GN Rao Committee
-
వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం
సాక్షి, అమరావతి: ‘‘పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. సమగ్రాభివృద్ధి అంటే.. ఒకే చోట మహానగరాలు నిర్మించడం కాదు.. రక్షిత తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూర్తిగా రూపుమాపవచ్చు.. ఇది అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలలో, రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయి.’’ ఇవి చెప్పింది ఒకటి కాదు రెండు కాదు మూడు కమిటీలు. శివరామకృష్ణన్ కమిటీ, జీఎన్.రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) ఇవే విషయాలను నివేదికల రూపంలో అందించాయి. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆ కమిటీలు చెప్పిన ముఖ్యమైన అంశాలను ఓ మారు పరిశీలిద్దాం.. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే.. విభజన తర్వాత రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తుందని తేల్చిచెప్పింది. కమిటీ సిఫార్సులివి.. ► రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైనది కాదు. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. ► శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. ► విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం వాటిల్లుతుంది. పర్యావరణానికీ విఘాతం కలుగుతుంది. ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే ప్రతికూల పరిణామాలనెదుర్కోవాల్సి ఉంటుంది. ► విజయవాడ–గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. జీఎన్ రావు కమిటీ ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదిక ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులు ఇవీ.. ► శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. ► అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. ► అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. ► అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే వి«షయాన్ని ప్రభుత్వానికి సూచించాం. ► రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. ► రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీజీ ఏం చెప్పిందంటే సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక అందిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ► ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉంటేనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. ► చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) ► ఆంధ్రప్రదేశ్ అప్పు ఇప్పటికే 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి 1.20 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది భారం. ► అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలా అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు. ► అమరావతి నగరంలో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటికి పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. ► ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. -
నెరవేరిన ఆరు దశాబ్దాల కల
సాక్షి, కర్నూలు : మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన హరిచందన్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలు ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, 6 దశాబ్దాల మా కల ఇన్నాళ్లకు నెరవేరిందని పేర్కొన్నారు. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) హైకోర్టు ఏర్పాటు వల్ల సీమకు న్యాయం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నిర్ణయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజుని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కుట్రలన్నీ విఫలమయ్యాయి. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు కుట్రలు పన్నితే... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఆలోచన చేశారు’ అని అన్నారు. -
సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. (ముగ్గురి నోట అదే మాట!) రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. (‘బోస్టన్’ చెప్పిందేంటి?) అనంతరం 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్ అయ్యింది. గవర్నర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణ కలిసొచ్చిన అదృష్టం
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంటే ఆకాశహర్మ్యాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన పార్కులు, పెద్ద పెద్ద మాల్స్, సినిమా హాల్సే కాదు. పురోభివద్ధి కారిడార్లు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య కేంద్రాలు, విద్యావకాశ నిలయాలు, స్వచ్ఛమైన మంచినీరు, నిరంతర విద్యుత్, అందరికి ఆరోగ్యం, ఆధునిక ఇంటర్నెట్ కమ్యూనికేషన్లు, వ్యవసాయ పురోభివద్ధికి పరిశోధనలు, అంతర్జాతీయ వ్యాపారానికి ప్రణాళికలు, ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు....ఇలా ఎన్నో బరువులు, బాధ్యతలు. (వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం) వీటన్నింటిని ఒకే నగరానికి పరిమితం చేయకుండా మూడు నగరాలకు విస్తరిస్తామనడం కొత్త సంప్రదాయం. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన మార్గం. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబుతున్న మాట. గీసుకున్న బాట. భారత దేశంలో నగరాలు అభివద్ధి చెందిన గతకాలపు చరిత్రను పరిశీలిస్తే కొత్త సంప్రదాయంలో ఉన్న శాస్త్రీయ దృక్పథం కూడా అర్థం అవుతుంది. (మూడు రాజధానులకు మద్దతుగా పోస్టుకార్డుల వెల్లువ) 17వ శతాబ్దం నుంచి భారత్ లో ముంబై, చెన్నై, కోల్‌కతా రేవు పట్టణాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అప్పటికే భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉండడంతో విదేశాల నుంచి ముడి సరకులను తీసుకొచ్చి వాటి ఉత్పత్తులుగా మార్చి ఎగుమతి చేయడానికి ప్రధానంగా ఈ రేవు పట్టణాలే తోడ్పడ్డాయి. కనుక అక్కడ తొలుత మార్కెట్లు కూడా అభివృద్ధి చెందాయి. బ్రిటీష్ పాలకుల హయాంలో రేవుల వద్ద సరకుల దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలు మరింత విస్తరించాయి. వాటికి దేశీయ మార్కెట్లు కూడా అవసరం వచ్చి దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశంలో పలు వ్యూహాత్మక నగరాలను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. బ్రిటీష్ పాలకులది కేంద్రీయ పాలన కనుక పలానా ప్రాంతమని తేడా లేకుండా ఏ ప్రాంతం ఏ వ్యాపారానికి వీలుందో, ఆ ప్రాంతంలోని పట్టణాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం అనివార్యమైంది. ఆ తర్వాత వ్యవసాయోత్పత్తులు, ఇతర మార్కెట్ల అవసరాల కోసం ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, రాజస్థాన్‌లో జైపూర్, ఉదయ్‌పూర్, పంజాబ్‌లో లూథియానా, అమృత్సర్, మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్ లాంటి నగరాలు అలా అభివృద్ధి చెందినవే. (ఇతర రాష్ట్రాలదీ సమగ్రాభివృద్ధి బాటే!) దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల ప్రాతిపదిక ప్రాంతాలు, నగరాల అభివృద్ది జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రధాన నగరాలైన, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నిజాం పాలిత ప్రాంతంతో కలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తెలంగాణాతో విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నగరాలను, వాటి చుట్టూ ప్రాంతాలను మరింత వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. (మూడు రాజధానుల ఆలోచన అద్భుతం) అలాంటప్పుడు మూడు నగరాలకు రాజధాని కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం లభించడం నిజంగా ఓ అదృష్టమే. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగుతున్న నేటి పరిస్థితుల్లో ఓ రేవు పట్టణానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్ అక్కడ ఉండడం ఎంతైన శ్రేయస్కరం. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమైతే వైషమ్యాలకు, వేర్పాటు వాదాలకు దారితీస్తుందని అలా ఆవిర్భవించిన ఓ రాష్ట్రానికి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. (కంచీ యూనివర్శిటీలో డీలిట్, అమెరికాలో పీహెచ్డీ చేసిన సమీర్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసిన పరిశోధనాత్మక వ్యాసానికి సంక్షిప్త స్వేచ్ఛానువాదం) -
జిఎన్ రావు రిపోర్టు
-
విశాఖే బెస్ట్
-
విశాఖనే బెస్ట్ ఆప్షన్ : జీఎన్ రావు
సాక్షి, హైదరాబాద్ : తమ కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలను విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో జీఎన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు. తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా, ఆన్లైన్ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు. చదవండి : ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..? -
విశాఖనే బెస్ట్ ఆప్షన్
-
మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) నివేదికలన్నీ పరిపాలన వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాయి. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశాయి. గత ప్రభుత్వం రూపొందించిన అమరావతి మెగా సిటీ నిర్మాణం సాధ్యం కాదని, మెగా సిటీల నిర్మాణం కాన్సెప్ట్ ప్రపంచంలో విఫలమైందని ఉదాహరణలతో వివరించాయి. అమరావతి మెగా సిటీ నిర్మాణ ప్రణాళిక కూడా విఫల ప్రయోగమేనని స్పష్టం చేశాయి. అత్యధిక శాతం ప్రజలు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న తరుణంలో మూడు కమిటీల సిఫార్సులు క్లుప్తంగా.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు - రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని నగరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదని స్పష్టం చేసింది. గ్రీన్ సిటీ నిర్మాణం సాధ్యాసాధ్యాల మీదా విస్తృతంగా పరిశీలించింది. గ్రీన్ సిటీ నిర్మాణం రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని అభిప్రాయపడింది. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. ఈ కమిటీ ఇంకా ఏమి సిఫారసు చేసిందంటే.. - విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. జీఎన్ రావు కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు.. - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉండే పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్యా ఉండదు. - అమరావతి ప్రాంతంలో కొంత వరద ముంపునకు గురవుతుంది. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్టుమెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటిని మార్చి, ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యాకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరులను పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించరాదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు సిఫార్సులు.. - పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. సచివాలయానికి ఏడాదిలో మొత్తం లక్ష మంది వస్తే అందులో 75 శాతం మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లులకోసం వచ్చే వారే. - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15–16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 సంవత్సరం వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ విఫలమయ్యాయి. కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50% సాధించాయి. మిగతావన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పోలవరం – బొల్లాపల్లి– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.150 లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. -
రేపే ఏపీ మంత్రివర్గం భేటీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర మంత్రివర్గం రేపు (శనివారం) సమావేశం కానుంది. హై పవర్ కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక అధ్యయనానికి ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్న కేబినెట్ హై పవర్ కమిటీ నివేదికను అధ్యయనం చేయనుంది. కాగా ఈ నెల 20న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందుకు తీసుకొచ్చింది. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హై పవర్ కమిటీ శుక్రవారం కలిసింది. నివేదికపై ప్రజంటేషన్ ఇచ్చింది. -
వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాపై మాట మార్చారు. హోదా కోసం తాను చేయాల్సింది చేశానని ఆయన చెప్పుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు బీజేపీ పంచన చేరి కామ్రేడ్లకు గట్టి ఝలక్ ఇచ్చారు. పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని హోదాపై కేంద్రంపై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు కాషాయ కండువాతో జత కట్టారు. మరోవైపు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించడం వల్లే సమస్య వచ్చిందని పవన్ వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, జనసేన తరపున పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బీజేపీ, జనసేన కీలక భేటీ : విలీనమా? పొత్తా?) ఈ భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘వామపక్ష పార్టీలకు నేను ఏమైనా బాకీ ఉన్నానా? ఆ పార్టీలకు నేనేమీ చెబుతాను. వామపక్ష పార్టీలతో కలవక ముందే బీజేపీ కోసం పని చేసాను. ఏపీ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకు వెళతాం. ఇక అమరావతిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.’ అని అన్నారు. కాగా అమరావతిపై ప్రభుత్వం ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానం దాటవేశారు. ఇక పవన్ వైఖరిపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. కాగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ కమిటీలను వేసింది. అంతేకాకుండా ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార్సులు, నివేదికలపై మంత్రులతో కూడిన హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీ ఉ.11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉ.10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే 21 వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి (ఇంచార్జీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్టు తెలిసింది. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మండలి సమావేశం మాత్రం ఒకే రోజుతో ముగిస్తారు. రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెడుతుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను కూడా ప్రవేశ పెడతారు. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమకు అందిన రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ దశల వారీగా సమగ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. -
రాజధానికి దూరమైనా.. అభివృద్ధికి దగ్గరే
రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలంటూ విష ప్రచారం చేస్తున్న కొందరికి.. అసలు దేశ రాజధాని ఎక్కడుందో? ఏయే రాష్ట్రాలకు ఎంత దూరంలో ఉందో తెలుసా? పక్కనున్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రాజధానులు ఆయా జిల్లా కేంద్రాలకు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసా? అంతెందుకు మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్‌కు, శ్రీకాకుళానికి మధ్య దూరం ఎంతో గుర్తుందా? సెకన్ల వ్యవధిలో ఖండాంతరాలు దాటేలా సమాచార విప్లవం ఇవాళ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇ–ఫైళ్లు, ఇంటర్నెట్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్.. ఇలా పేరేదైనా కావచ్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్, ప్రైవేట్ కార్యాలయాలు క్షణాల్లో సమాచారాన్ని అటూ ఇటూ.. ఇటూ అటూ బట్వాడా చేసేస్తున్నాయి. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య దూరం అనేది అభివృద్ధిపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. మౌలిక వసతుల కల్పన, ప్రకృతి వనరుల సద్వినియోగంపై మాత్రమే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందని ఎన్నో నగరాల చరిత్ర చెబుతోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని అత్యధిక జిల్లాలు రాజధాని నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తుండటం గమనార్హం. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సత్వర ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశాయి. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయి. శాసన, న్యాయ, పరిపాలన రాజధానులు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరచవచ్చని నివేదించాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు నానా యాగీ చేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రకు తెరతీశాయి. మరోవైపు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలని వితండవాదనను లేవనెత్తుతున్నాయి. అసలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? దేశ రాజధానికి దగ్గరగా ఉండటానికి – అభివృద్ధికి సంబంధం ఉందా? అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశ రాజధానికి ఎంత దూరంలో ఉన్నాయి? అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలకు ఆ రాష్ట్ర రాజధాని ఎంత దూరంలో ఉంది? మొదలైన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని సమీపంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. దేశ రాజధానికి దూరంగా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రాల రాజధానులకు దూరంగానే ఉండటం గమనార్హం. – సాక్షి, అమరావతి నంబర్ వన్ కేరళ.. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక–2019 ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఢిల్లీకి 2,814 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం రాజధానిగా ఉన్న కేరళ సమగ్రాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఢిల్లీకి కేవలం 497 కిలోమీటర్ల దూరంలో లక్నో రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్ 23వ స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఢిల్లీకి దూరంగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. వాటికంటే దేశ రాజధానికి ఎంతో సమీపంలో ఉన్న బిహార్ చిట్టచివరి స్థానానికి పడిపోయింది. సమగ్రాభివృద్ధి సూచీ టాప్–10 జాబితాలో ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చోటే లేకుండాపోయింది. దేశ రాజధానికి అత్యంత దూరంలో ఉండే సిక్కిం.. పెద్ద రాష్ట్రాలను తోసిరాజని ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్ ఢిల్లీకి 1,598 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి రాజధానికి దగ్గరగా ఉన్నామా.. దూరంగా ఉన్నామా.. అన్నదానికీ, అభివృద్ధికి సంబంధం లేదని నీతి ఆయోగ్ నివేదికే స్పష్టం చేస్తోంది. పరిపాలనా దక్షత, నిబద్ధత ఉంటే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరిస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ నివేదిక సమగ్రాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి(ఐరాస) నిర్ణయించిన 17 ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల ప్రాతిపదికన గరిష్టంగా 100 పాయింట్లతో సమగ్రాభివృద్ధి సూచీని నిర్ణయించారు. అందులో 65 నుంచి 99 మధ్య పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ప్రగతిపథంలో ముందుండగా, 50 నుంచి 64 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనపరిచినవిగా.. .0 నుంచి 49 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ఆశావహ (అంటే ఇంకా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన) రాష్ట్రాలుగా నిర్ణయించింది. కేరళ 70 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. 69 పాయింట్లతో హిమాచల్‌ప్రదేశ్ రెండో స్థానంలో, 67 పాయింట్లతో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. కర్ణాటక 66 పాయింట్లతో నాలుగో స్థానం, గోవా, సిక్కిం 65 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా మహారాష్ట్ర, గుజరాత్ 64 పాయింట్లతో ఆరో స్థానం సాధించాయి. సమగ్రాభివృద్ధి సూచీలో అగ్ర స్థానంలో ఉన్న పది రాష్ట్రాల్లో తొమ్మిది అంటే కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్ దేశ రాజధాని ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్క హిమాచల్‌ప్రదేశ్ మాత్రమే సమీపంలో ఉంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 23వ స్థానంలో, బిహార్ చివరి స్థానంలో ఉండటం గమనార్హం. నీతి ఆయోగ్ నివేదిక మరికొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. పేదరిక నిర్మూలనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం మెరుగైన పనితీరు కనబరిచాయని పేర్కొంది. ఇక జీరో హంగర్ (ఆకలి సమస్యను పరిష్కరించడం)లో గోవా, మిజోరం, కేరళ, నాగాలాండ్, మణిపూర్ మొదటి స్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలన్నీ ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం గమనార్హం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి దేశంలో అభివృద్ధి పథంలో ముందున్న అత్యధిక రాష్ట్రాల్లో రాజధానులు ఆ రాష్ట్రాల్లోని మెజార్టీ జిల్లాలకు దూరంగానే ఉన్నాయన్నది అక్షర సత్యం. యావత్ రాష్ట్రం అభివృద్ధికి చోదకశక్తిగా పని చేసేందుకు అత్యంత అనుకూలంగా ఉన్న నగరాలనే రాజధానులుగా ఎంపిక చేశారు. అంతేగానీ రాష్ట్రానికి మధ్యలో ఉందా.. అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉందా.. అని స్కేల్ పట్టుకుని కొలిచి రాజధానులను నిర్ణయించలేదని పరిశీలకులు చెబుతున్నారు. అప్పటికే తగిన మౌలిక వసతులతో ఉన్న నగరాలను రాజధానులుగా చేసుకుని రాష్ట్రం మొత్తం అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి చేశారు. అంతేగానీ ఎక్కడో ఖాళీ భూముల్లో రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పేరిట భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ లేదు. తమిళనాడుకు ఉత్తరాన చిట్టచివరన ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఉండగా అత్యధిక జిల్లాలు ఆ నగరానికి సుదూరంగా ఉన్నాయి. కర్ణాటకలో తూర్పు దిశలో ఏపీ సరిహద్దుకు సమీపంలో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు ఉండగా మెజార్టీ జిల్లాలు పశ్చిమ వైపున దూరంగా అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్రలో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రానికి మధ్య, దక్షిణ, తూర్పు దిక్కున ఉండగా రాజధాని ముంబై మాత్రం పశ్చిమాన చిట్టచివరగా అరేబియా సముద్ర తీరంలో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం ఆ రాష్ట్రానికి దక్షిణాన చిట్టచివరలో అరేబియా సముద్ర తీరంలో ఉండగా.. మెజార్టీ జిల్లాలు ఉత్తర, పశ్చిమాలుగా విస్తరించి ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. సమగ్రాభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కాబట్టి రాజధాని అన్నది అన్ని జిల్లాలకు సమాన దూరంలో రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలనడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉన్న మధ్యప్రదేశ్, లక్నో అభివృద్ధి సాధించలేకపోయాయని కూడా గుర్తు చేస్తున్నారు. వికేంద్రీకరణతో సొంతూళ్లలోనే సమస్యల పరిష్కారం సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల ద్వారా సొంతూళ్లోనే సమస్యలు పరిష్కారమవుతున్నప్పుడు ఎవరికైనా అదే పనిగా రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయం, హెచ్‌వోడీ(విభాగాధిపతుల కార్యాలయాలు)ల వద్ద సాధారణ ప్రజలకు పని ఉండే అవకాశాలు చాలా తక్కువ..! ఈ నేపథ్యంలో సదుపాయాలను బట్టి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలెవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సామాజికవేత్తలు, మేధావులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడీషియల్ కేపిటల్), అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్లను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు పరిపాలన వికేంద్రీకరణ జరిగి సమ న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. అమరావతిలో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడటం ద్వారా.. తక్కువ ధరలకే కాజేసిన వేలాది ఎకరాల భూముల ధరలు పెంచుకోవడానికే పచ్చదండు రాజధాని గ్రామాల రైతుల పేరుతో ఉద్యమాలను చేస్తోందని విమర్శిస్తున్నారు. రాజధాని, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై పశ్చిమతీరాన అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ రాష్ట్రంలో గోండియా జిల్లా కేంద్రానికి ముంబైకి మధ్య దూరం 1,060 కి.మీలు. గడ్చిరోలి జిల్లా కేంద్రానికీ ముంబైకి మధ్య దూరం 942 కి.మీలు. తమిళనాడు రాజధాని చెన్నైకి ఆ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన కన్యాకుమారి మధ్య ఉన్న దూరం 718 కి.మీలు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో రాజధాని నగరాలకు కొన్ని జిల్లాలకు మధ్య దూరం ఎక్కువ. కానీ ఆ రాష్ట్రాల్లో రాజధాని అంశంపై సామాన్య ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతగానీ, ఇబ్బందులుగానీ ఉత్పన్నం అయిన దాఖలాలు లేవని మేధావులు గుర్తు చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరించిన విషయం తెలిసిందే. దాదాపు 534 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించడానికి శ్రీకారం చుట్టారు. అంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకే వెళ్లాల్సిన అగత్యం ఇక ఉండదు. పట్టణ ప్రజలూ అంతే. అలాంటప్పుడు సమస్యల పరిష్కారం కోసం రాజధానికి వెళ్లాల్సిన అవసరం వారికి ఏముంటుందని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
జనవరి 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
-
ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్ భేటీ కానుంది. చదవండి: అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ముగిసిన హై పవర్ కమిటీ భేటీ వికేంద్రీకరణకే పెద్దపీట -
అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు
‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? సామాజిక న్యాయం జరగకూడదనుకుంటున్నారా? అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలన్నదే మీ ఉద్దేశమా? వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందంటే అడ్డుపడతారా? మీ స్వార్థం కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అభివృద్ధి అంతా అమరావతిలోనే జరగాలనడం న్యాయమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు చేసిందేమిటి? రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? గ్రాఫిక్స్‌తో చుక్కలు చూపించడం తప్ప ఏం చేశారు? ఇన్సైడర్ ట్రేడింగ్‌తో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సృష్టించుకోవడం తప్ప సామాన్య ప్రజానీకానికి ఏ విధంగానైనా లబ్ధి కలిగించారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘మీ హయాంలో ఎవరికీ మేలు చేయలేదు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుణ్యమా అని మేలు జరగబోతుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. బాబు తీరును నిరసిస్తూ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. తీరు మారకపోతే మా ప్రాంతాల్లో అడుగు పెట్టలేరంటూ హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సబబుకాదని హితవు పలికారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాలన్న నినాదాలు హోరెత్తాయి. నగరంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ అన్నివర్గాల ప్రజలు నినదించారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు ర్యాలీ జరిపారు. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, గాజువాక, మాడుగుల నియోజకవర్గాల్లో ప్రజలు కదం తొక్కారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పరిసరాల్లో తన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి వదరయ్యపాళెం/పలమనేరు/శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా సత్యవేడులో మహిళలు, విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు రోడ్ల కూడలిలోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. సత్యవేడులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. చంద్రబాబుకు వచ్చిన బాధేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే కళావతి అన్నింటికీ అమరావతే అనడం సరికాదు పాలన వికేంద్రీకణ జరగాలని ఆకాంక్షిస్తూ ‘తూర్పు’గోదావరి జిల్లా అంతటా శుక్రవారం ఉద్యమం ఊపందుకుంది. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు ఎర్రవంతెన నుంచి హైస్కూల్ సెంటర్ వరకూ ర్యాలీలో పాల్గొన్నారు. తునిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని సాంస్కృతికంగా అభివృద్ధి చేస్తామని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపేర్కొన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు కోటిపల్లి బస్టాండ్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బైఠాయించారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యువత ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా? కడప కార్పొరేషన్: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమరావతి పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు నాయుడు కేవలం తన సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడటానికే మూడు రాజధానుల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ఖాజా రహమతుల్లా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు అనంతపురం: అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతూ అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ మేరకు కలెక్టర్ గంధం చంద్రుడుకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. గిరిజన విద్యార్థి సంఘం, ఎంఐఎం విద్యార్థి సంçఘం, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ సాంబశివారెడ్డి మద్దతు ప్రకటించారు. హిందూపురంలో టీడీపీ వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆందోళనలను అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. థ్యాంక్యూ.. సీఎం కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’ అంటూ నినదించారు. కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. నంద్యాల, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, మంత్రాలయంలో ర్యాలీ చేపట్టారు. సమగ్రాభివృద్ధి కోరుతూ.. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ విజయనగరం జిల్లావ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తాయి. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్లో మానవ హారం నిర్వహించారు. బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, కొత్తవలస, భోగాపురంలో ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు పట్టణం, చేజెర్ల, సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోడూరు, ఏలూరు నగరం, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలం బాదంపూడి తదితర ప్రాంతాల్లో బైక్, కార్ల ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కొట్టు విశాల్ మద్దతు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, చర్చాగోష్టులు నిర్వహించారు. సోంపేటలో‘అధికారం–అభివృద్థి–వికేంద్రీకరణ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో.. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేధావుల ఫోరం చెబుతోందని స్పష్టం చేశారు. టెక్కలిలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. అమరావతిలో భూములు కొన్న నాయకులే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అలాగే ఈ నెల 13వ తేదీన కమిటీ మరోసారి సమావేశం కానుంది. సమావేశం అనంతరం మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ప్రజలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకేచోట అభివృద్ధితో ఎంత నష్టపోయామో చరిత్ర చెబుతోందన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి సమాంతరంగా జరగాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. కొద్ది రోజుల నుంచి టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారు. రైతుల్లో లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో భూ దందాను నడిపి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదా? వెనుకబడిన ప్రాంతాలు అలానే ఉండాలా? కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా... మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, స్వలాభం కోసమే చంద్రబాబు తాపత్రాయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం మంచిదికాదని సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు వెళతాం అని ఆయన స్పష్టం చేశారు. చదవండి: వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అందరి అభిప్రాయాలు తీసుకుంటాం మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే -
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, అమరావతి : తన బినామీలకు నష్టం జరుగుతుందన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాజధానిలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, చంద్రబాబు, లోకేష్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారని ప్రసంసించారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలు కూడా అధికార వికేంద్రీకరణకు మొగ్గు చూపాయని గుర్తు చేశారు. -
అందరి అభిప్రాయాలు తీసుకుంటాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అలాగే, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలనా వికేంద్రీకరణ కూడా అవసరమని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తెలిపింది. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలపై చర్చించామని.. ఇంకా దీనిపై అధ్యయనం చేస్తామని కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మరో మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పాలనా వికేంద్రీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ తొలి సమావేశం మంగళవారం విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగింది. సమావేశం అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలనే అంశంపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతోందని, దానిపై సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించామని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటివరకు రెండు కమిటీలిచ్చిన నివేదికలను విశ్లేషించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకునేందుకు సీఎం వైఎస్ జగన్ హైపవర్ కమిటీని నియమించారని చెప్పారు. తొలి సమావేశంలో జరిగిన చర్చలో వికేంద్రీకరణ జరగాల్సిందేనని కమిటీ భావించిందని.. జోన్లు, సెక్టార్ల వారీగా అభివృద్ధి ఎలా జరగాలో చర్చించామన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. తదుపరి సమావేశంలో మరింత సుదీర్ఘంగా, వివరంగా జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చిస్తామని, ఆ తర్వాత హైపవర్ కమిటీ తరఫున ఒక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ మాత్రమే జరిగిందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వానికి అందిన వివిధ నివేదికలు, నిజాలు, లెక్కలన్నీ చూసి చరిత్రలో జరిగిన అనేక పరిణామాలు, పరిస్థితుల్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. కమిటీ తరఫున రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకపాటి గౌతంరెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆదిమూలపు సురేష్, సీఎం ప్రత్యేక సలహాదారు అజేయ కల్లం, ఐఏఎస్ అధికారులు నీరబ్‌కుమార్ ప్రసాద్, శ్యామలరావు, విజయ్‌కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు, బీసీజీ గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబే అధికార ఉన్మాది
-
చంద్రబాబే అధికార ఉన్మాది
సాక్షి, కాకినాడ: గతంలో చంద్రబాబు అధికార ఉన్మాదంతో అరాచకాలకు పాల్పడ్డారని.. ఆయనే అధికార ఉన్మాది అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేమ.. వెనుకబడిన ప్రాంతాలపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘అధికార వికేంద్రీకరణ జరగాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగకూడదా..? చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలా? వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణకు ఆయన ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్ క్యాపిటల్‌కు చంద్రబాబు వ్యతిరేకమా..’ అంటూ పలు ప్రశ్నలను మంత్రి సంధించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.. స్వార్థం కోసమే చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జీఎన్‌రావు, విజయ్‌కుమార్‌లాంటి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని.. అధికారులను కించపరడం మానుకోవాలని హితవు పలికారు. బీసీజీ నివేదికను మంటల్లో వేయమనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీకి అబద్ధాలు అంటగడుతున్నారని.. వాళ్లు చెప్పింది ఒక్కటైతే.. చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లాంటి రాజధాని వద్దని శివరామకృష్ణన్ చెప్పారని.. దానికి విరుద్ధంగా చంద్రబాబు అమరావతి అంటున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. డ్రామాలొద్దు.. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ఇకనైనా డ్రామాలు ఆపాలన్నారు. చంద్రబాబు మాయలో పడొద్దని రైతులకు కన్నబాబు సూచించారు. ఫ్యూడలిస్టు విధానాలకు సీపీఐ నారాయణ మద్దతు పలుకుతున్నారా అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు. ‘అమరావతి ముద్దు- రాష్ట్రాభివృద్ధి వద్దు అన్నది చంద్రబాబు నినాదం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముద్దు అన్నది సీఎం జగన్ నినాదం’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
రేపు సమావేశం కానున్న హై పవర్ కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హై పవర్ కమిటీ తొలిసారి సమావేశం కానుంది. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో హై పవర్ కమిటీ భేటీ అవుతోంది. ఈ కమిటీ జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనుంది. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ హై పవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. చదవండి: మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
అలా అయితే అమరావతిలో ఎండలకే చనిపోతారు...
సాక్షి, అమరావతి: విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ ...అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే , రాయలసీమలో 400 ఎకరాలు ఖాళీ భూములు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాంతీయ విభేదాలు లేకుండా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఇక రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటే ...చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడిగారని, ప్యాకేజీ తీసుకుంటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. చదవండి: మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడింటిలోనూ ఉద్ధండులే!
సాక్షి, అమరావతి: శివరామకృష్ణన్ కమిటీ.. కేంద్ర స్థాయిలో సీనియర్ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జీఎన్ రావు కమిటీ.. పలు రంగాలు, విభాగాల్లో విశేష అనుభవం ఉన్న నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ).. ప్రపంచంలోనే టాప్–3 కన్సల్టెన్సీల్లో ఒకటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నియమించిన రెండు కమిటీలు... ఓ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీ.. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఒకే మాటను నొక్కిచెప్పాయి. అదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ.. వికేంద్రీకరణే రాష్ట్రం ముందడుగు వేసేందుకు చోదకశక్తి అని విష్పష్టంగా ప్రకటించాయి. అప్పుడే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని కుండబద్దలు కొట్టాయి. రాష్ట్ర ప్రజల శాశ్వత ప్రయోజనాలకు ఏది సరైందని నిపుణులు భావించారో అదే తమ నివేదికల్లో స్పష్టం చేశారు. అందుకోసం పూర్తిస్థాయి కసరత్తు చేసి మరీ నివేదించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణలను పరిశీలించారు. ఆర్థిక పరిస్థితిని మదించారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని...సహజవనరులను పరిగణనలోకి తీసుకుని... అనుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషిస్తూ తమ నివేదికలను సమర్పించారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ దురుద్దేశాలతో జీఎన్ రావు, శివరామకృష్ణన్ కమిటీల్ని, బీసీజీని విమర్శిస్తుండటం విస్మయపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఆనాటి సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ చైర్మన్, సభ్యులపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీసీజీపై అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీఎన్‌రావు, శివరామకృష్ణన్ కమిటీల్లో చైర్మన్లు, సభ్యుల సుదీర్ఘ పాలనానుభవం, వివిధ రంగాల్లో వారు చేసిన అవిరళ కృషి ఏమిటన్నది.. అదేవిధంగా బీసీజీ అంతర్జాతీయస్థాయిలో సాధించిన అత్యున్నత ప్రమాణాలు ఏమిటన్నది ఓసారి తెలుసుకుందాం... శివరామకృష్ణన్ కమిటీ.. 1) కేసీ శివరామకృష్ణన్: సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య, హోం శాఖల కార్యదర్శిగా చేశారు. దేశంలో స్థానిక సుపరిపాలనకు నాంది పలికిన 73, 74 రాజ్యాంగ సవరణల బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా మెట్రోపాలిటన్ అథారిటీ సీఈవోగా వ్యవహరించారు. దుర్గాపూర్, అసన్సోల్ టౌన్షిప్ సృష్టికర్తగా ఖ్యాతి గడించారు. 2) రతిన్ రాయ్: కేంబ్రిడ్జ్ నుంచి పీహెచ్డీ చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్‌గా, బ్యాంకాక్‌లోని ఆసియన్ పసిఫిక్ రీజనల్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కేంద్రం నియమించిన 13వ ఆర్థిక సంఘానికి సలహాదారు. 3) అరోమర్ రెవి: ప్రజా వ్యవహారాలు, సమగ్రాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు. యునిసెఫ్, యూఎన్డీపీ, యూఎన్ఈపీ తదితర విభాగాల్లో సేవలు అందించారు. ‘నెట్వర్క్ సొల్యూషన్స్’కు కో చైర్మన్‌గా వ్యవహరించారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆ సంస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. 4) జగన్ షా: ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రణాళిక, పట్టణాభివృద్ధి రంగాల్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియాభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. టాటా ట్రస్ట్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భువనేశ్వర్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేశారు. 5) కేటీ రవీంద్రన్: ఈయన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జీఎన్ రావు కమిటీ.. 1) జీఎన్ రావు: కమిటీ చైర్మన్‌గా ఉన్న జీఎన్‌రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో వివిధ జిల్లాల్లో డీఆర్డీఏ పీడీ, జాయింట్ కలెక్టర్‌గా చేసిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. సైనిక సంక్షేమ డైరెక్టర్‌గా, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా, ఎన్నికల సంఘం కార్యదర్శి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రెవెన్యూ రికార్డ్స్ డైరెక్టర్‌గా చేసిన ఆయనకు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలపై పూర్తి పట్టుంది. గోదావరి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్(జీఎఫ్సీఎల్) ప్రత్యేక అధికారిగా 30 జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డు పొందారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కింది. 2) కేటీ రవీంద్రన్: పట్టణాభివృద్ధి రంగంలో నిపుణుడు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాల మేలుకలయిగా నగరాల అభివృద్ధి కోణంలో ఆయన సుప్రసిద్ధుడు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో అర్బన్ డిజైన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఐదేళ్లు పని చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మాస్టర్‌ప్లాన్స్ సలహామండలిలో సభ్యుడిగా చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులకు సలçహాదారుగా కూడా ఉన్నారు. 3) ప్రొఫెసర్ మహావీర్: ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్. రిమోట్ సెన్సింగ్ ఫిజికల్ ప్లానింగ్‌లో నిపుణుడు. పట్టణాభివృద్ధి రంగంలో 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్. అమృత్ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలక స్థానంలో ఉన్నారు. 4) ఆర్. అంజలీమోహన్: అర్బన్, రీజనల్ ప్లానర్.. బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ఇ–గవర్నెన్స్ సబ్జెక్టులో పీహెచ్డీ చేశారు. అర్బన్ ప్లానింగ్, మేనేజ్మెంట్లో 20 ఏళ్ల అనుభవం. 5) కేబీ అరుణాచలం: పట్టణాభివృద్ధి రంగంలో 33 ఏళ్ల విశేష అనుభవం ఉంది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దేశంలో వివిధ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు. వుడాలో చీఫ్ అర్బన్ ప్లానర్‌గా వ్యవహరించారు. 6) ఏవీ సుబ్బారావు: జెన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెసర్. ఉమ్మడి ఏపీలోనూ, తెలంగాణలోనూ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఏపీలో చిత్తడి నేలల అట్లాస్ రూపొందించిన ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించారు. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ)కు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. 7) సీహెచ్.విజయ్‌మోహన్: ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా, సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్‌గా వ్యవహరించారు. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. అత్యుత్తమ కన్సల్టెన్సీ బీసీజీ... 1963లో స్థాపించిన ఈ సంస్థకు 50 దేశాల్లో 90కి పైగా కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సమతుల– సమగ్రాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థికాభివృద్ధి, ఆహార భద్రత, వైద్య– ఆరోగ్య రక్షణ, విద్య తదితర రంగాల్లో బీసీజీ ప్రధాన భూమిక పోషిస్తోంది. సమతుల, సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి చేపట్టే ప్రాజెక్టుల్లో బీసీజీది కీలక పాత్ర. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జీ–20 దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఉండే బి–20 సంస్థ, అమెరికాలో ప్రజా విధానాల రూపకల్పనలో సలహాదారుగా ఉన్న ‘బిజినెస్ రౌండ్ టేబుల్’ సంస్థ, బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలసి పనిచేస్తోంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, సేవ్ ద చిల్ట్రన్, టీచ్ టు ఆల్ వంటి అంతర్జాతీయస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. బీసీజీ నిర్ధారించే గ్రోత్ రేటింగ్స్‌ను అంతర్జాతీయస్థాయిలో కార్పొరేట్, మేనేజ్మెంట్ సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటాయి. -
‘ఆ రిపోర్టునే ఇచ్చామని చెప్పడం అసంబద్ధం’
సాక్షి, తాడేపల్లి : తమ నివేదికపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని రిటైర్డ్ ఐఏఎస్, నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తాము ఇచ్చిన నివేదికపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవాలనీ ఆయన కొట్టిపడేశారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇచ్చిన రిపోర్టునే.. తామిచ్చామని చంద్రబాబు చెప్పడం అసంబద్ధమని జీఎన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు) ‘మా కమిటీలో సభ్యులందరూ అపారమైన అనుభవం కలిగినవారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించే నివేదిక రూపొందించాం. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సంప్రదించి, ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించాం. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, హెచ్వోడీలను సంప్రదించి డేటా సేకరించాం. ప్రజల అభిప్రాయాన్ని చెప్పాలని పత్రికా ప్రకటన ఇచ్చాం. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించాం. నివేదికపై చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తున్నాం. రాజధాని సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా కమిటీ సూచనలు చేసింది. అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యలకి పరిష్కారాల్ని సూచించాం’అని జీఎన్ రావు పేర్కొన్నారు. (చదవండి : మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!) -
ముగ్గురి నోట అదే మాట!
-
వికేంద్రీకరణకే పెద్దపీట
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరి కాదు. పాలనను వికేంద్రీకరించాలి. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. – శివరామకృష్ణన్ కమిటీ మానవ జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. మెగా సిటీల నిర్మాణం, భూముల ధరలు పెరగడం అభివృద్ధి కాదు. రాష్ట్రంలోని ప్రజలందరి తలసరి ఆదాయం పెరగడం అభివృద్ధి. పాలన వికేంద్రీకరణే ఇందుకు మార్గం. – జీఎన్ రావు కమిటీ పరిపాలన వికేంద్రీకరణతో పాటు బహుళ రాజధానుల వ్యవస్థ వల్ల ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందుతాయి. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలి. – బోస్టన్ కమిటీ ‘పాలన ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలి.. అందుకు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణే మార్గం కావాలి’ అని రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, మొన్న జీఎన్ రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీలు విస్పష్టంగా నొక్కి వక్కాణించాయి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రంగా పరిపాలన, అసెంబ్లీ, హైకోర్టు వ్యవహారాలు సాగితేనే అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యం సాధ్యమని స్పష్టీకరించాయి. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల రూపాయలు గుమ్మరించి అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల మాటేమిటని ఆందోళన వ్యక్తం చేశాయి. అవకాశాలు అందరికీ రావాలని, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలకు తావివ్వరాదని స్పష్టం చేశాయి. అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన అనర్థమేమిటో కళ్లెదుటే కనిపిస్తున్నా, మళ్లీ మళ్లీ ఆ పొరపాటుకు తావివ్వడం సరికాదని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల అభిప్రాయాల మధ్య సారూప్యతపై మరోసారి అవలోకనం.. సాక్షి, అమరావతి : నాడు శివరామకృష్ణన్, మొన్న, నిన్న జీఎన్.రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదికలు నిజమైన అభివృద్ధికి అద్దం పట్టేలా, వికేంద్రీకరణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటే ఒకే చోట పెద్ద పెద్ద నగరాలు నిర్మించడం కాదనే అభిప్రాయపడ్డాయి. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. రవాణా, మంచి నీరు, విద్య, వైద్యం, విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చెబుతూ.. ఇందుకు రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడమే మంచి మార్గమని సూచించాయి. అన్ని జిల్లాల సమతుల అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ సూచించడం ఎంతైనా అవసరమేనని స్పష్టీకరించాయి. అమరావతి రాజధాని నగరం పేరుతో గత ప్రభుత్వం నిర్మాణాలను పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మోడల్‌నే రూపొందించిందనే విషయాన్ని ఎత్తి చూపాయి. మిగతా జిల్లాలు వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తాయి. పలు దేశాల్లో, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయని ఉదహరిస్తూ.. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సూచించాయి. ఇంచు మించు ఒకేలా ఉన్న ఈ మూడు కమిటీల నివేదికల సూచనల అమలుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి: జీఎన్ రావు కమిటీ - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. - అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. - రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. మహానగరం సరికాదు : శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరయినది కాదంది. - అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరోచోట బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - విజయవాడ– గుంటూరు నగరాల మధ్య మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం (అప్పట్లో చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పిత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. - సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. - విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. పాలన వికేంద్రీకరణే మార్గం: బోస్టన్ నివేదిక - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. - తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి 80 వేల కోట్ల రూపాయల నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. - ప్రపంచంలో గత 50 ఏళ్లలో ఏడు దేశాల క్యాపిటల్ సిటీల నిర్మాణం చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరకుంది. మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతి నగరంపై రూ.లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదు. అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. - అమరావతి నగరంలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 6 నుంచి 8 శాతానికి సమానంగా ఉంటుంది. తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల అభివృద్ధి పథకాల అమలకు నిధులుండవు. – బోస్టన్ నివేదిక మూడు రాజధానులతో సమ న్యాయం ఒకే పెద్ద రాజధాని బదులు మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలను వికేంద్రీకరించాలి. హైకోర్టు వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. – ఈఏఎస్ శర్మ, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సమతుల అభివృద్ధి సాధ్యం పాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలో సమతుల అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పాలన అన్ని ప్రాంతాల వారికి చేరువవుతుంది. ఒకే చోట పాలనా వ్యవస్థలన్నీ కేంద్రీకృతం కావడం మంచిది కాదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో అన్నీ ఒకే చోట ఉండాలనే ఆలోచనకు అర్థం లేదు. – ప్రొఫెసర్ ఎం.రవీంద్రనాథ్, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ చదవండి: అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెబుతాం
-
బోస్టన్ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం: ఏయూ రిజిస్ట్రార్
-
‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’
సాక్షి, తాడేపల్లి: గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదని..అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీసీజీ కమిటీ స్పష్టంగా చెప్పిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీజీ కమిటీ మీద కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని.. బీసీజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమిటీ అని పేర్కొన్నారు. చంద్రబాబుతోనూ బీసీజీ కమిటీ కలిసి పనిచేసిందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశం సీఎం వైఎస్ జగన్‌కు ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో కొంత ఆందోళన ఉందని.. రైతులకు అన్యాయం జరగకుండా సీఎం చూసుకుంటారన్నారు. ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటీ..? రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. బినామీల పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు. ఐదేళ్ల కాలంలో కేవలం చంద్రబాబు రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని..ఆ సొమ్ముకు 700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. లక్ష 16వేల కోట్లు పెట్టి రాజధాని కడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని కట్టడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 6న హై పవర్ కమిటీ సమావేశమవుతుందని.. కమిటీ నివేదికను చట్టసభల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమరావతికి ఎక్కడికి తరలిపోలేదు..అలాంటి అపోహలు సృష్టించవద్దన్నారు. మత్స్యకారుల విడుదలకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.. పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు.. తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఆ దేశం చెరలో చిక్కుకున్నారని.. ఆ విషయాన్ని జాలర్ల కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. మత్స్యకారులను విడిపించేందుకు వైఎస్ జగన్ ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని మోదీ, అమిత్‌షా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని సార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఈ నెల 6న మత్స్యకారులు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి చెప్పారు. చదవండి: పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం -
సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..
సాక్షి, తాడేపల్లి: గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సాధ్యంకాదన్న శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబు తన వర్గం నేతలతో మరో కమిటీ వేశారని.. తాను నిర్ణయించుకున్నది ఆ కమిటీతో చెప్పించారని తీవ్రంగా విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయని.. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించాలని బీసీజీ సూచనలు చేసిందని తెలిపారు. సమగ్రాభివృద్ధి కోసం బీసీజీ ప్రభుత్వం ముందుకు రెండు ఆప్షన్లు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదికను వెల్లడించిందని అప్పలరాజు తెలిపారు. అదేవిధంగా పోలవరం, పెన్నా- గోదావరి అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని బీసీజీ సూచనలు చేసిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందంపై చంద్రబాబుకు నమ్మకం లేదా అని అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప వికేంద్రికరణను అందరూ హర్షిస్తున్నారని అన్నారు. విశాఖలో క్యాపిటల్ పెట్టడం చంద్రబాబుకు ఇష్టం ఉందో.. లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు శాశ్వత భవనాలు నిర్మించలేని అప్పలరాజు దుయ్యబట్టారు. లక్షల కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో పరిపాలనంతా ఒకేచోట కేంద్రీకృతం అవడంతో నష్టపోయమని ఆయన అన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకణ జరుగుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మండమైన ఆలోచనలు చేశారని అప్పలరాజు కొనియాడారు. నీళ్లు, నిధులు, పరిపాలన అందిరికీ అందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..
సాక్షి, తాడేపల్లి : వికేంద్రకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విషయాలను శాస్త్రీయంగా నివేదికలో పొందుపరిచిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని ఆరు విభాగాలుగా విభజించి సమగ్రమైన నివేదిక అందించిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అమర్నాథ్ శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గతంలోనే చెప్పాయన్నారు. ప్రపంచంలో అనేక గ్రీన్ ఫీల్డ్ రాజధానులు విళమైందని బీసీజీ నివేదికలో పేర్కొన్నారని, రాజధానిపై లక్షా పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టమని చెప్పారన్నారు. విష ప్రచారం చేస్తున్నాయి.. అయితే కొన్ని పత్రికల్లో మూడు ముక్కలు అంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ మండిపడ్డారు. రాజధానులపై కొన్ని వార్తా పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక రాజధాని ఉంటే మరొక రాజధానిని అభివృద్ధి చేయకూడదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం కోసం రాష్ట్రం విడిపోలేదా? అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే మళ్లీ విభజన వాదం తెరపైకి వస్తుందని అన్నారు. ప్రాంతాల వారీగా టీడీపీ...ప్రజలను రెచ్చగొడుతుందని విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు, నిధులు, పరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, సీమ పరిస్థితి? ‘అమరావతి పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని చెపుతున్నారు. డబ్బంతా అమరావతిలో ఖర్చు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటి?. ఖర్చు అంతా ఒకచోటే పెడితే పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించవద్దా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని ఇక్కడ నిర్మించమంటే ఎలా? విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు. తమ భూములకు రేట్లు తగ్గిపోతాయని చెప్పడం త్యాగమా? తమ వ్యాపారంను కాపాడుకోవడానికి చంద్రబాబు... తన సతీమణి భువనేశ్వరిని అమరావతికి తీసుకువచ్చారు. ప్రజలు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. అందుకే వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారు. పులివెందుల పంచాయతీ అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల నివాస వేదిక విశాఖపట్నం. చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. అద్భుతమైన రాజధాని నిర్మిస్తే నారా లోకేష్ ఎందుకు రాజధానిలో ఓడిపోయాడు. జీఎన్‌రావు, బోస్టన్ గ్రూప్‌కు చట్టబద్ధత లేదు కానీ నారాయణ కమిటీకి చట్టబద్ధత ఉందా? విశాఖలో రాజధానిని వ్యతిరేకించే టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు మాటలు విని అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అశోక్ గజపతి...రాజుగా కాకుండా బంటుగా వ్యవహరిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగున్నం తిన్నారు. పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్ వెళ్లి మాట మార్చారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారు. ఊగడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడు రాజధానుల నిర్ణయం మంచిదే
-
మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన
సాక్షి, తిరుమల: మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సమర్థించారు. ఆయన శనివారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు ఎమ్మెల్యే రాపాక సమాధానమిస్తూ మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. నవ రత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందే అని... అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాపాక కోరారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
అమరావతి.. విఫల ప్రయోగమే
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీల(కొత్తగా భారీ నగరాన్ని నిర్మించడం) నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) నివేదిక వెల్లడించింది. అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలు, రాజధాని నగరాల నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీజీ ప్రతినిధులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి నివేదిక సమర్పించారు. అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేసి ఒకే చోట రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుపెడితే.. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని తేల్చిచెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేయవచ్చని పేర్కొంది. ప్రపంచంలో గత 50 ఏళ్ల అనుభవాల్ని పరిశీలిస్తే.. 30కుపైగా గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలు నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం రెండు నగరాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని సాధించాయని.. మిగతా మెగా సిటీలు 6–7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయని బోస్టన్ అధ్యయనం వెల్లడించింది. అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది. బోస్టన్ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ.. రూ.1.20 లక్షల కోట్ల ఖర్చు శక్తికి మించిన భారం ‘ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల నుంచి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ది చెందితే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది(ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధిరేటు 2 నుంచి 7 శాతం మాత్రమే).. కజకిస్థాన్ రాజధాని ‘ఆస్తానా’, దుబాయ్ సిటీల అభివృద్ధికి కారణం పెట్రో ఉత్పత్తుల నుంచి భారీ ఎత్తున ఆ దేశాలకు వచ్చే ఆదాయాన్ని విచ్చలవిడిగా వాటి అభివృద్ధికి ఖర్చు చేయడమే..’ అని బీసీజీ స్పష్టం చేసింది. గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలతో ఒరిగేది శూన్యం గ్రీన్‌ఫీల్డ్ సిటీలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం దోహదపడవని బీసీజీ విశ్లేషించింది. ‘గ్రీన్‌ఫీల్డ్ నగరాలు పర్యావరణ హితం కావు. ప్రపంచంలోని గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలను అధ్యయనం చేసిన తరువాత కాలుష్యం పెరగడాన్ని గుర్తించాం. రష్యాలో ఇన్నోపోలీస్, ఈజిప్టులో న్యూ కైరో, సదత్, షేక్ జియాద్ సిటీ, పోర్చుగల్‌లో ప్లాన్ ఐటీ వ్యాలీ, ఆస్ట్రేలియాలో మొనార్టో, చైనాలో చెంగాంగ్, కాంగ్‌బసీ ఆర్డోస్, నానుహీ న్యూ సిటీ, లావాసా, లాంజోహు, యూఏఈలోని మస్డర్ మెగా సిటీల నిర్మాణాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు’ అని నివేదికలో వెల్లడించారు. ప్రపంచంలో గత 50 ఏళ్లలో 7 దేశాల కేపిటల్ సిటీల నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదని పేర్కొన్నారు. - 1991లో నైజీరియాలో అబూజాను రాజధాని నగరంగా నిర్మించగా.. 20 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం 30 శాతమే చేరుకుని ఆరు లక్షల జనాభాతో ఆగిపోయింది. - శ్రీలంక 1982లో శ్రీ జయవర్ధనెపుర కొట్టేలో రాజధాని నిర్మించగా.. 10 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభా కూడా చేరలేకపోయింది. - 1999లో మలేసియా రాజధానిగా పుత్రజయ నిర్మాణం చేపట్టగా 5 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభాతోనే ఆగిపోయింది. - 2007లో దక్షిణ కొరియాలో సెజాంగ్ సిటీ నిర్మాణం చేపట్టగా 10 లక్షల జనాభా లక్ష్యానికి గాను ప్రస్తుతం 3 లక్షల జనాభా మాత్రమే ఉంది. - అమరావతిలో ఏటా సగటున 15 శాతం మేర జనాభా వృద్ధి ఉంటుందని గత ప్రభుత్వం వేసిన అంచనాలన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవ రూపం దాల్చవని అధ్యయన నివేదికలో స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణే పరిష్కారం రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచికల్లో ఏ జిల్లాలు ముందున్నాయి... ఏ జిల్లాలు వెనుకబడ్డాయి.. అభివృద్ధిలో ఏ ప్రాంతాల మధ్య తారతమ్యాలు, వ్యత్యాసాలున్నాయనే వివరాలను బోస్టన్ కన్సల్టెన్సీ తన నివేదికలో వెల్లడించింది. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడంతో పాటు అన్ని జిల్లాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించింది. ఇందుకు ఉదాహరణగా జర్మనీలో గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీ నిర్మాణాన్ని ఆపేసి.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడాన్ని బోస్టన్ నివేదిక ప్రస్తావించింది. పరిపాలన వికేంద్రీకరణకు బోస్టన్ గ్రూపు రెండు ఆప్షన్లను ప్రభుత్వానికి సూచించింది. మొదటి ఆప్షన్లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అమరావతిలో అసెంబ్లీతో పాటు కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్... కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్ కమిషన్లు ఉండాలని సూచించింది. రెండో ఆప్షన్లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్... అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్ కమిషన్లు ఉండాలని అభిప్రాయపడింది. రెండో ఆప్షన్ ఉత్తమమని కమిటీ పేర్కొంది. బీసీజీ.. అత్యుత్తమ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రపంచంలో అత్యుత్తమ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థల్లో బీసీజీ(బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్), మెకన్సీ, బెయిన్ అండ్ కంపెనీలు ప్రధానమైనవి. ఒక దేశం.. ఒక రాష్ట్రం, పరిశ్రమల స్థితిగతుల్ని అధ్యయనం చేసి.. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇవ్వడంలో ఈ సంస్థలు అత్యత్తమమైనవి. ఇందులో బీసీజీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అందువల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నడుంబిగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దానికోసం ప్రణాళికను రూపొందించే పనులను బీసీజీకి అప్పగించింది. రాష్ట్ర బడ్జెట్లో 8 శాతం అప్పుకే కట్టాలి ఒకే ప్రాంతంలో అభివృద్ధికి రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తే.. అందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల నుంచి 9 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 6–8 శాతం సమానంగా ఉంటుందని పేర్కొంది. ‘తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు. దీనికి బదులు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిచేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం మొత్తం రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చిస్తే రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు పెరుగుతుంది’ అని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా వేసింది. అప్పుడు ప్రాజెక్టుల పూర్తికి పెట్టిన పెట్టుబడిని 5 సంవత్సరాల్లో వెనక్కి రాబట్టుకోవచ్చని విశ్లేషించింది. అమరావతి నగరంపై రూ. లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదని, అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15–16 శాతం వృద్ధిరేటు నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని, అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయమని హెచ్చరించింది. 30కి పైగా నిర్మిస్తే.. అన్నీ విఫలం లక్షల కోట్లు చొప్పున వెచ్చించి ప్రపంచంలో నిర్మించిన 30కి పైగా కొత్త నగరాల్లో అన్నీ కూడా లక్ష్యాలను సాధించలేక చతికలబడ్డాయి. ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన గానీ, అభివృద్ధి గానీ సాధించలేకపోయారని బీసీజీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 1980 దశకంలో చైనాలో ప్రారంభించిన షెన్జెన్, భారత్‌లో నవీ ముంబయి మాత్రమే కొంతమేరకు లక్ష్యాల్ని సాధించాయని పేర్కొంది. మిగిలిన నగరాల నిర్మాణంతో ప్రజాధనం వృథా కావడం తప్ప వేరే ప్రయోజన మేమీ సాధించలేదని నివేదికలో తెలిపారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) విస్పష్టంగా పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ సిఫార్సులు చేసింది. న్యాయ, శాసన, పరిపాలనా వ్యవస్థలను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు ఆప్షన్లను సూచించింది. ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. రెండు ఆప్షన్లనూ పరిశీలించి, రాష్ట సమగ్రాభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ఉదాహరణలను పరిశీలించి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రధానంగా రాజధాని వ్యవస్థ ఎలా ఉండాలన్నది బీసీజీ సూచించింది. పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని పేర్కొంది. తద్వారానే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని చెప్పింది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందించగలమని అభిప్రాయపడింది. జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఈ విధంగానే సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నారని ఉదహరించింది. అన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించిన మీదట రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాలను రాజధాని ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సూచనలు రాష్ట్ర సుస్థిర, సమతులాభివృద్ధికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు సవివర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధానం ఉత్తమమనే అంశాల్ని బీసీజీ సిఫారసు చేసిందని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కమిషనర్ కార్యాలయంలో బీసీజీ నివేదికలోని అంశాలను శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నివేదికను హైపవర్ కమిటీకి రిఫర్ చేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం, మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సూచీలలో ప్రగతి సాధించేందుకు బీసీజీ సూచనలు.. - రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ(జీవీఏ) మరింతగా పెంపొందించవచ్చు. - కృష్ణా, గోదావరి బేసిన్ బయట ఉన్న 9 జిల్లాల్లో వ్యవసాయ ఉద్పాదకతను మరింతగా పెంచవచ్చు. - రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తిలో 60 శాతం రెండు జిల్లాల నుంచే లభిస్తోంది. ఇతర జిల్లాలపై మరింత దృష్టి సారించడం ద్వారా మత్స్య ఉత్పత్తిని వృద్ధి చేయవచ్చు. - ప్రధానంగా మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సి ఉంది. - ప్రస్తుతం రాష్ట్రానికి ఏటా 0.3 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చు. - చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితోపాటు రాష్ట్రం గుండా వెళ్తున్న అన్ని జాతీయ రహదారులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాలి. - రాయలసీమలో పంటల విస్తీర్ణాన్ని పెంపొందించాలి. కృష్ణా– గోదావరి బేసిన్లో 60 శాతం నుంచి 80 శాతం వరకు భూములు సాగుబడిలో ఉన్నాయి. కానీ రాయలసీమలో కేవలం 20 శాతం భూములు మాత్రమే సాగులో ఉన్నాయి. గోదావరి–పెన్నా నదుల అనుసంధానించాలి. సచివాలయానికి వస్తోంది ఇందుకే.. - ఏడాదికి మొత్తం లక్ష మంది సచివాలయానికి వస్తే, అందులో 75 శాతం మంది కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వచ్చారు. - ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా, ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. - మిగతావారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లుల కోసం వచ్చే వారే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి... (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) - ఎనలిటిక్స్, డాటా హబ్‌గా తీర్చిదిద్దాలి. - వైద్య పరికరాల ఉత్పత్తి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలి. - జీడి మామిడి, కాఫీ, పసుపు వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి. - భోగపురం విమానాశ్రయాన్ని నిర్మించాలి. - అరకులో ఎకో, వైద్య టూరిజంను ప్రోత్సహించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నిర్వహణ వేదికగా తీర్చిదిద్దాలి. గోదావరి డెల్టా అభివృద్ధికి...(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) - పెట్రో కెమికల్, ప్లాస్టిక్, సోలార్ పరిశ్రమలను నెలకొల్పాలి. - ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలి. - ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. - పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. - రోడ్ కనెక్టివిటీని పెంచుతూ బ్యాక్‌వాటర్ టూరిజం కేంద్రంగా కోనసీమ, హోప్ ఐలాండ్లను అభివృద్ధి చేయాలి. కృష్ణా డెల్టా అభివృద్ధికి... (కృష్ణా, గుంటూరు) - ఫుడ్ ప్రాసెసింగ్, సిరామిక్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - హైటెక్ సేంద్రియ వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించాలి. - బందరు పోర్టును నిర్మించాలి. - బహుళ వినియోగ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. - వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా చేస్తూ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలి. - ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. దక్షిణాంధ్ర జిల్లాల అభివృద్ధికి... (ప్రకాశం, నెల్లూరు) - ఆటోమొబైల్, టెలికాం ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి. - చిన్న తరహా, మధ్యతరహా కాగితం గుజ్జు, చర్మ, ఫర్నిచర్ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలి. - మత్స్య పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలి. - మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయాలి. - గోదావరి – పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. తూర్పు రాయలసీమ అభివృద్ధికి... (వైఎస్సార్, చిత్తూరు) - స్టీల్, ఎలక్ట్రానిక్స్, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. - టమాటో ప్రాసెసింగ్ యూనిట్లు వంటి హైటెక్ వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. - గండికోట, బెలూం గుహల (కర్నూలు జిల్లా) కేంద్రంగా ఎకో–అడ్వంచర్ పర్యాటక రంగ కేంద్రంగా తీర్చిదిద్దాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. పశ్చిమ రాయలసీమ అభివృద్ధికి... (కర్నూలు, అనంతపురం) - టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్ ఉద్యానవన పంటల సాగును పెంపొందించాలి. - విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ పెనుకొండ – రాయదుర్గం టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. చదవండి: బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
బీసీజీ నివేదికపై స్పందించిన ఆదిమూలపు
-
ఆరు అంశాల ఆధారంగా బోస్టన్ నివేదిక
-
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ నివేదికలో ప్రస్తావించింది. అదే విధంగా అభివృద్ధి సూచీల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించింది. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలు, వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించింది. అవి అనుకున్న లక్ష్యాలను సాధించాయా లేదా అన్న అంశాలపై గణాంకాలతో సహా వివరించింది. (సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బీసీజీ) అదే విధంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్యరంగాల్లో ప్రణాళికలను సైతం బీసీజీ తన నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు, దేశంలోని వివిధ రాష్ట్రాల బహుళ రాజధానుల గురించి నివేదికలో పేర్కొంది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించింది. రాష్ట్రం సత్వర ఆర్థికాభివృద్ధి, సత్వర ఫలితాల సాధనకై ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలో బీసీజీ తన నివేదికలో సూచించింది. కాగా రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.(జీఎన్ రావు, బీసీజీ నివేదికల అధ్యయనానికి.. హైపవర్ కమిటీ) ఆరు అంశాల ఆధారంగా బోస్టన్ నివేదిక విజయవాడ: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఆరు అంశాల ఆధారంగా నివేదిక సమర్పించిందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. అభివృద్ధికి అడ్డంకులు ఏమున్నాయన్న దానిపై కమిటీ పరిశీలించిందని పేర్కొన్నారు. బీసీజీ నివేదికలో పేర్కొన్న అంశాల గురించి శుక్రవారం మీడియాకు వివరించారు. వివిధ దేశాల అభివృద్ధి ఆధారంగా ఏపీ అభివృద్ధికి సూచనలు చేశారని పేర్కొన్నారు. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2.2 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించారు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి కృష్ణా, గోదావరి బేసిన్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి(వెస్ట్ గోదావరి, కృష్ణా) ఎక్కువగా ఉంది ఎయిర్‌పోర్టు, పోర్టు విషయంలో విశాఖ తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి చెందలేదు చేపల ఉత్పత్తి(60 శాతం) రెండు జిల్లాలోనే అధికంగా ఉంది రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది 8 జిల్లాల్లో ఇండస్ట్రియల్ ఏరియా తక్కువగా ఉంది పర్యాటకంలో గత రెండేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు కొన్ని కొన్ని మండలాలు నేషనల్ హైవే రావటానికి 4 ,5 గంటలు ప్రయాణం పడుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెడికల్ హబ్ టూరిజం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, బోగపురం ఎయిర్‌పోర్టు, పసుపు, కాఫీ పంటలు, అరకు లోయలో ఎకో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలి గోదావరి డెల్టాలో పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పోలవరం ప్రాజెక్టు, రోడ్ కనెక్టివిటీ, హార్టికల్చర్, కోనసీమ అభివృద్ధి చేయాలి కృష్ణా డెల్టాలో సిరమిక్స్, ఫిషరీస్, ఎడ్యుకేషన్ హబ్, మచిలీపట్నం పోర్టు, హెల్త్ హబ్ అభివృద్ధి చేయాలి దక్షిణ ఆంధ్ర.. ఆటోమొబైల్ మానిఫాక్చరింగ్ , లెదర్ అండ్ ఫిషరీస్, మై పాడు బీచ్, గోదావరి- పెన్నా లింకేజీ అభివృద్ధి చేయాలి వెస్ట్ రాయలసీమలో టెక్ట్స్ టైల్స్, ఆటోపార్ట్స్, సేంద్రీయ ఉద్యావన సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, గోదావరి పెన్నా అనుసంధానం, హైవే కనెక్టివిటీ ఈస్ట్ రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మానిఫాక్చరింగ్, స్టీలు ప్లాంట్లు, హైటెక్ అగ్రికల్చర్(టొమాటో ప్రాసెసింగ్), గండికోట, బేలం గుహల మధ్య ఎకో ఎడ్వంచర్ సర్క్యూట్ అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం(మాస్టర్ ప్లాన్) దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవసరం(ఏపీసీఆర్డీఏ శ్వేతపత్రం- జూన్ 2019 ప్రకారం) ఇందుకోసం ఏడాదికి దాదాపు 8 వేల నుంచి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ రాష్ట్రం ఇప్పటికే 2.25 కోట్ల రూపాయల రుణాల్లో కూరుకుపోయి ఉంది కేవలం ఒకే ఒక్క పట్టనానికి ఇంత ఖర్చు చేయడం రిస్కుతో కూడుకున్న పని నిజానికి కొత్త పట్టణాల అభివృద్ధికి దాదాపు 30 నుంచి 60 ఏళ్ల సమయం పడుతుంది చాలా వరకు గ్రీన్‌ఫీల్డ్ సిటీలు ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాయి సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా పరిశీలించాం అమరావతి ప్రాంతానికి వరదల ముప్పు ఎక్కువ(ఐఐటీ మద్రాస్, ఏపీ డిజాస్టర్ అథారిటీ వివరాల ప్రకారం) జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాలు బహుళ రాజధానుల ద్వారా ప్రభుత్వ సంస్థలు, పౌరుల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి కర్నూలు, అమరావతి, విశాఖపట్నం రాజధానులుగా అనుకూలం కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని మేలు అని సూచించింది. -
అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..
సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలపై క్షుణ్ణంగా చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీ త్వరలోనే సమావేశవుతుందని వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యోచిస్తున్నారని మంత్రి వెల్లడించారు. (చదవండి : సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బీసీజీ) అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం సాధ్యం కాదని మంత్రి తేల్చిచెప్పారు. అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో తెలియదని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాకు తాగు, సాగునీరు ప్రాజెక్టులు అవసరమని సురేష్ తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అందుకే వాస్తవ ప్రణాళికల అమలు జరగాలని అన్నారు. బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలను ప్రజలందరిలో చర్చకు పెడతామని అన్నారు. అసెంబ్లీలో కూడా సమగ్రంగా చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. (చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు) -
సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బీసీజీ
-
ఏపీ రాజధానిపై నివేదిక అందించిన బీసీజీ
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక సమర్పించింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీ భేటీ అనంతరం రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 6న హైపవర్ కమిటీ భేటీ అయి చర్చించనుంది. 20 లోపు ప్రభుత్వానికి రిపోర్టు అందించనుంది. హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. (చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని పేర్కొంటూ జీఎన్ రావు కమిటీ రెండు వారాల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ (శాసన రాజధాని), విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో (న్యాయ రాజధాని) జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు కీలక సూచనలు చేసింది. (చదవండి : జీఎన్ రావు, బీసీజీ నివేదికల అధ్యయనానికి.. హైపవర్ కమిటీ) -
‘మూడు రాజధానుల’పై కిషన్‌రెడ్డి కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందన్నారు. అధికారిక నిర్ణయం రాకముందే ఏపీ బీజేపీ నేతలు మాట్లాడడం, విమర్శించడం తగదని హితవు పలికారు. రాష్ట్రం, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించిన తర్వాత తమ పార్టీ అభిప్రాయం చెబుతామన్నారు. మూడు రాజధానులు అంశంపై కమిటీ నివేదిక వచ్చాక, విధివిధానాలు తేలిన తర్వాతే తమ అభిప్రాయం చెప్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అప్పటి వరకు బీజేపీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. కాగా, ఏపీలో వికేంద్రీకరణకు మొగ్గుచూపుతూ జీఎన్ రావు కమిటీ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కాంక్షిస్తూ జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. -
వాళ్లే వ్యతిరేకిస్తున్నారు: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఉగాది రోజు 25 లక్షల ఇళ్ళ పట్టాలను అందిస్తామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... మూడు రాజధానుల ఆలోచన మంచిదని.. అమరావతిలో రియల్ ఎస్టేటు వ్యాపారం చేసేవాళ్లే దీనిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై కమిటీలు అందించిన నివేదిక గురించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాదునే అభివృద్ధి చేశారు.. ‘రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాదునే అభివృద్ధి చేశారు. నిజానికి రాజధానితో పదిశాతం ప్రజలకు మాత్రమే పని ఉంటుంది. కోర్టులతో కూడా పదిశాతం ప్రజలకు మాత్రమే పని. మూడు రాజధానుల ఆలోచన ఎంతో మంచిది. రాయలసీమ వాసులంతా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలి. రాజధాని అంశంలో ఇకనైనా కార్మికుల పోరాటాలు, ధర్నాలు పక్కన పెట్టాలి’అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
సాక్షి, అమరావతి: సీనియర్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావుపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నోరుపారేసుకున్నారు. జీఎన్ రావు పనికిమాలిన వ్యక్తి అంటూ అక్కసు వెళ్లగక్కారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన జీఎన్ రావు వివిధ హోదాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్ ఏఐఎస్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయమై ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ అధికారిపై నోరుపారేసుకుంటూ.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో అధికారులను దుర్భాషలాడుతూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసింది. -
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో.. ఇప్పటికప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే.. రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వేసిన పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించాకే తగిన విధంగా స్పందిస్తామని, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టస్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 585ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిటీ నివేదికను అమలు చేయకుండా చూడాలని.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటివన్నీ అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రెండు అనుబంధ వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. భూముల అభివృద్ధి, రాజధానిపై నిర్ణయం వేర్వేరు అంశాలు: హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, జీఎన్ రావు కమిటీ ఏర్పాటు జీవో, తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జీవోలో ఎక్కడా సీఆర్డీఏ చట్టం ప్రస్తావన లేదన్నారు. దాని ప్రస్తావన లేకుండా రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ చట్టంలో ఎక్కడా నిర్ణీత కాల వ్యవధిలోగా భూముల్ని అభివృద్ధి చేసి ఇవ్వాలని లేదని.. రైతుల భూముల్ని అభివృద్ధి చేయడం గురించి మాత్రమే ఉందని పేర్కొంది. రైతుల భూములను అభివృద్ధి చేసి ఇవ్వడం, రాజధాని విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించింది. భూములిచ్చిన రైతులకు వారి భూములను అభివృద్ధి చేసి ఇవ్వడమే ముఖ్యమని, మిగిలిన భూమి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను మీరెలా తప్పు పట్టగలరని ప్రశ్నించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా.. తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఇంకా బీసీజీ నివేదిక రావాల్సి ఉందని.. ఈ దశలో ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. మా వాదనలూ వినండి ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న జీఎన్ రావు కమిటీ సిఫార్సులను సమర్ధిస్తూ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ధర్మాసనం ఈ వ్యాజ్యాలను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
జీఎన్ రావు, బీసీజీ నివేదికల అధ్యయనానికి.. హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, అవసరమైతే అడ్వొకేట్ జనరల్ సూచనలు తీసుకోవాలని హైపవర్ కమిటీకి దిశానిర్దేశం చేస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. కాగా, రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని సెప్టెంబరు 13న ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పలు సిఫార్సులు చేసింది. అవి ఏమిటంటే.. ►మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్లో ఉన్నట్లు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన (లెజిస్లేచర్) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో, శీతాకాల సమావేశంలో అమరావతిలో నిర్వహించాలి. విశాఖలో సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలి. అమరావతిలో హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి. ►అలాగే, అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాలను ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తయిన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. ►అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. ►సీడ్ యాక్సిస్ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానించాలి. ►శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలి. ఈ సిఫార్సుల నేపథ్యంలో.. త్వరలో రానున్న బీసీజీ నివేదికతోపాటు జీఎన్ రావు సూచనలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేయాలని ఈనెల 27న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ సభ్యులు బుగ్గన, పిల్లి సుభాష్‌చంద్ర బోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ సవాంగ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు, న్యాయ శాఖ కార్యదర్శులు -
'బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్ సాధ్యం కాదు'
సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికఅన్ని ప్రాంతాల అభివృద్దిని సూచించేలా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు మేం ఎక్కడా చెప్పలేదని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం వైఎస్ జగన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే వికేంద్రికరణలో భాగంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి భారీగా డబ్బులు దండుకున్నారని విమర్శించారు. అంతేగాక రైతుల వద్ద వేలాది ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించారని దుయ్యబట్టారు. ఆయన చూపించిన గ్రాఫిక్స్‌తో రాజధాని కట్టాలంటే రూ. లక్షా 15వేల కోట్లు అవసరం అవుతాయని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్యా అది సాధ్యపడదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రైతులకు వివరిస్తామని, వారు సానకూల దృక్పథంతో అర్థం చేసుకుంటారని తాము భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హైపవర్ కమిటీ నియమాకాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. లక్ష కోట్లు ఒక ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు చదరపు గజానికి రూ. 12వేలు వెచ్చించారని, అదే విశౠఖలో అయితే రూ. 4వేలతో పూర్తయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన రూ. వందల కోట్లతో విశాఖలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గతంలోనే విశాఖను రెండో రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా సూచించిందని చెప్పారు. -
హై పవర్ కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
-
నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులు సహా మొత్తం 16మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ కమిటీ ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలన చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్ తీర్మానం చేసింది. ఇక ఈ కమిటీలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్,సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, లా సెక్రటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. మూడు వారాల్లోగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అవసరం అనుకుంటే హై పవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయనానికి హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలనకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను కేబినెట్ ముందుంచారు. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని మీడియాతో తెలిపారు. ఆ వివరాలు ఇలా.. చంద్రబాబు హయాంలో జరిగిందిదీ.. ‘2015లో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైన కలల రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుని దేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను విస్మరించి అప్పటి మంత్రి నారాయణ బృందం ఇచ్చిన రిపోర్టును ఆమోదించింది. 2015–16లో రైతుల నుంచి 33 వేల ఎకరాలు, అసైన్డ్ లేదా ప్రభుత్వ, బంజరు భూమి 21 వేల ఎకరాలు కలిపి మొత్తం 54 వేల ఎకరాలు సేకరించింది. ఆ భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ. 2 కోట్ల వంతున సుమారు రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేసింది. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే అప్పటి పాలకులు అయిదేళ్ల పాలనలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో అప్పట్లో భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1,500 కోట్లు కాగా, రూ.4 వేల కోట్లకుపైగా నెలకు వందకు రూ.1.10 నుంచి రూ.1.15 వడ్డీతో అప్పు తెచ్చారు. ఈ అప్పునకు ఏటా వడ్డీ రూపంలో ప్రభుత్వం రూ.570 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని గొప్పగా చెప్పిన అనుభవమున్న అప్పటి ముఖ్యమంత్రి.. మౌలిక సదుపాయాల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక తయారు చేసి అయిదేళ్లలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అలాంటప్పుడు అనుభవం లేని, వాస్తవ దృక్పథం గల మనమేమి చేయాలని ఎవరైనా ఆలోచించాలి కదా? ఈ పరిస్థితిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ. 1.10 లక్షల కోట్లు వెచ్చించాలంటే.. కలల రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందనే అంశంపై మంత్రివర్గం వాస్తవ దృక్పథంతో చర్చించింది. రాష్ట్ర అవసరాల మాటేమిటి? అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 6 నెలల క్రితం పాత్రికేయులతో మాట్లాడుతూ.. తేగలిగినంత అప్పు మేమే తెచ్చాం. ఇక వీరికి ఎవరు అప్పు ఇస్తారు? అని అన్నారు. రూ.25 వేల కోట్లో రూ.50 వేల కోట్లో అప్పు తెచ్చుకుందామనుకున్నా చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో శంకుస్థాపనలు చేసిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.25 వేల కోట్లకు పైగా అవసరం ఉంది. స్కూళ్ల మరమ్మతులకు రూ.12 వేల కోట్లు, అధ్వానంగా ఉన్న ఆస్పత్రుల బాగుకు రూ.14 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద పేదల వైద్య అవసరాలు తీర్చడం కోసం రూ.3,150 కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు నీరివ్వడం కోసం సాగునీటి ప్రాజెక్టులకు వెరసి మరో లక్ష కోట్ల రూపాయలు అవసరం. అమ్మ ఒడికి ఏటా రూ.6 వేల కోట్లు, రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం ఏటా రూ.9 కోట్ల చొప్పున 5 ఏళ్లకు రూ.45 వేల కోట్లు కావాలి. రక్షిత నీరు లేని దుస్థితి.. గుక్కెడు రక్షిత మంచి నీటి కోసం ప్రజలు తపిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో సురక్షితంకాని నీరు తాగి ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు వాటర్ గ్రిడ్ కోసం రూ.40 వేల కోటు, గిరిజన, బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.35 వేల కోట్లు కావాలి. పేదలకు సబ్సిడీ బియ్యం సరఫరాకు ఏటా రూ.10 వేల కోట్లు, పేదల విద్యాభివృద్ధికి ఏటా రూ.6 వేల కోట్లు అవసరం. చదువు ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని మా ప్రభుత్వం నమ్మింది. అందుకే సంపూర్ణమైన ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. ఇవే కాకుండా రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం వాటా పోను రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. రోడ్ల నిర్మాణం చేపట్టాలి. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పేదలకు మౌలిక వసతులు కల్పించాలి. మా ప్రభుత్వం వ్యవసాయానికి పగలే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏటా మరో రూ.3 వేల కోట్లు కావాలి. ఈ విషయాలన్నింటినీ మంత్రి మండలి సమగ్రంగా చర్చించింది. మరి రాజధాని నిర్మాణం ఎలా? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలి. ఇవన్నీ వదిలి ఈ కలల రాజధానిని ఇక్కడ ఎప్పటికి నిర్మించగలం? ప్రజా సంక్షేమాన్ని, బాగోగులను, మౌలిక సదుపాయాల కల్పనను, పేదల చదువు, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితే వస్తే హైదరాబాద్తోనో, బెంగళూరుతోనో, చెన్నైతోనో ఎప్పటికి పోటీ పడగలం? అనేది సమగ్రంగా మంత్రిమండలి చర్చించింది. విస్తృత చర్చ, మంత్రుల తర్జనభర్జనల అనంతరం జీఎన్‌రావు కమిటీ నివేదిక, రాబోయే బీసీజీ నివేదిక రెండింటి అధ్యయనం కోసం హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయించింది. అందులో నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు. దానికి సంబంధించిన మార్గదర్శకాల గురించి చర్చించాం. రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేదు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజధాని మారుస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చి స్తాం. మా ప్రభుత్వం ఏ పని చేసినా ధైర్యంగా చేస్తుంది. జర్నలిస్టులపై దాడి జరిగిందని చెబుతున్నారు.. దాడి గురించి ఎవరైనా రాసిస్తే హోం మంత్రి, డీజీపీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం. దాడి జరిగినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. రాజధాని ప్రాంతంలోని రైతులే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు చేయాలన్నదే మా అధినేత ఆశయం. ఊహాజనితమైన కలల వల్ల కొందరు వ్యథ చెందుతున్నారనేది వాస్తవం. వారి ఆందోళన, దిగులు, బాధ పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తాం. మాది అమానవీయ ప్రభుత్వం కాదు. ఆదుకునే సర్కారు’ అని మంత్రి పేర్ని నాని వివరించారు. -
ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు
-
ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లోకయుక్త, సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం, జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చ వంటి అంశాలపై శుక్రవారం సమావేశమైన మంత్రిమండలి నిర్ణయాలకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎస్టీలకు 4 శాతం, ఎస్సీలకు 19.08, బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఈ మేరకు తీర్మానం చేశామని పేర్కొన్నారు. (జీఎన్ రావు కమిటీ నివేదికపై సూత్రపాయ చర్చ) హైపవర్ కమిటీ సమీక్ష అనంతరం తుది నిర్ణయం అలాగే రాజధానిపై జీఎన్‌రావు కమిటీ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించిందని, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి రాజధాని నిర్మాణం జరపాలా? లేక ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలా అనేదానిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. జీఎన్‌రావు కమిటీతో పాటు శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రిమండలి అధ్యయనం చేసిందన్నారు. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. రాజధాని భూములపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాజధాని రైతులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా ఉన్నారని అన్నారు. కలల రాజధాని నిర్మించారు.. సమావేశంలో పేర్ని నాని వివరాలను వెల్లడిస్తూ.. ‘గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన అవినీతి, కుంభకోణాలుపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించింది. వాటిపై మంత్రి మండలి చర్చించింది. చంద్రబాబుకు వాటాలు ఉన్న ఓ కంపెనీ రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసింది. కొందరు మంత్రులు కూడా భూములు కొనుగోలు చేశారు. ఆస్తులు అక్రమంగా కొన్నవారు శిక్ష అనుభవించక తప్పదు. న్యాయనిపుణుల సలహా అనంతరం వీటిపై విచారణను ఆదేశిస్తాం. 2015లో అప్పటి ప్రభుత్వం ఊహాజనితమైన రాజధాని నిర్మించాలని కలలు కన్నది. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కుతూ.. మంత్రి నారాయణ ఇచ్చిన నివేదిక మాత్రమే పరిగణలోకి తీసుకుంది. 33 వేల ఎకరాల రైతుల భూములను, మరో ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూములను కలిపి మొత్తం 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక లక్షా పదివేల కోట్ల పైచిలుకు అంచనా వేశారు. కానీ ఐదేళ్ల కాలంలో కేవలం 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు’ అని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర.. ‘దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబుల్సెన్స్ వాహనాలను గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భ్రష్టుపట్టించారు. వాటిని మరింత పటిష్టం చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. 412 కొత్త వాహనాలకు కొనుగోలు చేస్తాం. వాటి కోసం రూ.71 కోట్లు కేటాయించాం. అలాగే వైద్య సేవలు కోసం రూ. 60 కోట్లతో 656 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేస్తాం. కనీస మద్దతు ధరకు నోచుకోని, పసుపు, మిర్చి ఉల్లి, చిరుధాన్యాలు వంటి పంటలకు మద్దతు ధరలను ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా మంత్రిమండలి తీర్మానం చేసింది. కడప జిల్లా రాయచోటిలో నాలుగు ఎకరాల భూమిని వక్ప్ బోర్డుకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణం డీపీఆర్ తయారీకి రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వమే దీనిని సొంతగా నిర్మాణం చేయుటకు అనుమతులు మంజూరు చేశాం. రామాయపట్నం పోర్టుకు ముందడుగు పడింది. త్వరలోనే నిర్మాణం చేపడుతాం’ అని తెలిపారు. -
జీఎన్ రావు కమిటీ నివేదికపై సూత్రపాయ చర్చ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికలోని సూచలనపై కేబినెట్ సమావేశంలో సూత్రపాయంగా చర్చ జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి కురసాల కన్నబాబు కూడా ధ్రువీకరించారు. అయితే, రాజధాని విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక రావాల్సి ఉందని గుర్తుచేశారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక గురించి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని.. జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు అవినీతిపై నివేదిక.. కేబినెట్ భేటీకి ముందు మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక అందజేసింది. ఏసీబీ, విజిలెన్స్, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదిక సిద్దం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు -
‘గ్రాఫిక్స్ అభివృద్ధి కాదు.. వాస్తవ అభివృద్ధికి కృషి’
-
‘తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధే మా లక్ష్యం’
సాక్షి, అమరావతి : కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించామని చెప్పారు. రాజధాని నిర్మాణ విషయంలో అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులను సంతోష పరిచేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అమరావతిలో గ్రాఫిక్స్ అభివృద్ధి కాకుండా వాస్తవ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. రాజధాని అంటే కొత్త పట్టణాలు కాదు అని, రాజధాని అంటే సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మించడం అని అన్నారు. రాజధాని కోసం నగరాన్ని నిర్మించడం కాదు, నగరంలోనే రాజధాని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. తాత్కాలిక రాజధానిపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారని, ఈ రాజధానిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడులతో రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. గత ఐదేళ్లలో రాజధాని కోసం చంద్రబాబు నాయుడు రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టారని, అయినప్పటికీ ఒక్క శాశ్వత భవనం నిర్మించలేకపోయారని విమర్శించారు. అమరావతిని పూర్తి చేయాలంటే రూ. లక్ష పదివేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బును అప్పుగా తీసుకొస్తే వడ్డీలు చెల్లించడానికే కోట్ల రూపాయాలు అవుతాయన్నారు. డబ్బులు విచ్చలవిడిగా ఉంటే రాజధాని ఎలాగైనా నిర్మించుకోవచ్చని, కానీ రాష్ట్ర ఖజానాలో అంత డబ్బులేదన్నారు. తక్కువ ఖర్చుతో ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపైనే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంబటి పేర్కొన్నారు. బాబు అనాలోచిత నిర్ణయాలతో అప్పుల భారం పెరిగింది చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో అప్పుల భారం పెరిగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రూ. లక్షా పదివేల కోట్లతో రాజధాని నిర్మాణం అసాధ్యమన్నారు. రాజధాని విషయంలో అమరావతి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్‌నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఒకే చోట లక్షకోట్ల రూపాయల పెట్టుబడి అవసరమా అనేది జీఎన్ రావు కమిటీ సూచిందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిని నిట్టనిలువునా ముంచిన చంద్రబాబు... ఇప్పుడు రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
'స్వార్థపూరిత రాజకీయాలే చంద్రబాబు నైజం'
సాక్షి, విజయనగరం : జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిపాలన వికేంద్రీకరణ అవసరమని చెప్పినట్లు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర తెలిపారు. బుదవారం విజయనగరంలో నిర్వహించిన సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేశారు. స్వార్థపూరిత రాజకీయాలే చంద్రబాబు నైజమని రాజన్న దొర దుయ్యబట్టారు. కృష్ణా, గుంటూరు మాత్రమే అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే నిరంతరం ధర్నాలకు దిగుతున్నారని మండిపడ్డారు. చాళుక్యులు, శాతకర్ణులు తమ పాలనలో రాజధానులు మార్చిన చరిత్ర బాబు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేవలం 29 గ్రామాల కోసంఅత్యంత వెనుకబడిన జిల్లాలకు రాజధాని ఇవ్వడం తప్పా అంటూ నిలదీశారు. కుప్పిగంతులేయడమే తప్ప విశాఖపట్నం టీడీపీ నేతలు రాజధానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. జయప్రకాశ్ నారాయణ్, వెంకయ్యనాయుడు వంటి నేతలే వికేంద్రికరణపై మద్దతు ఇస్తుంటే.. చంద్రబాబు రాద్దాంతం చేస్తుండడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.ఇన్సైడ్ ట్రేడింగ్‌పై దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం : బొత్స అప్పలనర్సయ్య దశాబ్ధాల తరబడి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెనకబడిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై జగన్‌కు స్పష్టత ఉందని , జీఎన్ రావు కమిటి ఇచ్చిన నివేదికను యధావిధిగా అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికేంద్రికరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే, ఎంపీలంతా ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, హైకోర్టు బెంచ్‌లు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. -
టీడీపీ తీర్మానాన్ని వ్యతిరేకించిన కొండ్రు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజధాని అంశంపై సోమవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో భిన్న స్వరాలు విన్పించాయి. అమరావతికి మద్దతుగా తీర్మానాన్ని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ తదితరులు ప్రతిపాదించగా.. పలువురు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. జీఎన్ రావు కమిటీ ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణను ఆయన స్వాగతించగా.. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారిద్దరూ కోండ్రుకు అడ్డు తగిలినా ఆయన వెనక్కి తగ్గలేదు. అమరావతి రాజధానిగా ఉండాలన్న తీర్మానాన్ని కొండ్రు గట్టిగా వ్యతిరేకించారు. ఇంతలో అమరావతి ప్రస్తావన అనవసరమని మరికొందరు నేతలు కూడా చెప్పడంతో తీర్మానం చేయకుండానే సమావేశం ముగించారు. -
‘అందుకే మూడు రాజధానులు’
సాక్షి, విశాఖపట్నం : రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు పేద ప్రజల భూములను దోచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రూ. వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇంతకాలం చేసిన దోపిడీ చాలక.. ఇప్పుడు అమాయక రైతును రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి మోసపోవద్దని రైతును కోరారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులు నిరసనలు విరమించాలని కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పరచి వారికి అందజేస్తామని చేశారు. జీఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికపై ఈ నెల 27న నిపుణులతో చర్చించి, రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు మధ్య అసమానతలు ఉండకూడదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందాలనే మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. గత రెండు రోజులు నుంచి అమరావతి ప్రాంతంలో కొందరు నిరసన చేస్తుంటే ప్రతి పక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి ముసలి కన్నీరు కారున్నారు. సచివాలయం, హైకోర్టు ఉండడం వల్ల ఏ ప్రాంతం అభివృద్ధి జరగదు అని చంద్ర బాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దుర్భాలాడిస్తున్నారు. రాజధాని, రాజధాని కట్టడాలు పేరు చెప్పి వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. గత ప్రభుత్వ దోపిడిని అమరావతి వాసులు అర్థం చేసుకోవాలి. మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మోద్దు. రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం. జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. బీజేపీ నాయకులు సైతం వికేంద్రీకరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మధ్య అసమానతలు ఉండకూడదు అని పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నాం. 14 రాష్ట్రాల్లో సచివాలయం ఒక చోట, హైకోర్ట్ ఒక చోట ఉంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలి. ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రభుత్వం మాది. రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడోద్దు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
జీఎన్ రావు కమిటీ నివేదిక ద్వారా ప్రభుత్వనికి స్పష్టమైన సలహాలు
-
27న రాజధానిపై తుది నిర్ణయం : బొత్స
-
మూడు రాజధానులు స్వాగతిస్తున్నా: చిన్నికృష్ణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంశంపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ స్పందించారు. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ మంచి ఆలోచన అని, ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి మద్దతివ్వడం మంచి పరిణామని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతిలోనే జరిగిందని చిన్నికృష్ణ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే చెప్పారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. (3 రాజధానులను స్వాగతించాలి) కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందని అన్నారు. ఈ ప్రకటపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను స్వాగిస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి రాష్ట్ర ప్రజలను ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!) -
జిఎన్ రావు కమిటీ నివేదిక స్వాగతించిన న్యాయవాదులు
-
ఆ ప్రకటన అవాస్తవం: చిరంజీవి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆదివారం పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చిరంజీవి పేరుతో శనివారం నాటి ప్రకటనకు భిన్నంగా తెల్ల కాగితంపై ఆదివారం మరో ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిని ఖండిస్తూ చిరంజీవి వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. తెల్ల కాగితంపై తన పేరిట వచ్చిన ప్రకటన అవాస్తవమని, ఫేక్ అని స్పష్టం చేశారు. ఆదివారం తెల్లకాగితంపై వచ్చిన ప్రెస్‌నోట్ తనది కాదని, అలాంటి ప్రకటన తానివ్వలేదని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని, ఫేక్ ప్రకటనను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి శనివారం నాటి ప్రకటనలోని ముఖ్యాంశాలు ►అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ►మూడు రాజధానులు.. అమరావతి – శాసన నిర్వాహక, విశాఖపట్నం – కార్యనిర్వాహక, కర్నూలు – న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం ఆహ్వానించాల్సిన, స్వాగతించాల్సిన సందర్భం ఇది. ►ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ.లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది. ►రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది. ►శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు చూసినా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివినా, తాజాగా జీఎన్ రావు కన్వీనర్‌గా ఉన్న నిపుణుల కమిటీ సిఫార్సులు చూసినా అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం అన్నది నిర్వివాదాంశంగా కనిపిస్తోంది. ►రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు నివారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉంది. -
‘అడగకుండానే సీఎం జగన్ అన్ని ఇస్తున్నారు’
-
ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన: బొత్స
సాక్షి, విశాఖ : ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ముంబై తర్వాత విశాఖ అభివృద్ధి చెందే నగరమని కమిటీ గుర్తించిందన్నారు. రాష్ట్ర నైసర్గిక స్వరూపంతో పాటు ఆయా ప్రాంతాల్లో వనరులు వంటి అంశాలతో నివేదికను రూపొందించిందన్నారు. మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందన్నారు. మాటలు చెబుతూ, గ్రాఫిక్స్ చూపిస్తే పెట్టుబడులు రావని అన్నారు. రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మౌలిక వసతుల ఏర్పాటుకు సుమారు వెయ్యి కోట్ల విలువ చేసే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. త్వరలో మెట్రో రైలుకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. అలాగే రెండు నెలల కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడానికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి బొత్స తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధి, రాజధానులపై నిపుణుల కమిటీ వెయ్యి పేజీల నివేదిక ఇచ్చింది. ఈ నెల 27న కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుంది. అమరావతిలో చట్టసభలను కొనసాగించమని కమిటీ సూచించింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగనివ్వం. అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తాం. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్‌పై ఆధారాలతో సహా బయటపెట్టాం. విశాఖలో భూములకు సంబంధించి మాపై ఆధారాలు ఉంటే పేర్లతో సహా బయటపెట్టండి. అనధికార లే అవుట్లకు అనుమతి ఇస్తే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తాం. త్వరలోనే దీనిపై ప్రభుత్వ విధివిధానాలు రూపొందించి విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు. -
‘అడగకుండానే సీఎం జగన్ అన్ని ఇస్తున్నారు’
సాక్షి, విజయవాడ: అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ... జీఎన్ రావు కమిటీ నివేదికను ఆహ్వానిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, రాజధాని మార్చినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఉద్యోగులకు కావల్సిన అన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటులో చంద్రబాబు అందరి అభిప్రాయం తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని బొప్పరాజు అన్నారు. తాత్కాలిక కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాజధాని ఏర్పాటు అనేది మన ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్మించుకోవాలని, లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఏం కావాలో అడగకుండానే అన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి చరిత్ర సృష్టించారని, అడగకుండానే కార్మికుల జీతాలు పెంచారన్నారు. -
‘బాబు అనుకూల మీడియా సమాధానం చెప్పాలి’
సాక్షి, వైఎస్సార్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియా సపోర్ట్ చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. అభివృద్ధిని సమతుల్యం చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై నిపుణల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. జీఎన్ రావు కమిటీ 13 జిల్లాలో పర్యటించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచనలు చేసిందని తెలిపారు. జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనలనే సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారని అన్నారు. పాలనలో దూరదృష్టితోనే సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజమౌళి గ్రాఫిక్స్ చూపించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏం చేసినా స్వప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. 13 జిల్లాల రాష్ట్రానికి గ్రాఫిక్స్ రాజధాని అవసరమా అని ప్రశ్నించారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించాలనుకోవడాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు. దీనికి చంద్రబాబుకు అనుకూల మీడియా సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు అందరు సమర్థించాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు వన్‌సైడ్ ట్రేడింగ్ చేశారని.. ఆయన మైండ్ మార్చుకోకపోతే టీడీపీ మరింత దిగజారుతుందని విమర్శించారు. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారని భరోసా కల్పించారు. -
‘బాబు అనుకూల మీడియా సమాధానం చెప్పాలి’
-
మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖ : రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆకాంక్షించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహా నగరంగా మారుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. చినగదిలి మండలం కొమ్మాదిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో శనివారం ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకు తరలిస్తున్నామని నిర్ణయం తీసుకుంటే... దానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహోద్దేశంతో రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజధానిని ఇక్కడకు తరలించడం వల్ల ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఆయన హయాంలోనే రాజధాని విశాఖకు రావడం సంతోషకరమైన విషయం. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో, అన్ని సామాజిక వర్గాలకి, అన్నిప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు 13 జిల్లాలు...భవిష్యత్‌లో 25 జిల్లాలు... అన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు భీమిలి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రభావతి, కొప్పుల రమేష్‌తో పాటు పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి
-
వికేంద్రీకరణకే మొగ్గు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని(ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రికి నివేదిక అందచేసిన అనంతరం కమిటీ కన్వీనరు జీఎన్ రావు, సభ్యులు విజయమోహన్, ఆర్.అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారా>వు, కేటీ రవీంద్రన్, అరుణాచలంలు మీడియాతో మాట్లాడారు. (చదవండి : చేనేతలకు ఆపన్నహస్తం) కమిటీ ప్రధాన సిఫార్సులు.. ►మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి. ►అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోట ఉంచాల్సిన అవసరం లేదని కె.సి.శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకు అనుసంధానించాలి. ►శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ►పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వృథా కారాదు అమరావతిలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి... అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడినవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంబించాలి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. 2 వేల మంది రైతులతో మాట్లాడాం: జీఎన్ రావు రాజధాని, అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులమంతా అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని సూచనలు ఇచ్చాం. మాకు మొత్తం 38 వేల విజ్ఞాపనలు అందగా.. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాం. జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. వాటికి అనుగుణంగా అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్ర పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. రాజధానికి అనుకూలం కాదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలి. రాజధాని ఎక్కడో చెప్పడం మా పని కాదు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి, సమతుల్యతపై కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. మేము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవం. ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలి ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది. అందువల్ల ప్రాంతాల మధ్య అభివృద్ధి– సమతూకంపై అధ్యయనం చేసి సూచనలిచ్చాం. అదే సమయంలో రాష్ట్రంలోని అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరానికి దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి’ అని జీఎన్ రావు చెప్పారు. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చాకే... రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక కూడా వచ్చాకే.. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక రానుంది. ఈ రెండు నివేదికలపై ఒకేసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. అందువల్ల ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపైనే చర్చించకపోవచ్చని సమాచారం. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. ►రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ►అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి. ►గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి. ►రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. ►పొడవైన తీర ప్రాంతంలోని వైవిద్య భరితమైన పర్యావరణం, మడ అడవులు, బీచ్‌ల్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలి. ►పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త పోర్టులు ఏర్పాటు చేయాలి. రెండు పోర్టుల మధ్య కనీస దూరం, రోడ్డు, రైలు సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులు నెలకొల్పాలి. ►విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వమే సౌర విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టాలి. ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి ►పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. ►డెల్టా కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లీకేజీలు అరికట్టి.. ఆయకట్టుకు సమర్ధంగా నీటిని అందించేందుకు కాలువల వ్యవస్థను ఆధునికీకరించాలి. ►పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి. ►రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టి.. పచ్చదనాన్ని పెంచాలి. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఇవే.. 1. ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం 2. మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 3. దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 4. రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ►అన్ని ప్రాంతాల అభివృద్ధికి వనరులు,అవకాశాలకు అనుగుణంగా విస్తృత విధానాలు, వ్యూహాలు అమలు చేసి ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని కమిటీ ఆకాంక్షించింది.