అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ... జీఎన్ రావు కమిటీ నివేదికను ఆహ్వానిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, రాజధాని మార్చినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఉద్యోగులకు కావల్సిన అన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉందని బొప్పరాజు వెంకటేశ‍్వర్లు పేర్కొన్నారు.