విభజనపై కేంద్రం తీరు సరిగా లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరె డ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: విభజనపై కేంద్రం తీరు సరిగా లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరె డ్డి అన్నారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి తన వాదనను వినిపించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ భవన్‌కు వ చ్చీరాక ముందే.. విభజన బిల్లు శీతాకాల సమావే శాల్లో పార్లమెంటు ముందుకు వస్తుందంటూ వార్తలు వచ్చాయని, నిర్ణయాలు అలా తీసుకుంటున్నపుడు ఇక సంప్రదింపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆయన గురువారం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భద్రాచలం తెలంగాణ పరిధిలోకి వస్తుందంటున్నారని, అటవీ శాఖ రికార్డుల ప్రకారం శ్రీైశె లం రాయలసీమలో ఉందని వార్తలు వెలువడ్డాయని అన్నారు. రికార్డుల పరంగా భద్రాచలం తెలంగాణలో ఉంటే, అదే సూత్రం శ్రీశైలానికి వర్తిస్తుందన్నారు.
విభజన తర్వాత సమైక్య పార్టీ ఎందుకు?: టీజీ
సమైక్యంగా ఉండాలనే డిమాండ్‌తో రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన గురువారం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. విభజనను అడ్డుకోవడానికి శాసనసభ రద్దే ఏకైక మార్గమని, అపుడు విభజన బిల్లు అసెంబ్లీకి రాదని, అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరమూ ఉండదని అన్నారు.