న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 300 కొత్త శాఖలను తెరవనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా 22,405 శాఖలు ఉన్నాయి. అలాగే, 235 విదేశీ శాఖలు సైతం పనిచేస్తున్నాయి.
ఒకవైపు డిజిటల్‌గా విస్తరిస్తూనే, మరోవైపు అవసరమున్న చోట భౌతికంగా శాఖలను ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. అలాగే, బిజినెస్ కరస్పాడెంట్ల విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు ప్రకటించారు.
‘‘కస్టమర్లకు ఏమి కావాలన్నది మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా వాహకాలను ఏర్పాటు చేసి వారికి సేవలు అందించే చర్యలు తీసుకుంటున్నాం. మాకు ఇప్పటికే ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఫలితాలను రాబడుతున్నాం’’అని ఖరా ప్రకటించారు. నికర వడ్డీ మార్జిన్ గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.5 శాతంగా ఉంటుందన్నారు. జూన్ త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.16,884 కోట్ల లాభాన్ని ప్రటించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment