ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ నివేదికలో ప్రస్తావించింది. అదే విధంగా అభివృద్ధి సూచీల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించింది.