ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే! | Home, office, side by side ..! | Sakshi
Sakshi News home page

ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే!

Published Sat, Mar 7 2015 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే!

ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే!

- ఇంటి దగ్గరే విద్య, వైద్య, వాణిజ్య సంస్థలు, పార్కులూ ఉండాలంటున్న కొనుగోలుదారులు
- దీంతో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌ల వైపే మొగ్గు చూపుతున్న బిల్డర్లు

సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంటి పక్కనే ఆఫీసు. కాలుష్యం, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా రోజూ నడుచుకుంటూ వెళ్లొచ్చు. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేసేందుకు షాపింగ్ మాల్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లుండాలి. అవి కూడా ఇంటిదగ్గర్లోనే. విద్య, వైద్య సదుపాయాలూ ఉండాల్సిందే.

అవి కూడా చేరువలోనే’’ ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటాయా? అది కూడా కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో. కానీ, ఇలాంటి ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లే కావాలంటున్నారు కొనుగోలుదారులు. ఇంకేం మరి బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి  కొన్ని నగరాలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు భాగ్యనగరానికీ వచ్చేశాయి.
 
వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి. నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చ్యూన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు.

ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్‌లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతున్న శ్రీశైలం హైవేలో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామన్నారు. ఈ రోడ్‌లో 3 వేల ఎకరాల్లో హార్డ్‌వేర్ పార్క్, వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ పార్కులు, 5 కి.మీ. దూరంలో ఉన్న ఆదిభట్లలోని ఏరోస్పేస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయి. మహేశ్వరంలో ఫ్యాబ్‌సిటీ, ముచ్చర్లలో ఫార్మాసిటీలు కూడా రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తక్కువలో తక్కువగా 40-50 వేల ఉద్యోగులు రానున్నారు. వీరందరికీ నివాస సముదాయాలే కాదు వాణిజ్య, నిత్యావసరాలూ కావాలి. అందుకే ఈ ప్రాంతంలో 3,600 ఎకరాల్లో బటర్ ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.
 
నగరం చుట్టూ..

గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకూ ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో  వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా.
 
3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ!

ఫ్లాట్లు అమ్మేశామా.. చేతులు దులుపుకున్నామా అన్న రీతిలో కాకుండా కొనుగోలుదారులకు ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కందుకూరు మండలంలోని కర్తాల్ గ్రామంలో 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని సంస్థ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. ప్రాజెక్ట్ మొత్తాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసి సరికొత్త నగరంగా రూపుదిద్దుతాం.
3 వేల ఎకరాల్లో రెసిడెన్షియల్, 600 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లొస్తాయి. ప్రస్తుతం నివాస సముదాయాలను విక్రయిస్తున్నాం. 50 ఎకరాలు డాక్టర్స్ కాలనీ, 150 ఎకరాలు టెమ్స్-1,2, 50 ఎకరాలు క్లౌడ్ పార్క్, 500 ఎకరాలు ఎన్నారై టౌన్‌షిప్, 1,000 ఎకరాలు ఎవరెస్ట్, 200 ఎకరాలు వీకెండ్ హోమ్స్‌లకు కేటాయించాం.
ఎన్నారై టౌన్‌షిప్‌లో 500 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.3,500. ఎవరెస్ట్‌లో 200, 267, 300, 400 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.2,200. వీకెండ్ హోమ్స్‌లో 800 విల్లాలుంటాయి. 1,200 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉండే ఒక్కో విల్లా ధర రూ.40 లక్షలు.
వచ్చే జూలైలో కమర్షియల్ ప్రాజెక్ట్‌నూ మార్కెట్‌లోకి తీసుకొస్తాం. ఇందులో విద్యా, వైద్య సంస్థలు, షాపింగ్ మాల్స్, క్రీడా మైదానాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్.. ఇలా ప్రతీ విభాగానికి కొంత స్థలాన్ని కేటాయిస్తాం. అయితే ఆయా విభాగాన్ని ఏదో అమ్మేశాం అన్న రీతిలో కాకుండా అంతర్జాతీయ సంస్థలతో కలసి జాయింట్ వెంచర్‌గా చేపడతాం. విద్యుత్ సమస్యేమీ లేకుండా సొంతంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ కేంద్రాన్ని కూడా నెలకొల్పుతున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement