బంద్ సంపూర్ణం | Complete shutdown | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Sat, Feb 15 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

Complete shutdown

  •     ఎన్‌జీవోల మద్దతు
  •      స్తంభించిన జనజీవనం
  •      రోడ్డెక్కని బస్సులు
  •      మూతపడిన కార్యాలయాలు, వాణిజ్యసంస్థలు
  •      తిరుపతిలో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
  •  సాక్షి, చిత్తూరు: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బంద్ విజయవంతమైంది.  ఎన్‌జీవోలూ మద్దతు ప్రకటించడంతో జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించింది. వాణిజ్య సంస్థలు, సినీ థియేటర్లు, హోటళ్లు మూతపడ్డాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆర్‌టీసీ బస్సులు ఏ ఒక్క డిపోలోనూ రోడ్డెక్కలేదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

    పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, పుత్తూరులో పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, సత్యవేడులో సమన్వయకర్త ఆదిమూలం బంద్‌ను పర్యవేక్షించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో జాతీయ రహదారి దిగ్బంధనంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరులో రాస్తారోకోకు సమన్వయకర్త ఏఎస్.మనోహర్, మదనపల్లెలో రాస్తారోకోకు సమన్వయకర్త షమీమ్ అస్లాం నాయకత్వం వహించారు.
     
    తిరుపతిలో ఉదయం ఆరు గంటల నుంచే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభం సర్కిల్ వద్ద రోడ్డును దిగ్బం ధించారు. నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే స్వయంగా బంద్‌ను పర్యవేక్షించడంతో కార్యకర్తలు వందలాది మంది సమైక్యాంధ్ర నినాదాలతో ముందుకు కదిలారు. రమణమ్మ, గీత అనే మహిళా కార్యకర్తలు శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వీరిని పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థులు ఒక హోటల్ పైకి ఎక్కి దూకేందుకు యత్నించగా పోలీసులు నచ్చజెప్పి కిందకు దించారు. పూర్ణకుంభం సర్కిల్ వద్ద పెద్ద చెక్కమొద్దులు మంటేసి వాహనాలు పోకుండా అడ్డుకున్నారు.
     
    పుంగనూరులో ఉదయం 5.30 నుంచి సా యంత్రం 4 గంటల వరకు బంద్ నిర్వహిం చారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ను జయప్రదం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అన్ని జేఏసీలు వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నా యి. వాణిజ్య సంస్థలు, హోటళ్లు, థియేటర్లు మూతపడ్డాయి. ఆర్‌టీసీ బస్సుల రాకపోకలు నిలిచి పోయాయి. సోనియా పశ్చాత్తాపం చెంది విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
     
     పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, ఏటీఎం సర్కిల్, చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అన్ని రోడ్లలో రాళ్లు అడ్డుగా పెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. బంద్‌లో ఎన్‌జీవోలు పాల్గొన్నారు.
     
     చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అనంతరం మోటార్‌బైక్ ర్యాలీ చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో దర్గా సర్కిల్‌లో మహిళలు నిరసన తెలిపారు. అక్కడ నుంచి ఆర్‌టీసీ డిపోకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
     
     కుప్పంలో బంద్ విజయవంతమైంది. నియోజకవర్గ సమన్వయకర్త ఎం.సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో బంద్ పాటించారు. అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు, దుకాణాలు మూతపడ్డాయి. శాంతిపురం జాతీయ రహదారి దిగ్బంధించారు. ఆర్‌టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
     
     పీలేరులో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
     
     పుత్తూరులో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నారాయణస్వామి కార్యకర్తలతో కలిసి ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్‌కు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు మద్దతు ప్రకటించి ర్యాలీ చేపట్టారు.
     
     తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో బి.కొత్తకోట, కురబలకోట, తం బళ్లపల్లె, ములకచెరువు మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అంగళ్లు వద్ద జరిగిన జాతీయ రహదారి దిగ్బంధనంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
     
     సత్యవేడు నియోజకవర్గంలో సమన్వయకర్త ఆదిమూలం, కార్మికవర్గ జిల్లా అధ్యక్షుడు బీరేంద్రవర్మ, రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. గాంధీరోడ్, నేతాజీరోడ్లలో దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
     
     మదనపల్లెలో పార్టీ సమన్వయకర్త షమీం అస్లాం, మైనారిటీ నాయకుడు పీఎస్.ఖాన్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఏపీ ఎన్‌జీవోలు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.
     
     శ్రీకాళహస్తిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు గుమ్మడి బాలక్రిష్ణ, మిద్దెలహరి, సిరాజ్‌బాషా ఆధ్వర్యంలో ఆర్‌టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, పెండ్లి మండపం, సూపర్‌బజార్ సర్కిళ్లలో రాస్తారోకోలు నిర్వహించారు. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
     
     జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూ రు, పాలసముద్రం, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్‌ఆర్.పురం మండలాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
     
     పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళెం మండలంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
     
     చంద్రగిరి నియోజకవర్గంలోనూ బంద్ విజ యవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement