
శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శనివారం ఉదయం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మనందం తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీనివాస రాజు తీర్థప్రసాదాలు అందజేశారు.