రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరిద్దరు గతంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని పక్కనపెట్టడం, అదే సమయంలో రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలంటూ వారిపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో నేరుగా గవర్నర్‌ను కలిసి ఆమోదించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈరోజు గవర్నర్ను కలిశారు. వారు తమ రాజీనామా లేఖలను గవర్నర్కు సమర్పించనున్నారు. అంతకు ముందు వారిద్దరూ సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే రాజీనామాలపై తొందరపడవద్దని, సమిష్టిగా నిర్ణయం తీసుకుందామని వారించినట్లు సమాచారం.