Kondru Murali Mohan
-
రాజాం టీడీపీలో వర్గపోరు
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగైపోయిన టీడీపీకి రాజాంలో జీవం పోయడానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ను అసమ్మతి సెగ వెంటాడుతోంది. ఇప్పటికీ పార్టీ అధిష్టానం చేస్తున్న కార్యక్రమాలు నచ్చక ప్రజలు కనీసం కన్నెత్తి చూడకపోగా, పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బ్యానర్ల కలకలం.. నాలుగు నెలలు క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ప్రజాదరణను జీర్ణించుకోలేక ఉనికి కోసం టీడీపీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. చివరకు పార్టీలోని నియోజకవర్గ పెద్దలు కూడా సహకరించడంలేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, ఆమె కుమార్తె గ్రీష్మాప్రసాద్‌లు రాజాం పట్టణంలో పలుచోట్ల భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇందులో కోండ్రు మురళీమోహన్ ఫొటో ఎక్కడా కనిపించకపోవడంతో పలువురు టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మురళీమోహన్ రాజాంపై పెత్తనంకోసం తనకు అన్యాయం చేయడం కారణంగానే ప్రతిభాభారతి కోండ్రును పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజాం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే తాను గెలిచే అవకాశాలు ఉండగా.. కోండ్రు రాకతో టికెట్ లభించలేదనే అభిప్రాయంలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో రాజాం నియోజకవర్గ టీడీపీ టిక్కెట్ తన కుమార్తె గ్రీష్మాప్రసాద్‌కు తెప్పించుకునే పనిలో ఆమె ఉన్నట్లు టీడీపీ తమ్ముళ్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. చదవండి: (బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి) అన్ని మండలాల్లోనూ అదే పరిస్థితి.. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సొంత మండలం రేగిడిలో టీడీపీని నడిపించే నాయకులు ఎవరూలేకపోవడం గమనార్హం. గతంలో క్రియాశీలకంగా ఉన్న కిమిడి రామకృష్ణంనాయుడు, ఆయన కుమారుడు వినయ్‌కుమార్‌లు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ►వంగర మండలంలో కోండ్రుపై వ్యతిరేక పవనాలు నడుస్తున్నాయి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్యాడర్ చాలా వరకూ వైఎస్సార్సీపీ గూటికి వెళ్లిపోయింది. కనీసం పోటీకి అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. ►సంతకవిటి మండలంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కొల్ల అప్పలనాయుడును ఇంతవరకూ గుర్తించలేదు. గతంలో ఎమ్మెల్సీ రాకుండా పెద్దలు అడ్డుకోవడంతో ఈయన చాలా తక్కువగానే పార్టీ కార్యక్రమాలకు హాజరౌతున్నారు. ►రాజాం పట్టణం, మండలంలో ప్రతిభాభారతికి అనుకూలంగా కార్యకర్తలు ఉన్నారు. దీంతో కోండ్రు కార్యక్రమాలు గాలిబుడగను తలపిస్తున్నాయి. -
టీడీపీ తీర్మానాన్ని వ్యతిరేకించిన కొండ్రు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజధాని అంశంపై సోమవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో భిన్న స్వరాలు విన్పించాయి. అమరావతికి మద్దతుగా తీర్మానాన్ని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ తదితరులు ప్రతిపాదించగా.. పలువురు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. జీఎన్ రావు కమిటీ ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణను ఆయన స్వాగతించగా.. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారిద్దరూ కోండ్రుకు అడ్డు తగిలినా ఆయన వెనక్కి తగ్గలేదు. అమరావతి రాజధానిగా ఉండాలన్న తీర్మానాన్ని కొండ్రు గట్టిగా వ్యతిరేకించారు. ఇంతలో అమరావతి ప్రస్తావన అనవసరమని మరికొందరు నేతలు కూడా చెప్పడంతో తీర్మానం చేయకుండానే సమావేశం ముగించారు. -
అధికార వికేంద్రీకరణకు ఓకే: టీడీపీ నేత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకుడు వ్యతిరేకిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు టీడీపీ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించాలని, ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. గురువారం ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. సహజసిద్ధ నగరమైన విశాఖపట్నానికి పరిపాలనా రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. టైర్-1 సిటీ కావాలంటే కచ్చితంగా విశాఖపట్నాన్ని పోత్సహించాలని అభిప్రాయపడ్డారు. 13 జిల్లాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే మెట్రో సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. మెట్రో సిటీతో ఉపాధి లభించడంతో పాటు పెట్టుబడులు తరలివస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో అమరావతి వచ్చి చూసిన వెళ్లిన కంపెనీలు అటు నుంచి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్లి పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. వైజాగ్‌ను పరిపాలనా రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, దీన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ వాదించడానికి లేదని, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ కంటే ప్రాంతం ముఖ్యమని స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామంటే అడ్డుకోవడం సరికాదని అచ్చెన్నాయుడుతో కూడా చెప్పినట్టు వెల్లడించారు. సింగపూర్ లాంటి రాజధాని కట్టడం వంద సంవత్సరాలైన అవదన్న విషయం తమ నాయకుడు చంద్రబాబుకు కూడా తెలుసునని చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబును ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని కొండ్రు మురళి వ్యక్తం చేశారు. కాగా, ఇంతకుముందు గంటా శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం జగన్ నిర్ణయం మంచిదని వ్యాఖ్యానించారు. సంబంధిత వార్తలు... బహుళ రాజధానులే బహుబాగు ‘ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు’ సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఒకేచోట అభివృద్ధితో సీమాంధ్రకు దారుణ నష్టం -
‘కోండ్రు’పై.. జనం గాండ్రింపు
సాక్షి, శ్రీకాకుళం: కోండ్రు మురళీమోహన్..ఈ పేరు వినగానే అందరి మదిలోనూ ఒక్కటే మెదులుతుంది. అడ్డూ, అదుపూ లేని నోటి దురుసుతనం, నిర్లక్ష్యం, అహంకార వైఖరే గుర్తుకొస్తుంది. అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడిన తీరే జ్ఞాపకం వస్తుంది. అలాంటి వ్యక్తి పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చి రాజాం ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచారు. 2004లో ఎచ్చెర్ల నుంచి, 2009లో రాజాం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కోండ్రు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును దుమ్మెత్తిపోసిన కోండ్రును టీడీపీలో ఎలా చేర్చుకుంటారని ఆ పార్టీ నేతలు ససేమిరా అన్నారు. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నా అతి కష్టమ్మీద టికెట్ దక్కించుకున్నారు. గతంలో ఆయన వ్యవహార శైలిని చూసిన వారు, విన్న వారూ ఇప్పుడు అమ్మో.. కోండ్రు అంటూ గాండ్రిస్తున్నారు..! 2009లో ఎన్నికైన కోండ్రు మురళీమోహన్ మంత్రి అయ్యాక మరింతగా దూకుడు పెంచి నోటికి పని చెప్పారు. అధికారులపైనా దుందుడుకుగా వ్యవహరించే వారు. తన వ్యతిరేకులపై కేసులు పెట్టించడం, జైలుకు పంపడం, వర్గాలను ప్రోత్సహిస్తూ అశాంతికి కారకులయ్యారని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కోండ్రు మురళి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన సోదరుడు జగదీష్ కూడా అధికారులపై జులుం ప్రదర్శించే వారని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కోండ్రును గెలిపిస్తే మళ్లీ అలాంటి రోజులే పునరావృతమవుతాయన్న ఆందోళన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అభివృద్ధి పేరిట అవినీతి కోండ్రు మురళి మంత్రిగా పనిచేసిన సమయంలో అభివృద్ధి పేరిట అవినీతికి పాల్ప డ్డారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మంజూరైన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే.. రాజాంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రోడ్డు విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం జరగలేదు. ♦ వమ్మి–రుషింగి మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేయలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ వంతెనకు రూ.27 కోట్లు విడుదల చేశారు. ♦ రేగిడి, వంగర మండలాల్లో రూ.49 కోట్లతో 135 గ్రామాలకు అందించాల్సిన భారీ రక్షిత మంచినీటి పథకాలు పూర్తి కాలేదు. ♦ రూ.40 కోట్లతో నిర్మించాల్సిన రాజాం–రణస్థలం రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ♦ రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, వంగర మండలాల్లో రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. రక్షిత మంచినీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ♦ మడ్డువలస రిజర్వాయరు పునరావాస బాధిత గ్రామాల ప్రజలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ ఏడు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదు. ♦ ఈ నిర్వాసితులు ఇంకా తమ గ్రామాలను ఖాళీ చేయలేదు. రికార్డుల్లో తరలింపు గ్రామాలుగా చేర్చడంతో ఎలాంటి సదుపాయాలకూ నోచుకోవడం లేదు. ఈ బాధితులంతా ఏళ్ల తరబడి అక్కడే శిథిల ఇళ్లలోనే మగ్గుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు. సొంతూరినే పట్టించుకోలేదు.. కోండ్రు మురళి సొంతూరు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం లావేటిపాలెం. అమాత్యునిగా అందలమెక్కినా తన సొంతూరినే ఆయన పట్టించుకోలేదు. లావేటిపాలెంలో ఇప్పటికీ పారిశుద్ధ్య లోపం తాండవిస్తోంది. ఊళ్లో బోర్లన్నీ ఉప్పునీటినే ఇస్తాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరిప్పించండి మహాప్రభో..! అని గ్రామస్తులు ఏళ్ల తరబడి వేడుకున్నా మంత్రి హోదాలో ఉండి కూడా మనసు కరగలేదు. సొంతూరికి మంచినీళ్లే ఇవ్వలేని నాయకుడు తమ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తారని రాజాం నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
కోండ్రు.. అవినీతి బ్రాండ్
సాక్షి, శ్రీకాకుళం: అవినీతి చక్రవర్తి కోండ్రు మురళీమోహన్ మరోమారు రాజాం నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో కోట్లాది రూపాయలు దండుకున్న ఈయనకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పడంతో పత్తాలేకుండా పోయారు. అప్పట్నుంచి నియోజకవర్గ ప్రజలపై కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం టీడీపీలో చేరగా, మంత్రిగా తన హయాంలో చేపట్టి అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులు కొనసాగించడంలో చొరవ చూపలేదు. అయితే అప్పట్లో కాంట్రాక్టురు అవతారమెత్తిన తన సోదరుడు జగదీష్‌తో కలసి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం ఒత్తిళ్లు, నిధుల నిలుపుదల, ఇసుక అవినీతి బాగోతం కార్యకర్తలపై నెట్టేయడం వంటి అరాచకాలు సృష్టించారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న ఈయన్ను ఓడించేందుకు ఆ పార్టీలో అసమ్మతి వర్గం చాపకింద నీరులా తమ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫొటోలోని రహదారి సంతకవిటి మండలం మల్లయ్యపేట–హొంజరాం గ్రామాల మధ్య నిర్మించారు. కోండ్రు మురళీమోహన్ మంత్రిగా ఉన్న సమయంలో రూ.86 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో రాజాం వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంట్రాక్టరు వద్ద భారీగా ముడుపులు అందుకోవడంతో రోడ్డు నిర్మాణం నాసిరకంగా మారింది. మరోవైపు ఇదే రహదారి మీదుగా మేడమిర్తి, తమరాం, కేఆర్‌పురం గ్రామాల నుంచి కోండ్రు మురళీ రాత్రిళ్లు ఇసుకను తరలించేవారు. ఈ క్రమంలో మందరాడ వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో పోతురాజుపేట గ్రామానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రస్థాయిలో సంచలనం రేపగా, ఇసుక అక్రమ రవాణాను కోండ్రు పార్టీ కార్యకర్తలపై నెట్టేసి తప్పుకున్నారు. అవినీతి, అరాచకాలే... ఐదేళ్ల కిందట కొండ్రు మురళీమోహన్ మంత్రి హోదాలో రాజాం నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ చాలా పనులు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. కోట్ల ఖర్చుతో అరకొరగా పనులు చేయగా, మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈయనకు టిక్కెటిచ్చి జీవితాన్ని ప్రసాదించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపైనే మంత్రి పదవి కోసం బురద జల్లే ప్రయత్నం చేశారు. వర్గవిభేదాలను ప్రోత్సహించేందుకు అంతర్గత ముఠా రాజకీయాలు చేశారు. రోడ్లు, భవనాల నిర్మాణాల పనులు కట్టబెట్టేందుకు తన సోదరుడు కోండ్రు జగదీష్‌ను కాంట్రాక్టురుగా అవతారమెత్తించారు. మరోవైపు కాంట్రాక్టులు దక్కించుకున్న వారి నుంచి కమీషన్ల కోసం ఒత్తిళ్లు చేయడం, ఇవ్వకుంటే నిధుల నిలుపుదల చేయడం, అర్ధంతరంగా పనులు ఆపివేయడం చేసేవారు. అంతేకాదు విశాఖపట్నంలో ఇసుక వ్యాపారం నిమిత్తం తన అనుచురలతో సంతకవిటి, రేగిడి మండలాల నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఈ బాగోతాలతో అప్పటి మంత్రి కోండ్రు మురళీమోహన్‌పై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాజాం నియోజకవర్గ ఓటర్లు ఈయనకు డిపాజిట్ దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించారు. అప్పట్నుంచి రాజాం నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఈయన ఆర్నెల్ల క్రితం టీడీపీలో చేరారు. అయినప్పటికీ ఈ పనులు పూర్తి చేయకపోవడం సంగతి అటుంచితే కనీసం వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్ వస్తుందని మొదటి నుంచి ఆశపెట్టుకుని భంగపడిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి రగలిపోతున్నారు. ఈమెను కాదని స్థానికేతరుడైన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. దీంతోపాటు మంత్రి కళా వెంకటరావు సొంత మండలం రేగిడి నుంచి ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో ఈయన అరాచకాలు, దౌర్జన్యాలతో ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని కుదేలై ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరలా అవినీతి అక్రమాలకు తెగబడతారని బెంబేలెత్తుతున్నారు. రాజాం నుంచి రణస్థలానికి బీటీరోడ్డు నిర్మించారు. ఈ రహదారిలో శ్యాంపురం వద్ద కోండ్రు గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. అంతేకాకుండా రాజాం నుంచి తన స్వగ్రామమైన లావేరు మండలం చేరుకునేందుకు ఈ రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టరుతో కుమ్మక్కై నాసిరకంగా రహదారి నిర్మించినా పలు చోట్ల అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. అంతే కాకుండా రాజాంలో ఎస్సీ బాలుర వసతి గృహాల భవనాల్లోనూ, ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాల నిర్మాణంలోనూ దండిగా కమీషన్లు లాగారు. అవినీతికి కాంట్రాక్టర్లు సహకరించకపోవడంతో ఈ రెండింటికి బిల్లులు నిలుపుదల చేయడంతో ఇప్పటికీ ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ఫొటోలో వాటర్ ట్యాంకు సంతకవిటి మండలం జావాం వద్ద రూ.49 కోట్లతో నిర్మించారు. దీనిద్వారా సంతకవిటి, రేగిడి, రాజాం మండలాల్లోని 136 గ్రామాలకు తాగునీటిని అందించాల్సి ఉంది. కాంట్రాక్టరు వద్ద కమీషన్ కోసం కోండ్రు డిమాండ్ చేయడంతో పనుల్లో నాణ్యత లోపిం చింది. ఫలితంగా గత కలెక్టర్ లక్ష్మీనరసింహం ఈ రక్షిత పథకం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ధ్రువీకరించి పథకం ప్రారంభాన్ని నిలుపుదల చేశారు. ఈయన బదిలీపై వెళ్లిన వెంటనే తూతూమంత్రంగా పనులు చేసి మమ అనిపించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికి పది గ్రామాలకు కూడా పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాలేదు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న వంతెన నిర్మాణం వంగర మండలం రుషింగి – వీరఘట్టం మండలం కిమ్మి గ్రామాల మధ్య నాగావళిపై చేపట్టారు. రూ.27 కోట్లతో 2012లో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ప్రజలకు సేవచేసే నాయకుడినంటూ చెప్పుకొంటున్న కోండ్రు ఏ ఒక్క రోజైనా ఈ వంతెన నిర్మాణంపై సమీక్షించిన పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
కోండ్రు కిరికిరి!
కోండ్రు మురళీమోహన్... నిన్నటివరకూ కాంగ్రెస్‌లో ఎదిగి ఓ వెలుగు వెలిగిన నాయకుడు! ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు రాజాం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అప్పటివరకూ రాజాంలో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభా భారతి అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు. వారితో సర్దుకుపోతానన్న కోండ్రు కూడా ఇప్పుడు ఇన్చార్జిగా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రధానంగా రాజాంలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఏవైనా వ్యతిరేక పవనాలు వీస్తే అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగేలా సన్నాహాలు చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వ్యూహాలకు అనుగుణంగా తన సన్నిహితుల ద్వారా కార్యచరణనూ ప్రారంభించారు. ఇది గ్రహించిన కిమిడి, కావలి అనుచర గణాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:రాజాంలో టీడీపీ ఇన్చార్జిగా కోండ్రు మురళీమోహన్ మూడు నెలల క్రితమే నియమితులయ్యారు. సక్రమంగా రెండు వారాలే గడిచాయి. తరువాత నుంచి నియోజకవర్గంలో వర్గవిభేదాలు ప్రారంభమయ్యాయి. కోండ్రు చాపకింద నీరులా ప్రతీ మండలంలోనూ టీడీపీలో రెండో వర్గాన్ని తయారుచేసి తటస్థుల ముసుగులో వారిని వెనుక తిప్పుకోవడం దీనికి కారణమైంది. వీరి కనుసన్నల్లోనే ఆయా మండలాల్లో టీడీపీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీరంతా టీడీపీ ప్రధాన నేతల వ్యతిరేక వర్గీయులు కావడం విశేషం. రాజాం నగర పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి వ్యతిరేక వర్గీయులను కోండ్రు ప్రోత్సహిస్తున్నారు. వారికి కాంట్రాక్ట్ వర్క్‌లు అప్పగిస్తూ తన పెత్తనాన్ని సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రతిభాభారతి వర్గం ఇబ్బందులు పడుతోంది. మరోవైపు వంగరలో సంక్షేమ పథకాలు మంజూరు బాధ్యతను తన వర్గానికి చెందిన వారికి అప్పగించి అక్కడ కూడా అసలు వర్గాన్ని పక్కనపెట్టారు. అంతేకాకుండా వారిలో కొంతమందికి కొత్త హామీలు గుప్పించి పూర్తి్తగా కోండ్రు వర్గంగా మార్చుకుంటున్నారు. సంతకవిటిలో టీడీపీ నేత కొల్ల అప్పలనాయుడును ఏడాది క్రితం ఆ మండలంలో జరిగిన ట్రేడింగ్ స్కాంను అడ్డుపెట్టుకుని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా మొదటినుంచి టీడీపీలో ఉన్న కొంతమందిని పక్కనపెట్టారు. కిమిడి కుటుంబమే టార్గె్గట్... కోండ్రు మురళీమోహన్ ఆది నుంచి సొంత పెత్తనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. గతంలో రాజాం నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్యేగా గెలుపొందిన కోండ్రు... ఆయన మరణాంతరం మంత్రి పదవి కూడా పొందిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత కాలంలో వైఎస్సార్‌పై బురదజల్లే ప్రయత్నం చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. అదేసమయంలో ఇటు ధర్మాన ప్రసాదరావు, విజయనగరం జిల్లాలో ఎంపీ బొత్స ఝాన్సీతోనూ విభేదాలు పెంచుకున్నారు. ఆ ధీమాతోనే 2014 ఎన్నికల్లో బరిలోకి దిగిన కోండ్రుకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు టీడీపీలో ఉన్నా కోండ్రు మళ్లీ ఆ పథకాన్నే అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం గమనార్హం. రాజాం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కైన రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకటరావు కుటుంబాన్ని పక్కనపెట్టే పనిలో పడ్డారు. దీంతో రేగిడి మండలంలో టీడీపీ మండల అ«ధ్యక్షుడు కిమిడి వినయ్‌కుమార్‌తో పాటు వైస్ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడు వర్గీయులను పూర్తిగా పక్కకు నెట్టి అక్కడ కిమిడి వ్యతిరేక వర్గీయులుకు ప్రోత్సహించడం ప్రారంభించారు. చివరకు రెండు రోజులు క్రితం ఈ మండలంలోని టీడీపీ నేతలు కోండ్రు వైఖరికి నిరసనగా సమావేశాలు పెట్టుకున్నారు. కోండ్రు వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. తనపై వ్యతిరేకతను టీడీపీ నేతలపైకి నెట్టుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గంలోని మండలాల్లో తనకంటూ తయారు చేసుకున్నారు. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో తనకు అనుకూలంగా వారంతా ఉండకపోవడంతో వారిని స్థానికసంస్థల ఎన్నికల్లో ఓడించేందుకు కష్టపడ్డారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయినా చాలా పంచాయతీల్లో ఈ పాచిక పారలేదు. అంతేకాకుండా ఆ వ్యవహారశైలి కారణంగానే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలంతా కోండ్రును తమ పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక టీడీపీలో చేరిన కోండ్రు... పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు వచ్చిన కొద్ది రోజులైనా గడవకముందే వర్గాలను ప్రోత్సహించడం ప్రారంభించారు. దీంతో పాటు ప్రజల్లో ఆయనపై గతంలో ఉన్న వ్యతిరేకత కారణంగా గ్రామదర్శిని కార్యక్రమాలకు, జన్మభూమి మా ఊరు కార్యక్రమాలకు ప్రజలు ముఖం చాటేశారు. ఈ వ్యతిరేకతను టీడీపీపై, గతంలో ఉన్న నాయకులపై ఉన్న వ్యతిరేకతగా కోండ్రు ప్రచారం చేయడం ప్రారంభించారు. వీటిని సహించలేక టీడీపీకి అనుకూలంగా ఉన్నవారంతా కోండ్రు వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. చివరిలో స్వతంత్ర అభ్యర్థిగా... రాజాం నియోజకవర్గంలో టీడీపీకి ప్రధాన పట్టు కిమిడి కుటుంబమే. గతంలో ఈ వర్గం మద్దతుతో టీడీపీ గెలిచిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. అటువంటి కిమిడి కుటుంబానికి వ్యతిరేకంగా కోండ్రు వ్యవహరించడంతో పాటు తన పాత స్నేహితులను, టీడీపీ ప్రధాన నేతల వ్యతిరేక వర్గీయులను ఈయన ప్రోత్సహించడంపై సర్వత్రా అలజడి నెలకొంది. ఇదే తరుణంలో కోండ్రు సన్నిహితులు కూడా ప్రస్తుతం రాజాంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేదని చెప్పడంతో సొంతంగా క్యాడర్ తయారు చేసుకునే పనిలో కోండ్రు పడ్డారు. చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థి పేరుతో బరిలో దిగి గెలిచిన తరువాత గెలుపొందిన పార్టీలోకి చేరిపోదామనే సంకేతాన్ని కూడా తన అనుచరుల్లోకి పంపుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీకి కోండ్రు కిరికిరి పెద్ద తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. -
వర్షాలు తక్కువ పడతాయని ముందే తెలుసు
రాజాం: వర్షాలు తక్కువుగా పడతాయని తనకు ముందే తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది 32 శాతం తక్కువుగా వర్షపాతం నమోదైందని, నదుల అనుసంధానంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తుంటే కేంద్రం రెండు రాష్ట్రాల మద్య వివాదం పెడుతోందని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్ట్ ప్రారంభించామని, మడ్డువలస ప్రాజెక్ట్ జలగం వెంగళవారం శంకుస్థాపన చేసి వదిలేస్తే తానే పూర్తిచేశానన్నారు. నాగావళి, వంశధార నదులను కలిపానని, గోదావరి నది నీటిని శ్రీకాకుళం తెస్తామని చెప్పారు. 10 శాతం వడ్డీ చెల్లించి రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని, సంక్రాంతి అనంతరం మొత్తం మాఫీ అవుతుందని పేర్కొన్నారు. రూ. 24 వేల కోట్లుతో రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 67 సాగునీటి ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఘనత తనదేనన్నారు. సేంద్రియ ఎరువులతో రైతులకు ఎరువుల కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం ఓబురైజేషన్ యాప్ తీసుకొస్తున్నామని చెప్పారు. మోదీ మోసగిస్తున్నారు.. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసగిస్తోందని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అడిగితే సీబీఐ పేరుతో భయపెడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సీబీఐ కారణంగానే మోదీకి వత్తాసుగా ఉన్నారన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు అప్పగించడం సబబుకాదన్నారు. తమ వద్ద అన్ని రికార్డులు ఉండగా కేంద్రం జోక్యం చేసుకోవడంతో తనపై కుట్రజరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. త్రిపుల్ తలాక్‌ను తెరపైకి తీసుకొచ్చి తమకు నచ్చినట్లుగా చట్టాన్ని మార్చుకుంటున్నారని, కేరళలో ఒక విధానం, ఆంధ్రాలో ఇంకో విధానం అమలుచేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించడం కక్షసాధింపేనన్నారు. జగన్‌పై సీబీఐ కేసు విషయంలో ఏడాదిలోగా అరెస్టు చేస్తామని మోదీ హామీ ఇచ్చి ఆ తరువాత పక్కనపెట్టేశారని, ఇప్పుడు మళ్లీ మొదటినుంచి దర్యాప్తు చేస్తే కేసుకు ఆధారాలు ఉండవని అన్నారు. మహిళల ఆగ్రహం.. చంద్రబాబు ప్రసంగిస్తుండగా మధ్యలో పలువురు మహిళలు గట్టిగా కేకలు వేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేశాను, ఇళ్లు ఇచ్చానని చెప్పి చప్పట్లు కొట్టమని ప్రజలను కోరగా సంతకవిటి మండలం తాలాడకు చెందిన పలువురు మహిళలు తమకు పక్కా ఇళ్లు ఎక్కడ ఇచ్చారని తిరిగి ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందలేదని నినదించారు. రాజాం మండలానికి చెందిన మహిళలు పసుపు కుంకుమ నిధులు రాలేదని చేతులను అడ్డంగా ఊపుతూ నిరసన తెలిపారు. వీరిలో కొంతమందిని అక్కడ పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలని రైతులు గట్టిగా అరుస్తూ నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది మహిళలు నిరసనగా లేచి వెళ్లిపోయారు. సభకు జనాల్ని తరలించడానికి 120 బస్సుల్ని వినియోగించినా.. సభలో జనం పలుచగానే ఉన్నారు. విఫలమైన ప్రతిపక్షనేత చంద్రబాబు! నోరుజారిన కోండ్రు ‘‘రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్ని విధాలా విఫలమయ్యారు. ప్రజాస్వామ్యమంటే కనీస గౌరవం లేని నాయకుడు చంద్రబాబు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్లలేదు. పెద్దలంటే కనీసం గౌరవం లేదు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించడంలేదు. అసెంబ్లీలో ఒక ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేదు’’ అంటూ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ప్రసంగం ప్రారంభించారు. కోండ్రు మాట్లాడుతున్న తీరు చూసి చంద్రబాబు సైతం విస్తుపోయారు. ఇంతలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కోండ్రును అప్రమత్తం చేయగా తేరుకున్న ఆయన చెంపలేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రపంచ మేధావి అంటూ ఆకాశానికెత్తారు. కోండ్రు మాటలు విని ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు. -
ఆంధ్రుల గొంతు నొక్కేస్తున్న చంద్రబాబు
పాత శ్రీకాకుళం : చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర ప్రజల గొంతును నొక్కేస్తున్నారని మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ దుయ్యబట్టారు. శనివారం ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద్ విజయవంతమైతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదనే ఉద్దేశంతోనే చంద్రబాబు రాష్ట్రబంద్‌ను పోలీసులతో అణగదొక్కించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర విభజన జరగక ముందే యూపీఏ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని గుర్తు చేశారు. టీడీపీ నేతలు రోజుకో మాట, పూటకో అబద్ధం చెబుతూ ప్రత్యేక హోదాను పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీలో ఒకమాట, బయటకొచ్చాక మరోమాట మారుస్తూ రాష్ట్ర ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని చెప్పారు. బంద్‌ను పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు కుటిల రాజకీయ అస్త్రాలను ప్రయోగించారని దుయ్యబట్టారు. ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్ద.. అరసవల్లిలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్ వద్ద ప్రత్యేక హోదా కోరుతూ శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, విశాఖపట్నంను రైల్వేజోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోల జగన్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చౌదరి సతీష్, పీసీసీ అధికార ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి, కాంగ్రెస్ నేతలు గంజి.ఆర్.ఎజ్రా, నంబాల రాజశేఖర్, బాణ రాము, అల్లిబిల్లి రాధా, కేవీఎల్ ఈశ్వరి, వైశ్యరాజు మోహన్, ఎల్.నారాయణ రావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వం పోయింది
ఎచ్చెర్ల: ‘సర్వం నాశనమైపోయింది.. పంటచేతికందే పరిస్థితి లేదు..ఎలా బతకాలో అర్థం కావడం లేదు..’ ఇదీ..పీసీసీ బృందం వద్ద అన్నదాతల మొర. పీసీసీ అ ధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, కోండ్రు మురళీమోహన్, కిల్లి కృపారాణి తదితరులతో కూడిన బృందం..హుదూద్ బాధితులను గురువారం పరామర్శించింది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామా ల్లో తుపాను నష్టాలను పరిశీలించారు. పాడైన వరి, అరటి, చెరుకు పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎర్రన్నాయుడు, కన్నప్పడు, నేతింటి నీలమప్పడు, పంచిరెడ్డి రాంబాబు తదితరులు సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారులు కనీసం పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రావులపాలెం నుంచి అరటి విత్తనాలను తెచ్చి పంటను సాగు చేశామని, ఎకరాకు రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టామని, పంట నెలరోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో నేల పాలైందని వాపోయారు. పొట్టదశలో ఉన్న పైరును గాలులు చీల్చేశాయని, దీంతో తెగుళ్లు ఆశిస్తున్నాయని పేర్కొన్నారు. రుణమాఫీ హామీతో మోసం రుణమాఫీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని రైతులు పేర్కొన్నారు. గ తంలో రుణం తీసుకున్న వెంటనే..బీమా చేసేవారమని..ప్రస్తుతం రుణమాఫీ, రీషెడ్యూల్ లేదు సరికదా..కనీసం పంటల బీమాకు కూడా దూరమయ్యామంటూ..ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు మా ట్లాడుతూ..రైతులకు న్యాయం జరిగేంత వర కు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ డోల జగన్, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, పైడి రవి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రిగారి బంపర్ ఆఫర్ : సై అంటే రూ.3 లక్షలు!
మాజీ మంత్రి కోండ్రు బంపర్ ఆఫర్? కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే నజరానా అయినా ముందుకురాని నేతలు ఒక్క వంగరలోనే ఇద్దరి నామినేషన్ మిగతా మండలాల్లో పడని బోణీ రాజాం: జాతీయ పార్టీ తరఫున పోటీ చేయడమంటే చిన్న విషయం కాదు. గెలిచినా.. ఓడినా పోటీ చేశారన్న గుర్తింపే చాలన్నట్లు చాలామంది టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటారు. అదీ.. దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఏలిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అయితే ఇక చెప్పేదేముంది. మహా మహా నేతలే టిక్కెట్లు దొరక్క ఉసూరుమన్న సందర్భాలు కోకొల్లలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. స్థానిక ఎన్నికలకే అభ్యర్థులు దొరకని దీనస్థితిలో పడిపోయింది. అందుకేనేమో.. మాజీమంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలో ప్రాదేశిక నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడితే చాలు.. రూ. 3లక్షలు ఇస్తామన్నది సదరు ఆఫర్ సారాంశం. ‘రండి బాబు.. రండి.. బీ ఫారంతోపాటు రూ.3 లక్షలు తీసుకెళ్లండి.. పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయండి’.. అని తన అనుచరగణం ద్వారా స్థానిక నాయకులకు ఎర వేస్తున్నారు. అయినా ఇప్పటివరకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగుస్తున్నప్పటికీ నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున ఒక్క వంగర మండలంలో రెండు ఎంపీటీలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. వంగరలో 12 ఎంపీటీసీలకు గాను రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో కాంగ్రెస్ తరఫున బోణీ పడలేదు. గురువారం మధ్యాహ్నం 3గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు. దీంతో మాజీ మంత్రి పరిస్థితి కుడితిలో పడిన ఎలక చందంగా తయారైంది. తను ప్రకటించిన బంపర్ ఆఫర్ చివరి రోజైనా నేతలను అకర్షించి అభ్యర్థులుగా మారుస్తుందేమో చూడాలి. -
కోండ్రుకు దెబ్బ మీద దెబ్బ
రాజాం, న్యూస్‌లైన్ : మొన్న పాలవలస శ్రీనివాసరావు, నిన్న దుప్పలపూడి శ్రీనివాసరావు, నేడు పొట్టా చిట్టిబాబు ఇలా రోజుకు ఒకరు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ఏకాకిగా మారుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మందిమాగతులతో.. అధికార లాంచనాలతో వీఐపీ భద్రతతో రాజాం నియోజకవర్గంలో తిరిగిన కోండ్రు నేడు ఒంటరయ్యారు. ఐదేళ్ల పాటు ఆయనకు కుడి భుజంగా వ్యవహరించిన మారేడు బాక మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త దుప్పలపూడి శ్రీనివాసరావు, ఎడమ భుజంగా ఉన్న పాలవలస శ్రీనివాసరావులు రెండురోజుల వ్యవధిలో అనుచర గణంతో పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరడంతో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టు అరుు్యంది. మొదటి నుంచి కోండ్రును వ్యతిరేకిస్తూ వస్తున్న పీసీసీ సభ్యుడు పొట్టా చిట్టిబాబు వైఎస్ఆర్ పార్టీ తీర్ధం తీసుకోవడంతో కోండ్రుకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో పాటు సంతకవిటి మండలంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కైన మాజీ డీసీసీబీ చైర్మన్ వర్గీయులు కూడా వైఎస్ఆర్ సీపీలో చేరడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు రేగిడి, వంగర మండలాల్లో పలు పంచాయతీల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు పార్టీ వీడేందుకు సమాయత్తం అయ్యారు. దీంతో ప్రస్తుత రాజకీయాలు మాజీ మంత్రికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేసినప్పటికి అనుచర వర్గం పార్టీని వీడి ఎందుకు వెళ్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరిందని, ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని సన్నిహితులు ఆయన వద్ద ప్రస్తావించడం గమనార్హం. రాజాం మెయిన్ రోడ్డు విస్తరణ, తొమ్మిదేళ్ల పాటు నగర పంచాయతీ కోర్టు కేసులో చిక్కుకున్నా పరిష్కరించక పోవడం, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు తోటపల్లి నుంచి సాగునీరు సరఫరాలో విఫలం కావడం, సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేయడంతో ప్రజలు మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన వద్ద ప్రస్తావించినా అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
ఏపీ పీసీసీకీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఏపీ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంటును నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు సాగిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన ఎన్.రఘువీరారెడ్డి (యాదవ్)కి అప్పగించినందున దళితవర్గానికి చెందిన నేతల పేర్లపై పరిశీలన సాగిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు (సీమాంధ్ర) ఇటీవలే వేర్వేరు పీసీసీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పీసీసీకి అధ్యక్షునిగా వెనుకబడినవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంటుగా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో సీమాంధ్రలో కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని ఏర్పాటుచేయలేదు. కొత్త కమిటీల ప్రమాణం, బాధ్యతలు స్వీకార కార్యక్రమాలకు హాజరైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీమాంధ్రలోనూ వర్కింగ్ ప్రెసిడెంటును ఏర్పాటు చేయాలని, తద్వారా ఇతర వర్గాల నేతల్లో పార్టీపట్ల నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడితో చర్చించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ వారికి తెలిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వగా ప్రచార, మేనిఫెస్టో కమిటీలను అగ్రవర్ణాలకు చెందిన చిరంజీవి, ఆనం రామనారాయణరెడ్డిలకు కట్టబెట్టారు. దీంతో దళితవర్గాలను నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ తరుణంలో ఆ వర్గాలకు చెందినవారికి వర్కింగ్ ప్రెసిడెంటును అప్పగిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ను నియమించవచ్చన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది. -
సీఎం రాజీనామా చేయరు... పార్టీ పెట్టరు
ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారంటూ వస్తున్న వార్తలు ఊహగానాలే అంటు కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఆయన పార్టీ వీడతారనేది ఊహగానమే అని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావడం కల అని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీఎం కిరణ్ తన పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తారని ఊహగానాలు గత కొంత కాలంగా ఊపందుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన బిల్లు అసంపూర్తిగా ఉందని తిప్పి రాష్ట్రపతికి పంపింది. బిల్లును పార్లమెంట్లో ఎలాగైనా నెగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వేళ అదే జరిగితే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా అనే విలేకర్ల ప్రశ్నకు కొండ్రు మురళీపై విధంగా స్పందించారు. -
`ఆయన కొత్త పార్టీ ఊహజనితమే`
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో దశాబ్ధాల అనుబంధం ఉందని, ఆయన కొత్త పార్టీ పెట్టడమనేది ఊహజనితమేనని మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో విభజన బిల్లుపై చర్చ జరగాల్సిందేనని మంత్రి కొండ్రు మురళి డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుంటే విభజనకు అనుకూలమని కేంద్రం భావిస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సమైక్య తీర్మానం కోసం పట్టుబతామని కొండ్రు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడినా పార్టీకి వచ్చే నష్టమేమి లేదని ఆయన తెలిపారు. పార్టీని కాపాడటానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం పటిష్టంగా ఉందని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. -
మంత్రి మెప్పు కోసం కంత్రీ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రిగా జిల్లా విశాల ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన కోండ్రు మురళీ మోహన్ సంకుచిత భావంతో, తన నియోజకవర్గ ప్రజల మెప్పు పొందేందుకు జిల్లా రైతులందరికీ ఉపయోగపడాల్సిన కేంద్రాన్ని రాజాంకు తరలించుకుపోయారు. మెహర్బానీ కోసం రైతు ప్రయోజనాలకు తూట్లు పొడిచారు. రాష్ట్ర మంత్రిగా ఉంటూ నియోజకవర్గ మంత్రిగా తనస్థాయిని కుదించేసుకున్నారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(డబ్లుఏఎల్ఎంటీఏఆర్ఐ)ను జిల్లా కేంద్రంలో కాకుండా పట్టుబట్టి మరీ రాజాంకు తరలించారు. ఈ నెల ఆరో తేదీన ఆ శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ చేత ఆర్భాటంగా శంకుస్థాపన కూడా చేయించారు. ధర్మాన కృషితో జిల్లాకు మంజూరు వాస్తవానికి ఈ శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మొదట ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 15 కోట్లు కూడా కేటాయిం చింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సభ్యుల్లో వృత్తి నైపుణ్యత పెంచేందుకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలన్నది ఉద్దేశం. సుమారు వెయ్యి మందికి ఉపయోగపడే ఈ సెంటర్‌ను నగర ప్రాంతమైనవిశాఖలో కాకుండా సాగునీటి సంఘాలు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనతో ప్రభుత్వం విశాఖకు బదులు శ్రీకాకుళానికి మంజూరు చేసింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ధర్మాన మాట చెల్లుబాటు కాలేదు. అదే సమయంలో మంత్రి కోండ్రు రాజాంలో ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన చెప్పిన ప్రతి పనీ చేసిన అధికారులు ఆయన రాజీనామా అనంతరం కోండ్రు మాటకు విలువనిచ్చారు. వనరులు, రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా కేంద్రాన్ని రాజాంకు తరలించారు. రాజాంలో నీటి సంఘాలే లేవు జిల్లాలో 508 సాగునీటి సంఘాలు ఉండగా, రాజాం ప్రాంతంలో ఒక్కటి కూడా లేదు. ఈ నియోజకవర్గంలోనే ఉన్న మడ్డువలస ప్రాజెక్టు కింద కూడా సంఘాలు లేవు. వంశధార ప్రాజె క్టు కింద 54 సంఘాలు ఉండగా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 454 సంఘాలు ఉన్నా యి. విజయనగరం, విశాఖ జిల్లాల్లో మరో 500 వరకు ఉన్నాయి. అంటే ఈ రెండు జిల్లాల్లోని మొత్తం సంఘాల కంటే శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువ ఉన్నా యి. పైగా శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత, వెనుకబడిన జిల్లా. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలే ఎక్కువ. ఈ దృష్టితోనే శ్రీకాకుళంలో ఈ కేంద్రం ఏర్పాటుకు ధర్మాన ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇప్పుడు దాన్ని రాజాంకు మంత్రి కోండ్రు తన్నుకుపోయారు. శ్రీకాకుళంలో స్థలం ఉన్నా.. శ్రీకాకుళంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలం లేదనే సాకు చూపించి దాన్ని రాజాంకు తరలించారు. కేంద్రం నిర్మాణానికి మూడెకరాల స్థలం అవసరం. మొదట నరసన్నపేట వద్ద ఉన్న వంశధార ప్రాజెక్టు ఏరియాలో ఏర్పాటు చేయాలని యోచించారు. అనంతరం కోండ్రు వ్యూహం ప్రకారం ఆ యోచన విరమించుకుని రాజాంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి శ్రీకాకుళం శివారులోని అంపోలు వద్ద ‘నాక్’ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉంది. అది కాకపోయినా వంశధార గెస్ట్‌హౌస్ ఎదురుగా రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇవేవీ పనికిరావన్నట్లు రాజాంలో మడ్డువలస కార్యాలయాల సమీపంలో రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఇక్కడ కూడా స్థలం లేదు. కొన్ని భవనాలను పడగొట్టి కొత్త కేంద్రాన్ని నిర్మించాల్సిందే. ఆ పనేదో శ్రీకాకుళంలో చేయొచ్చు కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కళాశాలకు అనుబంధంగా ఉంటే మంచిది... జిల్లా కేంద్రానికి సమీపంలోని నైరలో వ్యవసాయ కళాశాల ఉంది. అందువల్ల రైతు శిక్షణ కేంద్రాన్ని శ్రీకాకుళం లో ఏర్పాటు చేస్తే నైర కళాశాల ప్రొఫెసర్ల సేవలు కూడా పొందే అవకాశం ఉండేది. అంతే కాకుండా ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల సలహాలు కూడా తీసుకునే వీలు ఉంది. ఇవన్నీ కాదని ఎక్కడో ఉన్న రాజాంలో ఈ శిక్షణ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఏమిటనేది పలువురు రైతుల ప్రశ్న. ఈ ప్రశ్నకు వ్యవసాయ శాఖ కూడా సమాధానం చెప్పలేకపోతోంది. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే.. అన్నింటికీ మించి శిక్షణ కోసం మూడు జిల్లాల రైతులు ఈ కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రాజాం పట్టణానికి రావాణా సౌకర్యాలు అంతగా లేవు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు రాజాం వెళ్లాలంటే శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లాల్సిందే. పైగా ఈ ప్రాంతాల్లోనే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించకుండా మంత్రి కోండ్రు స్వార్థపూరితంగా ఆలోచించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీజినల్ సెంటర్ లక్ష్యమేమిటి? ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రీజనల్ రీసెర్చ్ సెంటర్‌తో రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. అధునాతన సౌకర్యాలతో నిర్మించే ఈ కేంద్రంలో ఏసీ ఆడిటోరియం, డిజిటల్ డిస్ప్లే, హాస్టల్ భవనాలు, మేనేజ్మెంట్ భవనాలు, క్లాస్ రూమ్‌ల బ్లాక్ వంటివి ఉంటాయి. ప్రధానంగా రైతులకు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు నీటి నిల్వ, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏ సీజన్లో ఏ పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయనే వివరాలు, భూమి యాజమాన్య పద్ధతులు, భూసారానికి సంబంధించిన అంశాలు, అధునాతన పద్ధతులు, యంత్రాలతో సాగు పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు. -
`విభజన జరిగినా కాంగ్రెస్ నుంచే పోటీచేస్తాం.. గెలుస్తాం`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. సమైక్యంపై ముగ్గురు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అవాస్తవ కథనాలు ఇస్తున్నారని మంత్రి కోండ్రు మురళీ వ్యాఖ్యానించారు. విభజన జరిగిన సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని కోండ్రు అన్నారు. విభజన జరిగినా.. తాము కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాం.. గెలుస్తామని మంత్రి కోండ్రు మురళీ స్పష్టం చేశారు. కొత్త పార్టీ అనే ప్రచారమంతా మీడియా కుట్రేనని కోండ్రు తెలిపారు. కాగా, అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రజలు ఉద్యమించాలని టీజీ వెంకటేశ్ చెప్పారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరిగితే మంత్రులుగా తామే అబాసుపాలవక తప్పదని టీజీ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్పారు. -
పారిశ్రామిక రంగంలో రాష్ట్రానిది రెండో స్థానం
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి గీతారెడ్డి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి చెప్పారు. ఎస్సి, ఎస్టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇగ్నైట్ పేరుతో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 21రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రవుంలో గీతా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్ మే)లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ళ కిందట పరిశ్రమ రంగంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండోస్థానానికి ఎదగడం గర్వకారణమని, త్వరలోనే ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జె.డీ. శీలం మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో పలువురికి ఉద్యోగాలు కల్పించేస్థాయికి దళితులు ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద రావు, కొండ్రు మురళీ మోహన్, పసుపులేని బాలరాజు మాట్లాడారు. -
వెళ్లవయ్యా.. వెళ్లూ!
సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. మంగళవారం ఆయా పార్టీల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడకనిపిస్తే అక్కడ సమైక్యవాదులు అడ్డుకున్నారు. నిరసన దీక్షా శిబిరాల వద్దకు వస్తున్న నేతలను గో బ్యాక్ అంటూ తిప్పిపంపారు. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద నిర్వహించిన మాక్ కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ వీరభద్రస్వామిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విశాఖలో జీవీఎంసీ ఎదురుగా రిలేదీక్షలు చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిని అడ్డుకోగా, ‘నేను రాజీనామా చేసేశా’.. అని చెప్పడంతో శాంతించారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో మంత్రి పితాని సత్యనారాయణను విద్యార్థి సంఘాల నేతలు ఘెురావ్ చేశారు. కొవ్వూరులో ఎమ్మెల్యే టీవీ రామారావు ఇంటిని ముట్టడించారు. మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సంతకవిటి మండల కేంద్రంలో ప్రతిఘటన ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పొలకొండ ఏలాం కూడలిలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కాన్వాయ్‌ని సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు అడ్డుకున్నారు. మంత్రి వాహనం దిగి రాగా, సీమాంధ్ర ద్రోహి అని తిట్ల వర్షం కురిపించారు. శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి వ్యతిరేకంగా ఉద్యమకారులు నినాదాలు చేశారు.