ఉద్యోగులను వేధిస్తున్నారు
దీనివల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది
ఏపీఆర్‌ఏస్‌ఏ రాష్ట్ర అ«ధ్యక్షుడు బొప్పరాజు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దీనిపై వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ప్రమాదమా? అనేది తేల్చలేదని ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై నేటికీ సీఐడీ విచారణ కొనసాగుతోందని... ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో వాస్తవాలు ఇంకా నిరా్ధరణ కాలేదు.
ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనికిరాని కాగితాలను తీసివేస్తే.. వెంటనే ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగలపెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే మీడియా ప్రసారం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పనిచేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
తహసీల్దార్ కార్యాలయాల్లో రోజువారీ ఖర్చులకు కూడా నిధుల్లేవు. ప్రభుత్వం ఆదేశాలిస్తుంది గానీ నిధులివ్వట్లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో అద్దె వాహనాలకు కూడా నిధులు లేవు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ తదితరాలకు నిధులివ్వకపోవడంతో.. సిబ్బంది జీతాల నుంచే ఖర్చు పెడుతున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీఆర్‌ఎస్‌ఏ ప్రధాన కార్యదర్శిగా రామిశెట్టి వెంకట రాజేశ్‌ను ఎన్నుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment