టీడీపీ తీర్మానాన్ని వ్యతిరేకించిన కొండ్రు | TDP Leader Kondru Murali Supports Three Capital Formula | Sakshi
Sakshi News home page

మూడు రాజధానుల ప్రతిపాదనకు కొండ్రు మద్దతు

Published Tue, Dec 24 2019 8:06 AM | Last Updated on Tue, Dec 24 2019 11:52 AM

TDP Leader Kondru Murali Supports Three Capital Formula - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజధాని అంశంపై సోమవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో భిన్న స్వరాలు విన్పించాయి. అమరావతికి మద్దతుగా తీర్మానాన్ని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ తదితరులు ప్రతిపాదించగా.. పలువురు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. జీఎన్‌ రావు కమిటీ ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణను ఆయన స్వాగతించగా.. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారిద్దరూ కోండ్రుకు అడ్డు తగిలినా ఆయన వెనక్కి తగ్గలేదు. అమరావతి రాజధానిగా ఉండాలన్న తీర్మానాన్ని కొండ్రు గట్టిగా వ్యతిరేకించారు. ఇంతలో అమరావతి ప్రస్తావన అనవసరమని మరికొందరు నేతలు కూడా చెప్పడంతో తీర్మానం చేయకుండానే సమావేశం ముగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement