Commercial organizations
-
కోహ్లి బ్రాండ్ @రూ.1200కోట్లు
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది దేశంలో ‘మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్’గా నిలిచాడు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ సలహాదారు సంస్థ ‘డఫ్ అండ్ ఫెల్ఫస్’ తాజా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్ విలువ ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్ అగ్రస్థానం మరింత పదిలమైంది. కోహ్లి గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ రూ.718 కోట్ల (102.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ (రూ.473 కోట్లు), రణ్వీర్ సింగ్ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. -
ఖాదీ డెనిమ్ డిజైనర్ వేర్స్
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ మంగళవారం ఖాదీ డెనిమ్ డిజైనర్ దుస్తులను ఆవిష్కరించింది. యువజనులను ఆకర్షించేలా డెనిమ్ జీన్స్, జాకెట్లు, స్కర్ట్లు, బ్యాగ్‌లను నిఫ్ట్ విద్యార్ధులు, ఇతర ప్రముఖ డిజైనర్లు రూపొందించారని పేర్కొం ది. ఖాదీ షాప్‌ల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించింది. -
‘ప్రచారానికి’ గ్రీన్ సిగ్నల్..?
సాక్షి, ముంబై: వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫ్లెక్సీల ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కార్పొరేటర్ల సూచనలతో మెట్రో, మోనో రైలు మార్గం పిల్లర్లపై బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తే బీఎంసీ ఖజానాకి అదనపు ఆదాయం వస్తుందని వారు భావిస్తున్నట్లు తెలిసింది. బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసే వాణిజ్య ప్రకటనలు, నాయకుల పుట్టిన రోజు వేడుకల ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులను బీఎంసీ నిషేధించింది. దీంతో వాణిజ్య, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు మెట్రో, మోనో రైల్వే మార్గం లోని పిల్లర్లపై దృష్టి సారించాయి. ఇప్పటికే అక్రమంగా పిల్లర్లపై హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో బీఎంసీకి రావల్సిన అదనపు ఆదాయానికి గండిపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేటర్లు బ్యానర్లకు అధికారికంగా అనుమతినిచ్చి ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని బీఎంసీ పరిపాలన విభాగానికి సూచించారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగులే.. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల వల్ల నగరం విృతంగా మారిపోయింది. దీంతో చేసేది లేక బ్యానర్ల ఏర్పాటును బీఎంసీ నిషేధించింది. అనుమతి పొందిన వారు రుసుం చెల్లించి, నియమాలకు లోబడి పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించాల్సి వస్తుందని అనేక వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు మెట్రో రైల్వే పిల్లర్లను ఆశ్రయించడం మొదలు పెట్టాయి. అధికారికంగా బ్యానర్లు హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటు సంబంధించిన ప్రక్రియను ఏదైనా సంస్థకు కాంట్రాక్టుకు ఇవ్వాలని కార్పొరేటర్లు బీఎంసీ పరిపాలనా విభాగానికి సూచించారు. ఈ ప్రతిపాదనకు బీఎంసీ సభలో మంజూరు లభించగానే అమలు చేయనున్నట్లు సమాచారం. -
ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే!
- ఇంటి దగ్గరే విద్య, వైద్య, వాణిజ్య సంస్థలు, పార్కులూ ఉండాలంటున్న కొనుగోలుదారులు - దీంతో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌ల వైపే మొగ్గు చూపుతున్న బిల్డర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంటి పక్కనే ఆఫీసు. కాలుష్యం, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా రోజూ నడుచుకుంటూ వెళ్లొచ్చు. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేసేందుకు షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్లుండాలి. అవి కూడా ఇంటిదగ్గర్లోనే. విద్య, వైద్య సదుపాయాలూ ఉండాల్సిందే. అవి కూడా చేరువలోనే’’ ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటాయా? అది కూడా కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో. కానీ, ఇలాంటి ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లే కావాలంటున్నారు కొనుగోలుదారులు. ఇంకేం మరి బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి కొన్ని నగరాలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు భాగ్యనగరానికీ వచ్చేశాయి. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి. నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతున్న శ్రీశైలం హైవేలో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామన్నారు. ఈ రోడ్లో 3 వేల ఎకరాల్లో హార్డ్‌వేర్ పార్క్, వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ పార్కులు, 5 కి.మీ. దూరంలో ఉన్న ఆదిభట్లలోని ఏరోస్పేస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయి. మహేశ్వరంలో ఫ్యాబ్‌సిటీ, ముచ్చర్లలో ఫార్మాసిటీలు కూడా రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తక్కువలో తక్కువగా 40-50 వేల ఉద్యోగులు రానున్నారు. వీరందరికీ నివాస సముదాయాలే కాదు వాణిజ్య, నిత్యావసరాలూ కావాలి. అందుకే ఈ ప్రాంతంలో 3,600 ఎకరాల్లో బటర్ ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. నగరం చుట్టూ.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకూ ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా. 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ! ఫ్లాట్లు అమ్మేశామా.. చేతులు దులుపుకున్నామా అన్న రీతిలో కాకుండా కొనుగోలుదారులకు ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కందుకూరు మండలంలోని కర్తాల్ గ్రామంలో 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని సంస్థ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. ప్రాజెక్ట్ మొత్తాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసి సరికొత్త నగరంగా రూపుదిద్దుతాం. ⇒ 3 వేల ఎకరాల్లో రెసిడెన్షియల్, 600 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్లొస్తాయి. ప్రస్తుతం నివాస సముదాయాలను విక్రయిస్తున్నాం. 50 ఎకరాలు డాక్టర్స్ కాలనీ, 150 ఎకరాలు టెమ్స్-1,2, 50 ఎకరాలు క్లౌడ్ పార్క్, 500 ఎకరాలు ఎన్నారై టౌన్షిప్, 1,000 ఎకరాలు ఎవరెస్ట్, 200 ఎకరాలు వీకెండ్ హోమ్స్‌లకు కేటాయించాం. ⇒ ఎన్నారై టౌన్షిప్లో 500 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.3,500. ఎవరెస్ట్‌లో 200, 267, 300, 400 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.2,200. వీకెండ్ హోమ్స్‌లో 800 విల్లాలుంటాయి. 1,200 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉండే ఒక్కో విల్లా ధర రూ.40 లక్షలు. ⇒ వచ్చే జూలైలో కమర్షియల్ ప్రాజెక్ట్‌నూ మార్కెట్లోకి తీసుకొస్తాం. ఇందులో విద్యా, వైద్య సంస్థలు, షాపింగ్ మాల్స్, క్రీడా మైదానాలు, అమ్యూజ్మెంట్ పార్క్.. ఇలా ప్రతీ విభాగానికి కొంత స్థలాన్ని కేటాయిస్తాం. అయితే ఆయా విభాగాన్ని ఏదో అమ్మేశాం అన్న రీతిలో కాకుండా అంతర్జాతీయ సంస్థలతో కలసి జాయింట్ వెంచర్‌గా చేపడతాం. విద్యుత్ సమస్యేమీ లేకుండా సొంతంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ కేంద్రాన్ని కూడా నెలకొల్పుతున్నాం. -
బంద్ సంపూర్ణం
ఎన్జీవోల మద్దతు స్తంభించిన జనజీవనం రోడ్డెక్కని బస్సులు మూతపడిన కార్యాలయాలు, వాణిజ్యసంస్థలు తిరుపతిలో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం సాక్షి, చిత్తూరు: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బంద్ విజయవంతమైంది. ఎన్జీవోలూ మద్దతు ప్రకటించడంతో జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించింది. వాణిజ్య సంస్థలు, సినీ థియేటర్లు, హోటళ్లు మూతపడ్డాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు ఏ ఒక్క డిపోలోనూ రోడ్డెక్కలేదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, పుత్తూరులో పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, సత్యవేడులో సమన్వయకర్త ఆదిమూలం బంద్‌ను పర్యవేక్షించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో జాతీయ రహదారి దిగ్బంధనంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరులో రాస్తారోకోకు సమన్వయకర్త ఏఎస్.మనోహర్, మదనపల్లెలో రాస్తారోకోకు సమన్వయకర్త షమీమ్ అస్లాం నాయకత్వం వహించారు. తిరుపతిలో ఉదయం ఆరు గంటల నుంచే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభం సర్కిల్ వద్ద రోడ్డును దిగ్బం ధించారు. నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే స్వయంగా బంద్‌ను పర్యవేక్షించడంతో కార్యకర్తలు వందలాది మంది సమైక్యాంధ్ర నినాదాలతో ముందుకు కదిలారు. రమణమ్మ, గీత అనే మహిళా కార్యకర్తలు శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వీరిని పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థులు ఒక హోటల్ పైకి ఎక్కి దూకేందుకు యత్నించగా పోలీసులు నచ్చజెప్పి కిందకు దించారు. పూర్ణకుంభం సర్కిల్ వద్ద పెద్ద చెక్కమొద్దులు మంటేసి వాహనాలు పోకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో ఉదయం 5.30 నుంచి సా యంత్రం 4 గంటల వరకు బంద్ నిర్వహిం చారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ను జయప్రదం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అన్ని జేఏసీలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నా యి. వాణిజ్య సంస్థలు, హోటళ్లు, థియేటర్లు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచి పోయాయి. సోనియా పశ్చాత్తాపం చెంది విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, ఏటీఎం సర్కిల్, చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అన్ని రోడ్లలో రాళ్లు అడ్డుగా పెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. బంద్‌లో ఎన్జీవోలు పాల్గొన్నారు. చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అనంతరం మోటార్‌బైక్ ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో దర్గా సర్కిల్లో మహిళలు నిరసన తెలిపారు. అక్కడ నుంచి ఆర్టీసీ డిపోకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కుప్పంలో బంద్ విజయవంతమైంది. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో బంద్ పాటించారు. అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు, దుకాణాలు మూతపడ్డాయి. శాంతిపురం జాతీయ రహదారి దిగ్బంధించారు. ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పీలేరులో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పుత్తూరులో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నారాయణస్వామి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్‌కు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు మద్దతు ప్రకటించి ర్యాలీ చేపట్టారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బి.కొత్తకోట, కురబలకోట, తం బళ్లపల్లె, ములకచెరువు మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అంగళ్లు వద్ద జరిగిన జాతీయ రహదారి దిగ్బంధనంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో సమన్వయకర్త ఆదిమూలం, కార్మికవర్గ జిల్లా అధ్యక్షుడు బీరేంద్రవర్మ, రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. గాంధీరోడ్, నేతాజీరోడ్లలో దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. మదనపల్లెలో పార్టీ సమన్వయకర్త షమీం అస్లాం, మైనారిటీ నాయకుడు పీఎస్.ఖాన్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు గుమ్మడి బాలక్రిష్ణ, మిద్దెలహరి, సిరాజ్‌బాషా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, పెండ్లి మండపం, సూపర్‌బజార్ సర్కిళ్లలో రాస్తారోకోలు నిర్వహించారు. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూ రు, పాలసముద్రం, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్ఆర్.పురం మండలాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళెం మండలంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోనూ బంద్ విజ యవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.