bopparaju venkateswarlu
-
ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దీనిపై వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ప్రమాదమా? అనేది తేల్చలేదని ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై నేటికీ సీఐడీ విచారణ కొనసాగుతోందని... ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో వాస్తవాలు ఇంకా నిరా్ధరణ కాలేదు.ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనికిరాని కాగితాలను తీసివేస్తే.. వెంటనే ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగలపెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే మీడియా ప్రసారం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పనిచేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.తహసీల్దార్ కార్యాలయాల్లో రోజువారీ ఖర్చులకు కూడా నిధుల్లేవు. ప్రభుత్వం ఆదేశాలిస్తుంది గానీ నిధులివ్వట్లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో అద్దె వాహనాలకు కూడా నిధులు లేవు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితరాలకు నిధులివ్వకపోవడంతో.. సిబ్బంది జీతాల నుంచే ఖర్చు పెడుతున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శిగా రామిశెట్టి వెంకట రాజేశ్‌ను ఎన్నుకున్నట్లు చెప్పారు. -
ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదు: బొప్పరాజు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. కాగా, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు. 30 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ క్రమబద్దీకరణ చేశారు. జీపీఎస్ విధానం పాత పెన్షన్ విధానానికి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘కన్నా లక్ష్మీనారాయణ నీ చరిత్ర నాకు తెలుసు..’ -
తెలంగాణలో జీతాలు పెంచాలని ఉద్యోగులు రోడెక్కారు : బొప్పరాజు
-
సీఎం జగన్ స్పష్టంగా చెప్పిన మాటలు: ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
సీఎం హామీ ఇచ్చిన తర్వాత నిరసనలెందుకు?
అమలాపురం టౌన్: పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్ తెలిపారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకుంటున్న రెండు జేఏసీల నిరసనల్లో రెవెన్యూ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదన్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వీఎస్ దివాకర్ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీ గ్రామ సహాయకుల సంఘం, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ తహసీల్దార్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్లు జేఏసీల నిరసనల్లో పాల్గొనడం లేదని చెప్పారు. జేఏసీల చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెనుక రెవెన్యూ ఉద్యోగులెవరూ లేరన్నారు. పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణలోకి దిగడమేమిటని ప్రశ్నించారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. 2019 ఎన్నికలప్పుడు రాష్ట్ర సచివాలయం నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు తహసీల్దార్లకు ఫోన్లుచేసి టీడీపీకి ఓటు వేయించాలంటూ ఆదేశాలిచ్చారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ డైరీలో బొప్పరాజుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు రాసి ఉందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణాల కోసం చేసిన వసూళ్లపైనా బొప్పరాజు సమాధానం చెప్పాలన్నారు. సీఎంపై ఉద్యోగులకు నమ్మకముంది ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారని నమ్ముతున్నట్లు ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల వరద ప్రాంతాల పర్యటన సందర్భంగా కలసిన ఉద్యోగులకు సీఎం పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడాన్ని గమనించాలన్నారు. -
నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసిన ఏపీఆర్ఎస్ఏ నేతలు
సాక్షి, అమరావతి: 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసి ఏపీఆర్ఎస్ఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ‘30-35 ఏళ్లపాటు రెవెన్యూశాఖలో ఉద్యోగులు సుదీర్ఘమైన సేవలందిస్తారని.. తహశీల్దార్‌గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేయడం ఉద్యోగి కల’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అటువంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని బొప్పరాజు అన్నారు. -
నిమ్మగడ్డకు ఉద్యోగుల ప్రాణాలు పట్టవా?
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ నిమ్మగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని, ఎస్ఈసీకి ఉద్యోగుల ప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వ్యాక్సినేషన్ పంపిణీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. నిమ్మగడ్డ పునరాలోచించి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ( ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ దుర్మార్గంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేమని ఉద్యోగులు చెప్తున్నారు.. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నిమ్మగడ్డ నిర్ణయం సరికాదు’’ అన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. ‘‘ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదు. చంద్రబాబు చెప్పిందే నిమ్మగడ్డ చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంతో ప్రజలు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు’’ అన్నారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘కరోనా బారిన పడి 109 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహిస్తే మంచిది’’ అని అన్నారు. -
కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పెరిగిన జనాభా, పనిభారం ప్రాతిపదికగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీఆర్ఎస్ఏ కొత్త కార్యవర్గ ప్రతినిధులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యద్భుతంగా ఏర్పాటు చేశారంటూ అభినందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటే కొత్త మండలాల విషయం పరిశీలించాలని సీఎంకు వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూయేతర పనులు రెవెన్యూ ఉద్యోగులకు అప్పగించకుండా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఉద్యోగుల సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి పరిష్కార చర్యలు తీసుకోవాలని తన అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డికి సూచించారని బొప్పరాజు తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురి, ఏపీజేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ వైవీరావు సీఎంను కలిశారు. -
‘ఈనాడు ఇటువంటి వార్తలు రాయడం బాధాకరం’
సాక్షి, విజయవాడ: ఈనాడు లాంటి పత్రిక ఇటువంటి వార్తలు రాయడం బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలని ఈనాడులో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈనాడుతో పాటు మరో పత్రిక కూడా 5వ తేదీ వరకు జీతాలు రావడం లేదని రాసింది.. కానీ ఉద్యోగుల జీతాలు 3వ తేదీనే వచ్చాయని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయడాన్ని వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. ఉద్యోగులను, పెన్షన్ దారులను కొన్ని పత్రికలు తప్పు తోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో చులకన కావద్దని సూచించారు. 3 లక్షల 70 వేల మంది పింఛన్ దారుల్లో చాలామందికి పెన్షన్ వచ్చిందని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వల్ల కొంతమందికి ఒకటి రెండు రోజులు ఆలస్యమైందన్నారు. దానిని పట్టుకుని పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలంటూ ఈనాడు తప్పడు వార్తలు రాయడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మద్య దూరం పెంచాలన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులలో విశ్రాంత ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలాలు లేని విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగులకు అడగకుండానే అన్ని సౌకర్యాలను సీఎం జగన్ కల్పిస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జీతాలు అందరికి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ జేఎసీ ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ కష్టమని ఈనాడులో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనాడులో వచ్చిన వార్త అవాస్తవమని, విశ్రాంత ఉద్యోగులలో చాలా మందికి పెన్షన్ వచ్చిందన్నారు. జీతాలు, పెన్షన్ విషయంలో పత్రికలు విజ్ఞత పాటించి వార్తలు రాయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని వాస్తవాలను ఉద్యోగులు, పెన్షన్ దారులు గ్రహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, ఇటు వంటి వార్తలను తాము ఖండిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. జయబాబు మాట్లాడుతూ... 3 లక్షల 70 వేల మంది పెన్షన్ దారులు ఉన్నారని వాళ్లకు పెన్షన్ కష్టమని ఈనాడులో వార్త రాశారన్నారు. ఈనాడులో రాసిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికే చాలా మంది విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగులను,పెన్షన్ దారులను తప్పు తోవ పట్టించే విధంగా వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
మా ఉద్యోగుల జోలికి రావొద్దు..
సాక్షి, అమరావతి: విశ్రాంత ఉద్యోగస్తులకు 100 శాతం పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కింది స్థాయి ఉద్యోగుల కష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కరోనాపై పోరులో ఇంటికి వెళ్లకుండా కష్టపడుతున్న ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించారని... మిగిలిన 50 శాతం గురించి ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ఇక ఉద్యోగులను అడ్డుగా చూపించి పదవి సంపాదించిన చరిత్ర గల టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. ఉద్యోగుల కోసం ఇప్పుడు దీక్ష చేసేంత అవసరం ఆయనకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆయన నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిన ఆయన తమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు అశోక్‌బాబు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమను కదిలిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను బయటపెడతామని.. ఉద్యోగుల జోలికి రావొద్దని హెచ్చరించారు. (కరోనాపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) ‘‘ఉద్యోగ సంఘాల మీద రాజకీయ ముద్ర వేసిన చరిత్ర నీది. మా ఉద్యోగులకు ఏం కావాలో మాకు తెలుసు... మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వలన ఉద్యోగస్తులమంతా ఇప్పుడు బాధ పడుతున్నాం . మీ రాజకీయం మీరు చేసుకోండి.. మేం మీ జోలికిరాము. వాళ్ల నాన్న చనిపోతే అశోక్‌బాబు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ చదవిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమని మేము పోరాడుతుంటే.. డిగ్రీ వాళ్ల కు ఇవ్వమని అడిగిన వ్యక్తి అశోక్ బాబు. 50 శాతం జీతాలు రాకుండా అడ్డుకొవాలని అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘ నాయకులు పై రాజకీయ ముద్ర పడేలా చేసిన చరిత్ర అశోక్ బాబుది’’ అని అశోక్‌బాబు తీరును బొప్పరాజు వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.(కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ) ఆ ఘనత సీఎం జగన్ సొంతం ‘‘ఉద్యోగులు అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్ సొంతం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు వేల రూపాయల నుంచి 10 వేలు జీతాలు పెంచిన ఘనత సీఎం జగన్‌కు దక్కింది. అయితే కొంతమంది పారిశుద్య, కార్మికులు, ఏఎన్ఎంలతో ధర్నాలు చేయించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. పనిచేసే వాడికి ఎస్మా గురించి అవసరమేముంది. పనిచేయని వాడే ఎస్మా గురించి భయపడతారు. ఇంకా కొన్ని రోజులు కష్టపడండి... కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మరింత కష్టపడి ప్రజలను రక్షిద్దాం’’ అని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ‘‘అశోక్ బాబు రాజకీయాలు మీ చేసుకోండి, మా ఉద్యోగుల సంక్షేమం మేము చూసుకుంటాం’’ అని చురకలు అంటించారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు..
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం అమరావతి జేఏసీ నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. వెంటనే నివేదికలు తెప్పించాలని సీఎం అధికారులను ఆదేశించారని బొప్పరాజు తెలిపారు. ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలను చావ చచ్చారా అని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. -
‘అడగకుండానే సీఎం జగన్ అన్ని ఇస్తున్నారు’
-
‘అడగకుండానే సీఎం జగన్ అన్ని ఇస్తున్నారు’
సాక్షి, విజయవాడ: అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ... జీఎన్ రావు కమిటీ నివేదికను ఆహ్వానిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, రాజధాని మార్చినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఉద్యోగులకు కావల్సిన అన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటులో చంద్రబాబు అందరి అభిప్రాయం తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని బొప్పరాజు అన్నారు. తాత్కాలిక కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాజధాని ఏర్పాటు అనేది మన ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్మించుకోవాలని, లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఏం కావాలో అడగకుండానే అన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి చరిత్ర సృష్టించారని, అడగకుండానే కార్మికుల జీతాలు పెంచారన్నారు. -
‘స్వప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయం’
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు. -
ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టిన పీఆర్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల మధ్య 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఉత్తర్వులు చిచ్చుపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సిఫార్సుల సమర్పణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీను ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో చర్చించి ఏడాదిలోగా వేతన సవరణపై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీని ఆదేశించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం (మే 18) ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వేతన సవరణ సిఫారసుల కోసం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (అమరావతి జేఏసీ) సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొంది. అశోక్‌బాబు వర్సెస్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలో ఏపీఏన్జీవో, సచివాలయ ఉద్యోగల సంఘాలను ప్రస్తావించక పోవడంపై ఎన్జీవో నేత అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాలను ఎందుకు పెట్టలేదని అశోక్ బాబు వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రతో సోమవారం అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధులు భేటీ అయ్యారు. జీవోలో తమ సంఘాలను ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నించారు. అయితే పీఆర్సీని నియమించమని వినతిపత్రం ఇవ్వలేనందునే ఏపీఎన్జీవోలో పేర్లు చేర్చలేదని సీఎం వర్గాలు తెలిపాయి. తాజా వివాదంతో అశోక్‌బాబు వర్సెస్ బొప్పరాజు వెంకటేశ్వర్లుగా వ్యవహారం మారిపోయింది. -
అధికారులపై రాజకీయ ఒత్తిడులు తేవద్దు: ఏపీ జేఏసీ
కాకినాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ తక్షణమే విడుదల చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమలు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శాశ్వత ప్రాతిపదికన జరపాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల బదిలీల్లో అధికారుల మీద రాజకీయ ఒత్తిడులు తీసుకురావద్దని ఆయన సూచించారు. -
'ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో రెవిన్యూ ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సమయపాలన లేదనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా రెవిన్యూ ఉద్యోగులే పని చేస్తున్నారని చెప్పారు. ఆఖరికి కొత్త సినిమా రిలీజైనా తామే పని చేస్తున్నామన్నారు. దళారీ వ్యవస్థ వల్ల ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతోందన్నారు. ఎవరో తప్పు చేశారని అందరిని నిందించడం సరికాదని వెంకటేశ్వర్లు సూచించారు. -
'ప్రతిశాఖలోనూ రాబందులు ఉన్నారు'
రాజమండ్రి: ప్రతి శాఖలోనూ రాబందులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యు ఎంప్లాయిస్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకరిద్దరి గురించి మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగడం లేదన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యు కార్యాలయల్లో ఆర్ఎస్ఆర్- ఎస్ఎల్ఆర్ లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
పోలీస్ రక్షణ ఉంటేనే.. ఇసుక మాఫియాను అడ్డుకోండి
ఒంగోలు కలెక్టరేట్ : ‘కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నార్నూర్ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగులను ఇసుక మాఫియా టార్గెట్ చేసింది. విధి నిర్వహణలో ఉన్నవారిపై వాహనాన్ని నడిపించింది. ఈ సంఘటనలో ముగ్గురు వీఆర్ఏలు, ఒక ఆర్ఐ మరణించారు. అక్కడి తహసీల్దార్‌తో పాటు అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అందువల్ల పోలీస్ ప్రొటెక్షన్ ఉంటేనే ఇసుక మాఫియాను అడ్డుకోవాలి’ అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన.. స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇసుక మాఫియాను అడ్డుకోవాలని గతంలో అనేకమార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బొప్పరాజు విమర్శించారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్ అధికారులతో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ రెండు శాఖలు దూరంగా ఉంటున్నాయని తెలిపారు. ఇసుక మాఫియాను అడ్డుకునే సమయంలో మాఫియాకు సంబంధించిన ఎవరైనా అధికారులు, సిబ్బందిపై కేసులు పెడితే పోలీసులు అత్యుత్సాహంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల సమయంలో ముందుగానే పోలీసులకు ఫోన్‌చేస్తే సిబ్బంది లేరంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తిని కలిసి నార్నూర్ గ్రామ ఘటనను వివరించామన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వమే ఇసుక వేలం వేస్తే బాగుంటుందని, ఒకవైపు మాఫియాకు అడ్డుకట్ట వేయడంతోపాటు మరోవైపు ఆదాయం కూడా వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇసుకను తరలించడం ద్వారా నదులు, నదీ ప్రవాహాలు దెబ్బతింటాయని ప్రభుత్వం వేలం వేయడం లేదని, మాఫియా కారణంగా దాన్నేమైనా కాపాడగలుగుతున్నారా అని బొప్పరాజు ప్రశ్నించారు. ఇదేనా మీ సంస్కృతి..? తెలంగాణకు చెందిన గ్రూప్-1 ఆఫీసర్స్ నాయకుడు ఆంధ్రాకు చెందిన అధికారులంతా అక్కడ నుంచి వెళ్లాలంటూ పదేపదే ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు. స్టేట్ లెవల్ ఆఫీసర్లంతా కమలనాథ్ కమిటీ సిఫార్సులు తీసుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన గుర్తించకపోవడం దారుణమన్నారు. అక్కడ పనిచేసే ఆంధ్రా ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇదేనా మీ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు. సహజీవనానికి నిదర్శనం కక్ష సాధింపు చర్యలా అని అక్కడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, రాష్ట్ర నాయకుడు శెట్టి గోపి, కలెక్టరేట్ యూనిట్ కార్యదర్శి ఊతకోలు శ్రీనివాసరావు, నాయకుడు ఎస్వీ సుధాకరరావు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. -
పెరిగిన పార్ట్‌టైమ్ వీఆర్వోల గౌరవ వేతనం
సాక్షి, హైదరాబాద్: పార్ట్‌టైమ్ గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓల) గౌరవ వేతనం రూ. 4900 నుంచి రూ. 10,000కు పెరిగింది. ఈమేరకు రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వీఆర్వోల సమాఖ్య అధ్యక్షుడు భక్తవత్సల నాయుడు, తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌కు, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్పరాజు వెంకటేశ్వర్లు -
ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోమా?
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంతకాలం సమ్మె చేసి ఏం సాధించాం? జీతాలతో పాటు పిల్లల భవిష్యత్‌ను పణంగా పెట్టి సమ్మె చేశాం. ఇప్పుడు ఆశించిన ఫలితం రాకుండానే విరమిస్తే.. ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? ఇంతకాలం స్పష్టమైన హామీ వస్తేనే విరమిస్తామన్నాం. ఇప్పుడు ఎలాంటి హామీ లేకుం డానే.. సమ్మె ఎందుకు విరమించాలి? ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో ఎందుకు విఫలమయ్యాం? ప్రజలు స్వచ్ఛందంగా చేసిన ఉద్యమాన్ని పెట్టుబడిదారీ ఉద్యమం అని కేంద్ర మంత్రులే అంటుంటే ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నాం? ఒకసారి ఎంపీల రాజీనామాలు కోరుతాం. మరోసారి వద్దంటాం. శాసనసభలో తీర్మానం ఓడిద్దామంటాం. అసలు శాసనసభకు తీర్మానమే రాదంటే.. మరేదో అంటాం. ఎందుకు మనకు స్పష్టత లేదు? అన్ని వ్యవస్థలను కలుపుకొని పోవడంలో ఎక్కడ విఫలమయ్యాం? ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించి సమ్మె విరమిస్తే ఇప్పుడు జనం ఛీ కొట్టరా? ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాకట్టుపెడితే ఎలా?’’ సీఎంతో చర్చలకు ముందు గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో సమ్మెకు నేతృత్వం వహించిన ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఎదుర్కొన్న ప్రశ్నాస్త్రాలివి. ప్రారంభం నుంచీ వాడివేడిగా సాగిన సమావేశంలో 52 సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా అశోక్‌బాబు మాట్లాడుతూ.. సమ్మె వల్ల చిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించారు. సమ్మెను తాత్కాలికంగా విరమించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా? అనే అంశం మీద అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. అనంతరం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యమ నిర్వహణలో రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లడంలో విఫలం కావడానికి మన వైఖరే కారణమని విమర్శించారు. ఉద్యోగులుగా తమ శక్తి ఎంత అనే విషయం స్పష్టంగా తెలిసినా... ఉద్యమంలో చేరేందుకు ముందుకొచ్చిన పార్టీలను అడ్డుకుని నష్టపోయామన్నారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చిన తర్వాత ఓడించడానికి ప్రయత్నించడం కంటే.. ఇప్పుడే శాసనసభను సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతున్న పార్టీకి మద్దతు ఇచ్చి ఉంటే ఉద్యమం మరింత ఉధృతంగా సాగడానికి, ఉద్యమం నుంచి ఉద్యోగులు నిష్ర్కమించడానికి మేలైన మార్గం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుంటే మెరుగైన ఫలితం వచ్చి ఉండేదన్నారు. వెంకటేశ్వర్లు వాదనతో దాదాపు ఉద్యోగ సంఘాల నేతలంతా ఏకీభవించారు. విభజనపై ముఖ్యమంత్రికే స్పష్టత లేకుంటే తమకు వచ్చే హామీలో స్పష్టత ఏమి ఉంటుందని పలువురు నేతలు నిలదీశారు. సీఎం ఇచ్చే హామీని చూపించి సమ్మె విరమించడం కంటే.. ఉద్యోగులుగా తమ శక్తి ఇంతేనని, సమ్మె కొనసాగించలేమని, తమను క్షమించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసి సమ్మె విరమించడం మంచిదన్నారు. దాంతో ఉద్యమం ప్రజలు, రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లే అవకాశమైనా ఉందన్నారు. సమ్మె విరమణకు అదే గౌరవ ప్రమదమైన ముగింపు అవుతుందన్నారు. విభజన ప్రక్రియ వేగంగా సాగుతున్న సమయంలో సీఎం హామీతో సమ్మె విరమిస్తే.. ఉద్యోగులు అమ్ముడుపోయారని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందన్నారు. ఒకానొక దశలో సమావేశంలో అశోక్‌బాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగులు లేవనెత్తిన పలు అంశాలకు అశోక్‌బాబు వివరణ ఇస్తూ.. సీమాంధ్రలో అన్ని వ్యవస్థలు విఫలమైన తర్వాతే ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగాయని, సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నందున ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.