`విభజన జరిగినా కాంగ్రెస్ నుంచే పోటీచేస్తాం.. గెలుస్తాం`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. సమైక్యంపై ముగ్గురు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అవాస్తవ కథనాలు ఇస్తున్నారని మంత్రి కోండ్రు మురళీ వ్యాఖ్యానించారు. విభజన జరిగిన సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని కోండ్రు అన్నారు. విభజన జరిగినా.. తాము కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాం.. గెలుస్తామని మంత్రి కోండ్రు మురళీ స్పష్టం చేశారు. కొత్త పార్టీ అనే ప్రచారమంతా మీడియా కుట్రేనని కోండ్రు తెలిపారు.
కాగా, అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రజలు ఉద్యమించాలని టీజీ వెంకటేశ్ చెప్పారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరిగితే మంత్రులుగా తామే అబాసుపాలవక తప్పదని టీజీ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్పారు.