Erasu Pratap Reddy
-
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. ఏరాసు, ఎస్పీవై నిరసన
సాక్షి, కర్నూలు: జిల్లా టీడీపీలో తీవ్ర అసమ్మతి వ్యక్తమవుతోంది. టీడీపీ అధిష్టానం వైఖరిపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీనియర్ నేతలు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డితో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత టీడీపీకు మద్దతు తెలిపిన ఎస్పీవై రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాగా గౌరు చరితారెడ్డి దంపతులు టీడీపీలో చేరిన కార్యక్రమానికి ఏరాసు ప్రతాప్‌రెడ్డి గైర్హాజరైన సంగతి తెలిసిందే. పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించడంతో ఏరాసు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు నంద్యాల సీటు విషయంలో సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి అలకబూనారు. గంగుల ప్రతాప్‌రెడ్డిని పక్కనపెట్టడంతో ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. -
పేదల భూములు లాక్కోవడం టీడీపీ నైజం
ఓర్వకల్లు (కర్నూలు): పేదల భూములు లాక్కోవడం టీడీపీ నైజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. కేతవరం గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని బుధవారం.. సర్పంచు పాపన్న, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాటసానితో పాటు వైఎస్సార్సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూడిచెర్ల గ్రామానికి చెందిన రైతుల భూములను రిలయన్స్ కంపెనీకి ధారాదత్తం చేసినట్లు టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతుల భూములు తీసుకోకుండా ఉండేందుకు అప్పట్లో తానే స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. అలాగే గవర్నర్ వద్దకు రైతులను పంపి భూములు తీసుకోవడాన్ని రద్దు చేయించానన్నారు. టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎయిర్‌పోర్టు సమీపాన పూడిచెర్ల గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు సాగులో ఉన్న రైతుల భూములను రాత్రికిరాత్రి అన్లైన్లో పేర్లు మార్చిన ఘనత టీడీపీ నేతలదేనన్నారు. అక్రమాలపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దమ్ముంటే ఈ భూములపై విచారణ జరిపించాలని ఏరాసుకు సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ నాయకులు మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, పూడిచెర్ల రాజన్న, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీలో రోజుకో లొల్లి
పాణ్యంలో మాజీ మంత్రుల మధ్య వివాదం అగ్గి రాజేసిన కాంట్రాక్ట్ వ్యవహారం తనకు విలువ ఏముంటుందని ఏరాసు కినుక అధిష్టాన వైఖరే అలజడికి కారణమంటున్న తెలుగు తమ్ముళ్లు కర్నూలు: అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు- అప్పటికే ఉన్న నియోజకవర్గ ఇన్చార్జీల మధ్య నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో ఒక ప్రైవేటు కాంట్రాక్టు విషయంలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వివాదం చెలరేగింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కేఈ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడంపై పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందులోనూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని మరీ కాంట్రాక్టు ఇప్పించడం పట్ల ఆయన కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు సిమెంట్ కంపెనీకి నంద్యాల నుంచి శ్లాబ్ సరఫరా కాంట్రాక్టును కేఈ కుటుంబానికి ఇప్పించినట్టు సమాచారం. ఈ కాంట్రాక్టు విలువ నెలకు రూ. 50 లక్షల మేరకు ఉంది. విషయం తెలుసుకున్న ఏరాసు.. నియోజకవర్గంలో వారికి పనులు ఇప్పించడమా అని వాపోతున్నారు. ఇప్పటికే పాణ్యం నియోజకవర్గం ఇన్చార్జ్ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు గుప్పుమంటుండగా... తాజాగా కాంట్రాక్టు వ్యవహారం మరింత అగ్గి రాజేసింది. పాణ్యం పోరు పదనిసలు వాస్తవానికి పాణ్యం నియోజకవర్గ విషయంలో అటు కేఈ కుటుంబానికి.. ఇటు ఏరాసుకు మధ్య రగడ నడుస్తోంది. పాణ్యంపై సదరు రాజకీయ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు కన్ను ఉంది. పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తనకు అప్పగించాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరుతున్నారు. ఇందుకోసం నూతన సంవత్సర వేడుకలను ఆయన వేదికగా చేసుకున్నారు. నియోజకవర్గానికి చెందిన నేతలను పిలిచి ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్ వేదికగా భారీ పార్టీ ఇచ్చారు. ఇందుకు అనేక మంది అధికార పార్టీ నేతలు హాజరయ్యారు. అదేవిధంగా మా ఊరు- జన్మభూమి సభలను కూడా వేదికగా చేసుకుని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. విషయం తెలుసుకున్న ఏరాసు.. హడావుడిగా విదేశాల నుంచి తిరిగి వచ్చి మరీ సభల్లో పాల్గొన్నారు. అయితే, కేఈ ప్రభాకర్ ప్రయత్నాలు సఫలం కాలేదు. పాణ్యం ఇన్చార్జిగా ఏరాసే ఉంటారని అధిష్టానం స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని చల్లపరచడానికా అన్నట్టు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం వ్యవహరించిన తీరు పట్ల ఏరాసు గుర్రుగా ఉన్నారు. అధిష్టానమే ఇలా చేస్తే ఎలా? ప్రశాంతంగా ఉన్న పార్టీలో అధిష్టానం వైఖరితోనే అలజడి రేగుతోందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ఇప్పటికే కోడుమూరు నియోజకవర్గంలో విష్ణుకు, మణిగాంధీకి మధ్య వార్ మొదలయింది. గూడూరు జాతర వేదికగా ఏకంగా రథోత్సవాన్ని నిలిపి మరీ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు మణిగాంధీ యత్నించారు. జాతర వేదికగా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇక నంద్యాల, ఆళ్లగడ్డలో రోజుకో వైరం తెరమీదకు వస్తోంది. ఏకంగా సీఎం సాక్షిగా ఇరు వర్గాలను రాజీ కుదర్చాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇంకో గ్రూపును ప్రోత్సహించే పేరుతో పార్టీ పెద్దలే అగ్గిరాజేస్తే ఎలా అని నియోజకవర్గ ఇన్చార్జీలు వాపోతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. -
'రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రెండవ రాజధానిని రాయలసీమలో అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఆయన మాజీ మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డిలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటకలో ఉన్న విధంగానే ఏపీలోనూ రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో మరోసారి ప్రత్యేక ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వాటికన్ సిటీ తరహాలో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. అందుకు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో మద్యం, ధూమపానం వంటివి నిషేధించాలని సూచించారు. శేషాచలంలోని మైన్స్, ఎర్రచందనం ద్వారా సమకూరే ధనాన్ని రాయలసీమ అభివృద్ధికే వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు టీటీడీ కృషి చేయాలని అన్నారు. వారితోపాటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
వేంపెంటలో ‘ప్లాంట్’ చిచ్చు
వేంపెంట (పాములపాడు), న్యూస్‌లైన్: మండలంలోని వేంపెంట గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణ చిచ్చు రగులుతోంది. గ్రామస్తులకు వ్యతిరేకంగా గురువారం పోలీస్ పహారాలో పనులు ప్రారంభించారు. పనులు వెంటే ఆపివేయాలని, లేదంటే తాము గ్రామాన్ని విడిచి వెళతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 2011 జులైలో నిప్పుల వాగులో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. 7.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి దాదాపు రూ.35కోట్ల తో ర్యాంక్ మినీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రెండేళ్ల కిందట భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ ప్లాంట్ నిర్మాణం వేంపెంట గ్రామం మధ్యలో జరుగుతున్నందున గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పలుమార్లు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.. అప్పటి రాష్ట్ర న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామిలు కూడా ప్రజలతో చర్చించారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుతాయని, శబ్ద కాలుష్యం, వ్యవసాయ బోరు బావులకు, సాగుతాగు నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని గ్రామస్తులు ఆందోళనకు గురై తమ గోడును వారితో చెప్పుకునప్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి గత ఏడాది జులై 13న గ్రామానికి చేరుకుని సభ నిర్వహించి వారితో అభిప్రాయాలు సేకరించారు. గ్రామస్తుల అభీష్టం మేరకే పవర్‌ప్లాంట్ పనులు జరుగుతాయని ప్రజలకు తెలిపారు. ఆ సమయంలేనే ప్లాంటు పనులు నిలిపి వేయించారు. ప్రజల కోరికకు విరుద్ధంగా ప్రజల అభీష్టానికి విరుద్ధంగా గురువారం గ్రామంలో పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా బస్టాండ్ సెంటర్లో, పనులు జరిగే చోట, ఎస్సీకాలనీలోని స్థూపం వద్ద ప్రధాన కూడళ్లలో డీఎస్పీ జి.నరసింహారెడ్డి, సీఐ రవిబాబుల ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసు పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. పనులు చేసుకునేందుకు తమకు ప్రభుత్వ అనుమతులున్నాయని, అయితే గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఉందని పనులు జరిగేందుకు పోలీసు ఫోర్సు కావాలని కోరడంతో బలగాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామం విడిచి వెళతాం.. పజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పవర్‌ప్లాంటు పనులు జరుపుతున్నందున గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్తులు గాండ్ల రమేష్, సామేలు, సాలన్న, ఏసురత్నం, కాంతారెడ్డి, రమణారెడ్డి, కోరబోయిన శాంతు, చెలమారెడ్డి, బోయశ్రీనివాసులు పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడంతో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పనులు చేయబోమని హామీ ఇచ్చి ఈరోజు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటకు విలువ లేనప్పుడు గ్రామంలో ఉండటం వ్యర్థమని ప్రజలంతా మూకుమ్మడిగా గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ‘ ఏరాసు, కేఈలు పెద్దోళ్లు.. వారి రాజకీయ, ధన బలాన్ని చూపేం దుకే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దించారు.’ అని బోరెడ్డి శివారెడ్డి ఆరోపించారు. గ్రామంలోని ప్రజలంతా రోడ్డుమీద పడితే అధికారులకు, పవర్‌ప్లాంట్ యజమానులకు ఆనందమా అంటూ జాను అనే వ్యక్తి ప్రశ్నించారు. -
వలస నేతలు.. విలవిల
టీజీవీకి ముస్లింలు రాంరాం ఏరాసు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత నంద్యాలలో ఓటమి అంచున శిల్పా నందికొట్కూరులో లబ్బికి ఎదురుగాలి కండువాలు మార్చినా.. ఓటర్లను ఏమార్చలేని వైనం సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఆ నలుగురు నేతలను రాష్ట్ర విభజన పాపం వెంటాడుతోంది. కండువాలు మార్చుకున్నా వజ్రాయుధమైన ఓటు నుంచి తప్పించుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను చేపట్టి.. అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజలను చీల్చొద్దని నెత్తినోరు కొట్టుకున్నా పెడచెవిన పెట్టారు. అధికార దాహంతో తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. విభజనానంతరం కాంగ్రెస్‌ను ప్రజలు చీకొట్టడంతో.. గుడ్డికన్నా మెల్ల నయం అన్నట్లు మంత్రులుగా పనిచేసిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిలు టీడీపీలో చేరిపోయారు. పార్టీ అయితే మారారు కానీ.. ప్రజల ఆగ్రహజ్వాలల నుంచి తప్పించుకునే దారి లేక ఓటమి అంచున కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ‘పచ్చ’ పార్టీ అధినేత చంద్రబాబు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలిసిందే. పైగా నరేంద్రమోడీ గొప్ప నాయకుడని బాబు పొగడ్తలతో ముంచెత్తడం ముస్లిం ఓటర్లలో వ్యతిరేకతను పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మైత్రి టీడీపీ అభ్యర్థుల ఓటమి కారణమవుతోంది. పైగా వలస నేతలైన ఈ నలుగురికి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం కూడా గెలుపు ఆశలను గల్లంతు చేస్తోంది. కర్నూలులో టీడీపీకి ముస్లింలు రాంరాం మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పట్ల కర్నూలు ముస్లింలలో వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకోవటం టీడీపీకి గడ్డు పరిస్థితులను తీసుకొచ్చింది. జయాపజయాలను శాసించే ముస్లిం ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తుండటం.. వారి మధ్యే వర్గ విభేదాలు సృష్టించటం ఆ సామాజిక వర్గంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. అదేవిధంగా తన ఆల్కలీస్ పారిశ్రామికవాడ నుంచి వెదజల్లే కాలుష్యంతో ఇటీవల కాలంలో కర్నూలు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యారు. ఓ వృద్ధురాలు మరణించారనే ప్రచారం కూడా ఉంది. ఇవి చాలవన్నట్లు టీజీపై 420 కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయినట్లు ప్రచారం జరగడంతో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం గమనార్హం. మొత్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత నడుమ ఆయన గట్టెక్కడం కష్టమేనని తెలుస్తోంది. నంద్యాలలో శిల్పాకు ఎదురుగాలి నంద్యాల పేరు చెబితే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తారు. నందుల కోటలో ఆయన పట్ల అంతటి అభిమానం ఉంది. రాజకీయ భిక్షపెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా నిలవక ఆయన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలిచిన భూమా నాగిరెడ్డి ప్రజాదరణతో ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఆయనను ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కడం ఆయనను ఓటమికి చేరువ చేస్తోంది. మార్పును కోరుకుంటున్న ఇక్కడి ప్రజలు ఈ విడత వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఏరాసును పట్టించుకోని పాణ్యం జనం శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించిన ఆయన టీడీపీలో చేరి పాణ్యం బరిలో నిలిచారు. మూడేళ్లు అధికారం కట్టబెట్టినా ఏమీ చేయలేని ఆయన ఇక్కడ అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రచారం సందర్భంగా ఆ వ్యతిరేకత బయటపడుతోంది. బొల్లవరంలో ఇటీవల ప్రచారానికి వెళ్లగా ‘‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా.. చంద్రబాబు అయితే బాగుంటుందా’’ అని ఆయన పదేపదే జనం స్పందన కోరగా.. ప్రజలు ‘వైఎస్ జగన్ సీఎం అయితేనే బాగుంటుంది’’ అని చెప్పడం విశేషం. నందికొట్కూరులో లబ్బి గూండాగిరి ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన లబ్బి వెంకటస్వామికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డే. అలాంటి కుటుంబాన్ని కాదని ప్రత్యర్థులతో చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై అనుచరులచే దౌర్జన్యాలకు దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బుధవారం ఓ విద్యార్థిపై తమ్ముళ్లు చేయి చేసుకోవడమే తాజా నిదర్శనం. అదేవిధంగా చిరకాల ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న బెరైడ్డి వర్గం, లబ్బి వర్గం ఏకమై ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి స్థానికులు ముక్కన వేలేసుకుంటున్నారు. ఆయన హయాంలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించడం పట్ల కూడా ప్రజలు గుర్రుగా ఉన్నారు. -
టీడీపీలోకి టీజీ, ఏరాసు?
* రాజధాని రాగం.. రంగు మార్చే వ్యూహం! * వైఎస్ఆర్సీపీలోకి మూసుకుపోయిన దారులు * కాంగ్రెస్‌లో ఉండలేక ‘పచ్చ’పార్టీలోకి... * అందులో భాగమే రాజధాని డిమాండ్ * విభజన మచ్చ చెరిపేసుకునేందుకు ఎత్తుగడ * చంద్రబాబుతో రహస్య మంతనాలు కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ లేదని తెలుసుకున్న నాయకులు ఏదో ఒక సాకుతో పార్టీ మారేందుకు ప్రణాళిక రచించుకుంటున్నారు. ఇన్నాళ్లు సమైక్య రాష్ట్రం తెస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఆ తంతు ముగియడంతో ఇప్పుడు సరికొత్త రాగం ఆలపిస్తున్నారు. కర్నూలును రాజధాని చేయాలనే వాదన వారి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. ఆ ముసుగులో రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. పాణ్యం, నందికొట్కూరు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామిలు ఇప్పటికే టీడీపీలో తమ బెర్తులు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రులు వారి అనుయాయులు సహా పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వీరు సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ కావల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో ఈ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరికపై మరింత సమయం కావాలని గంటా బృందం కోరినట్లు సమాచారం. అయితే బయటకు మాత్రం కర్నూలును తిరిగి రాజధాని చేయాలనే డిమాండ్‌తో చంద్రబాబు మద్దతు కొరేందుకు వెళ్తున్నట్లు ప్రకటించుకోవడం గమనార్హం. గత రెండు రోజులుగా టీజీ వెంకటేష్ రాజధాని డిమాండ్‌తో పాటు ప్రత్యేక రాయలసీమపై ప్రసంగాలు ఊదరగొడుతుండటం తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎలాగోలా ఆ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారనే చర్చ ఉంది. పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న నాయకులు బహిరంగంగా నిర్ణయం తీసుకోవాలే కానీ.. ఇలా దొంగచాటుగా ప్రయత్నాలు చేయడం ఏమిటని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీజీ, ఏరాసులు టీడీపీలో చేరేందుకు ఈనెల 27వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు చర్చ జరిగినా.. ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. తక్కిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి రెండు రోజుల్లో వారినే అనుసరిస్తారని తెలిసింది. అయితే సమైక్య ఉద్యమంలో తన వంతు పాత్రతో ప్రజాభిమానం చూరగొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనేందుకు.. విభజనకు కారణమైన టీడీపీతో జట్టు కట్టినా ఒరిగేదేమీ లేదని వారికి కొందరు పార్టీ ముఖ్యులు నచ్చజెబుతున్నట్లు వినికిడి. అటు కాంగ్రెస్‌లో ఉండలేక.. ఇటు వైఎస్ఆర్సీపీలో విభజనవాదులకు చోటు లేకపోవడంతో గత్యంతరం లేక టీడీపీ వైపు అడుగులేస్తుండటం చూసి అనుచరులు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏదేమైనా టీజీ, ఏరాసులు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనుండటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. -
మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
-
మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడే నేతల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఆయన పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ విభజన ప్రక్రియతో రాయలసీమ ప్రజల బతుకును అంధకారంలోకి వెళ్లిందని.. రాయలసీమకు తాగు, సాగు నీరు కోసం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. తెలంగాణ ప్రాంత నాయకుల్లో ఉన్న ఐకమత్యం సీమాంధ్ర నేతల్లో లేకపోవడం వల్లే విభజన ప్రక్రియ సాధ్యపడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందని ఏరాసు విమర్శించారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వారి వెంటే తాను నడుస్తానని స్పష్టం చేశారు. -
ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే తగిన శిక్షే వేసారు: ఏరాసు
-
'కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం'
పార్టీలో కొనసాగడంపై మంత్రులు టీజీ, ఏరాసు, గంటా బిల్లు పెట్టినట్లు తేలిన మరుక్షణమే రాజీనామా కిరణ్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? లేదా సీఎం పెట్టే కొత్త పార్టీలో చేరాలా? టీడీపీలోకి వెళ్లాలా?.. అనే అంశాలను తమ అనుచరులు, కార్యకర్తలతో చర్చించాకనే నిర్ణయిస్తామని మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షకట్టి మరీ తెలుగు ప్రజల గొంతు కోస్తోందని, ఆ పార్టీలో కొనసాగడం ఎవరికీ ఇష్టం లేదని వారు వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎం కిరణ్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తానని కొన్ని నెలలుగా సీఎం అంటున్నా తామే వారించామని.. సీఎం ఇప్పుడు కూడా అందుకు సిద్ధమయ్యారని మంత్రులు చెప్పారు. బిల్లు పెట్టలేదని బీజేపీ అంటున్నందున.. రాజీనామా చేస్తే బిల్లు ప్రవేశపెట్టినట్లు సంకేతాలు పోతాయని, రాజీనామా చేయకుండా ఉంటే బీజేపీ వాదనకు బలం చేకూరుతుందని తాము వివరించినట్లు పేర్కొన్నారు. బిల్లుపై అధికారికంగా ప్రకటన వచ్చాక సీఎం రాజీనామా చేస్తారని వెల్లడించారు. కొత్త పార్టీ అవసరం ఎంతో ఉందని... సీఎం కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెప్పారు. అయితే, కొత్త పార్టీ సంగతి తమతో సీఎం ప్రస్తావించలేదని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మీడియాకు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై ఏం జరుగుతుందో వేచి చూడాలని తాను సీఎంకు తెలిపానని ఎమ్మెల్యే మస్తాన్‌వలీ చెప్పారు. సీఎం రాజీనామాతో పాటు అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన కూడా వచ్చే అవకాశముందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పారు. ఈ నెల 18 లేదా 19న సీఎం రాజీనామా చేయవచ్చని వారు పేర్కొన్నారు. బిల్లు పెట్టినట్లు తేలిన మరుక్షణమే రాజీనామా: పితాని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారా? లేదా? అన్న సందిగ్ధం ఉన్నందున... దానిపై అధికారిక ప్రకటన వచ్చిన తక్షణమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రాజీనామాపై కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం చర్చించారని... బిల్లు పెట్టలేదని ప్రతిపక్షాలు చెబుతున్నందున రాజీనామా చేయవద్దని తామంతా సీఎంకు చెప్పామని వివరించారు. సీఎం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదని... కేంద్ర మంత్రుల సూచనలు, ఢిల్లీలో ఏపీఎన్జీవోల దీక్షల నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిర్ణయించే అవకాశముందని తెలిపారు. -
కిరణ్ కచ్చితంగా పార్టీ పెడతారు: ఏరాసు
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరముందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కచ్చితంగా కొత్త పార్టీ పెడతారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం సీఎం కిరణ్‌తో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఏరాసు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈరోజు సీఎం కిరణ్ రాజీనామా చేయడంలేదని వెల్లడించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రోజున సీఎం రాజీనామా చేస్తారని చెప్పారు. తమ జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటామని ఏరాసు తెలిపారు. తాము ఏపార్టీలో ఉంటామన్నది త్వరలోనే తేలుస్తుందన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు పెట్టిన వెంటనే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని మరో మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు సంకేతాలు పోతాయన్న భావనతో సీఎం వెనక్కు తగ్గారని వెల్లడించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అంటున్నాయని టీజీ చెప్పారు. -
కాంగ్రెస్‌లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఏరాసు
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో మూర్ఖంగా వ్యహరిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తాను కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. విభజన జరగకుండా సీఎం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీమాంధ్రులకు కలిగే లాభనష్టాలు, సాగునీటి పంపకం, నిరుద్యోగం సమస్యల వంటి వాటి గురించి తెలంగాణ బిల్లులో ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్రం ముక్కలయితే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏరాసు పునరుద్ఘాటించారు. -
వీరిద్దరికీ ఏమైంది?
శుంఠ, స్టూపిడ్... ఈ మాటలన్నది మామూలు మనుషులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అమాత్య పదవులు తలపండిన రాజకీయ నాయకుల నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయల్లో దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. మంచి వక్తగా పేరున్న కేంద్ర మతం జైపాల్ రెడ్డి, ఆచితూచి మాట్లాడే రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి లాంటి నాయకులు కూడా మాట జారడంతో వీరిద్దరికీ ఏమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను సీమాంధ్ర నాయకులు ఖండించారు. ఇరు ప్రాంతాల్లో శుంఠలున్నారని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జైపాల్‌రెడ్డి లాంటి సీనియర్ రాజకీయ వేత్త ఇలా మాట్లాడడం తగదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హితపు పలికారు. వేతనాలు పెంచాలని కోరిన పాపానికి ఓ వీఆర్ఏపై ఒంటికాలిపై లేచారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని.. తమకు వేతనాలు ఎప్పుడు పెంచుతారని శేఖర్ అనే వీఆర్ఏ ప్రశ్నించాడు. దీంతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. 'నోర్ముయ్...స్టుపిడ్..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మరో మంత్రి మహీధర్ రెడ్డి కలుగచేసుకుని వేలు చూపిస్తూ...'ఏయ్...ఇక్కడ గోల చేయొద్దు' అంటూ కన్నెర్ర చేశారు. అమాత్యుల వైఖరితో అక్కడున్నవారంతా ముక్కుపై వేలేసుకున్నారు. బాధ్యతయుత పదవుల్లో పెద్ద మనుషులు విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. తమ కింది వారిని నోటికొచ్చినట్టు దూషించడం అలవాటుగా మారు తోంది. కొంతమంది నేతాశ్రీలు చేతికి పని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. నాయకుడనేవాడు మార్గదర్శిగా ఉండాలి. ప్రజా ప్రతినిధి జనం సమస్యలను పరిష్కరించాలి గాని శిక్షించకూడదు. అధికారం ఉంద కదా అని మాట జారితే ప్రజల దృష్టిలో చులకనవడమే కాదు, విలువనూ కోల్పోతారు. -
జైపాల్ ఏనాడు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేయలేదు: ఏరాసు
-
రెండు ప్రాంతాల్లో శుంఠలున్నారు: ఏరాసు
హైదరాబాద్: సీమాంధ్రలో శుంఠలున్నారన్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి సమైక్యవాది అని, గతంలో ఆయన ఏనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. తెలివైన తెలంగాణవాదులు రాష్ట్ర విభజన కోరుకోరని చెప్పారు. అలాగే తెలివైన సీమాంధ్రవాదులు సమైక్యాన్ని కోరుకోరని అన్నారు. దురదృష్టవశాత్తూ రెండు ప్రాంతాల్లో శుంఠలున్నారని ఆయన అన్నారు. విభజన విషయంలో తమకు దింపుడు కళ్లెం ఆశ ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌కు పట్టుపడతామన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీపై తమకు సమాచారం చేయలేదన్నారు. రాష్ట్రం విడిపోతే సీఎం కొత్త పార్టీ పెట్టినా లాభం ఉండదని ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. -
స్టెప్పులేసిన మంత్రులు కాసు, ఏరాసు
విశాఖపట్టణం: మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి కాసేపు డాన్సర్ల అవతారం ఎత్తారు. సరదాగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌళిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాసరావు కూతురి వివాహ వేడుకలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడున్న ఓ అమ్మాయి చేయి పట్టుకుని సరదాగా నాలుగు స్టెప్పులు వేయడంతో గంటా శ్రీనివాసరావు సహా అక్కడున్న అందరూ సరదా పడ్డారు. సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కాసు, ఏరాసు డాన్స్ చేసి ఔరా అనిపించారు. ఏఎన్నార్ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏరాసు ప్రతాపరెడ్డి భరతనాట్యం చేశారు. కాగా గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహం బుధవారం జరగనుంది. -
`విభజన జరిగినా కాంగ్రెస్ నుంచే పోటీచేస్తాం.. గెలుస్తాం`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. సమైక్యంపై ముగ్గురు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అవాస్తవ కథనాలు ఇస్తున్నారని మంత్రి కోండ్రు మురళీ వ్యాఖ్యానించారు. విభజన జరిగిన సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని కోండ్రు అన్నారు. విభజన జరిగినా.. తాము కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాం.. గెలుస్తామని మంత్రి కోండ్రు మురళీ స్పష్టం చేశారు. కొత్త పార్టీ అనే ప్రచారమంతా మీడియా కుట్రేనని కోండ్రు తెలిపారు. కాగా, అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రజలు ఉద్యమించాలని టీజీ వెంకటేశ్ చెప్పారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరిగితే మంత్రులుగా తామే అబాసుపాలవక తప్పదని టీజీ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్పారు. -
చర్చ జరుగుతుంది, మేం సహకరిస్తాం: ఏరాసు
శాసన సభ లో చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం నాడు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదు అని అన్నారు. రాష్ట్రపతి నిర్ధేశించిన గడువులోగానే బిల్లు పంపడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. బిల్లును పంపడానికి, చర్చకు రాష్ట్రపతి తగినంత సమయం ఇచ్చారు మీడియాతో అన్నారు. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారమే చర్చ జరుగుతుంది అని, దీనికి మేం సహకరిస్తాం అని అన్నారు. చర్చ జరగదు, బిల్లు ఆపుతున్నామనే భయాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారో తెలియడం లేదు అని ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు. -
కడుపు మండితే ఏమైనా మాట్లాడుతాం: ఏరాసు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా మంత్రులుగా తాము మాట్లాడామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కడుపు మండితే ఏమైనా మాట్లాడుతామని అన్నారు. రాష్ట్ర విభజనలో సాంప్రదాయాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. విభజనకు అసెంబ్లీ తీర్మానం కోరాలన్నారు. శీతకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు రాదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఏరాసు ప్రతాప్ రెడ్డి అంతకుముందు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని అభిప్రాయపడ్డారు. -
'సీమాంధ్రను పాక్, చైనా మాదిరిగా చూస్తోంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలాగా చూస్తుందని ఆయన కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగితే గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి విన్నవించిన సంగతిని ఈ సందర్బంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కర్నూలు, అనంతపురం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. -
విభజనపై కేంద్రం తీరు సరికాదు: ఏరాసు ప్రతాపరెడ్డి
సాక్షి, హైదరాబాద్: విభజనపై కేంద్రం తీరు సరిగా లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరె డ్డి అన్నారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి తన వాదనను వినిపించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ భవన్‌కు వ చ్చీరాక ముందే.. విభజన బిల్లు శీతాకాల సమావే శాల్లో పార్లమెంటు ముందుకు వస్తుందంటూ వార్తలు వచ్చాయని, నిర్ణయాలు అలా తీసుకుంటున్నపుడు ఇక సంప్రదింపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆయన గురువారం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భద్రాచలం తెలంగాణ పరిధిలోకి వస్తుందంటున్నారని, అటవీ శాఖ రికార్డుల ప్రకారం శ్రీైశె లం రాయలసీమలో ఉందని వార్తలు వెలువడ్డాయని అన్నారు. రికార్డుల పరంగా భద్రాచలం తెలంగాణలో ఉంటే, అదే సూత్రం శ్రీశైలానికి వర్తిస్తుందన్నారు. విభజన తర్వాత సమైక్య పార్టీ ఎందుకు?: టీజీ సమైక్యంగా ఉండాలనే డిమాండ్‌తో రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన గురువారం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. విభజనను అడ్డుకోవడానికి శాసనసభ రద్దే ఏకైక మార్గమని, అపుడు విభజన బిల్లు అసెంబ్లీకి రాదని, అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరమూ ఉండదని అన్నారు. -
అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలి: సీమాంధ్ర మంత్రులు
-
అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలి: సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్: అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేదన్న సీఎం వ్యాఖ్యలతో మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి వ్యతిరేకించారు. అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలన్నారు. అలా తీర్మానం చేస్తే ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏరాసు మాటలను మంత్రులు సమర్ధించారు. మభ్యపెట్టే మాటలు వద్దని మంత్రులు తెగేసి చెప్పారు. సొంత పార్టీలోనే సీఎం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిఓఎంకు నివేదిక ఇస్తే విభజనకు అనుకూలమవుతుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రుల తరపున జిఓఎంకు తెలపాలని మంత్రి శైలజానాధ్ చెప్పారు. -
తెలుగువారు లేకుండా విభజన కమిటీనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కమిటీని ఆమోదించేది లేదని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. బుధవారం వారు సీఎల్పీ కార్యాలయం వద్ద వేర్వేరుగా మాట్లాడారు. తెలుగు రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కమిటీలో తెలుగువారెవ్వరికీ చోటు లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాన్ని ఇతరులు విభజించడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ‘‘మేము ముందు నుంచి సమైక్యవాదులమే. కమిటీలో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపర్చలేదు. ఈ కమిటీ ఏవిధంగా పనిచేస్తుందో తెలియదు. రాష్ట్రానికి వస్తుందో రాదో కూడా స్పష్టతలేదు. 70 రోజులుగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోకుండా కమిటీని ఏర్పాటుచేయడం ఏమిటి? దీన్ని ఎదిరించి తీరుతాం. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోవాలి’’ అని కాసు కృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీకి తీర్మానం రావాల్సిందేన ని, దాన్ని తామంతా ఓడించి తీరుతామని చెప్పారు. రాజీనామాలపై సీఎం అభీష్టానానికి వదిలేశామని, ఆయన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఏరాసు ప్రతాప్‌రెడ్డి చెప్పారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. జీఓఎంలో పదిమంది సభ్యులుంటారని కేబినెట్లో తీర్మానించారని, ఇపుడు ఏడుగురికే పరిమితం చేశారన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ఎలా మారుస్తారో అర్థం కావడం లేదని చెప్పారు. గందరగోళం మయంగా ఉన్న విభజనను ఆపాలని కోరుతున్నామని, తెలుగువారికి సంబంధం లేకుండా విభజనను చేయడం సరికాదని అయన పేర్కొన్నారు. -
'జీవోఎంలో కీలకశాఖ మంత్రులు లేరు'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో కీలక శాఖ మంత్రులు లేరని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆ కమిటీ అసలు రాష్ట్రానికి వస్తుందో లేదో నమ్మకం లేదని....అందుకే ఆ కమిటీని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు బుధవారమిక్కడ తెలిపారు. ఆ కమిటీలో తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ జరగకపోయినా.... సభ్యులంతా విభజనపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. అలాగే అసమ్మతి తెలపటానికి కూడా ఆస్కారముందని వారు తెలిపారు. రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిస్తున్నారని.... అయితే విశ్వరూప్ పార్టీ మారతారనే ఆయన రాజీనామాను ఆమోదించారని కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
రాజీనామాలు వద్దు.. పార్టీలోనే ఉందాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేవరకు ఎవరూ రాజీనామా చేయకుండా కొనసాగాల్సిన అవసరం ఉందని సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర విభజన జరగకుండా అన్ని మార్గాలను అనుసరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ సమైక్య నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు మంత్రులు, ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే న్యాయ పోరాటానికి వీలుగా మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్లతో కమిటీని ఏర్పాటుచేశారు. అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు పూనుకుంటే, దానిపై న్యాయపోరాటం చేయాలని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, తోట నర్సింహం, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి, మహీధర్‌రెడ్డి, గల్లా అరుణకుమారి, అహ్మదుల్లా, సి.రామచంద్రయ్య, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్లతోపాటు 44 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వెళ్తారనుకోవడం లేదు. దాన్ని అడ్డుకోవడానికి ఎవరూ రాజీనామా చేయొద్దంటున్నాను. మంత్రులు కూడా రాజీనామా చేయొద్దు’’ అని అన్నట్లు తెలిసింది. ఉద్యోగులు ఎంతో కాలం సమ్మె చేయలేరని, రాజకీయ పార్టీలు దాన్ని కొనసాగించాల్సిన అవసరముంటుందని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. సరైన భరోసా ఇస్తే వారు సమ్మె విరమించడానికి సానుకూలంగానే ఉన్నారన్నారు. అసెంబ్లీతో సంబంధం లేకుండానే కేంద్రం పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెడుతుందన్న ప్రచారం సాగుతోందని విప్ రుద్రరాజు పద్మరాజు తదితరులు పేర్కొన్నారు. తాను సమైక్యవాదినని గట్టిగా వాదిస్తున్నా.. తన కార్యాలయంపైనా ఉద్యమకారులు దాడులు చేశారని మంత్రి టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. సమైక్య నినాదంతో పార్టీ యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించాలని మంత్రి శైలజానాథ్... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కోరారు. దీంతో సీనియర్ మంత్రులు, నాయకులతో కమిటీని ఏర్పాటు చేస్తానని బొత్స చెప్పారు. తాను పార్టీలోనే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తానని మంత్రి ఆనం నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని, తాను పోటీ చేయాలనుకోవడం లేదని జేసీ పేర్కొన్నారు. కేంద్రం రూపొందిం చిన ఆర్డినెన్సును చించి పారేయాలని రాహుల్‌గాంధీ పేర్కొన్నం దున బొత్స ఆయనతో మాట్లాడి తెలంగాణ తీర్మానాన్ని కూడా అలాగే చించే లా చూడాలని సమావేశంలో మరో నేత పేర్కొన్నారు. దాడులు చేసేవారిపై ఫిర్యాదు చేస్తే కేసులు ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. విజయనగరంలో తన నివాసంపై జరిగిన దాడి గురించి బొత్స ప్రస్తావించి, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదైతే తప్పనిసరిగా పోలీసులు చర్యలు తీసుకుంటారని సీఎం స్పష్టంచేశారు. హామీ పత్రం ఇచ్చేందుకు సిద్ధం: గంటా సమావేశం అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీఎన్జీవోలు గత 60 రోజులకు పైగా చేస్తున్న సమ్మెను విరమించాలని ఒక విజప్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడే బాధ్యతను తాము తీసుకుంటామని ఉద్యోగులకు ఒక హామీ పత్రం సైతం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం రాజీనామా చేయవద్దన్న అంశంపైనా చర్చ జరిగిందని తెలిపారు. ఎంపీల రాజీనామాల వల్ల పార్లమెంట్లో తమ వాదన వినిపించడానికి అవకాశం ఉండదని, అందువల్ల రాజీనామాలు వద్దన్న అభిప్రాయం వ్యక్తమైందన్నారు. మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలసి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను ఫ్యాక్స్ ద్వారా గాంధీభవన్‌కు పంపారు. సీమాంధ్ర ప్రజల పట్ల కేంద్రం, కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ఏరాసు తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధప్రసాద్ గుడ్‌బై రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవడం తీరని అన్యాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతానికి తిలోదకాలు ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. -
మంత్రి పదవి ఏరాసు ప్రతాప్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్ : న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి శుక్రవారం మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు అందచేశారు. తెలంగాణపై కేబినెట్ నోట్ ఆమోదాన్ని నిరసిస్తూ ఏరాసు తన పదవికి రాజీనామ చేశారు. కొద్దిరోజుల క్రితం మంత్రి విశ్వరూప్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏరాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందునే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఏమి చేస్తారా? అని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పార్టీ నాయకులు, ఇతర పార్టీలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయ ప్రకటన తరువాత సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాస్‌రావు, కాసు కృష్ణారెడ్డి, టిజి వెంకటేష్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు సిఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్‌తో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రితో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. -
మెట్టు దిగిన కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిన్నటివరకు చెబు తూ వస్తున్న సీమాంధ్ర మంత్రులు ఒక్కో మెట్టు దిగుతున్నారు. విభజనవల్ల తమ ప్రాంతంలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తే తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామంటున్నారు. రాష్ర్టం విడిపోతే తలెత్తే ప్రధాన సమస్యలు సాగునీరు, ఉద్యోగ భద్రత, హైదరాబాద్ లాంటి అంశాలను సీమాంధ్ర కు అన్యాయం జరగకుండా పరిష్కరిస్తే విభజనకు తమకేమీ అభ్యంతరం లేదనేదే వీటి సారాంశం. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి దీనిపై చర్చించేందుకు ముందుకు రావాలని తెలంగాణ మంత్రుల్ని కోరుతున్నారు. కాగా తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరించే మంత్రుల్నిగాక తమ ప్రాంత సమస్యలపై సానుకూల ధోరణితో ఉన్న అమాత్యుల్ని చర్చలకు పిలిచేందుకు సీమాంధ్ర మంత్రులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా శ్రీధర్‌బాబు, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి తదితరులతో మంతనాలు జరుపుతున్నారు. సీమాంధ్ర మంత్రుల ప్రతిపాదనపై చర్చిం చేందుకు వారూ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఒకరోజు ముందు వీరంతా సమావేశమై విభజన వల్ల తలెత్తే సమస్యలు, పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియ నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని అధిష్టానం తెగేసి చెబుతోంది. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన గాడితప్పింది. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేకు పడాల్సిన అవసరముంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రతిపాదన తెచ్చాం. విభజనవల్ల తలెత్తే సమస్యలు, పరిష్కార మార్గాలపై ఓ ప్రతిపాదనను రూపొందిస్తున్నాం. మా ప్రతిపాదనలకు పరిష్కార మార్గం చూపితే విభజనకు అంగీకరిస్తాం’’ అని ఏరాసు తెలిపారు. విభజనవల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని పరిష్కరించడం సాధ్యమా? కాదా? అనేది ఇరుప్రాంతాల నేతలు కూర్చుని మాట్లాడుకుంటే ఓ అంచనాకు రావొచ్చని గంటా చెప్పారు. టీ-మంత్రులు తమకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కార మార్గాలు చూపితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. -
షిండే మాటలు నడవ్వు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పినంత మాత్రాన విభజన ప్రక్రియ జరిగిపోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోకుండా చేస్తామని, ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా కళ్లు తెరవాల్సిందేనన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈనెల 7న ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర సభకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అవసరమైతే సభలో పాల్గొంటాం. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మాకు మరేదీ సమ్మతం కాదు. షిండే మాటలు, బిండే మాటలు మా దగ్గర నడవవు. విభజనకు ఎన్నో ప్రక్రియలున్నాయి. కనీసం 4, 5 నెలల సమయం పడుతుంది. ఈలోపు హైకమాండ్ కళ్లు తెరవాలి. విభజనను కచ్చితంగా ఆపాల్సిందే’’ అని పేర్కొన్నారు. మంత్రి గల్లా అరుణ మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య వాణిని విన్పించేందుకే తాము ఇంకా పదవుల్లో కొనసాగుతున్నామన్నారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం రాకముందే విభజన ప్రక్రియ ఆగిపోతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
'తెలంగాణపై కాంగ్రెస్ ముందుకు వెళ్లలేకపోతోంది'
హైదరాబాద్ : సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమంతో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్లలేకపోతోందని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు కోరుకున్నట్లు రాజీనామాలు చేయటానికి తాము వెనకాడమని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించడానికే రాజీనామాలు చేయటం లేదని ఆమె తెలిపారు. చంద్రబాబును రాజీనామా చేయమని ఏపీ ఎన్జీవోలు ఎందుకు కోరటం లేదని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. టీడీపీ నేతలు సమైక్యాంధ్ర అంటూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇస్తే కాంగ్రెస్ విభజన నిర్ణయాన్నివెనక్కి తీసుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని కొండ్రు మురళి డిమాండ్ చేశారు. -
'రాజీనామాలు ఆర్బాటపు ప్రచారానికే పరిమితం'
హైదరాబాద్ : మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి రాజీనామా హైడ్రామా తేలిపోయింది. మీడియాలో గత రెండురోజులనుంచి హడావిడి చేస్తున్నవీరిద్దరూ ఆర్భాటపు ప్రచారానికే పరిమితమయ్యారు. సోమవారం ఉదయం సీఎంతోనూ, తర్వాత గవర్నర్‌తోనూ జరిగిన సమావేశాల్లో వారిద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరకు రాజీనామా లేఖలు గవర్నర్‌కు ఇవ్వలేదని చెప్పారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రాజీనామాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి తమను వారించారని మంత్రులు గంటా, ఏరాసు చెప్పారు. గవర్నర్‌కు కూడా రాజీనామా లేఖలు ఇవ్వాలనుకున్నామని, అయితే రాజీమానాలు ఆమోదించాల్సింది ముఖ్యమంత్రేనని గవర్నర్ చెప్పటంతో ఆయనకు రాజీనామా లేఖలు ఇవ్వడాన్ని విరమించుకున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో సీఎం ఢిల్లీ వెళ్తానంటున్నారని, హైకమాండ్‌తో అన్ని విషయాలు చర్చిస్తామన్నారన్నారు. ఆ తర్వాతే రాజీనామాలపై సమిష్టి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారని గంటా, ఏరాసు తెలిపారు. రాజీనామాలు చేయొద్దని తమను ముఖ్యమంత్రి వారించారని, అందుకే తాము రాజీనామాలను ఆమోదించాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు. -
'రాజీనామాలు ఆర్బాటపు ప్రచారానికే పరిమితం'
-
గవర్నర్‌తో మంత్రులు గంటా, ఏరాసు భేటీ
-
బాబు దొంగ నాటకాలు ఆపాలి:శైలజానాథ్
విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే అన్ని పార్టీలు కలిసి ఓడిస్తామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్ఫష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరామని ఆయన తెలిపారు. అయిన రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజిస్తారు అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇకనైన దొంగ నాటకాలకు తెరదించాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా హితవు పలికారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని బాబు ఇప్పటికైనా చెప్పకపోవడం పట్ల ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కర్నూలులో లక్షమంది రోడ్లపైకి వచ్చి సమైక్యగళం వినిపించిన సంగతిని న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో నేతలను దగ్గరకు రానీయకుండా ప్రజలే ఉద్యమం చేస్తున్నారని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.