ వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గోనేందుకు టీమిండియా సిద్దం కానుంది.
50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా రన్నరప్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి షూరూ కానుంది. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.
ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
ఈ మెగా ఈవెంట్‌లో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఐసీసీ నిర్దేశించిన గడువుకు ఒక రోజు ముందు (జనవరి 11)న భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినవెంటనే జట్టు ఎంపికకు కసరత్తులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకేసారి భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అయ్యర్‌కు ఛాన్స్
కాగా ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదే విధంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మహ్మద్ షమీ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు స్వదేశంలో జరగనున్న ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లతో షమీ పునరాగమనం చేసే అవకాశముంది.
ఇంగ్లీష్ జట్టుతో టీ20 లేదా వన్డే సిరీస్‌కు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సైతం సెలక్టర్లు తిరిగి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లను అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment