Ganta Srinivasrao
-
కృషి మీ ఆయుధమైతే.. విజయం మీకు బానిస
కడప సిటీ/వేంపల్లె: ‘కృషి నీ ఆయుధమైతే విజయం నీకు బానిస’ అన్న జాతిపిత మహాత్మగాంధీ మాటలను ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీ విద్యార్థి గుర్తించుకుని ముందుకు సాగా లని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. శుక్రవా రం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2012–18 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, డైరెక్టర్ అమరేంద్రకుమార్ పండ్ర తదితరులు హాజరై పట్టాలు పొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. అనంతరం వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం లాంటివన్నారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రం లో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. ప్రతి ట్రిపుల్ ఐటీలో ప్రతి ఏడాది 6 వేలమంది విద్యార్థులకు ఇక్కడ చదివేందుకు అవకాశం వస్తోందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు 4 శాతం వెయిటేజీ మార్కులు కలుపుతున్నామన్నారు. అయినప్పటికి చివరి సీటు సాధించిన విద్యార్థికి కూడా 10 జీపీఏ పాయింట్లు సాధించిన వారే ఇక్కడ విద్యనభ్యసించడం జరుగుతోందన్నారు. ఆరేళ్ల సమీకృత కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ల్యాప్‌టాప్, భోజన వసతి, వసతి, యూనిఫాం తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. మరో రెండు ట్రిపుల్ ఐటీలు ప్రధానంగా ట్రిపుల్ ఐటీలలో బాలికలకు 65శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. 1985లో తాను ఆంధ్రా యూనివర్సిటీలో పట్టా తీసుకున్నానని, ఆ నాటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు. పట్టాలు తీసుకోవడంతోనే సరిపోదని, ఇంకా లాంగ్ జర్నీ ఎంతో ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రిపుల్ ఐటీల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. మరో రెండు కొత్త ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని వెల్లడించారు. 2008లో ప్రొఫెసర్ రాజిరెడ్డి ఈ ట్రిపుల్ ఐటీలకు రూపకల్పన చేశారన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో 17శాతం ఖర్చు చేస్తోందన్నారు. ఎడ్యుకేషన్ ఆఫ్ నాలెడ్జి హబ్‌గా వీటిని మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాన చుక్క పడే స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుందని, ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుందని, అటువంటి ఆల్చిప్పగా ట్రిపుల్ ఐటీని ఆయన అభివర్ణించారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మా ట్లాడుతూ మిమ్ములను చూస్తే స్టూడెంట్–1 సినిమా గుర్తుకు వస్తోందన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పె రిగి.. ఇక్కడే చదివాం అన్నట్లుగా ఉందని, బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ, సుందర్ పిచ్చయ్లను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు. భావి శాస్త్రవేత్తలు ఎదగాలి చాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌సిస్టర్ రేడియో, డిస్కవరీ, రోబోస్టిక్స్ తదితర వినూత్న ప్రయోగాలపై శ్రద్ధ చూపి దేశాభివృద్ధికి పాటుపడటంతోపాటు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థికి ఇక్కడ చదువుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, సద్వి నియోగం చేసుకోవడమే మీ వంతు అన్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. రాబోయే రోజులలో మరింత ఖ్యాతిని గడించేలా క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని ముందుంచుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు, ఫ్యాకల్టీకి నగదు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. -
స్కూళ్లకు, విరాళాలు ఇచ్చే ఎన్నారైల పేర్లు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 5వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చేవారి పేర్లను స్కూళ్లు, క్లాసులకు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇక నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి అని తెలిపారు. మరోవైపు, ఈ నెల 25న ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. లక్షా 30వేల 264 సీట్లకు ఇప్పటి వరకు 69,459 సీట్లు భర్తీ అయ్యాయని గంటా తెలిపారు. ఇంకా 43, 599 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. -
శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శనివారం ఉదయం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మనందం తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీనివాస రాజు తీర్థప్రసాదాలు అందజేశారు. -
'నెలలోపు వీసీల నియామకం'
తిరుపతి: నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ అధికారులకు అప్పగించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ మేరకు ముందుగా ఎస్వీ యూనివర్సిటీలో ఒక హాస్టల్‌ను ఔట్సోర్సింగ్ అధికారులకు ఫెలైట్ ప్రాజెక్టుగా ఇచ్చి పరిశీలిస్తామని చెప్పారు. ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలు ఔట్సోర్సింగ్ అధికారులకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. వైస్చాన్స్లర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడగిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లలో తర్వాత పనితీరును పరిశీలించి ఆశాజనకంగా లేకపోతే పదవి నుంచి తొలగిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. -
ఉమ్మడి రాజధాని అనే ఫీలింగ్ రావడం లేదు: గంటా
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉమ్మడి రాజధాని అనే ఫీలింగ్ రావడం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఏపీ మంత్రులతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకేనని మంత్రులు తెలిపారు. మొత్తం ఏడుగురు మంత్రులు వెళ్లారు. సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్దేనని గంటా అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇక్కడ సబ్ ఆర్డినేట్ ప్రభుత్వం కాదు అని గంటా గుర్తు చేశారు. తక్షణమే సెక్షన్ - 8 అమలు చేయాలని గవర్నర్‌ను కోరామని గంటా తెలిపారు. ఏడాదిగా ఆంధ్రా ఉద్యోగులకు, ప్రభుత్వానికి, ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి గంటా ఈ సందర్భంగా సూచించారు. కేసీఆర్ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం: కేఈ ముఖ్యమంత్రి, మంత్రులని చూడకుండా మాట్లాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ గవర్నర్ వద్దకు తీసుకెళ్లామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత గవర్నర్దేనని కేఈ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుంకేశుల డ్యాం బాంబులతో పేల్చేస్తామంటున్నారని కేఈ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై గివర్నర్ సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా కేఈ తెలిపారు. -
రాష్ట్రపతిని కలుద్దాం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ నిర్ణయం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధానికి లేఖ రాయాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ నిర్ణయించింది. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం మంత్రి శైలజానాథ్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారధి, పి.బాలరాజు, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీమోహన్, అహ్మదుల్లా, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, బి.ఎన్.విజయ్‌కుమార్, బొత్స అప్పలనర్సయ్య, కాండ్రు కమల, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కమిటీలో లేనప్పటికీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, కె.సుధాకర్, రాజన్నదొర, తైనాల విజయకుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభ్యుల మెజారిటీ అభిప్రాయాలు, ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాల్సిందిగా రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని నేతలు నిర్ణయించారు. సోనియాగాంధీతో భేటీ కావాలనే అభిప్రాయం వ్యక్తమైనా.. ఢిల్లీ వెళ్లినా ఫలితం ఉండదని టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. పురందేశ్వరి సహా కొందరు కేంద్ర మంత్రులు విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఇంకా సమైక్యంగా ఉంచాలని అడగడం సరికాదంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తావించారు. మంత్రి బాలరాజు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని కొందరు గుర్తుచేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై దిగ్విజయ్‌సింగ్‌ను కలిస్తే మేలని సూచించారు ‘విభజన అనివార్యం. మీ సమస్యలేమిటో చెప్పండి. పరిష్కరిస్తామని మాట మాత్రంగానైనా చెప్పడం లేదు. అలా చెబితే మనం కూడా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేసేవాళ్లం..’ అని మంత్రి పార్థసారధి అన్నారు. మనం ఏం చెబుతున్నా ఢిల్లీ స్థాయిలో జరగాల్సివన్నీ జరిగిపోతున్నాయని, అన్నీ పక్కనపెట్టి సమైక్య ఉద్యమంపై సమీక్షించాలని కన్నబాబు అన్నారు. కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ విభజనపై నిర్ణయం జరిగిపోయినందున కాంగ్రెస్ లైన్లోనే వెళ్లాల్సిన అవసరముందన్నాగరు. మరికొందరు కూడా కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు ఢిల్లీ వెళ్లి తొలుత దిగ్విజయ్‌సింగ్‌ను కలవాలని నేతలు నిర్ణయించారు. సమావేశానంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించే విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దిగ్విజయ్‌సింగ్‌లను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
గవర్నర్‌తో మంత్రులు గంటా, ఏరాసు భేటీ