ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫారసు చేసింది. ఈ పదవి కోసం ప్యానల్ ముగ్గురుని ఇంటర్వ్యూ చేసి చల్లాను ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. పనితీరును దృష్టిలో ఉంచుకుని ఈయన పెరుగు ప్రతిపాదించినట్లు ఎఫ్ఎస్ఐబీ పేర్కొంది.
ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ప్రతిపాదించినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత ఛైర్మన్‌గా ఎవరనేది అధికారికంగా వెలువడుతుంది.
Recommendation for the position of Chairman in State Bank of India. Official Announcement onhttps://t.co/AEcyakCCQ9 pic.twitter.com/29NdHpGjAL
— Financial Services Institutions Bureau (@FSI_Bureau) June 29, 2024
ప్రస్తుతం ఎస్‌బీఐ ఛైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2020 అక్టోబర్ 7న ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అయితే ఈయన పదవీకాలం గత ఏడాది అక్టోబర్‌లోనే ముగిసింది. కానీ కేంద్రం మళ్ళీ మళ్ళీ పొడిగించింది. కాగా ఈయన ఆగష్టు 28వరకు ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తరువాత ఈ స్థానంలోకి కొత్త ఛైర్మన్ వస్తారు.
ఇక చల్లా శ్రీనివాసులు శెట్టి విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుత గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. అక్కడే ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత హైస్కూల్, ఇంటర్మీడియట్ గద్వాల్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఈయన 1988లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా తన వృత్తి ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో ఈయనకు సుమారు 36 సంవత్సరాలు అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment